నాలుగవ గీర్వాణం
గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
91-వడ్లమాని లక్ష్మీ నరసింహ శాస్త్రి
వడ్లమాని సూరాంబ ,కృష్ణల కుమారుడే లక్ష్మీ నరసింహ శాస్త్రి .గోదావరిజిల్లా చోడవరం లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు .దేవిడి సంస్థానం లో కందుకూరి బాల సూర్యారావు బహద్దర్ ఆస్థాన కవి .స్నేహితుడు బంధువు సోమనాధ శాస్త్రి ప్రేరణ చేత ‘’చెన్నపురి రాజధాని ధూమ శకట తీర్ధ యాత్ర చరిత్రం ‘’అనే యాత్రా సాహిత్యాన్ని సంస్కృతం లో రాశాడు .మద్రాస్ ప్రెసి డెన్సిలో కవి చేసిన రైలు యాత్రా విశేషాలన్నీ గుది గుచ్చాడు .ఇందులో 28౦ శ్లోకాలున్నాయి .అందులో 17తన ఇష్టదేవత శ్యామలాంబ మీద,గురువులపైనా రాశాడు .మిగతాదంతా రైలుయాత్రా సాహిత్యమే .తన గురువులైన కిలాంబి రామానుజాచార్య ,పరవస్తు రామానుజ స్వామి ,గుడిమెల్ల వరదా చార్య ,మహా మహోపాధ్యాయ తాతాసుబ్బరాయ శాస్త్రి వాదూల వెంకట రామ ,భావనారాయణ ,కోపెల్ల విశ్వనాధ ,పేరి లక్ష్మీనారాయణ ,నగుదూరు వెంకట శాస్త్రి ,గంటి సూర్య నారాయణ శాస్త్రి ,పేరివెంకట శాస్త్రి ,అప్ప్ల జోగన్న శాస్త్రి ,ఆకొండి వెంకట రత్న శాస్త్రి గుమ్ములూరి సత్యనారాయణ గార్లను స్తుతించాడు .కవిని ఈకావ్యం రాయమని సోమనాధుడు కోరాడని చెబుతూ –
‘’సుప్రాచ్యా విద్వాద్గురూదోసి జాతు దేవాది సంస్థాన సు పండితోస్మి –ప్రతస్తివాన్ తద్విభునా కదాచిత్ సమస్త తీర్దాటనమాప్యకార్షాః
త్వట్టీర్ధ యాత్రా చరితం సమస్తం గీర్వాణ భాషా మవలంబ్య సాదు –నానావిదై వ్రుత్తవరేస్సుబద్ధం సమస్త సంస్థాన చరిత్ర యుక్తం
భూగోళ శాస్త్రాన్విత దేశ వృత్తం వ్రుత్తాంతం పూర్వ కవీశ్వరాణాం –సర్వం స్వభావోక్తి యుక్తం సురమ్యం గ్రంధం కురుష్వేతి చ మామవాదీత్ ‘’
ఈ రైలు యాత్రను తన రాజు బాలసూర్యారావు బహద్దర్ తో కలిసి మద్రాస్ ప్రెసిడెన్సి మైసూర్ రాజ్యం నిజాం రాజ్యం సందర్శించారు యాత్ర 1924లో దేవిడిలో ఎడ్లబండ్ల మీద ప్రారంభమై ఉర్లాం స్టేషన్ కు చేరి ,అక్కడినుండి ఈ విధంగా సాగింది –
‘’కల్లోల్లోలసితం సుసంక్రమ యుతాంతాం వంశ దారానదీం –తీర్త్వా వాయు జవేన ధూమ శకటోగత్వా సుందరం తతః
తచ్చీకాకుల మార్గ ధూమ శకటాస్థానం త్యతీత్య ధ్వనన్ –ప్రావి క్ష ద్బలరామ లాంగల కృతాంనాగావళీ సంనిదీం ‘’
దారిలో పొందూరు ,విజయనగరం ,రాజమండ్రి,నెల్లూరు ,బెంగుళూరు శ్రీరంగ పట్నం ,మైసూర్ మదురై ,కంచి వరంగల్ లను చూస్తూ ప్రయాణం సాగింది .వరంగల్ శిదిలావస్తను కవి కళ్ళకు కట్టించాడు –
‘’అహో దుర్గామిదంసుజీర్ణ మభవత్ శ్రీ వీర రుద్ర ప్రభో –ప్రాసాదాస్సకలా నిపత్య వాసుదా భాగే నిమగ్న భ్రుశం
ద్రష్టవ్యాని చ తోరణాని సుశిలా బద్వాన్య ఖండాన్యహో –దుర్గేస్మిన్ కిల భాంతి పశ్యయత నిరాలంబాని సప్రేక్షకాః’’
అని మహోన్నత కాకతీయ వైభవ౦ పతనమైనందుకు కలత చెందాడు .రైలు యాత్రా బృందం మళ్ళీ దేవిడీ చేరింది –చివరగా –
‘’క్రిష్ణారయో జనకః సహోదర వరో రామాహ్వాయాశ్శా బ్దికః – -సూరామ్బా జననీ ప్రసిద్వాలసితా శ్రీ శ్యామలామ్బా స్వసా
శ్రీమద్వేంకటనారసింహ మహిళా భార్యా కవేర్యస్య తత్ –శ్రీ లక్ష్మీ నరసింహ శాస్త్రి రచితా సంపూర్ణ మగాత్క్రుతిః
ఈకావ్యం సంస్కృత చరిత్రలో ఏకైక సమకాలీన యాత్రా సాహిత్యం గా నిలిచి పోయింది .
92-కర్ణ వీర నాగేశ్వర రావు
తెలుగు సంస్కృతం హిందీ లలో గొప్ప పండితుడు కర్ణ వీర నాగేశ్వర రావు .గుంటూరు జిల్లా వేటపాలెం వాసి .తెలుగులో చాలా రాశాడు సంస్కృత రచనలు –సంస్కృత వాచకాలు అయిదు భాగాలు ,స్వాతంత్ర్య సందేశం ,వాణివీణ,మృత్యుంజయ తారావళి ,చండికా తారావళి ,శ్రీ వెంకటేశ్వర తారావళి ,పొట్టి శ్రీరాములు బలిదానం జాతీయ గీతం ,రెండుభాగాలు ,కదామంజరి ,వాణీ నిబంధన మణిమాల ,టాటా సుబ్బరాయ శాస్త్రి ,వజ్ర పాతం ,సంస్కృత పత్రావళి మొదలైనవి .వీటిలో చివరివి గద్య రచనలు .-కొన్ని
‘’శ్రీకరః సంస్క్రుతాకారః దయా పేతో గుణాన్వితః –పరబ్రహ్మా జగత్కర్తా ,రాక్షతాం సంస్కృతం సదా ‘’
సాహాయ్యం కురు సర్వేషాంసాహాహైం సత్ప్రవర్తనం –సాహాహ్య జీవితెన్నైవ దృశ్యతే సంస్థితం జగత్
మఖార్య రక్షణం మత్వా నిజ భక్తాన్ ప్రబోదయ –నేత్ర యుక్తా హృప్రకాశా మాం పాహి గరుడ ధ్వజా ‘’
93-లక్కా వజ్ఝాల వెంకట కృష్ణ శాస్త్రి –(1827లేక 1887)
సుబ్బమ్మ ,సుబ్బయ్య సిద్దా౦తిల పుత్రుడు వెంకట కృష్ణ శాస్త్రి .కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కురుమద్దాలి లో 25-5-1887లేక 16-5-1827జన్మించాడు పామర్రులో స్థిరపడ్డాడు సాహిత్యం తో బాటు న్యాయం వేదాంతం జ్యోతిషాలను మధించాడు .ఈ శతాబ్ది చివరి కవులందరూ ఈయన శిష్యులే .ఆంధ్రా బరోడా రాజాస్థానాల సత్కార గౌరవాలు అందుకొన్న ఘనుడు..సంస్కృతం లో ‘’స్తోత్ర కదంబం ‘’,శ్రీరామ స్తవమాల ,కదామంజరి ,వైఖానస మీమాంస ,ప్రశ్న కల్పతరువు రాశాడు .హైమవతీ పరిణయం కూడా రాశాడని అంటారు .
94-వేముల కొండ వెంకట నారాయణ (1866)
భారద్వాజ గోత్రీకుడు వేములకొండ కోనయామాత్య కుమారుడు వెంకట నారాయణ 1866లో విశాఖ లో జన్మించాడు పూనాలో సంస్కృతం ఇంగ్లీష్ చదివాడు .మధురంగా సంస్కృత కవిత్వం చెప్పటం అలవాటై చాలా రాశాడు .21ఏళ్ళ వయసులో ‘’పద్మినీ చంద్ర సంవాద౦’’ను 263శ్లోకాలో రచించిన ప్రతిభ ఉన్నవాడు. 12 .ఏళ్ళ తర్వాత ఇంగ్లీష్ వివరణతో ప్రచురితమైంది .పద్మానికి చంద్రునికి జరిగే సంభాషణ ఇది .ఒక ప్రశాంత వెన్నెల రాత్రిలో పద్మం ముకుళిత మై విచారంగా ఉండటం చంద్రుడు చూసి ,ఆమె బాధను పోగొట్టటానికి మాటలతో రంగం లో దిగాడు .చంద్ర ప్రవర్తన నచ్చని పద్మం ఏవ గి౦చు కొంటు౦ది .ఆమె మనసును గెలువలేక పోయిన చంద్రుడు ,హంసలా మారు వేషం లోవచ్చి బలవంతంగా ఎత్తుకు పోతుంటే రక్షించమని పద్మ బాంధవుడు సూర్యుని ఎలుగెత్తి పిలుస్తుంది .సూర్యుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై చంద్రుని శిక్షిస్తారు .మొత్తం మీద చక్కని నీతిబోధక కధనం .సంభాషణలు రసవత్తరంగా చేశాడు కవి .మొదటి శ్లోకం –
‘’గీర్గాన వీణా కవితా రుతేషు ,మయూర హంసేషు పితమహాక్కే –సితారవిన్దేషు చ పుస్తకేషు ,విరాజమానేభ్య మయి ప్రసీద ‘’
అగ్ర కులాల హీన ప్రవృత్తిని చెబుతూ –
‘’యధాపి కేచిత్ త్ప్రభు తాధనాంద ఉపానసత్తాః పరదారాసక్తాః-కేచిచ్వ వ్ద్వద్గురు దండినస్య మిధ్యాప్రభావా న్దధియో వినీతాః’’
చంద్రుడు స్వంత డబ్బా కొట్టుకోవటం –
‘’జ్యోత్స్నా ప్రవాహేన జగత్కరోమి పీయూష ధారా భిరివా భి షిక్తం –ఉల్లాస యన్మన్మద చేస్టితాని ,సంభోగ సౌఖ్యానుభవాయ యూనాన్ ‘’
కైలాస శుభ్రా శామతలయమానాః భాస్మత్య శైవావయ యామనానః –తపోధనానం హృదయాయ మానాః వారాంగనా రమ్య హసా యమానాః’’
‘అంతఃపుర స్త్రీల వలననేచంద్రునికి వైభవం దక్కింది అని పద్మిని దెప్పి పొడిచింది –
‘’విభ్రాజితాన్తః పురకామినీనాంరత్న ప్రభా భాసుర చంద్ర హారః –భూత్వా చరన్ పీన కుచాగ్ర భాగే తత్కంఠమాలింగ్యతదిపి శోభనం ‘’‘’.హంస రూపం లో చంద్రమాన్ పద్మినిని ఎత్తుకుపోయే సందర్భం –
రవి-సా స్యాన్నభో జలనిదౌ ప్రతి బిమ్బితాభూః-
లక్ష్మీ-కిం వా జయధ్వ జపటీసమరాన్గల నౌకా
రవి-హంసీ బిసం స కమలం కిముతోన్న య౦ తీ
సర-మత్పుత్రికాం హారతి జాన్త్రిక ఇందు చోరః ‘’
95-గోవర్ధనం వెంకట నరసింహా చార్య (1856-1935)
శ్రీవత్స గోత్రానికి చెందినా గోవర్ధనం వెంకట నరసింహా చార్య నల్గొండ జిల్లా మిర్యాల గూడ తాలూకా విభురం పేట నివాసి కాలం 1856-1935..తల్లి రామానుజమ్మ తండ్రి రామానుజా చారి .తెలుగు సంస్కృత పర్షియన్ భాషా ప్రవీణుడు .సంస్కృతం లో మట్టపల్లి లక్ష్మీనరసింహ స్తోత్ర నవ రత్న మాలిక ,తెలుగులో పంచ ముఖ హనుమస్తోత్రం రాశాడు .నవరత్నమాలిక 9శార్దూల శ్లోకాలు కలది .
‘’శ్రీ లక్ష్మీ భూమి నీలా ముఖాయువతి ముఖామ్భోజ దీప్తార్క బింబం –సాధ్యః ఖద్యోతమాలా నిభ మండి భ్రుద్వేమ దీప్యా త్కిరీటిం’’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-1-16-ఉయ్యూరు