ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -103
44- విమాన యానానికి రైట్ చెప్పిన రైట్ సోదరులు-2
చిన్నతనం నుంచి యంత్ర శాస్త్రం అన్నా , అందులో చలన యంత్రాలన్నా రైట్ సోదరులకు మక్కువ ఎక్కువగా ఉండేది .వారు తయారు చేసిన మొదటి ఆటవస్తువు’ఒక చిన్న ’ గైరోస్కోప్ ‘’-ఒక వలయం లో ఉన్న చక్రం –దీన్ని వేగంగా త్రిప్పితే కత్తిమొనమీద లేక కప్పు అంచు మీదఎటూ ఒరగకుండా బాలన్స్ గా ఉండే ఆటవస్తువు .రెండవది మియేచర్ హెలి కాప్టర్ .వెదురు ,కాగితాలతో రబ్బర్ బాండ్ లతో కట్టి తిరిగేట్లు చేశారు .ఇద్దరికీ పదేళ్ళ వయసు లోపు ఉండగానే దీని నాణ్యత పెంచటానికి కృషి చేశారు .తర్వాత బైసికిల్స్ తయారు చేయటం లో దృష్టిపెట్టారు .ఆట వస్తువులు తయారు చేసి అమ్ముతూ జీవికకు డబ్బు సంపాదించారు .అన్నదమ్ములకు 25,20ఏళ్ళున్నప్పుడు సైకిళ్ళను అద్దేకిస్తూ, అమ్ముతూ జీవించారు .తమ షాపు పైన ఒక గదిలో బైసికిల్స్ తయారు చేస్తూ యంత్రభాగాలను కూరుస్తూ ,లాభసాటి వ్యాపారం చేశారు .ఇన్ని చేస్తున్నా గాలిలో ఎగిరే హెలికాప్టర్ తయారు చేయాలన్న ఆలోచన మాత్రం మనసుల నిండా అలాగే ఉండి పోయింది .ఆర్విల్లీ ఇరవైలలో ఉండగా ఆల్బర్ తో కలిసి ఫ్లైయింగ్ కు సంబంధిన విషయాలన్నీ సేకరించి ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకొన్నారు .వీరిద్దరికీ జర్మన్ ఎక్స్ పర్ట్ఆటో లిలీన్తాల్ .ఆతను గ్లైడింగ్ గురించి బాగా అధ్యయనం చేయటమేకాక ,ఒక కొండ ప్రక్కనుండి చిన్న చిన్న దూరాలకు గ్గ్లైడ్ చేసి ఆశ్చర్య పరచాడు .పాపం ఈ గ్లైడింగ్ లో ఆతను ప్రాణాలు పోగొట్టుకొన్నాడు .ఇది విని మన సోదరులు కలత చెందారు కాని నిరాశ పడలేదు .అతని ప్రయత్నాలు అనుభవాలను క్షుణ్ణంగా పరిశీలించి,అతనురాసిన ‘’ది ప్రాబ్లెమ్స్ ఆఫ్ ఫ్లైయింగ్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్ పెరి మెంట్స్ ఇన్ సోరింగ్ ‘’పుస్తకాన్ని అధ్యయనం చేశారు .స్మిత్ సోనియన్ ఇన్ స్టిట్యూషన్ సెక్రెటరి పీర్పాంట్ లాంగ్లే కు ఉత్తరం రాసి ఆయన పుస్తకం ‘’ఎక్స్ పెరమెంట్స్ ఇన్ ఏయిరో డైనమిక్స్ ‘’పుస్తకాన్నీ చదివారు .ఆయన సూచన మేరకు ఏయిరో నాటికల్ జర్నల్స్ 1895,96,97లను పరిశీలించి అవగాహన పొందారు .ములార్డ్ రాసిన ‘’ఎంపైర్ ఆఫ్ ది ఎయిర్ ‘’,అందరూ చదవాల్సిన ఆక్టేవ్ చాన్యూట్ రాసిన ‘’ప్రోగ్రెస్ ఇన్ ఫ్లైయింగ్ మెషీన్స్ ‘’కూడా చదివి ఆయనకు మంచి స్నేహితులైపోయారు .ఆయన వీరికి గొప్ప ప్రేరణ కలిగించాడు .దీన్ని సమగ్రంగా ఫ్రూడేన్థాల్’’ఫ్లైట్ ఇంటు హిస్టరీ ‘’లో వివరంగా రాశాడు .
రైట్ సోదరులు స్వయంగా గ్లైడర్ తయారు చేయాలని నిర్ణయించారు .పూర్వం చేయబడిన వాటికి భిన్నంగా ఈ బై ప్లేన్ తయారు చేయాలన్నది వీరి సంకల్పం .ఇతర విమానాల వింత పోకడలను గమనించి ,తాము నిర్మించే దానికి ముందు భాగం లో స్టెబి లైజర్ ,పైలట్ చేతిలో నియంత్రణ ఉండేలా ఒక చిన్న అనుబంధ ప్లేన్ లేక ఎలివేటర్ ను నిర్మించారు .ఎగిరేప్పుడు అటూ ఇటూ ఒరిగితే ,అది ఆ యంత్రాన్ని మరింత పైకి ఎగిరెట్లు చేస్తుంది దాన్ని అణచేస్తే పైకి ఎగరటాన్ని వెనక్కి మారుస్తుంది (రివర్స్ ).కాని పార్శ్వ సమతులనం (లేటరల్ బాలన్స్ )లో చిక్కులున్నాయి .కాకుల సంజ్ఞలను గమనించి విమాన రెక్కలను సమతల౦ గా కాకుండా కొంచెం వంపు ఉండేట్లు తయారు చేసి బాలన్సింగ్ సమస్యను అధిగమించారు .అనువైన రెక్కల అమరిక నేర్పరచడం తో గ్లైడింగ్ లో విప్లవాత్మక మార్పు వచ్చింది .దీనిపైనే వారి భవిష్యత్తు పేటెంట్ లన్నీ ఆధార పడ్డాయి .రెక్కలచివరలలో కదిలే వాటిని మార్చటం తో నడిపెవాడికి పని తేలికై ఒకసారి ఎగిరితే గాలిలో దాన్ని స్థిరంగా ఉంచటం సాధ్యమైంది .దీనితో బైసికిల్ బిజినెస్ దెబ్బతింది .అందులోని స్పేర్ పార్టులన్నీ దీనికోసం వాడారు .1900ఆగస్ట్ లో రైట్ సోదరుల కొత్త గ్లైడర్ తయారైంది .
మొదటి ఫలితాలు ఆశా జనకం గా రాలేదు .కానిఎంతో అనుభవం వచ్చింది .గ్లైడింగ్ ఫ్లైట్ లను కంట్రోల్ చేయగలం అనే నమ్మకం కుదిరింది .అసలైన ఎగురుడు ఎంతో దూరం లేదని పించింది .డేటాన్ కు సోదరులు చేరుకొన్న వెంటనే ఇంతకు ముందెన్నడూ ఎవరూనిర్మించని అతిపెద్ద ఎగిరే యంత్రాన్ని తయారు చేశారు .కిట్టీ హాక్ లో దాన్ని ప్రయోగం గా నడిపి అంతకు ముందు కొన్ని సెకన్లు మాత్రమె ఉన్న గ్లైడింగ్ రికార్డ్ ను బద్దలు కొట్టి ,ఎక్కువ దూరం ఎక్కువ కాలం ఎగిరారు .ద్విగుణీకృత ఉత్సాహం తో సోదరులు మళ్ళీ ప్రయత్నాలు చేశారు .డేటన్ వచ్చి విండ్ టన్నెల్స్ ను ,సుమారు 200రెక్కల నమూనాలను రూపొందించారు .స్వయంగానే నేర్చి సంక్లిష్ట పట్టికలు ,జటిలమైన లెక్కలేనన్ని గణిత సూత్రాలను తయారు చేశారు .’’లెక్కల సూత్రాలపై ఎగిరే యంత్రాలు నమ్మకమైనవి కావు అని తెలిసింది ‘’అని ఆ తర్వాత రాశారు .ఒకదాని తర్వాత ఒకదాన్నిశాస్త్రీయం గా ప్రయోగం చేస్తూ ,అనుమానించిన వాటిని వదిలేస్తూ రెండేళ్ళు కఠోర శ్రమ చేసి విసిగి వేసారి చివరికి తామే స్వయంగా పరిశోధన చేసి తేల్చుకోవాలనుకొన్నారు .అత్యంత శాస్త్రీయ బద్ధంగా ఆలోచించి విమానం తాయారు చేయాలనే సంకల్పానికి వచ్చారు .
1902 శిశిరం లో కిట్ట్టేన్ హాక్ లో కొత్తగా అభివృద్ధి చేసి తయారు చేసినమూడవ గ్లైడర్ ను వాడారు .రెక్కల పొడవు 32అడుగులు .రెక్కల అమరికలో మార్పులు చేసి తోక కూడా ఏర్పాటు చేశారు .అన్ని రకాల పరీక్షలు నిర్వహించి సుమారు వెయ్యి గ్లైడింగ్ ఫ్లైట్స్ తయారు చెశారుఇద్దరూ .ఆరువందల అడుగుల పొడవుతో కొన్ని రెండు నెలలలో తయారు చేశారు .పార్శ్వ సమతుల్యతను అనేక చిట్కాలతో రెక్కలలో మార్పులతో సాధించారు .మరో అడుగు ముందుకు వేయటానికి సిద్ధ మైనారు .అదే’’ పవర్ ఫ్లైట్’’.అప్పటికి విల్బర్ కు 36,ఆర్విల్లీకి 32ఏళ్ళు .ఇద్దరూ సన్నగా పుల్లలాగా తీగల్లాగా ఆరు ,అయిదున్నర అడుగుల అందగాళ్ళుగా ,స్టీల్ బ్లూ కళ్ళతో, డేగ చూపుతో దృఢమైన శరీరం తో ఉండేవారు . ప్రముఖ అమెరికన్ కవి రచయిత ‘’ఎడ్గార్ అల్లెన్ పో’’ పోలికలు౦డేవి .చిన్నోడిని ఒక సభలో మాట్లాడమంటే ‘’నాకు చిలుక పక్షి ఒకటే తెలుసు కాని అది బాగా ఎగరలేదు కదా ‘’అని చెప్పి కూర్చున్నాడట .విల్బర్ రైట్ జీవితం గురించి గ్రిఫ్ఫిత్ ‘’ది లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ విల్బర్ రైట్ ‘’పుస్తకం లో ‘’To try to be always comfortable and happy was a mistake ,for ,if one succeeded life became unbearably monotonous ‘’అన్నాడని రాశాడు .విల్బర్ ఆర్విల్లీలిద్దరూ చాలాపవిత్రం గా ఉండేవారు .తాగుడు స్మోకింగ్ వారు ఎప్పుడూ చేయలేదు .సబ్బాత్ లో చెప్పిన నాలుగవ కమాండ్ మెంట్ ను తూ చా తప్పక ఆచరించేవారు .సాధారణ వ్యాపార వేత్తల దుస్తులనే ధరించేవారు .బజారులో తిరిగే బట్టలతోనే ఆర్విల్లీ గ్లైడర్ లో కూర్చునేవాడు .కళ్ళజోడు హెల్మెట్ ,చేతి తొడుగులు ధరించేవాడు కాదు .లేకపోతె ఆల్బర్ గ్రే సూట్ లో బాగా గంజి పెట్టిన కాలర్ తో పైలట్ గా ఉంటె చూస్తూ౦ డేవాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30-1-16-ఉయ్యూరు