డా .కొలచల సీతారామయ్య గారి జీవిత చరిత్ర –కెమోటాలాజి పిత గ్రంధావిష్కరణ సభ విశేషాలు
251-16సోమవారం ఉదయం 10-30గం లకు 67వ భారత రిపబ్లిక్ దినోత్సవం ము0దురోజున సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ ,, ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాల –కెమిస్ట్రీ శాఖ –ఉయ్యూరు సంయుక్త ఆధ్వర్యం లో ఉయ్యూరుకు చెందిన ప్రరంచ ప్రసిద్ధ శాస్త్ర వేత్త జీవిత చరిత్రపై సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించిన ‘’కేమోటాలాజి పిత కొలచలసీతారామయ్య –పుల్లేరు నుండి ఓల్గా దాకా ‘’గ్రంధావిష్కరణ ను భారత్ టుడే సంపాదకులు శ్రీ జి .వల్లీశ్వర్ ,రామయ్య గారి అన్నగారు శ్రీ గాయత్రి అనంతరామయ్య గారి మనవరాలు 86ఏళ్ళ జ్ఞాన వయో వృద్దు గైనకాలజీ డాక్టర్ సూరి శ్రీమతి గారు సంయుక్తంగా ఆవిష్కరించి చరితార్ధతను సృష్టించారు .కెమిస్ట్రీ హెడ్ శ్రీ జోశ్యుల నాగేశ్వరరావు గ్రంధ పరిచయం చేశారు .గ్రంధ రచన ఉద్దేశ్యం ,విషయసేకరణ, రామయ్య గారి బహుముఖీన వ్యక్తిత్వం ,ఆయన్ను స్వయంగా చూసి మాట్లాడిన అనుభవాలతోబాటు గ్రంధం లోని ముఖ్య విశేషాలను శ్రీ దుర్గాప్రసాద్ సభకు తెలియ జేశారు .
రెండు ప్రముఖ నిర్ణయాలను తీసుకోవటం ఈ సభ ప్రత్యేకతను చాటింది .మొదటిది శ్రీదుర్గా ప్రసాద్ ఉయ్యూరులో సీతారామయ్య గారి విగ్రహం స్థాపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారి స్పూర్తి భవిష్యత్ తరాలకు అందించటానికి ఇదొక ప్రేరణ అవుతు౦దని ,దీనికి రాజకీయ నాయకుల ను ఒప్పించి చేయటం చాలా ఔచిత్యంగా ఉంటుందని ,సభలో లేకున్నా శాసన మండలి సభ్యుడు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ కు సభాసదుల మనసులోని మాటను తెలియజేయవలసినదిగా,ఆయన తరఫున సభకు హాజరైన ఆయన శ్రీమతి ఉయ్యూరు మాజీ సర్పంచ్ శ్రీమతి భ్రమ రాంబ కు సూచించ గా ఆమె వెంటనే ఇందులో తనకూ బాధ్యతా ఉందని అందరి అభిప్రాయాన్ని శ్రీ రాజేంద్రకు తెలియజేస్తానని మాట ఇచ్చారు . ఇది ఒక సుదీర్ఘ ప్రయత్నమే అవుతుందని ,కాని ఉపాయం గా ఇప్పుడు గోవా వీరుడు సూరి సీతారాం విగ్రహం ప్రక్కనే రామయ్య గారి బస్ట్ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ తో సూరి ట్రస్ట్ తరఫున హ్యాం రేడియో అధినేత శ్రీ సూరి శ్రీరామ మూర్తి చేయించి తక్కువ ఖర్చుతో యేర్పాటుటు చేయవచ్చునని సూచించగా ,వెంటనే స్పందించి డాక్టర్ శ్రీమతి దానికి తన వంతు విరాళంగా 10వేల రూపాయలను ఎప్పుడు అడిగితె అప్పుడు శ్రీ సూరి కి అందజేస్తానని వాగ్దానం చేశారు .శ్రీ శ్రీరామ మూర్తి చాలా సంతోషంగా ఆ బాధ్యతను తానూ సూరి ట్రస్ట్ తరఫున నెరవేరుస్తానని సభా ముఖం గా తెలియ జేయటం తో ఆ ఇద్దరినీ కరతాళ ధ్వనులతో సభ అభినందించింది .ఈ విగ్రహ స్థాపన రామయ్య గారి జయంతి రోజు జులై 15న జరిపితే బాగుంటుందని ,ఒక వేళ వీలుకాని పక్షం లో వారి వర్ధంతి సెప్టెంబర్ 29న జరిపించాలని దుర్గా ప్రసాద్ సూచించారు .అక్కడ ఉన్న అందరి అభిప్రాయమూ అదే కనుక కార్యక్రమం త్వరలోనే రూపు దాల్చ వచ్చు .
రెండవది హ్యాం రేడియో అధినేత శ్రీ సూరి శ్రీరామ మూర్తి మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో తుఫాన్లను పసిగట్టి హెచ్చరించేందుకు హ్యాం రేడియోకు కాని ,ప్రభుత్వానికి కాని మచిలీపట్నం విజయవాడలు సరైన కేంద్రాలు కావని ,అవి తుఫాను ప్రభాలకు గురై కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినే ప్రాంతాలని అనుకని ఉయ్యూరు లోని ప్రశాంత అందమైన విశాలమైన,అన్ని వనరులు ఉన్న ఏ.జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ కాలేజిలో హ్యాంరేడియో కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాలేజి కన్వీనర్ శ్రీ తాతినేని శ్రీహరి రాగారు యాజమాన్యం తో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని సూచించగా వేదికపైనే ఉన్న కన్వీనర్ సద్యో స్పందనగా మనస్పూర్తిగా అంగీకరించి దానికి సంబంధిన ప్లాన్ అంతా తయారు చేసి తనకు వెంటనే పంపమని శ్రీ సూరి ని కోరారు .సభా సదుల హర్షధ్వానాలు మిన్నంటాయి .ఈ రెండు విషయాల సాధనగా ఈ వేదిక సాఫల్యమైనదదని దుర్గాప్రసాద్ అన్నారు .
సభాధ్యక్షులు కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు ,గౌరవ అతిధిగా శ్రీ తాతినేని శ్రీహరి రావు ,ఆత్మీయ అతిధులుగా కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ సూరి శ్రీరామ మూర్తి దంపతులు ,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్య దర్శి డా జి వి పూర్ణ చంద్ ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ముఖ్య కార్య దర్శి ,రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ,రచయిత శ్రీ గబ్బిట కృష్ణ మోహన్ ,శ్రీ సూరి ఆంగీరస శర్మ ,అంతర్జాతీయ హ్యాం కార్యకర్త శ్రీటాం జోస్.సరసాభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జ్యోశ్యుల శ్యామలాదేవి వేదిక నలంకరించారు .
శ్రీ సుబ్బారావు ‘’ఇలాంటి సభలు విద్యార్ధులతో నిర్వహించటం గొప్ప విషయమని దీనికి రెండు సంస్థలను అభినందిస్తున్నానన్నారు .శ్రీ పూర్ణ చంద్ లూబ్రికంట్ లంటే ఏమిటో వాటి సామర్ధ్యాన్ని పెంచటానికి రామయ్య గారు యెంత కష్టపడ్డారో తెలుసుకోవాలని ఊరికే ఏదీరాదని కృషి పట్టుదల సామర్ధ్యం ఉంటె విజయం వరిస్తు౦దన్నారు .శ్రీ శ్రీహరిరావు ఇంతటి గొప్ప పుస్తకం తమ కాలేజీలో ఆవిష్కరింప బడటం తమ కాలేజి అదృష్టమని విద్యార్ధులకు వరం అని అన్నారు .శ్రీచలపాక సరసభారతి అన్నా దుర్గాప్రసాద్ గారన్నా తనకు ఎంతో గౌరావమని పుస్తకాలు అన్నీ రిసెర్చ్ చెందిన విలువైన గ్రంధాలని వీటిని ఏంతో కస్టపడి ప్రసాద్ గారు రాశారని ఆయన తమ లాంటివారికి ప్రేరణ అనీ అన్నారు .శ్రీ జి కృష్ణమోహన్ తాను రామయ్య గారిని చూసి మాట్లాడిన అనుభవ౦ వివరించారు.
సభాకార్యక్రమానికి ముందు శ్రీ టాం జోస్ హుద్ హూద్ తుఫాను విశాఖను కల్లోల పరచిన తీరును ,అప్పుడు హ్యాం రేడియో ద్వారా తానూ అందించిన సేవలను తన సేవను గుర్తించి రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సంస్థలు తనను గౌరవించి సన్మానించిన చిత్రాలను ,తన విదేశీ పర్యటన సత్కారాల చిత్రాలను ప్రొజెక్టర్ పై ప్రదర్శించి గొప్ప అనుభూతిని కల్గించారు .అప్పుడు దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ‘’టాం మీలాగా ఇంకా కాలేజి విద్యార్దియే .హుద్ హూద్ తుఫానులో హ్యాం రేడియో తో చేసిన సేవలకు గుర్తింపు పొంది ఇవాళ ప్రపంచ ప్రముఖుడు అయ్యాడు .అంతేకాదు తెలంగాణా ప్రభుత్వం టాం సాధించిన విషయాలను 9వ తరగతికి లెసన్ గా చేసి ఇంత చిన్న వయసులో అతనికి అతి గొప్ప గౌరవాన్ని కలిగించిందని ,అందరు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో-స్టాండింగ్ వోవేషన్ ఇచ్చి టాంను అభినందించాలి అనగానే సభ ఒక్క మాటున ఆనందం తో లేచి నిలబడి కరతాళ ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేట్లు చేసి ఈ విద్యార్ధి నాయుకునికి అభినందనలు తెలియ జేసింది .టాం వినయంగా స్వీకరించి హ్యాంరేడియోతో ప్రపంచ ప్రముఖుల౦దరితోనూ మాట్లాడవచ్చునని ,ప్రపంచ వ్యాప్తంగా విషయాలన్నీ తెలుసుకోవచ్చునని విద్యార్ధులకు హితవు చెప్పాడు .సరసభారతి శాలువా, రామయ్య గారి చిత్రం ఉన్న జ్ఞాపికతోబాటు 2,౦౦౦రూపాయల నగదు బహుమతిని అందజేయగా ,కాలేజి యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది .
శ్రీ సూరి సభాముఖంగా శ్రీ దుర్గాప్రసాద్ కు 15,౦౦౦రూపాయల చెక్ ను అందజేసి ,విద్యార్ధులకు హ్యాం,పైనా ,రామయ్య గారిపైనా క్విజ్ కార్యక్రమాలవంటివి నిర్వహించి బహుమతులను అందజేయ వలసిందని కోరగా ,ప్రస్తుతం ఫైనల్ పరీక్షల మూడ్ లో విద్యార్దులున్నారని తీరుబడిగా వాటిని చేయచ్చునని అప్పటిదాకా ఆడబ్బు తన వద్ద ఉంచు కోవటం భావ్యం కాదని, నిర్వహించినపుడు తానే అడిగి బహుమతులకోసం తీసుకొంతటాననిమర్యాదగా చెప్పి చెక్కును తిరిగి ఇచ్చేశారు .
ఈ సభలో పాల్గొన్న అతిదులందరికి సరసభారతి శాలువా జ్ఞాపికలతో సత్కరించింది . రామయ్య గారి గ్రంధాన్ని కాలేజి లైబ్రరీకి 50,కెమిస్ట్రీ డిపార్ట్ మెంట్ కు 25కాపీలు ,స్పాన్సర్ అయిన శ్రీ రాజేంద్ర కు 75,రామయ్య గారి బంధువులకు .సభకు హాజరైన వారందరికీ అందజేయ బడినాయి .సరసభారతి కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మికార్య క్రమ నిర్వహణ చేయగా ,సాంకేతిక సలహాదారు శ్రీ వి బి జి రావు ,కోశాధికారి శ్రీ జి వి రమణ,కేమిస్త్రే లెక్చరర్లు శ్రీమతి శాంతి, కుమారి నవ నీత విలువైన సహకారం అందించారు .మాజీలెక్చరర్ శ్రీ పి .నారాయణ మూర్తిగారు సరసభారతికి కాలేజి కి అనుసంధాన కర్తగా వ్యవహరించి విజయానికి తోడ్పడ్డారు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సభ విజయవంతం కావటానికి ముఖ్య కారకులు అత్యంత క్రమశిక్షణతో మెలగినకాలేజీ డిగ్రీ విద్యార్ధినీ విద్యార్ధులేనని దుర్గాప్రసాద్ వారిని అభినందించారు . సభ ప్రారంభానికి ముందు కాలేజి వారు అతిధులకు అల్పాహార విందు నివ్వగా సభానంతరం సరసభారతి మధ్యాహ్న విందు నేర్పాటు చేసింది .విద్యార్ధినుల మా తెలుగు తల్లి ప్రార్ధనా గీతం తో సభ ప్రారంభమై ,జనగణ మనజాతీయ గీతం తో సమాప్తమైంది .కాలేజి విద్యార్ధినీ విద్యార్ధులు సుమారు వందమంది ,సాహిత్యాభిమానులు సుమారు 25మంది తో సభ కళకళ లాడింది .
రామయ్యగారి కుటుంబ సభ్యులు ఏంటో ఉత్సాహం గా ఇదొక పండుగ వేడుకలాగా కార్లలో హైదరాబాద్ నుండి వచ్చి పాల్గొని రామయ్యగారిపై ఉన్న గౌరవాన్ని ప్రకటించారు .వారందరు భోజనానతరంశ్రీ దుర్గా ప్రసాద్ ఇంటికి వచ్చి ఒక గంట ఉండి మార్యాద పొందారు .1963లో శ్రీ దుర్గాప్రసాద్ తో బాటు రాజ మండ్రి ట్రెయినింగ్ కాలేజీ లో బి ఎడ్ సహా విద్యార్ధి అయిన శ్రీ వారణాసి సుబ్బయ్య (రిటైర్డ్ జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ )భార్య శ్రీమతి లలితాదేవి తో 52ఏళ్ళ తర్వాత ఉయ్యూరు వచ్చి సభలో పాల్గొని శ్రీ దుర్గాప్రసాద్ దంపతులకు నూతన వస్త్రాలతో సత్కరించి వారిచే శాలువా జ్ఞాపికా అందుకోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది .శ్రీ సుబ్బయ్య దంపతులు శ్రీ దుర్గాప్రసాద్ ఇంటికి వచ్చి నూతన వస్త్రాలతో సత్కార మందుకొన్నారు . స్థానిక పత్రికా విలేకరులెవ్వరూ హాజరు కాకపోయినా .స్థానిక మన చానెల్ సిటీ కేబుల్ వారొచ్చి వీడియో తీసి ,వార్తలలో చూపారు నేషనల్ చానెల్ భారత్ టుడే విస్తృత కవరేజ్ నిచ్చి సభ ను చిరస్మరణీయ౦ చేసింది .
భారత గణ తంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -26-1-16-ఉయ్యూరు