నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
77-పింగళి ముత్తాజి మంత్రి
భారద్వాజ గోత్రీకుడు భానూజీ మంత్రి తిమ్మా౦బికల పుత్రుడే ముత్తాజి మంత్రి .’’సా౦బోదయం ‘’అనే రెండు ఆశ్వాసాల కావ్యం రాశాడు .కృష్ణ పండితుడు ‘’కృష్ణ కుతూహలం ‘’వ్యాఖ్య రాశాడు దీనికి .కొన్ని శ్లోకాలు –
‘’శ్రీ కాంతా చపలా నాగేంద్ర తనయా చండీ కునామ్నీ మహీ –జల్పాకి చతురాననస్య వనితా భాగీరధీ భంగ భాక్ ‘’
సోయం మజ్జనకో నమజ్జన దయాశాలీ దిశాలీవలత్ –తేజో భాను భుజోత్తమో విజయతాం శశ్వంతరాం శ్రేయం ‘’.
ముత్తాజీ కవి పండిత ప్రకాండుడు మాత్రమె కాదు ఎందరో విద్వాంసులను ఆదరించి సన్మానించిన వాడు .వ్యాఖ్యాత కృష్ణ సూది దక్షిణామూర్తి భక్తుడు .విశ్వేశ్వర పండితుడినీ పేర్కొన్నాడు .సాయమాంబ విషయమోచ్చింది ఆవిడ ఏ ప్రాంతాన్ని పాలించిందో తెలియదు .జా౦బవతి, శ్రీకృష్ణుల పుత్రుడు సా౦బు ని కధ ఇది .కృష్ణ జా౦బవతుల వివాహం తర్వాత చాలాభాగం రచన లోపించింది .ద్వారక వర్ణనతో కావ్యప్రారంభం జరిగింది –
‘’ఆస్తి ప్రశస్త తర వస్తుభిరుల్లసంతీపూద్వారకా జగతి మందిరా మందిరాయాః–తర్కో మమ స్పూరతినూనా మనూన లక్ష్మ్యా యస్సాస్సురేంద్ర నగరీ న గరీయ సీతి’’
శ్రీకృష్ణుని బల శౌర్య పరాక్రమ వర్ణన –‘’కీర్తి ప్రతాపో కిల దంప తీవ త్రైలోక్య సౌదే లతతస్మ తరస్య –శంఖే శార్జ్న ద్రుమణీతనూజౌ తయోరిమౌ పాండుర చండ రూపౌ ‘’
జాంబవతి ముందు నారదుడు కృష్ణుని స్తోత్రం చేస్తాడు ఇది లీలాశుకుని కృష్ణ కర్ణామృత శ్లోకాలు లాగా మధురంగా ఉంటాయి
‘’మందాకినీ కనదావలీషు మందార భూమీరుహ పల్లవేషు –తత్పద పీఠీ సుషమా సమృద్ధం ,విలోక యామో వయ మాదరేణ’’
జాంబవతి ప్రణయాన్ని ముగ్ధ మనోహరంగా వర్ణించాడు –‘
‘’చిత్రే చిత్రే రచిత ముచితం రూపదేయం మురారే –ర్దర్షీ ర్దర్షీ నిమిషా రహితైరీక్షితైరీక్ష ణీయం’’
స్ఫీతం జాతం విపుల పులక వ్రాత మస్యాఃప్రకామం –మారోదారప్రహరణాదియా నిర్మితం వర్మ శంఖోః’’
ఒకేసర్గలో వివిధ ఛందస్సులను పాతకవులకు భిన్నంగా ఉపయోగించాడు
78-నిశ్శంక మృత్యుంజయ భూపాలుడు
పెద్దన్న నిశ్శంక భూపాలుని కుమారుడు ,వెంకట నిశ్శంక భూపాలుని మనవడు ,విశాఖ జిల్లా సంగమ వలస జమీందారు మృత్యుంజయ భూపాలుడు .కవిపండితవిద్వా౦సులకు అండా దండా గా ఉన్నాడు .స్వయంగా కవి .నీతి శాస్త్ర సారం అనే 35శ్లోకాల గ్రంధం రాశాడు దీనికి అదే ఆస్థానపుకవి ఆకెళ్ళ వెంకట శాస్త్రి తెలుగు వ్యాఖ్యానం రాశాడు .మొదటి శ్లోకం
‘’శ్రీ కైలాస పయోరాశీ యయోస్సుప్రు టతరాలయో – భక్త్యాహం ప్రత్యహం నౌమి పార్వతీ పరమేశ్వరౌ ‘’
ఇందులో చాలా నీతులు బోధించాడు –మచ్చుకి కొన్ని –
‘’పురోగతస్య లోకస్య ప్రియం సత్యం వరం వదేత్ –నైచే త్రూష్నీం వర్తితవ్యం సభాయాం సతతం సతా ‘’
సుసుతః క కుల దీపాంశ్చసుయోషా గృహ దీపికా –వనానాం చందనో దీపౌ రాజా దీపౌ పురస్స్య చ ‘’
మృత్యుంజయుడు కాళిదాసరచనలపై వ్యాఖ్యానాలు కూడా రాశాడు .శాకుంతలం పై ‘’పూర్ణ చంద్రిక ‘’,విక్రమోర్వశీయం పై ‘’రత్న దీపిక ‘’మాలవికపై ‘’’’విబుధ రంజని ‘’వ్యాఖ్యానాలు రచించాడు .ఏడవ ఎడ్వర్డ్ రాజు రాయల్ ఏషియాటిక్ సొసైటీ కి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మృత్యుంజయ భూపాలుని సంస్కృత సాహితీ సేవను గుర్తించి మెచ్చి అందులో మెంబర్ గా ఎంపిక చేసి గౌరవించాడు
79-నాదెళ్ళ మేధా దక్షిణ మూర్తి శాస్త్రి (26-1-1894-27-11-1938)
నాదెళ్ళ పురుషోత్తమ కవి ముక్తికాంతామణి దంపతుల కుమారుడు మేధా దక్షిణా మూర్తి శాస్త్రి .హరితస గోత్రం .26-1-1894లో మచిలీపట్నం లో జన్మించాడు . -27-11-1938న మరణించాడు .గీర్వాణ,ఆంద్ర హిందీ పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు .,కవి రచయిత .ఖగోళం ధర్మ శాస్త్రాలపై గ్రంధాలు రాశాడు .తెలుగులో 30,సంస్కృతం లో 3రాశాడు .సంస్కృతం లో ‘’ఆత్రేయశ్రోత్రా నందం ,అస్టకమాల ,నానా దేవతా స్తోత్రం రాశాడు .మొదటి దానిలో 108శ్లోకాలున్నాయి .ఛందో వైవిధ్యం పాటించాడు .దత్తాత్రేయ అవతార గొప్పతనాన్ని ఇందులో వర్ణించాడు .ముందుగా తండ్రి పురుషోత్తమ శాస్త్రి కి పద్య నివాళి సమర్పించాడు –
‘’శ్రీ దక్షిణాస్య విమలా౦ఘ్రిద్రసరోజ భ్రున్గః శ్రీమద్గురు ర్జయతు తత్పురుషోత్తమాఖ్యః
యధ్యాన మాత్ర రసనాత్తకవిత్వ శక్తిః సత్కావ్య జాల రచనాల్లభతే సుకీర్తిం ‘’
తన వంశ చరిత్రను చెప్పుకొన్నాడు .కవి తన తల్లిగారిపై తెలుగులో ముక్తి కాంతా శతకం చెప్పాడు .ఇందులో 19సంస్కృత శ్లోకాలున్నాయి –
‘’గోమాననీయ పద సోమా ర్కవహ్నినయనోమా సతీపతి మజం –వాగార్ధ భాగ మణిదామాభి రామనిజ భామా మణీయుత తనుం .
చివరి శ్లోకం –‘’స్తవ్య సౌశీల్య సౌభాగ్య సద్రూపిణీం నిత్య హ్రుల్లగ్న భర్త్రింఘ్రి పంకేరుహం –భవ్యా విద్యా వతీం దీమతీం శ్రీమతీ మాశ్రయే మాతరం ముక్తి కాంతామణీం’’
మాత్రు దేవత ముక్తికాంత ను సంస్మరించటం మేదా దక్షిణామూర్తి గారికి ముక్తికాంతా దర్శనానికి సోపానమై ఉంటుంది .
80-రత్నారాధ్య
ఆంద్ర దేశానికి చెందిన వీరశైవ బ్రాహ్మణకవి రత్నారాధ్యుడు .కాలాదులు లేవు .’’దారుక వన విలాసం ‘’సంస్కృతం లో రాసినట్లు ఉన్నది .దారుకా వనం లో శివ క్రీడల వర్ణన –మొదటి శ్లోకం –
‘’శ్రీరాధ్యార్చిత పాద పంకజ ముమాకాంతం కటాక్షావిత్ –త్రైలోక్యం ముని మానససైక నిలయం దేవం సమస్తాధికం ‘’
వేద్యం ప్రత్న వచః శిరోభి తతులం మృత్యుంజయం మానసే –ధ్యాయాయామ్య న్వహమాశ్రితామర తరుం తమ్భూయసే శ్రేయసే ‘’
శ్రీ మద్రౌప్య గిరీ శివా తను రధం భద్రాసనే సుస్తితం –పాయాత్తోషితయా సమం గిరిజయా బాలేందు చూడామణిః’’
కవే దీనికి వ్యాఖ్యానం కూడా రాసినట్లుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-1-16-ఉయ్యూరు