నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
81-కిడాంబి రాఘవాచార్య
ధన్నవాడ రాఘవాచార్యగా ప్రసిద్ధుడైన కిడాంబిరాఘవాచార్య శ్రీనివాసాచార్య కుమారుడు .ఆత్రేయస గోత్రం.సంస్కృతాంధ్రాలలో మహా కవి ‘.’’విద్వత్ కవి మణి’’బిరుదుపొందాడు .కడప జిల్లా ప్రొద్దుటూరు వాడు సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడు .బాల సరస్వతి తిరుమల బుక్క పట్టణం శ్రీనివాసాచార్య కు సమీప బంధువు .30దాకా రచనలు చేశాడు .అందులో సంస్కృతం లో ‘’కురుమూర్తి వైభవం లేక శ్రీనివాస పాదుకార్పణ నాటకం ,శ్రవణానంద ప్రేక్షణీకం ,మాణిక్య నగర వైభవ ప్రేక్షణీకం ,కోదండరామ ప్రతిస్టాపనాప్రేక్షణీకం,లక్ష్మీధ్యాన సోపానం ,లక్ష్మీ మంగళాస్తుతి ,అహోబిల గురు వైభవ స్తుతి ఉన్నాయి .
కురుమూరర్తి వైభవ నాటకం 6అంకాలు .మహబూబ్ నగర్ జిల్లా అమర చింత లో సంస్థానం లో ఆత్మకూరు రాజు రాజా రామ భూపాలుడు వజ్రాల పాదుకలను కురుమూర్తి గుట్ట పై వెలసిన శ్రీనివాసునికి సమర్పించటం కధ.శాంత రస ప్రధానం .ఇది దాదాపు శ్రవ్య నాటకం .1906లోకురుమూర్తిలో చిత్రోత్సవం నాడురాజు గారి పట్టాభిషేకమహోత్సవానికి ప్రదర్శింప బడింది .ఈ నాటకం లో రాజు గారి బంధువులు పాత్ర దారులవటం విశేషం జమీందారి సమకాలీన చరిత్రను తెలియ జేస్తుంది .నాలుగవ అంకం లో మలయాళీలు గుజరాతీయులు ,అంగ వంగ దేశేయులు ఉంటారు .ఇది విశ్వ గుణాదర్శం లో లాగా ఉంటుంది .సూత్రధారుడు కవిని పరిచయం చేస్తాడు .
‘’ఆత్రేయ వంశ కలశోదధీ శీత భాసా గోపాల నామ విబుధాగ్ర భువా సహర్షం –శ్రీ శ్రీనివాస బుధ వార్య తనూ భవేన శ్రీ రాఘవార్య విదుషా రచితప్రబందః ‘
కవి ప్రతిభకు గుర్తుగా నిలిచే శ్లోకాలు –
‘’ఆభాతి పంకజ ముఖీ సరసీమ్రుణాల శైవాలసైకత భుజాల కసంనితంబా –ఆవార్త నాభి రిహ మీనా పయోజ కేశా ,చక్షుఃపయోధర యుతావనితేవ లోకే ‘’
కురుమూర్తి శ్రీనివాస రధోత్సవ వర్ణన –
‘’యత్కామినీ ముఖ జిత రరాశభ్రుక్త్రు శాంగః –స్తప్యాత్ససౌ సుర ధునీ శతటేగిరీశే
జ్యోత్స్నాపి తస్మిత ధుతాభి ముఖం సిషేవే-నాసాగ్ర లోల నవ మౌక్తిక డింభ నామ్నా ‘’
లక్ష్మీ ధ్యాన సోపాన స్తుతి 10శ్లోకాల కావ్యం .
‘’ద్వంద్వే దేవ్యా రుచిరపదయోరున్మిషత్పంచబుదుధ్యా-రేలంబత్వం వహతి కుతుకాన్ మానసం మామకీనం
లక్ష్మీ మంగళస్తుతి 8శ్లోకాలు
82-రామ కవి
ఆత్రేయ గోత్రీకుడు రామకవి ‘’సిద్ధాంత సంగ్రహం ‘’రాశాడు .శివుడిని బ్రహ్మం గా భావించి రాసిన కావ్యం .నూజి వీడుప్రభువు శోభనాద్రి అప్పారావు ఆస్థానకవి .దీనికి బహుశా కవేవ్యాఖ్యానమూ రాశాడు .ప్రారంభ శ్లోకం –
‘’విద్వాత్కల్ప తరో విష్ణు సమారాధన తత్పరాత్ –దీనావన సమాసక్తా చ్చత్రుతాశానాత్
నూజి వీటి పురాధీశాచ్చోభానా ద్రప్పారాయతః –అనాయాసేన సంలబ్ద జీవన స్థిరసన్మతిః’’
శివుని గురించి వర్ణన –
‘’త్వమారాధ్యాశ్శంభో సహృదయ హృదయాకాశావివరే – తతో బ్రహ్మాదీనాం యదసి పరమం కారణామితి
శ్రుతిః స్తోతి త్వాతో సుమతి మఘమమ్యాహి కృపయా –న చేదేవం చాహం నరక భవనః స్యాం హర విభో ‘’
సోపద్రుస్టః పరబ్రహ్మ గురుం సిద్ధాంత సంగ్రహం –యువాద్ధ ఊర్జే రాకాయాం రామస్వామ్య లిఖత్ స్మరన్ ‘’
83-పుల్లెల రామ చంద్ర కవి
కవికాలాదులు తెలియవు కాని కౌండిన్య గోత్రీకుదని ‘’పౌలస్త్య రాఘవీయం ‘’రాశాడని తెలుస్తోంది. 20సర్గాలున్నాయి .రామాయణమే .పుల్లెలవారు అమలాపురం లో ఉన్నారు పుల్లెల శ్రీరామ చంద్రుడు గొప్ప సంస్క్రుతాచార్యుడు కవి విమర్శకుడు అని మనకుతెలుసు ఏఎకవి వీరి తాతగారో లేక పై తరం వారో ?ఒక శ్లోకం
‘’వినాయకం పదసరోజ యుగం మునీంద్ర హ్రుత్కేర వైఘా విదు బిమ్బమహం భాజిశ్యే
విఘ్నౌఘ కుద్ర దలనే శతకోటి సారం సారం గిరామజ ముఖాబ్జ వినిస్సృత నాం’’
చివరి శ్లోకం –
‘’రఘుపతిస్య పంపాంవీక్ష్య చంచాత్తరంగాం-ధ్వనిమపి పీక శబ్ద౦ నీల కంఠోఘలాస్యం
మధుకర మదరావం తత్ర సంవీక్ష్య రామః –శృతి హృదయ వినోదాంనాట్య లక్ష్మీం సమేనే ‘’
బాలకాండ లో ఆరు సర్గలు అయోధ్య నాలుగు ,అరణ్య నాలుగు కండలు కొన్ని బంధ శ్లోకాలూ రాశాడు .
84-చంపక రామ చంద్ర
వైకుంఠ పతికోడుకే రామచంద్ర ‘’సర్వమాన్య చంపు ‘’రాశాడు .చందాసాహేబ్ కు ఫతే సింగ్ కు మధ్య ఉన్న వైరాన్ని గూర్చి రాసిన చారిత్రిక గాధ..18శతాబ్దిలో జరిగిన కర్నాటక యుద్ధాలు వర్ణించాడు .18వ శతాబ్దం లో ఆర్కాట్ నవాబు చందా సాహెబ్ .మధుర నాయక రాజ్యం కూలిపోవటానికి కారకుడు .తర్వాత కర్నాటక నవాబు అయ్యాడు .ఆతను చేసిన హింసా దుష్క్రుత్యాలన్నీ వివరంగా రాశాడు కవి . 10వేల సైన్యం తో నాజర్ జంగ్ సాహెబ్ పై దండయాత్ర చేస్తుంటే మహారాష్ట్ర మిలితరీఆఫీసర్ మురారి సహాయం చేశాడు .తర్వాత ఈ మురారి గవర్నర్ అయి శాంతి స్థాపన చేశాడు .మురారి ప్రోద్బలం తో కవి ఈ రచన చేశాడు .మధుర సైన్యాధికారి ఫతే సింగ్ చందా సాహెబ్ ను 1752జూన్ లో చంపేసి హీరో అయ్యాడు .
అనేక మంది ఆంధ్రులలాగానే కవికూడా మధుర నాయకుల పాలనలో తమిళనాడులోని కురుకనగరం లో ఉన్నాడు .సంస్కృతాంధ్రాలలో ద్విభాషకవిని అని చెప్పుకొన్నాడు .ఇతనికవిత్వం మధురా విజయం రాసిన గంగాదేవి కవిత్వం లాగా ఉంటుంది .కర్నాటక రక్షకులైన ఫతెసి౦గ్ ,మురారిలా వర్ణన శ్లోకం –
‘’తదను విహిత ఫత్తేసింగు ధర్మోపదేశ స్సమను రచిత విద్వజ్జజ్జాలాచి తర ప్రమోదః –సన్యవతిపాండంచక్షోనణీ చక్రం మురారి ప్రభు ర్యామితి వార్తా దిక్షు ప్రవృత్తా ‘’.-చివరి శ్లోకం –
‘’దిస్త్యా మహా రాష్ట్ర భటైర్విశస్తా స్సాధ్యప్రశస్తా యవనాస్సమస్తాః-డిస్త్యామురారి ప్రభురేషజాతః పాండ్య క్షమా మండల మండనశ్రీ
దత్తే కవిభ్యో దయమాన చేతా –మురారి నేతా ముహురీ ప్సితార్ధాన్ –వయం ప్రయామ స్త్రిశిరః పురీం తాం ప్రకాశ యామః పటు వాఖిలాసాన్ ‘’
85-రామయ
రామరాయ లేక రామయ కవి గురించి వివరాలు తెలియవు .ఆరు అంకాల ’’యయాతి నాటకం ‘’రాశాడు అదీదాదాపు శిదిలమే .మొదటి శ్లోకం –
‘’లక్ష్మ్యా లీలాకలహ కుతుక స్వాప భాజో నిచోలం –మోత్రుం ముక్త సార రుచిమయం మొఘ యత్నేమురారే ‘’
సూత్రధారుడు కదని ,కవిని పరిచయం చేస్తాడు –
‘’నాన్విదమేవ ప్రతిపన్న దాసి త్వాంమామాశ్వాసయితుం ప్రవృత్తం యుష్మద్వచనం స్మర్యతి
శ్రీ రామయ కవేః కృతిం యయాత౦ నామ నాటకం –యాత్ర శర్మిస్టాయా దాసీత్వమపి శ్లధనీయం ‘’
చివరగా –‘’
‘’చూడాన్దోలితనీడ దాడిమ వాణీ కుంజా౦త రాలే మనా –గున్మీలక్త లవి౦ఖ మండలగల ద్రోణా ద్రుత ప్రచ్యుతః
విశ్వాండమూర్చిత పశ్య విశ్వవిజయ –స్వేరహ్వోత్కార కింకిణీకలకలా త్కారా నుకరీ రవః’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-1-16-ఉయ్యూరు