నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
64-ఉద్దేమర్రి పాపయ
ఈ కవికాలాదులు తెలియవు కాని చిన్న దదైన ‘’రాఘవాస్టకం ‘’శ్రీరమునిపై రాశాడు .కొన్ని శ్లోకాలు –
‘’అ౦బువాహనీల దేహ ,మంబు జాక్ష మవ్యయం –మందమంద గౌర హస మిందు సుందరానననం ‘’
పద్మ జాత పూజితాంఘ్రిపంకజాత యుగ్మ-మ౦బాధమరాధవం సదా శివార్చితం భజే ‘’
సప్త సప్తి రాజ రాజ లోచనా కమోచనం –నిత్య పద్మ సద్మ పద్మ పద్మచిత్త మోషకం ‘’
సర్వ భక్త జాత జాత గంధీ శీత గంధి-మంబలాద మఘనం సదాశివార్చితం భజే ‘’
ఆశ్వాసాంత గద్య –‘’సర్వ వాంచితా ర్య కల్పవృక్ష ముద్రేమారిపా –ప్యా నామకో త్తరాఘవాస్టకం పఠంతియే
భక్తీ తశ్చ సంతత౦ చ భోజనాది కోయవా –ముక్త కిల్బిషా భవంతి మోక్ష మాపను వంతితే’’
65-ములుమూడి పిచ్చి రెడ్డి (19శతాబ్ది చివర )
నెల్లూరు జిల్లా బుచ్చి రెడ్డి పాలెం కు చెందిన వెంకా౦బికా ,వరద రెడ్డి ల కుమారుడు పిచ్చి రెడ్డి .’’శ్రీ వెంకటేశ్వర కర్ణామృత స్తోత్రం ‘’రాశాడు .దీనికే వెంకట నరసింహ శార్దూల స్తోత్రం ‘’అనే పేరుంది నృసింహ స్వామి పై రాసిన స్తోత్రం .108శార్దూల శ్లోకాలతో ఈఅష్టకం రాశాడు .ముందు తన గురించి తర్వాత గురువు గురించి చెప్పాడు .గురువు కామాక్షి ,శేషుల పుత్రుడు తమన వెంకవెంకటేశ్వర.గురుపత్ని మంగా౦బి క .కవితాధార సరళంగా సాగి చదివించే లక్షణం ఉన్నది –
‘’శ్రీమద్వేంకట నాయకం మునినుతం సేవ్యాన్ఘ్ర పంకద్వయం –పాపాన్ధం కరుణాకరం భవ హరం బాలేందు చూడార్చితం
పద్మాక్షం జగదేక వీర మదిపం బ్రహ్మ స్వరూపం హరిం –కామాక్షీ ప్రియ సోదరం నర మ్రుగాకారం భజేహం సదా ‘’
తెలుగు శతకం లాగానే నాలుగోపాదం గా మకుటం ఉంటుంది .కామాక్షీ అమ్మవారంటే భక్తివలన ఆపేరునూ చేర్చాడు .చివర ఆర్యా శ్లోకాలలో ఫలశ్రుతి రాశాడు
66-పుణ్య కోటి(18శతాబ్ది )
బోధానంద ఘనేద్ర యోగి శిష్యుడైన పుణ్య కోటి 11సర్గల ‘’కృష్ణ విలాసం ‘’అనే కావ్యం రాశాడు ..ఇది భాగవత దశమ స్కంద కద.దీనిపై అజ్ఞాతకవి రాసిన వ్యాఖ్యానం ఉంది .కవి జీవిత చరిత్ర ఎక్కడా లేదు .కావ్యాన్ని ఇలా ప్రారంభించాడు –
‘’మార్గెంత ర్నాలి నొల్ల సన్నిజ ముఖం సప్రేమ హాసం హ్రియా –పశ్యన్తిం నయనాన్జలాంజ లకచాం యాంతీంశనై రుక్మిణీం
గురువును గురించి –‘’వాచం యస్య నిశమ్య శేష ఫణి రాట్ పాతాలమాప హ్రియా-మౌనం గౌతమ జైమినీ కిల రాతౌ భట్ట స్సుదా ర్మాగతః –వ్యాసాధ్యః కమలాసనస్య భవనం యాతాః సమె సద్గురుః-బోధానంద ఘనేంద్ర యోగ యతి రాట్ జాజాయతాంమానసే’’
బోదా నందుడు కొట్లూరి రాజశేఖర కవికి కూడా గురువే కనుక మనకవి 18వ శతాబ్దివాడు .
67- ఏలేశ్వరపు పెద్దిభట్ట (1500)
గోదావరి జిల్లా ఏలేశ్వరం నివాసి వెలనాటి బ్రాహ్మణుడుఏలేశ్వరపు పెద్ది భట్ట .’’సూక్తి వారిది ‘’రచయిత..తాను ఏలేశ్వర మహోపాధ్యాయ వంశానికిచెందిన వాడినని వేద,శాస్త్రాలలో అఖండ పాండిత్యం ఉన్నవాడినని కవి చెప్పాడు .1700కాలపు కవి .కాని ఇంకా పూర్వీకుడే అని అనుమానం .16వ శతాబ్ది పూర్వార్ధపు కవి సంకుసాల నృసింహ కవి ఈ కవిని ఉదాహరించాడు .కనుక పెద్ది భట్టు కాలం 15వ శతాబ్దం అయి ఉండాలి .
సూక్తి వారిది 13అధ్యాయాలకావ్యం. కాని అయిదవ అధ్యాయం వైరాగ్య శతకం ,ఆరవది –దాన శతకం ,7వదిరాజ శతకం ,8వదైన సజ్జన శతకం ,9-దుర్యాన శతకం ,13వదైనధర్మ శతకం మాత్రమే లభ్యం .భర్త్రు హరి కవిపై అపార గౌరవం ఉన్నందున నీటి శతక౦ లో ఆయన స్తుతి చేశాడు –
‘’ఆశాయా దశా ఏతే దాసః సర్వ లోకస్య –ఆశా దాసీ యేషాం దాసయతే లోకః
అవశ్యం యాతార శ్చిరతరముషిత్వాపి విషయా –వియోగే కో భేద సత్యజతిన జానో యత్ స్వయమ్మూన్ .’’
చివరగా –‘’ఆసతో తృప్తి మాస్తాయ విద్యా లేశేన కేచన్ –భేకాఃకూప జలేనేవ సోకస్సంతో ష కారిణః’’
‘’ఇతి శ్రీమత్ ఏలేశ్వరపుర వర మహోపాధ్యాయ వంశోద్దారకేణ విరచితే –సూక్తి వారిధీ సుభాషిత గ్రందే త్రయోదశాధ్యాయః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు