ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -121

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -121

50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-2

వయసు ముప్ఫై రాగా లెనిన్ జైలు లో మొదలు పెట్టిన రచన ‘’ది డెవలప్ మెంట్ ఆఫ్ కేపిటలిజం ఇన్ రష్యా ‘’ అనే అసామాన్య  ఆర్ధిక పత్రం పూర్తీ చేశాడు .కొన్ని నెలలకే అతని ప్రవాస జీవితం పూర్తయింది.సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి రాగానే మళ్ళీ అరెస్ట్ చేశారు .విడుదలకాగానే వెంటనే  స్విట్జర్ లాండ్ వెళ్ళాడు .అక్కడ ప్లెఖనోవ్ చెప్పినట్లు ‘’ఇస్క్రా ‘’మేగజైన్ ప్రారంభించాడు .దీన్ని మ్యూనిచ్ లో ప్రింట్ చేశాడు .దీని మోటో-అంటే నినాదం ‘’స్పార్క్ టు ఫ్లేం ‘’అంటే రవ్వ నుంచి మంట దాకా .దీని ముఖ్యోద్దేశం కేంద్రీకృత  అండర్ గ్రౌండ్ విప్లవ పార్టీ  ఏర్పరచి జార్ నియంతల అణచి వేతను  ఎదుర్కోవటం .ఫాక్టరీ వర్కర్ లాగానే పొలం రైతు ఆకలి కూడా ఒకటేనని గుర్తించి సమష్టి శ్రామిక పోరాటాన్ని ప్రజాస్వామ్య విధంగా చేయాలని భావించాడు .ఇస్క్రా పత్రికను రష్యాలోకి దొంగతనంగా తెచ్చి పంచిపెట్టేవారు .రహస్యంగా అండర్ గ్రౌండ్ కార్యక్రమాలను అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం తో విస్తరించాడు .ఇది  బహిష్కృత నేతలకు సర్వ సాధారణ విషయమే ఆ రోజుల్లో .

తరువాత ఏడు సంవత్సరాలు లెనిన్ జీవితం లో అరెస్ట్ లు తప్పించుకు పారిపోవటం  విడుదల,దీర్ఘకాలం దాగి ఉండటం ,అకస్మాత్తుగా ప్రత్యక్షమవటం తో  అయి రికార్డ్ సృష్టించాయి .ఈ సమయం లో చాలాకాలం స్వదేశానికి బయటనే ఒక దేశాన్ని వదిలి మరో దేశం లో  ఉండి పోయాడు .పేపర్ ఎడిటర్ గా అతని జీతం నైపుణ్యమున్న ప్రింటర్ జీతానికి ,అతి తక్కువ కూలి పొందే లేబర్ కు మధ్యలో ఉండేది. దానితోనే భార్య తో జీవితం గడిపేవాడు .బట్టలు ఎప్పుడూ చిని గే ఉండేవి. ఉంటున్న గది పరమ దరిద్రంగా ఉండేది .తినే తిండి అతి నికృష్టంగా  కడుపు  నింపు కోవటానికి సరిపడా ఉండేది కాదు  పాపం .కాని అతని రచనా ప్రభావం అనంతంగా ఉండి ఎందరినో  విప్లవ కారులు గా మార్చి లెనిన్ పేరు రష్యా అంతా మారు మోగి పోయింది .రాసిన కర పత్రాలలో భాష అతి సహజంగా ,సరళం గా సూటిగా ఉండేది .నైరూప్య,సంక్లిష్ట  భావనలను ,అతి తేలిక మాటలలోకి తర్జుమా చేసి రాసి ప్రభావితం చేసే జీనియస్ లెనిన్ .ఆయన సూత్రాలు కొన్ని –‘’ఇతరుల పనిని  దోపిడీ చేసే వాడికి జీవించే అర్హత లేదు ‘’ ‘’పనివాడికి తన పని పై రాబడి ని కోరవచ్చు ‘’,వంటివి కొన్ని మాత్రమే . మార్క్స్ చాటువులలో చెప్పినట్లు సంఘటితమైతే కార్మికులకు పోయే దేమీలేదు బంధనాలు తప్ప అనేది బాగా ప్రచారం చేశాడు లెనిన్ .

1902లో లండన్ నుండి ఇస్క్రా ను ప్రచురిస్తున్నప్పుడు ,సైబీరియానుంది తప్పించుకోచ్చిన మరో విప్లవ కారుడు లియో ట్రాస్కి తో పరిచయమైంది .ట్రాస్కిమాంచి తెలివైన క్రియాశీల వక్త .లెనిన్ కు బాసటగా నిలిచాడు .ఏడాది తర్వాత ఇద్దరిమధ్యా అభిప్రాయ భేదమేర్పడి రష్యా సోషలిస్ట్ డెమోక్రాటిక్ పార్టీ రెండుగా చీలిపోయింది .క్రియా రహిత సానుభూతి పరులను పార్టీలో చేర్చుకో వచ్చు నని  ట్రాస్కి వాదం .అధిక సంఖ్యాకులు లెనిన్ నే బలపరచి లెనిన్ ఆధ్వర్యం లో ‘’బోల్షెవిక్ ‘’పార్టీ ఏర్పాటు చేశారు .అల్ప సంఖ్యాకులైన ట్రాస్కి ముఠా ను ‘’మెంషె వికీలు ‘’అన్నారు .

లెనిన్ వయసు ముప్ఫై .రష్యాలో పరిస్తితులు బాగా క్షీణించి విప్లవానికి తగిన పరిపక్వ  వాతావరణ మేర్పడింది .1905 జనవరి 9న ఒక మతాధికారి నాయకత్వం లో కొందరు వర్కర్లుజార్ రాజ కుటుంబం ఉండే  వింటర్ పాలస్ కు యాత్రగా వెళ్ళారు .తమ ‘’చిన్న తండ్రి ‘’గా భావించే  నమ్మే జార్ రాజు కు తాము యెంత దీన స్థితిలో జీవిస్తున్నామో తెలియ జేయటానికి ప్రశాంతంగా వారు అక్కడికి చేరుకొన్నారు .రాజ భవనానికి చేరుకోగానే పాలస్ గార్డ్ లు’’ కోసాక్’’ లు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీచేయకండానే వారిపై కాల్పులు జరిఫై రెండు వందలమందిని కాల్చి చంపేశారు .ఈ వార్త దావానలంగా దేశమంతటా వ్యాపించి అప్పటిదాకా దైవాంశ సంభూతుడు అని భావించిన రాజు పై ప్రజల ఆగ్రహ జ్వాల ఎగసి పడి నమ్మకాన్ని బుగ్గి చేసింది .రాజు గౌరవం మరింత దిగ జారి పోయింది ప్రజల మనసులు తీవ్రంగా గాయ పడ్డాయి. ఆత్మ గౌరవం దెబ్బతిన్నదని భావించారు .ఏడాది తర్వాత జపాన్ తో చేసిన యుద్ధం లో రష్యా బలగాలు దారుణంగా ఓడిపోయాయి .దేశమంతటా సమ్మెలు ,తిరుగు బాట్లు తో అతలా కుతలమైంది  .ఇదే తగిన సమయం అని లెనిన్ రష్యా చేరాడు .రెండేళ్ళు దేశమంతా పర్యటించి ,సుదీర్ఘ ఉపన్యాసాలిస్తూ ,విప్లవానికి ప్రేరేపిస్తూ ,గెరిల్లా దండులను ఏర్పాటు చేయటం లో సఫలుడైనాడు .దీనికి విరుగుడుగా జార్ రాజు ప్రజలను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంగా ప్రభుత్వం లో ‘’డ్యూమా ‘’అనే ఎన్నిక కాబడిన ప్రతినిదులను తీసుకొన్నాడు .కార్మికులకు ‘’సోవియెట్’’ లనే కమిటీ లను ఎన్నుకోవటానికి యజమానులకు అవకాశమిచ్చాడు , నామ మాత్రంగా  కార్మికుల జీతాలు పెంచెట్లు చేశాడు .1907నాటికి విప్లవ ఉద్యమం చప్పగా చల్లారి పోయింది .ఇబ్బంది కలిగించేవారు మళ్ళీ విజ్రుమ్భించారు .కాని లెనిన్ మాత్రం ఫిన్ లాండ్ కు అక్కడి నుండి స్వీడెన్ కు చేరుకొన్నాడు .

బోల్షివిక్ పార్టీ అధ్యక్షుడిగా లెనిన్ జీతం అతి స్వల్పం .అతని ఆర్ధిక స్థితి మరీ  అధ్వాన్నమైంది .అన్ని వైపులా నుండి ఇబ్బందు లేర్పడ్డాయి .ఇంపీరియల్ రష్యా నుండి ,మెన్షెవిక్ ల నుండి ,అరాచక ,టెర్రరిస్ట్ ల నుండి అతనికి ఒత్తిడి , ప్రమాదమేర్పడింది .ట్రాస్కీ ని వదిలి౦క్ చేసుకొన్నాడు .ఇప్పుడు మరో ఇద్దరు కొత్త స్నేహితులు ప్రముఖ రచయిత మాక్సిం గోర్కి ,కఠిన హృదయుడు ,యువ అతివాది జోసెఫ్ స్టాలిన్ లు దగ్గరయ్యారు .లెనిన్ పారిస్ లో ఉండి’’మెటీరియలిజం అండ్ ఎంప్రికో క్రిటిసిజం ‘’రాశాడు .దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ..తరువాత రాసిన ‘’హిస్టరీ ఆఫ్ మోడరన్ ఫిలాసఫీ ‘’ను మార్మికతపై తిరుగుబాటు అన్నారు .గతి తార్కిక భౌతిక వాదానికి(డయలేక్టిక్  టీరియలిజం )  ఇదే భూమిక అయింది..దీనిలో ప్రకృతితి జడం కాదని ,క్వాంటం ఫిజిక్స్ ఆవిష్కరణలతో  పదార్దాన్ని శక్తి రూపాలుగా భావిస్తూ ప్రకృతిని న్యూనత పరచరాదని,లెనిన్ చెప్పాడు .గతి తార్కిక వాదాన్ని 18వ శతాబ్దపు పదార్ధ భావన లతో ముడి పెట్టరాదన్నాడు .’’It is not the   contemplation of the objective world which counts rather it is the control through which we channel the powers of nature and make them useful to ma kind ‘’అని లెనిన్ అభిప్రాయ పడ్డాడని  ఫ్రెడరిక్ మేయర్ రాశాడు .లెనిన్ జీవిత చరిత్ర రాసిన’’ వాలేరు మార్కు ‘’ .ఈ పుస్తకాన్ని A cauldron of invective and constructive thought ‘’అంటే  దూషణాత్మక,నిర్మాణాత్మక జ్యోతి ‘’అన్నాడు ‘’it is a book in which profundity  alternatives with more abuse .If  any one else had written it ,no one would remember it ‘’అనీ అన్నాడు

 

.Inline image 1 Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-3-16-ఉయ్యూరు

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.