శ్రీ ప్రసాద్ గారికి ,
నమస్కారములు.మీ దగ్గర నుండి అన్ని విశేషములు వచ్చిన తరువాత అవి చదివి మెయిల్ ఇద్దామన్న ఉద్దేశ్యం తో ఆగాను. మీరు పంపించిన వన్నీ చదివాను.అందులో నాకు మరిచిపోలేని విశేషాలు.
అంతర్జాతీయ ఖ్యాతి గణిం చిన ప్రేమ్చంద్ గారు శాకాహారి కావటం .వీరి తండ్రి గారు వీరికి ప్రేమ్చంద్ అని పేరు పెట్టటానికి ఏమి కారణం అయిఉంటుందొ .Radio చైతన్యం కలిగించిన వారు కాబట్టి .. అ పేరు తట్టి ఉంటుందేమో .
ఇక కొలచల కుటుం బాన్ని గురించి …. ఒకే కుటుంబం లో గాయత్రి ఉపాసన చేసే వారు .తరువాత సుబ్రమణ్య శాస్త్రి గారు… సీతారామయ్య శాస్త్రి గారు ఉండటం జీవుల కర్మ పూర్వ జన్మ పుణ్య విశేషాలు . బ్రహ్మాస్త్రం నేర్చుకున్న చిరంజీవి అశ్వత్థామ… వేదవిద్యాచార్యుడైన ద్రోణుడి పుత్రుడే ..
మైనేని గోపాల కృష్ణ గారిని గురించి చెప్పేదేముంది .కపిధ్వజమల్లె మీరు చేసే ప్రతి ఉత్సవం లోను , ఉద్యమం లోను ముందర ఉంటారు. వారు ఇచ్చె బలం .. మిఠాయి లో బెల్లమల్లె అంతటా వ్యాపించి ఉంటుంది .
నాకు ఈ ఉత్సవంలో పాలు పంచుకునే అదృష్టం కలిగిన తీరు .. తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తున్ది. నేను నా పొన్నూరు మిత్రుడికి సంస్కృత నాటకం పంపిమ్చటము, అది దక్షిణ మూర్తి గారికి తెలియటము .. వారు నన్ను గురించి మీతో చెప్పటం … మీరు నేను ఫోన్ లో మాట్లాడుకోవటం . ఆతరువాత మనం కలవటం … ఇంట తొందర గా కలలలోను ,సినిమాలలోను మాత్రమె జరుగుతయ్యి.
ప్రపంచం Anthropic సూత్రం తోనే నడుస్తుంది కదా ..
మీకు చెప్పటానికి “ధన్య వాదాలు ” అనే మాట తప్ప లేక పోవటం వలన అదే వాడుతున్నాను. థాంక్స్
VB రాజేంద్ర ప్రసాద్ గారు కృష్ణజిల్లా వాడని తెలుసు గాని .. అంత సంస్కారవంతుడనీ .. మిమ్మల్ని మాస్టర్ గారని పిలుస్తాడని తెలిసి చాలా సంతోషం వేసిన్ది.
మీ నిరంతర కృషి ని గురించి మాకు ఒక 30 ఎల్లా క్రింద తెలిసివుంటే .. మా జీవితాలలో టైం ఇంకా సదుపయోగం అయ్యేదేమో ..
భవదీయుడు
ACPSastry
—