నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
59-మతుకు మల్లి నరసింహ విద్వన్మణి (1817-1873)
కృష్ణా జిల్లా వల్లూరు సంస్థాన కవిగా ఉన్న మతుకుమల్లి నరసింహ కవి గుంటూరు జిల్లా తెనాలి వాడు .తండ్రి, తాత కనకాద్రి శాస్త్రి నరసింహ శాస్త్రులు మహా పండితులు .తల్లి జానకమ్మ తెలుగు కవయిత్రి ..కవి నృసింహ స్వామికి మహా భక్తుడు .సంస్క్రుతంద్రాలలో చాలా రాశాడు .అందులో తెలుగులో లో ఇందుమతీ పరిణయం లేక అజ చరితం ,చెన్నపురి విలాసం ,జలక్రీడలు రచించాడు .సంస్కృతం లో ‘’పుండ్ర నిర్ణయ చంద్రిక ,పుండ్ర సూర్యోదయ కాల మహా దుర్దినం ,లక్ష్మీ నరసింహ స్తుతి స్తోత్రం రాశాడు ..ఇందులో సోత్రం ౩౦౦శ్లోకాలు ,6 అద్యాయాలతో ఉన్నది .వీటికి స్తంభోద్భవోధ్యాయం ,గండ భేరు౦ డాధ్యాయం ,నృసి౦హా ధ్యాయం ,సౌ౦ద ర్యాధ్యాయం ,దశావతారాధ్యాయం ,మాతృకాధ్యాయం అని పేర్లు పెట్టాడు .ఉగ్ర నరసిమ వృత్తాంతమే అయినా శ్లోకాలు చాల సరళం గా ఉండటం ప్రత్యేకత ..మచ్చుకి ఒకటి రెండు –
‘’చంద్ర రేఖా చమత్కార రాచంవదాంగి నఖాన్చలః –సుపర్వమకుటోగ్ధర్ష స్పురన్నఖ మణిధృణిః’’
శణార వి౦ద స్ఫర్గులు శోభమాన పదాంబుజః –శృతి సీమంత సీమాగ్ర సింధూర చరణా ధ్రుతిః’’
కమలా కటి సంవాస కమనీయా౦క పాలికః –నిలి౦పాద్రినితంబ తట సున్దరః ‘
’60-కాకతి రుద్రమ గురువు నృసి౦ హర్షి
కాకతి గణపతి దేవ ,రాణి రుద్రమ దేవి ,ప్రతాపరుద్రుల ఆస్థాన గురువు నృసిం హర్షి..అనేక కావ్య శాస్త్ర గ్రంధ రచయిత.ఋగ్వేదానికి భాష్యం రాశాడు .ఈ కవిప్రతిభకు తార్కాణగా చాలా శ్లోకాలున్నాయి .వీటిని పరిశీలిస్తే ఋగ్వేదానికి ఛాయఅనే వ్యాఖ్యానం రాసి నట్లు తెలుస్తుంది .కాకతీయ చరితలో ఓరుగల్లు ,ఏకశిలా నగరం అనే పేర్లు ఎందుకు వచ్చాయో వివరించాడు .పది రూపకాలు రాసినట్లు ఉంది .విష్ణు అవతారాలలో నరసింహా వతారనికే ప్రాదాన్యమిచ్చాడు కవి .రచనలన్నీ తాటాకులపైనే రాశాడు .అవన్నీ కాలం లో కలిసిపోయాయి .శిలమీద ఎక్కినవే మిగిలాయి .వరంగల్ దగ్గర చిన్న గ్రామం ‘’ఉర్స్ ‘’ఉంది .దాని దగ్గర ఉన్న చిన్న కొండను’’ ఉర్సు గుట్ట’’ అంటారు .దానిమీద కాళిదాసు మేఘ సందేశాన్ని అనుకరిస్తూనృసిం హర్షి రాసిన కవిత్వం చెక్కబడింది .దానిలో 62శ్లోకాలున్నాయి .అవి మృదుమధురంగా కర్ణ పేయంగా ఉంటాయి .ఇందులో 60శార్దూల వృత్తాలు .మిగిలిన రెండు స్రగ్ధరా వృత్తాలు .మొదటి నాలుగు శ్లోకాలు ఉపోద్ఘాతం లా ఉంటాయి .తర్వాత అంతా సిద్ధుల ప్రేమ సందేశమే .వారిద్దరి వివాహం ,సంభోగ శృంగారం ,ఎడబాటు ,మళ్ళీ కలవటం వర్ణించ బడి ఉంది .మొదటి శ్లోకం –
‘’కస్మిస్సిద్ధ యువా సమంద యాతయా స్స్టైస్త్రోతసే సైకతే-రాగాందో రమ మాణయేవ లిఖితే కారండ వనాంతయా ‘’
సూర్యాస్స్తమయ ,చంద్రోదయా వర్ణన –‘’కాలేస్మిన్ పుట పాక తప్త కనకాకారేణలొలాక్రుతిః
సంధ్యా మేఘన వప్రవామ్ష్య నయనం రాగీ సమాసేదివాన్ ‘’
నాయిక తొట్రుపాటు కంగారును వర్ణిస్తూ –‘’తిష్టత్యుచ్వ లతిప్రయాతి సంభాషతే
తూష్ణీం భావ ముపైతి పశ్యతి దిశః స౦ మీల యత్యక్షిణీ’’
పెళ్లి లో ఇద్దరూ కలుసు కోవవటాన్ని చెబుతూ –‘’వేదీ మధ్య నివేషితం హుతవహం కృత్వా విదేస్సాక్షిణ౦
స్వేదాంభః కణికాభిర౦ గుళిముఖా ద్వాంతా భి రాద్రస్తవః
రతిక్రీడలో నాయిపొందిన ఆనంద వర్ణన –‘’మ్లానం చాపి వికాసి చాపి వదనం వేణీ చ వదనం వేణీ చ వేష్టశ్లదా
భాలశ్చశ్రమ వారి మృస్టతిలకో హాసశ్చసంజాయతే ‘’
హనుమ కొండలో’’ సిద్దేశ్వర గుట్ట ‘’మీద ఇంకొక కవిత కనిపిస్తుంది .కవిపేరు లేదు .ఇదీ నృసింహ కవిదా కాదా అని తేలలేదు .37శ్లోకాల అసంపూర్తి కావ్యం ఇది ..ఆంద్ర దేశం పంట పొలాలు తోటల వర్ణన ఉంది. అనుప్రాసతో సరళంగా సాగిన కవిత్వం ఇది –
‘’ఆంధ్రస్సంతి గరీయంసః కాన్చనాధ్యాయ శాలయః –తదా హాటక శైలస్య కటకా రత్న శాలినః
కేదారా యత్ర శాలీనం తరంగిత జలంత రాః-కృష్ణా౦గ ఛాయహరితా తదా జలనిదే స్తటాః
కానీనికా కలంకిన్యా కాంతి చంద్రికయా స్త్రియః –ఆహార యాంతి యత్రత్య శ్చ౦ద్రికా హారిణః ఖగం ‘’
ఈ శ్లోకాలను 1891లోడా.పి.వి.పరబ్రహ్మ శాస్త్రి గారు సేకరించిన శాసన లిపులనుండి తాను తీసుకొని ఉదాహరించానని డా బిరుద రాజు రామ రాజు గారు తెలియ జేశారు .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-16-ఉయ్యూరు