గీర్వాణ కవుల కవితా గీర్వాణం
475- చరక మహర్షి(10వ శతాబ్దం )
మానవ ఆరోగ్యం ఆటను తీసుకొనే ఆహారం మీదనే ఆధార పడుతుందని తెలుసుకొని ”చరక సంహిత ”అనే గ్రంధాన్ని రాసిన వాడు చరక మహర్షి .శారీరక అవసరాలకు కావలసిన శక్తిని ఆహారం ద్వారానే పొందాలని చెప్పాడు .విజ్ఞతతో ఆహారం తీసుకోవాలి అనుకొనే వారు పన్నెండు రకాల ఆహార వర్గాలను గురించి తెలుసుకోవాలని వాటిని వివరించాడు .గింజలు ,పప్పులు మాంసం ,ఆకుకూరలు ,పండ్లు ,పచ్చని కూరగాయలు ,మద్యం నీళ్ళు,చెరకు రసం తో తయారైన ఆహారం ,వండిన ఆహారం ,పాల పదార్ధాలు ఇతర తిని బండారాలు గురించేకాక ,అనేక సంప్రదాయ వైద్య చికిత్సలను కూడా తన గ్రంధం లో రాశాడు .
చరకుడు ఏ కాలం వాడో స్పష్టం గా తెలియదు .కాని ఆయన రాసిన సంహిత మాత్రం క్రీ.శ.987లో పర్షియన్ ,అరెబిక్ భాషలలోకి అనువాదమై పోయింది దానిని ”భేళ”అనే ఆయన రాసినట్లు చెబుతారు .చరక మహర్షి క్రీ.శ800వాడు అని అందరి నిర్ధారణ .చరకుడు చెప్పిన వైద్య విషయాలకు మూలం ఋగ్వేదం లో అధర్వ వేదం లో ఉచరక సంహిత ఎనిమిది ప్రకరణాలతో నూట ఇరవై అద్యాయాలతో ఉన్న గ్రంధం .సూత్ర స్థాన ,నిదాన స్థాన,విమాన స్టాన ,శరీర స్థాన ,చికిత్సస్థాన ,కల్పస్థాన ,సిద్ధి స్థాన అనేవే ఎనిమిది ప్రకరణలు .ప్రతి అధ్యాయం లో విపులం గా ఆరోగ్య రక్షణ ,వ్యాధుల చికిత్సలను సూచించాడు .కాలు విరిగితే ఇనుప కాలు అమర్చే విదానం చెప్పాడు .అంధత్వం పక్ష వాటం ,కుష్టు ,మూర్చాస్ ,రాచపుండు అనే కేన్సర్ మొదలైన దీర్ఘ వ్యాధులకు సులభ నివారణోపాయాలు వివా రించాడు .
”జీవేమ శరదశ్శతం ”అన్న వేదం వాక్యాన్ని ఉదాహరిస్తూ నిండు నూరేళ్ళు మానవుడు హాయిగా ఆరోగ్య వంతం గా జీవించాలని కాంక్షిస్తూ ”చరక సంహిత ”రాశాడు .ఆయన పూర్వ నామం ”మహర్షి పునర్వసు ” కాని ఆయన రచించిన గ్రంధం పేరు చరక శాస్త్రమని కొందరు భావిస్తారు ..పునర్వసు మహర్షికి ఒక రోజు ఒక కోరిక కలిగింది. మారు వేషం లో నగరం లో సంచరిస్తూ ”కొ అరుగ్”అంటే ఆరోగ్యం లేని వారెవ్వరూ ?అని ప్రశ్నించటం ప్రారంభించాడట .అప్పుడు ఒకాయన ”చ్యవన ప్రాస ”తిన్నవారేప్పటికి రోగ గ్రస్తులు కారు అని జవాబు చెప్పాడట .ఇంకోడు ”చంద్ర ప్రభావతి ”తింటే రోగాలు రావన్నాడు .వేరొకరు ”వంగ భస్మం ”అన్నారు .కొందరు భాస్కర లవణం అని నిర్మోహ మాటం గా చెప్పారు ..అప్పుడు ఇవన్నీ విన్న పునర్వసుకు ఏడుపొచ్చినంత పని అయింది .తాను ఎంతో కస్టపడి వేదాల నుంచి అనేక విషయాలు సేకరించి వైద్య శాస్త్రం రాస్తే ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారని బాధ పడ్డాడు .ఇంతలో ప్రాచీన విద్యా చార్యుడు ”వాగ్భాటుడు ”నదీ స్నానం చేసి వస్తు న్నాడు .మళ్ళీ పునర్వసు అదే ప్రశ్న వేశాడు .అప్పుడు వాగ్భాటు డు ”హిత భుక్తిహ్ మిత భుక్తిహ్ రుత భుక్తిహ్ ”అన్నాడు అప్పుడు పునర్వసు ఆనందం తో తన సంహితను మూడు ముక్కల్లో స్పష్టం గా చెప్పిన వాగ్భాటుడిని ప్రశంసించాడు .
చరకుడు తన వైద్య విధానం లో ”పాదరసం ”ను వాడాడు .ఇది మహా గొప్ప విషయమని వైద్య శాస్త్ర వేత్తలు అంగీకరించారు .శరీరం లో వాత ,పిత్త,కఫాలు సమ తుల్యం లో లేక పొతే అస్వస్థత చేస్తుందని చెప్పాడు .దాటు లోపం వల్ల ఏ ఏ వ్యాధులు రావచ్చో వివరించాడు .చరక సంహిత ”మహా వైద్య విజ్ఞాన సర్వస్వం ”అంటారు అందరు .దీనిపై విపుల పరిశోధన చేసిన వారు నారదత్త ,చక్ర పాణి ,శివదాస ,వైన దాస ,ఈశ్వర సేన మొదలైన వారు .చరక సంహిత ఆధారం గానే యునానీ వైద్యం ప్రారంభ మయింది .
జన్యు శాస్త్రం లో కూడా చరకుని ప్రవేశం కని పిస్తుంది .లింగ నిర్ధారణ విషయమై అనేక ద్రుష్టి కోణాలను ఊహించి చెప్పాడు .శిశువు మూగ ,గుడ్డి,చెవిటి గా జన్మిస్తే అది తలి దండ్రుల దోషం కాదని వారి శుక్ల శోనితాలాడే దోషమని చెప్పాడు .ఇవి జన్యు శాస్త్రానికి మూలాలు అయ్యాయి .ఇరవై శతాబ్దాల క్రితమే ఈ విషయాలను తెలియ జేసినా మేధావి చరకుడు .మానవ శరీరం లో మూడు వందలఅరవై ఎముకలున్నాయని నిర్ధారించి చెప్పాడు .గుండెకు సంబంధించిన వ్యాధులను వాటి చికిత్సా విధానాలను కూడా తన గ్రంధం లో చర్చించాడు .ప్రాచీన వైద్య శేఖరుడు ”ఆత్రేయ మహర్షి ”మార్గ దర్శ కత్వం లో అగ్ని వేశుని బోధలు ,రచనలను వృద్ధి చేసిన ఫలితం గా తన సంహిత పరి పుష్టి చెందిందని చరకుడు పేర్కొన్నాడు .సుశ్రుతుడు చరకుడు ,వాగ్భటుతుడు అంద జేసిన మూలికా విశిష్టత ద్వారా పన్నెండు అత్యంత ప్రధాన దేశాలలో భారత దేశం మొదటి స్తానం లో ఉంది .మన దేశ వ్యాప్తం గా ఉన్న మొక్కలలో నలభై శాతం వరకు ఔషధ ప్రయోగాలకు ఉపయోగ పడతాయని ఆధునిక వైద్య శాస్త్ర వేత్తలు అభిప్రాయ పడ్డారు .ఇతర దేశాలలో ఈ సగటు కేవలం పన్నెండు శాతమే .
చరక సంహిత లో ”స్మ్రుతి భ్రంశం ,ధృతి భ్రంశం ,బుద్ధి భ్రంశం ”గూర్చి ప్రస్తావన ఉంది న్యూరోసిస్ ,డిప్రెషన్ ,యాన్గ్సైటీ ,స్కిజోఫీనియా ,ఎపిలేప్సి,ఉన్మాదం లకు ఏ ఇతర ప్రభావం చూపని గొప్ప వైద్య చికిత్స ను సూచించాడు .సర్ప గ్రంధి ,బ్రాహ్మీ ,జతామూసి ,వచ్చా ,స్వర్ణం ,తగరాలను ఔషధాలుగా వాడే పధ్ధతి తెలిపాడు .తలంటి శిరో వసతి శిరో తాపం ,అంజన కర్మ ,సస్య కర్మ మానసిక వ్యాధులకు గొప్ప చికిత్సలని చెప్పాడు .
చరక సంహిత అనంతర కాలం లో ”ఆయుర్వేద గ్రంధం ”గా రూపు దాల్చింది .ఆరోగ్య వంతుడి లక్షణం ”సమ దోషః సమాగ్నిస్చ ,సమధాతు మల క్రియః -ప్రసంనాత్మే ఇంద్రియ మనః శ్వాసతో ఇత్యభి దీయత్ ”అంటే వాతం పిత్తం కఫం అనే మూడు దోషాలు ,సప్త ధాతువులు ,మల విసర్జన మొదలైన వన్నీ సమ తుల్యం గా ఉండటం తో బాటు ,ఆత్మా ,ఇంద్రియాలు మనస్సు మొదలైనవి ప్రసన్న స్తితిలో ఎవరిలో ఉంటాయో వారే ఆరోగ్య వంతులు .చరక సంహిత లోని మూడు ముక్కలేమితో తెలుసు కొందాం
మొదటిది -హిత భుక్తి -మనం తినే ఆహారం మన శరీరానికి మేలు చేసేదిగా ఉండాలి .తినటానికే జీవించ రాదు .జీ విస్తున్నామ్ కనుక తినాలి .మనం తినే ఆహరం వల్ల శారీరక మానసిక ఆరోగ్యాలకు ఏది ప్రయోజన కరమో దాన్నే తినాలి
రెండోది -మిత భుక్తి -శ్రేష్టమైన తాజా ఆహారాన్నే మితం గా తినాలి .అతిగా తింటే తీపి కూడా చెడు అవుతుంది .సమంజసం గా తృప్తిగా తినాలి .హితమైంది మితం గా తినటం శ్రేష్టం .
మూడోది -రుత భుక్తి -జీవితాన్ని సఫలీకృతం చేసే మంచి ఆహారాన్ని తినాలి .న్యాయం గా సంపాదించినవే తినాలి అప్పుడే శారీరక ఆరోగ్యం తో బాటు మానసిక ఆరోగ్యం కూడా వర్ధిల్లు తుంది
476-ఆచార్య నాగార్జునుడు(931-
రసాయన శాస్త్రానికి బీజాలు వేసి ,రస వాద సిద్ధాంతానికి మహా ప్రయోగాలు నిర్వహించిన బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు .క్రీ.శ.931లో గుజరాత్ లోని సోమనాధ దేవాలయ సమీపం లో దైహాక్ అనే గ్రామం లో జన్మించి నట్లు తెలుస్తోంది .బౌద్ధం లో మహా యాన విభాగం లో మాధ్యమిక ,యోగాచార అనే రెండు విధానాలలో మాధ్యమిక చింతనను ప్రతి పాదించిన వాడే నాగార్జునా చార్యుడు .ఈయన రచించిన ‘’మాధ్యమిక కారిక ‘’గ్రంధం బౌద్ధ దర్శనాలలో అగ్ర శ్రేణి లో నిల బడింది .దీనితో ఆయన ‘’ఆర్య నాగార్జునుడు ‘’అని పించుకొన్నాడు .గుంటూరు జిల్లా మహా మండల ప్రాంతం లో శ్రీ పర్వత సానువులలో చాలా కాలం నివశించాడు .ఇక్కడి ఈ పర్వతానికే ‘’నాగార్జున కొండ ‘’అనే పేరొచ్చింది .ఇక్కడే ఒక విశ్వ విద్యాలయాన్ని స్తాపించి ఎందరికో విద్య నేర్పించాడు. దేశ ,విదేశాల నుండి ఎందరో విద్యార్ధులు ఇక్కడికి వచ్చి చదువుకొన్నారు .
కాని నాగార్జునుడు అంటే బంగారాన్ని కృత్రిమం గా తయారు చేసే వాడనే పేరు స్తిరపడి పోయింది .ధాతు విజ్ఞాని గా పాపం గుర్తింపు పొందలేదు .అందుకే ఆధునిక శాస్త్ర వేత్తలకు ఆయన దూరమై పోయాడు .పాదరసం వాడకాన్ని మొదటి సారిగా ప్రయోగించిన వాడు నాగార్జునుడే .దీన్ని శుద్ధి చేసే ప్రక్రియ ను కూడా ఆయనే ప్రపంచానికి తెలియ జేశాడు .పాదరసం తో బంగారం తయారు చేసే వాడని చరిత్ర కారులు చెప్పారు .బంగారు తయారీ లో పాద రసాన్ని తప్ప ఏ ఇతర ధాతువును వాడలేదు ఆచార్యుడు .ఆధునికులు బంగారం లో ఎనభై ప్రోటాన్లు ,ఎలేక్త్రాన్లు ఉన్నాయని పాదరసం లో డెబ్భై తొమ్మిది ప్రోటాన్లు ఎలేక్త్రాన్లు ఉన్నాయని కనుక్కొన్నారు మరి ఆ నాడే ఈ రహస్యాం నాగార్జునికి ఎలా అవగత మైనదో ఆశ్చర్యం వేస్తుంది .
ఆచార్య నాగార్జుండు అనేక వైద్య గ్రంధాలు రాశాడు .రస ప్రక్రియ అంటే ఆల్కెమీ కూడా నేర్చి నట్లు అని పిస్తుంది .ఆయన కాలం లో ‘’విజ్ఞాన వాదం ‘’ప్రారంభం అయి తర్వాత కూడా వ్యాప్తి చెందింది .అదీ ఆయన ఘనత .ఈ నాగార్జునుడు వేరు ఏ లోహాన్నైనా బంగారం గా మార్చ గలిగే ‘’పరసు వేది ‘’ని కని పెట్టిన సిద్ధ నాగార్జునుడు వేరు అనిఅనేక కధలు ప్రచారం లోఉన్నాయి . దీనితో నాగార్జునా చార్యుడు రసాయన శాస్త్రానికి చేసిన అద్వితీయ కృషి మరుగున పడి పోయింది .నాగార్జునుడు వివిధ లోహాలను ప్రకృతి నుంచి సేకరించి వాటిని శుద్ధి చేసే విధానం కని పెట్టాడు .రాత్రి వేళల్లో అడవుల్లో కాంతులు ప్రసరించే అనేక మూలికలను సేకరించి ప్రయోగాలు చేశాడు .వృక్ష సంబంధ పదార్ధాల తోను అనేక ప్రయోగాలు చేసి నమోదు చేశాడు .వీటి నన్నిటిని ‘’రస రత్నాకరం ‘’లో వివరించాడు .
ఆచార్యుడు రసాయన శాస్త్రం లోనే కాకుండా వైద్య ,యోగ శాస్త్రాలలో కూడా సృజనాత్మక కృషి చేశాడు .రస రత్నాకరం తో బాటు ‘’కక్షపుట తంత్రం ‘’,’’ఆరోగ్య మంజరి ‘’,యోగసారం ‘’యోగాస్టకం ‘’మొదలైన రచనలు చేశాడు .తన సిద్ధాంతాలను జన సామాన్యానికి అందించాలని ఎంతో తపన పడ్డాడు .దీనికి ఒక చిట్కా చేశాడు .ఈ అపూర్వ విజ్ఞానం అంతా తనకూ దేవతలకు మధ్య జరిగిన సంభాషణల వల్లనే అబ్బిందని అందరికి చెప్పాడు ఈవిషయాన్ని రస రత్నాకరం లో చెప్పాడు కూడా .
నాగార్జునుని రస రత్నాకరం ఆధునిక రసాయన శాస్త్ర వేత్తలకూ ప్రామాణిక గ్రంధమే అయింది .తన గ్రంధాలలో వాదప్రతి వాదాలరూపం తో ఆకట్టుకొనే విధం గా విజ్ఞానాన్ని అందించాడు .ఈయనకున్న మహిమల్ని జనం విస్త్ర్తుతం గా ప్రచారం చేశారు .ఈయన ప్రయోగించిన చిట్కా వల్ల ప్రాచీన శాస్త్ర వేత్త లెవ్వరికి రాని ప్రచారం ఆచార్యునికి దక్కింది .రస రత్నాకరం లో రసాయన మూల కాల వివరణ బాగా ఉంది .రాసాయనిక యౌగికాల గురించి మొట్ట మొదట తెలియ జేసిన వాడు నాగార్జునుడే .ఇదే ఆ తర్వాత మెటలర్జీ ,ఆల్కేమీ గా వృద్ధి చెందాయి. రాగి, సీసం ,టిన్ ,వెండి బంగారం మొదలైన ముడి లోహాలను ఖనిజాల నుండి ఏ విధానం లో సంగ్రహించాలో వాటిని ఎలా శుద్ధి చేయాలో మొదలైన అమూల్య విషయాలు ఈ గ్రంధం లో రాశాడు .ఆయన మేధస్సును అంచనా వేయటం కష్టం .రస రత్నాకరం ఒక ప్రయోగాత్మక రసాయన శాస్త్రం .ప్రయోగాల వల్లనే వివిధ ధాతువుల నిర్మాణం, మేళ వింపు ప్రయోజ నాలు తెలుసుకోవచ్చని చెప్పాడు ప్రకృతిలో దాగి ఉన్న ఖనిజాలు ,మొక్కలు, మూలికలు,తృణ ధాన్యాలు మొదలైన వాటిని ఆరోగ్య సంరక్షణ కై ఔషధాలను తయారు చేసుకోవచ్చునని సూచించాడు ,
‘’సిన బార్ ‘’(ఇంగిలీకం )నుండి పాదరసం తయారు చేయచ్చని ,’’కాలమైన్ ‘’సీసాం లాగా కనీ పిస్తుందని దీన్ని కూడా తయారు చేయ వచ్చునని ఈ గ్రంధం లో రాశాడు .దాతువుల్లో ఉన్న హాని చేసే పదార్ధాలను తొలగించి వాటిని ప్రయోజన కరమైన వాటిగా మార్చే విదానాలెన్నో చర్చించాడు .ఆరోగ్యం కోసం కొద్ది మోతాదులో పాదరసం ,గంధకం ఇంగువ కలిపీ తింటే ఆయుస్సు పెరుగుతుందనీ తెలియ జేశాడు .దీన్నే ఇప్పుడు ‘’రస సింధూరం ‘’గా పిలుస్తున్నారు .మనిషి లో ప్రాణ శక్తి ,దీర్ఘకాల జబ్బుల వల్ల ‘’ఓజస్సు ‘’క్షీనిస్తుందని ,మళ్ళీ దాన్ని పొందాలంటే రసాయన పదార్దాలే గతి అని స్పష్టం గా చెప్పాడు .శరీరం లో రసం ,రక్తం మాంసం ,మేధస్సు ,ఆస్థి ,మజ్జ ,శుక్లం వల్లనే ‘’ఓజస్సు‘’ఏర్పడుతుంది .కనుక ఓజస్సు తగ్గితే రసాయనిక చికిత్సే అవసరం అవుతుందని చెప్పాడు .వ్యాధి నిరోధక శక్తి పెరిగి ప్రాణ శక్తి పెరిగి సూక్ష్మ జీవులు నసించితే తే ఓజస్సు వృద్ది చెందుతున్దన్నాడు
వ్యాధిని వివారించటం తో బాటు నియంత్రించటం లో కూడా శ్రద్ధ చూపించాలన్నాడు. ఆచార్యుడు .శుశ్రుతుడు రాసిన‘’సుశ్రుత సంహిత ‘’ఆధారం గా ‘’ఉత్తర తంత్ర ‘’రాశాడు .దీని అసలు ప్రతి ఇతర దేశాల్లో వ్యాపించటం తో దాని వివరణలు
మనకేమీ తెలియ లేదు .ప్రక్రుతి సిద్ధ మైన రోగ నిరోధక శక్తి ని పెంచటానికి ఇందులో లొ చాలా విషయలున్నాయట..పాదరాసాన్ని పద్దెనిమిది సార్లు శుద్ధి చేసి,ఆ ద్రావకం లో వన మూలికల కషాయాన్ని రంగరించి విపరీతం గా చిలికితే అందులోని గంధకం ,అభ్రకం కొన్ని క్షారాలు కలిపి మళ్ళీ పది హేడు సార్లు శుద్ధి చేస్తే ‘’స్వర్ణ లోహం‘’ఏర్పడుతుంది అని వివ రించాడు నాగార్జునుడు .అయితే ఇందులో ఏవి ఎన్నిపాళ్ళు ఉండాలో స్పష్టం గా లేదట .జింక్ ను మూడు రెట్ల రాగితో కలిపి అత్యధిక వేడిలో ఉంచితే ఇత్తడి ఏర్పడుతుంది .కాని బంగారం ఎలా ?దీన్ని ఒక శ్లోకం లో రస రత్నాకరం లో వర్ణించాడు ,
‘’క్రమేణా క్రుత్వామ్బుధరేణ రంజితః – కరోతి శుల్వం త్రిపుటేన కాంచనం’’ కాని ఇంత వరకు ఎవరికీ ఇది అంటూ బట్ట లేదట .ఇలా రసాయనిక శాస్త్రానికి ఆద్యుడయ్యాడు ఆచార్య నాగార్జునుడు .
నాగార్జునుడు ఏర్పరచిన విశ్వ విద్యాలం లో బౌద్ధ భిక్షువులు ,సన్యాసులు అనేక దేశాల నుండి వచ్చి చేరి చదువు కొనే వారు అన్ని శాస్త్రాలను ఇక్కడ విద్యార్ధులు నేర్చుకొనే అవకాశం ఉండేది .ఇక్కడే 108అడుగుల వ్యాసం ,86అడుగుల ఎత్తు ,ఉన్న మహా స్తూపం ఉంది .దీన్ని పద్దెనిమిది అంగుళాల పొడవు ,తొమ్మిది అంగుళాల వెడల్పు ,నాలుగు అంగుళాల మందం తో చేసిన ప్రత్యెక ఇటుక లతో ఈ స్తూపాన్ని నిర్మించారు .విజయ పురి అంతర్జాతీయ బౌద్ధ విహార కేంద్రం అయింది ఇప్పటి నాగార్జున సాగర్ కు ఎనిమిది కిలో మీటర్ల దూరం లో ‘’అనువు ‘’అనే చోట ఇక్ష్వాకుల కట్టడాల్ని పునర్నిర్మించారు
నాగార్జునుడు సకల శాస్త్ర పారంగతుడని అపర ధన్వంతరి అని శాస్త్ర శాస్త్ర ప్రవీణుడు అని తత్వ వేది, తార్కికుడు ,ఖనిజ కళా నిష్ణాతుడు ,వేదంవేదంగ విద్యా విశారదుడు ,కవి సార్వ భౌముడు ,కళోపాసకుడు ,మాధ్యమిక వాద మహా ప్రవక్త,మహా యాన మార్తాండుడు ,శతాధిక గ్రంధ కర్త అని ఎందరో తమ రచనల్లో ఆయన ప్రతిభా విశేషాలను ప్రస్తుతించారు .చిన్ననాటే వేదం వేదంగ పారంగతుడై ,వివాహ ప్రసక్తి లేకుండా సన్య సించి సర్వ జ్ఞాని అయ్యాడు అని చరిత్ర కారుల అభి భాషణ .భారతీయ రస వాదుల్లో ప్రప్రధముడు .బట్టీ పట్టటం (దిస్తిలేషన్ )శుద్ధిచేయటం (సబ్లిమేషన్ )భస్మం చేయటం (కాల్సి నేషన్ )మొదలైన పద్ధతుల్లో లోహాల రంగులు మార్చటం ,లోహ మిశ్రమం (అల్లాయ్ల్ )అగ్ని శీలా (పైరైట్స్త్స్ )నుంచి రాగి తీయటం ,మెటాలిక్ ఆక్సైడ్స్ ,ఆక్సైడ్స్ ఆఫ్ బ్రాస్ మొదలైనవి నాగార్జున మేధో జనితాలే వైద్యం లో ‘’కజ్జోలి ‘’అన బడే బ్లాక్ సల్ఫైడ్ ఆఫ్ మెర్క్యురి ని పరచయం చేసిన వాడు కూడా ఆచార్యుడే .తన శాస్త్రీయ ప్రయోగ వివరాలను శిలలపై చెక్కించాడు .లోహ సంగ్రహణ శాస్త్రానికి (మెటలర్జీ )కి ఆద్యుడయ్యాడు .ఆచార్య నాగార్జుడిని మొదటి నాగార్జునుడు అంటారు .
ఆధునిక భౌతిక శాస్త్రం లో లేజర్ కిరణాల సహాయం తో అణువు కేంద్రకం లోని ప్రోటాన్లు న్యూట్రాన్ల సంఖ్యను మార్చే అవకాశం కలిగింది . ప్రోటాన్ సంఖ్య మారితే ఒక మూలకం ఇంకో మూలకం గా మారుతుందని రుజువు అయింది .లేజర్ తో రాగి కేంద్రాణువులో ఒక ప్రోటాన్ చేరిస్తే నికెల్ అయి పోతుంది .అలానే ‘వల్కన్ ‘’అనే శక్తి వంత మైన లేజర్ నుపయోగించి బంగారాన్ని పాదరసం గా మార్చ గలిగారు ఈ నాటి శాస్త్ర వేత్తలు .వీటి కన్నిటికి ఆచార్య నాగార్జునుని మౌలిక భావనలే ఆధారం .
రెండవ నాగార్జునుడే ‘’’సిద్ధ నాగార్జునుడు ‘’క్రీ.శ.600వాడు .రస విద్య లో అఖండుడు .పుణ్య సాధువు అనే ఆయన మేనల్లుడు .జైన తత్వ వేత్త .వైద్య ప్రకాన్దుడు అని పించుకొన్న పూజ్య పాదుల వద్ద ఉద్యోగి. జైనుడుగా పుట్టినా బౌద్దం స్వీకరించాడు .దేశం లో ను నేపాల్ ,టిబెట్ లలో పర్యటించి బౌద్ధ ప్రచారం చేశాడు శ్రీశైలం కొండడకు వచ్చి ‘’నాగార్జున బోధి సత్వ ‘’గా ప్రసిద్ధుడైనాడు. అనేక రసాయన ప్రయోగాలు చేశాడు .రస వాదవిద్య ద్వారా మోక్షాన్ని పొందాడు అందుకే సిద్ధ నాగార్జునుడుగా అందరూ ఆరాధించారు .’’రస కాచ పుట ‘’,’’కక్షు పుట తంత్ర ‘’,మొదలైన గ్రందాల రచయితగా సుప్రసిద్దుడయ్యాడీ సిద్ధ నాగార్జునుడు .
మూడవ నాగార్జునుడు –అసలు పేరు ‘’భదంత నాగార్జున ‘’క్రీ.శ.ఏడవశతాబ్దివాడు . కేరళ కు చెందిన బౌద్ధ సన్యాసిగా చరిత్ర పుటల కెక్కాడు .ఆయుర్వేదం లో ఆనాడు ప్రసిద్ధ మైన అనేక గ్రందాలు చదివి జీర్ణం చేసుకొన్నాడు .’’రస వైశేషిక సూత్ర ‘’అనే గ్రంధం రాశాడు .ఆయుర్వేద వైద్యానికి చెందిన మౌలిక సూత్రాలను ఇందులో చర్చించాడు .ఇది486సూత్రాలతో నలుగు అధ్యాయాలుగా ఉంది .స్వతంత్ర విధానం గా అలోచించి రాశాడు .తన శైలిలో ‘’నాగార్జుని యాన్‘’అనే ప్రత్యెక వైద్య స్సంప్రదాయాన్ని నెల కొల్పి అనేక మందికి తర్ఫీదు ఇచ్చాడు .మొత్తం మీద నాగర్జునులు ముగ్గురూ ముగ్గురే .వైద్య రసాయనాలకు ముగ్గులేసి వ్యాప్తి చెందించిన వారే .