నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
68-నవీన పతంజలి శ్రీధర పేరు సూరి (18శతాబ్దం )
షాహాజి మహా రాజు ప్రాపకం లో ఉన్న కౌశిక గోత్రీకుడు శ్రీధర వేంకటేశ వేంకటాంబ ల పుత్రుడే శ్రీధరుడు .రాజు చేత షాజీ రాజ పురాగ్రహారాన్ని పొందాడు .18వ శతాబ్ది ప్రారంభం వాడు .వ్యాకరణం లో అఖండ ప్రజ్ఞావంతుడై నందున’’ నవీన పతంజలి’’ బిరుదు నందుకొన్నాడు .వ్యాకరణ, నాటక ,కావ్య, రచయిత..
సూరి ‘’వసుమంగల నాటకం ‘’అయిదు అన్కాలలో రాశాడు .గిరికా వసురాజుల ప్రేమ కద..మధుర మీనాక్షి ఉత్సవాలలో ప్రదర్శించేవారు .రామ రాజ భూషణుని వసు చరిత్ర ఆధారం .ఈ నాటకానికి వ్యాఖ్యానం కూడా ఉంది .రచయిత పేరు తెలియదు .ప్రారంభ శ్లోకం –
‘’అస్టాభిఃస్వకలాభి రేవ రమణీ రూపాభి రాపాదితా –ముధద్ర త్నఘటీ వినిస్సృత మణీదారాభి షేక శ్రియం
కొటీరోపరిమాణ్య ప్రణయినీ రాగ ప్రణాలీమివ –స్తేమా కశ్చిదుదేతుమంగళ పరీఖండాను ష౦గా యనః ‘’
తర్వాత శ్లోకాలలో కవి వంశ ప్రస్తావన ,రచనల వివరం ఉన్నాయి .సంస్కృతం లో– పేరు సూరి శ్రీ రామ చంద్ర విజయం ,భరతాభ్యుదయం ,చకోర సందేశం ,వెంకటభాణం కూడా రాశాడు .ఇందులో చకోర సందేశమొక్కటే దొరికింది. ఇదీ అసంపూర్ణమే .మేఘ సందేశానికి నకలు మందా క్రాంత వృత్త విన్యాసం .కైలాసానికి మీనాక్షీ సుందరేశ దర్శనానికి వచ్చిదంపతులు వ్యాఘ్రపాదుని శాపానికి గురై చకోరం తో అచ్చోడ సరస్సునుండి సందేశం పంపిస్తాడు .ఇందులో ప్రేయసి ప్రియుల పేర్లు లేవు .-మొదటి శ్లోకం –
‘’కర్తుం సేవా ముపగత వతా సుందరేశోప కంఠం-ప్రత్యుత్దాన ప్రణతి విదురో వ్యాఘ్ర పాదేన శాపః
కామీ కరిచత్ పశు పతి పాదాంభోజ విన్యాస ధన్యే –కైలాసాద్రీస్థితి మతనుత ప్రేయసీ విపర యుక్తః
మొదటి సగం చివర –‘’ఇతి శ్రీ ధర వంశ శిఖావతంస,వైదుష్య సింహాసనాదీశ్వర పద వాక్య ప్రమాణ కూలంకష సాహిత్య మర్యాదాదురంధర నవీన పతంజలి బిరుద సంభావిత శ్రీ పేరు సూరి విరచితే చకోర సందేశ మహా కావ్యే పూర్వస్సందేశాస్సమాప్తః ‘’
చకోరం కైలాస గిరి నుండి పాండ్య దేశం లోని హాలస్య నగరికి ప్రయాణం చేసింది .మధ్యలో ఉన్న నదులు నగరాలను వర్ణించాడు .గోదావరి నది బ్రాహ్మణాగ్రహార వర్ణన –
‘’మజ్జత్కాంతా జన కుఛ తటీ హార దీప్తి ప్రరోహే –గచ్చాచ్చానామల దుప యసామపత ౦త్యః ప్రవాహైః
గోదావర్యాస్తట భువి తతః ప్రేక్ష్య విప్రాగ్రహరాన్ –ప్రాయస్తాంస్తాం ద్విజ వర హృది స్నేహ ముచ్చే ర్భాజేధాః’’
అంతర్వేది నృసింహ, శ్రీశైల క్షేత్రాలను చూపించాడు .వియోగ బాధను వెళ్ళ గక్కించాడు –
‘’సా చన్ద్రస్య చపల నాయనా కంబు కంఠీ సుకేశీ –ముగ్దా లాపా మధుర హసితా మంద యానన
స్సాజాత్యేన త్వితర వనితా రత్వేకషస్త త్ప్రయోగః ‘’
69-ఎల కూచి బాల సరస్వతి (17శతాబ్దం )
కౌండిన్య గోత్రానికి చెందిన ఎలకూచి కృష్ణ దేవుని పుత్రుడు ,భైరవార్య మనవడు బాల సరస్వతికవి .17వ శతాబ్దం వాడు .తెలుగుసంస్కృతాలలో లో చాలా రాశాడు .మహోపాధ్యాయ బిరుదున్నవాడు .మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థాన కవి .వ్యాకరణ పండితుడు. రాఘవ యాదవ పాండవీయ త్ర్యర్ది కావ్యం రాశాడు .భర్త్రు హరి సుభాషితాలను తెలుగు చేసి సురభి మల్ల భూపాలుడికి అంకిత మిచ్చాడు ..ఈకవి సంస్కృతం లో ‘’దశావ తార స్తోత్రం ‘’రాశాడు చాల క్లిస్టాన్వయం తో ఉంటుంది .ప్రతి శ్లోకాన్ని ఒకే సమాసం తో రాయటం బాల సరస్వతి ప్రత్యేకత –
‘’సాదీయో ముఖ పూరితో ద్వమి తతాసత్యోద్వ గోదన్వద-ర్ణాధారా ౦తరటక్తిమంగల ప్రోద్దాన నిధ్యానల
బ్ధ్వాదీశ ప్రభుతాస్వ భాగ హరణార్యయాయీ హ్రుజ్ఝాన్కరీ –ప్రాదాన్యాటి విలోల లవాద్రు గబట బ్రహ్మాన్ స్తుమస్త్వా మనున్ ‘’
చివరగా
‘’స్వ మహా బహు కృపాణక్రుత్తగల గుంచా మ్లోచ్చా వీరచ్చితే—త్క్రణాపాదిన పంక్తి నీరమణామధ్యాచ్చ్రిద్ కష్యామికో
ద్రమక్లుప్తా సమయే పరాగమతి కక్ష్మాస్తాన గంగానదీ –భ్రమ కృ త్తిక కల్కి మూర్తేక పరబ్రహ్మాన్ స్తుమాస్తస్త్వా మనున్ .’’
తెలుగులో లాగానే యతి ప్రాసలను పాటించాడు .దీనికి సంస్కృతం లో కురవి రామ కవి వ్యాఖ్యానం రాశాడు .
70-చెరుకూరి బ్రహ్మ సూరి
నరసా౦బా సర్వేశ్వర భట్ట లకుమారుడు బ్రహ్మ సూరి. చెరుకూరి ఇంటిపేరు .ఉత్తర కాండ చంపు సంస్కృతం లో రాశాడు .16వ శతాబ్దం నుంచి చెరుకూరి వంశం వారు గొప్ప కవి పండితులుగా ప్రసిద్ధులు ..స్వర్ణ మంజరి ,రసమంజరి మొదలైనవి రాసిన చెరుకూరి లక్ష్మీ ధరుడు విజయనగరరాజు తిరుమల దేవరాయ ఆస్థానకవి .మనకవి కాలం తెలియలేదు .చెరుకూరు కృష్ణా జిల్లా గ్రామం .మొదటి శ్లోకం –
‘’ఆనంద కంద లితయ చ్చరణారవి౦ద ,నిష్యన్దమాన మకరంద నిపాత పూతా –దివ్యాన్గనా జనిశిలశ్యాభి వంద నీయ ,వందామి తమ్ రఘుపతిమిందిరాయాః ‘’
రాముడు సీతను అడవికి పంపమని ఇచ్చిన ఆజ్న-
‘’’’భో భో భ్రాతరః శ్రుణుత మద్వచనం –మాబ్రూత్ ప్రతి వచనం –
‘’సీతాపి తాపస నివాస విలోకనాయ మామద్వ యాచిత వతీ గమనం చిరాయ –త్వాం త్వక్తు ముధ్యాతమనా అఃహ మష్య భూవం కర్మాను కూల రచన స్సామయో యమస్మిన్ ‘’
కావ్యమంతటా సున్నిత పదాలతో ప్రవాహంగా సాగటం ప్రత్యేకత .చివరి శ్లోకం లో తన వంశాన్ని వర్ణించాడు .
‘’చేరుకూరన్వ య దుగ్ధ సాగర విదుస్సర్వే శ్వరా వ్యయః పితా –జననీ యస్య నృసింహ నామ కలితా సూర్యస్సుదీ రోగ్రజః
పర మధ్యు త్తర కాండ మభ్య చరిత౦ శ్రీ రామ చంద్రాఖిల –వ్యవహార ప్రధన స్సమ గ్రమభవతద్బ్రహ్మ సూరేః కృతౌ ‘’.
71-నేపాల్ రాజ గురువు ఆస్థానకవి నడిమింటి భగవత్పతంజలి శాస్త్రి (18౦౦ -1872)
శ్రీకాకుళం జిల్లా నాగూరు గ్రామ వాసి నడిమింటి సర్వ మంగళ శాస్త్రి గారి కుమారుడే పతంజలి శాస్త్రి .1800-1872కాలం లోని వాడు తండ్రి వలే యోగ ,మంత్రం శాస్త్రాలలో నిష్ణాతుడు .కాశీ లో ఉండగా నేపాల్ రాజుకు గురువై ,రాజు కోరికపై నేపాల్ వెళ్లి రాజాస్థానం లో 1830-40మధ్య ఉన్నాడు .తండ్రి మరణం తో స్వదేశానికి స్వగ్రామంకి తిరిగి వచ్చాడు .నేపాల్ లో ఉండగానే ‘’గాయత్రి మహిమ ‘’పరమ పురుషాధ్యయనం ‘’సంస్కృతం లో రాశాడు .దీనిలోంచి శ్లోకాలు –
‘’చిదాత్మా చిన్మాయా౦ ప్రక్రుతి మభి సృజ్జో ద్భవవతాం-నివేశ్యస్యాం శ్వాసం పునరపి యదా పూర్వక భవత్
తత స్స్రస్టా జీవ ప్రకర ఇతి తస్యా నుజనితౌ –తమో౦ఘై తత్నాద్య స్తపదఘ స తేన ప్రభుదితః ‘’
పతంజలి శాస్త్రి నేపాల్ లో ఒక సంస్కృత పాఠశాల స్థాపించాడు..భారత్ కు తిరిగి వచ్చాక సంస్కృత సేవ చేయలేక పోయాడు .కారణం విజయ నగర సంస్థాన లిటిగేషన్లను తీర్చటానికే సమయమంతా సరిపోయేది .లభించిన ఆధారాలను బట్టి యోగ శాస్త్రం లో పతంజలి అంతటి ప్రతిభ ఉన్న భగవత్పతంజలి శాస్త్రి యోగాభ్యాసం తో తన శరీరాన్ని మహా వృక్షమంత ఎత్తుకు లేపేవాడు .చనిపోయే దాకా నేపాల్ రాజుల గౌరవ సత్కార కానుకలను అందుకొంటూనే ఉండేవాడు .కురుపాం జమీందారు అగ్రహారాలు దానం చేశాడు .
72-చర్ల భాష్యకార శాస్త్రి (20శతాబ్ది )
లోహిత గోత్రీకుడు ,వెంకటాద్రీయం రాసిన చర్ల వెంకట శాస్త్రి మనవడు భాష్యకార శాస్త్రి .పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రులో 20వ శతాబ్దం లో ఉండేవాడు .సంస్కృతం లో ఉద్దండుడు .శాస్త్రాలలో అద్వితీయుడు .వ్యాకరణం లో దిట్ట .నిఘంటు నిర్మాత .అన్నిటా సాటిలేని వాడు .రచనలలో మేధావిగా దర్శన మిస్తాడు .సంస్కృతం లో 20గ్రంధాలు రాశాడు .’’మేకాదీశ శబ్ద రత్నాకర కల్ప తరువు అనే అలంకార శాస్త్రం ఒక శబ్దాన్ని విడగొడితే వెయ్యి అర్దాలోచ్చేట్లు రాసిన ఘనుడు .దీనిపై వ్యాఖ్య కూడా రాశాడు –
‘’ఏ శబ్దార్ధ విచార తత్పరాదియో ఏ యా గుణాలంక్రియా –దోషాసక్త హృదే విచిత్ర కవనే యేవా ద్వనా వ్రుత్సుఖాః’’
మేకాదీశ శబ్దార్ధ శతకోటి ,మేకాదీశ శబ్ద శతకోటి లలో కూడా ఇలాంటి ఫీట్లు చాలా చేశాడు .నూజి వీడు ప్రభువు మేకా రంగయ్యప్పారావు చరిత్ర తో సంబంధమున్న రచనలివి .కవి ప్రతిభా వైదుష్యానికి ఆటపట్లు.
మేకాదీశ రామాయణం16అక్షరాల ఏకశ్లోకి .వీటి పెర్ముటేషన్,కాంబి నేషన్ లతో రామాయణం అంతా దిగుమతి అవుతుంది .అదీ గొప్ప .
32అక్షరాలతో ‘’కనక బంధ రామాయణం ‘’కూడా చిత్రిక పట్టాడు .అక్షరాలు చేతి గాజు లా ఉండి,ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు కూరిస్తే 64శ్లోకాలేర్పడతాయి .ఏర్పడిన ప్రతిశ్లోకానికి రెండు అర్ధాలు చెప్పాడు కవి .అంటే మొత్తం 128 శ్లోకాలయ్యా యన్నమాట .రుచికి –
‘’రామానా తాభాస ,చారా వారా గోపదారా –ధారా ధారా భీమకారా ,పారావారా సీతారామా ‘
ఈ కంకణబంధ కవిత్వం మొట్ట మొదట 1780-1870వాడైన శిస్టు కృష్ణ మూర్తి శాస్త్రి ప్రయోగించాడు. రెండవ కవి భాష్యకారుడుదీన్ని మెరుగు పరచాడు .
‘’వినాయక చరిత’’ లో శ్యమ౦తకోపాఖ్యానం చెప్పాడు .’’నృసింహ దండకం ‘’,గౌతమీ దండకం ,వ్యాప్తి చింతామణి రామాయణం శ్రీరామ విజయవ్యాయోగం కూడా రాశాడు. వ్యాయోగం లో నటి నాందిలో ఎడారి లాంటి వ్యాకరణ శాస్త్రం లో కవి మాస్టరీ చేశాడని చెబుతుంది .‘’తర్క వ్యాకరణ ప్రబంధ కవనైః కర్కస్యయుక్తా ప్యసౌ –వాణీ కావ్య వశాత్ప్ర సాదా గుణ తస్సవైః ప్రశస్య భవేత్
సూర్యో గ్రీష్మ హాత పవ శాదత్య న్యంతతీక్ష్నోఫై సన్-వర్షాకాల వశాత్సమస్తజగతస్స౦తోష కారీ భవేత్ ‘’
‘’చతురక్షర గీత సారం ‘’లో నాలుగక్షరాలతో సర్కస్ ఫీట్లు చేసి చూపాడు .ఇవికాక రాజ్య లక్ష్మీ పరిణయం ,భువన గుణ మహా దర్పణం ,సనాతన ధర్మ విజయ వ్యాయోగం ,వర్ణమాలా రామాయణం ,విజయ విలాసం ,దండక రామాయణం ,సూర్య దండకం ,హనుమద్దందకం ,కృష్ణ ప్రసాదీయం అనే అలంకార శాస్త్రం కూడా భాష్యకార శాస్త్రి రచనలే.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-16-ఉయ్యూరు