ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -123

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -123

50- రష్యాలో అక్టోబర్ విప్లవ నాయకుడు ,బోల్షివిక్ పార్టీ నేత మార్క్సిజం లెనినిజం కు మార్గ దర్శి –లెనిన్-4(చివరిభాగం )

లెనిన్ సాధించినవిప్లవ ఘన  విజయం ఆయనలో కాని ,ఆయన అలవాట్లలో కాని ఏ మాత్రం మార్పు తేలేదు .పరిశుభ్రమైన నిరాడంబర జీవితాన్నే గడుపుతున్నాడు .మూడేళ్ళు రష్యా నియంతగా ఎన్నుకోబడిన తర్వాత ఆయన్ను చూసిన మార్కు ‘’లెనిన్ సాధారణ కార్మికుడు ఉండే ఇంట్లోనేమరికొన్ని సౌకర్యాలతో  ఉన్నాడు .లెనిన్ భార్య ,సోదరి ల భోజనం ఆడంబరం లేకుండా,ఆనాటి సోవియెట్ ఆఫీసర్ల సగటు భోజనం లా  ఉంది .అందులో టీ,నల్ల రొట్టె ,వెన్న ,జున్ను మాత్రమే ఉన్నాయి .లెనిన్ చూడటానికి ఆకర్శ ణీయంగా ఉండడు..మామూలు ఎత్తుకన్నా కొంచెం తక్కువే .లెనిన్ కవళికలు ప్లేబియన్ కు చెందినవిగా స్లావోనిక్ గా దృఢం గా ఉంటాయి .విస్తారమైన అతని నుదురు మాత్రమే అతని శక్తికి నిదర్శనంగా ఉంటుంది ‘’అని రాశాడు .నీనా బ్రౌన్ బెకర్ అనే లెనిన్ జీవిత చరిత్ర కారిణి 1907లో రష్యా కు తిరిగొచ్చిన లెనిన్ ను ‘’బట్ట తల ,చిరిగిన కోటు ,పాంచీలాగా యెర్ర గడ్డం తో 45 ఏళ్లవాడేఅయినా ఇంకా ముసలివాడుగా కనిపించాడు అరుదైన చిరునవ్వు తో గృహ వాతారణం కలిపించాడు ‘’అని రాసింది .

తాను  స్థాపించా దలుచుకొన్న సోషలిస్ట్ రాజ్యం కోసం భూమిని విభజించి రైతులకు పంచిపెట్టాడు లెనిన్ .అప్పటిదాకా ప్రైవేట్ వ్యక్తుల పెత్తనం లో ఉన్న పరిశ్రమలు ,జాతి వనరులు ,వినియోగ సంస్థలను వారినుంచి లాక్కుని ప్రభుత్వ పరం చేశాడు .బోల్షెవిక్ పార్టీ పేరును అధికారికంగా కమ్యూనిస్ట్ పార్టీ గా మార్చేశాడు .మార్క్సిస్ట్  సిద్ధాంతాలను 1-ఉత్పత్తి లాభానికి కాదు వినియోగానికే 2-పని చేయనివాడు తిండికి అనర్హుడు ’’అనే రెండు నినాదాలతో  అమలు పరచాడు .1918జనవరి 7న  రాజ్యాంగ అసెంబ్లీ ని రద్దు చేసి ,శ్రామిక నియంతృత్వాన్ని అమలు చేసి ,ఒకరకంగా సమాజం లో వివిధ స్థాయిలను సమానం చేశాడు .మార్చి 15న జర్మనీతో రష్యా సంప్రదింపులు ప్రారంభించి ,బ్రెస్ట్ లితోవ్ స్క్ లో ఒడంబడిక కుదుర్చుకొని యుద్ధం నుంచి వై దొలగింది .ఒడంబడికపై సంతకాలు జరిగాయి కాని శాంతి కనిపించలేదు .దేశీయ విదేశీయ అణచివేతలు పెరిగాయి . .అధిక భూభాగాలు స్వంతం చేసుకొన్న యజమానులనబడే కులక్స్ శ్రామిక నియంతృత్వాన్ని ఎదిరించారు .దీనితో అనేక అంతర్గత పోరాటాలు అణచివేతలు, రక్త ప్రవాహాలతో రష్యా చాలా సంక్షోభం లో పడింది  సోవియెట్ లు ఏర్పరచిన ‘’చేకా ‘’అనే సీక్రెట్ ప్లీస్ సర్విస్- పై అధికారులను తప్పించాలనే కుట్ర జరుగుతున్నట్లు పసి గట్టింది. కుట్ర దారులను పసిగట్టి ఏరివేసి,రహస్య విచారణ జరిపి , ఉరితీసి, భయ పెట్టారు. దీనికే ‘’రెడ్ టెర్రర్ ‘’అనే పేరొచ్చింది .మిత్ర రాజ్యాలే బాహ్య శత్రువులై పోయాయి  .కొత్త రష్యా ప్రభుత్వానికి కూల్చే ప్రయత్నాలు చేశారు .జేకోస్లో వేకియా సైన్యాలు రష్యా భూభాగాన్ని ఆక్రమించి జార్ రాజును మళ్ళీ సింహాసనం మీద నిలబెడతామని ఆశ చూపించాయి .దీన్ని గమనించిన ‘’అధికార సోవియెట్’’ రాజును ,రాణిని అయిదుగురు పిల్లలను దారుణంగా హత్య చేసింది .దీనివలన అంతర్యుద్ధం ఆరంభమైంది .రెడ్ గార్డ్ లు వైట్ గార్డ్ లను సవాలు చేశారు .వీరు మిలిటరీ స్కూల్ కేడేట్ లకు చెందినవారు ,ఎగువ మధ్యతరగతి యువకులు .విప్లవ వ్యతిరేక ఉద్యమం విజయవంతం అవుతుందేమోనని పించింది .కాని 1921లో నిర్బంధ సైనికులను అందరినీ చేర్చుకొని రెడ్ ఆర్మీ అందర్నీ ఓడించింది .

1921నాటికి కాని లెనిన్ తాననుకొన్న   ఆర్ధిక .సాంఘిక సమాజాన్ని నిర్మించలేక పోయాడు .కొత్త ఆర్ధిక విదాననాన్ని ప్రవేశ పెడుతూ ,వస్తు పంపిణీ కోసం ప్రైవేట్ భాగస్వామ్యం తప్పదని గుర్తించాడు .తన బీద దేశం ఇంకా మానవ వనరు ల మీదే ఆధార పడి ఉండటం చూసి అత్యంత వేగంగా విద్యుదీకరణ విధానాన్ని అమలు చేశాడు .జాతీయ బృందాలు స్వేచ్చా పూరిత అభి వృద్ధిని దేశీయ విధానం లోనే సాధించాలని చెప్పాడు. కాలనీ ప్రజలతో సరిసమానం గా రష్యా అభివృద్ధి సాధించే కృషిలో అందరూ భాగ స్వాములవ్వాలి అని హితవు పలికాడు .రష్యా సాంప్రదాయ చర్చి ని రాజ్యాంగ మతం గా తీసేశాడు  .పెళ్ళిళ్ళు విడాకులు పూర్వం టాక్స్ లతో జరిపించే చర్చి ఇప్పుడు ప్రభుత్వం లో భాగ మైంది  .

1922లో పునర్నిర్మాణం జోరుగా సాగుతున్న తరుణం లో లెనిన్ చాలా తీవ్రంగా అలసిపోయాడు మెదడు లోని నాడుల వలన గుండెపోటు వచ్చింది .కొన్ని నెలల తర్వాత మరో స్ట్రోక్ వచ్చి పాక్షిక పక్షవాతానికి గురైనాడు .అలాగే కొంతకాలం గడిచింది .తన ముఖ్య స్నేహితుడి పేర నిర్మించిన ‘’గోర్కీ మోడల్ నగరం ‘’లో విప్లవ వేరుడు వ్లాడిమిర్ లెనిన్ 21-1-1924న 54 వ ఏట మరణించాడు .రష్యా రాజధానిని మాస్కో కు మార్చిన ఘనత లెనిన్ దే .మాస్కో లోనే లెనిన్ అంత్య క్రియలు జరిపి క్రెమ్లిన్ గోడకు ప్రక్కన ఒక సమాధి నిర్మించారు .

మన మహాత్మా గాంధీ లాగానే లెనిన్ కూడా తడబడని కృత నిశ్చయం తో ఏక దీక్షతో  కృషి చేశాడు .గాంధీలాగా కాకుండా లెనిన్ ప్రజలకన్నా తను ప్రేమించిన  ఐడియా వల్లనే ప్రజలకు లాభం అభివ్రుద్ధికలిగేట్లు చేశాడు .గాంధి కరుణ తో ఉన్న మహర్షి .ప్రజలతో మమేకమైన వాడు తన అనుచర గణంలో ఏ ఒక్కరినీ త్యాగం చేసుకొనే వాడుకాదు గాంధి. కాని లెనిన్ తన ఐడియా అమలు కోసం ఎవరినైనా భూమిపై లేకుండా చేసేవాడు .ది వర్డ్లి ఫిలాసఫర్స్ ‘’అనే పుస్తకం లో రాబర్ట్ హీల్ బ్రానర్ ‘’Internally corrupt ,externally predatory is still the soviet explanation of the world in which we live .Its validity was again affirmed by Stalin in 1952’’అని రాశాడు

మార్క్స్ సిద్ధాంతం ప్రకారం రాజ్యం కనిపించకుండా పోవాలి .కాని లెనిన్ మార్పు అనేక రూపాలలో వచ్చి పలు తీవ్రదారుణ ఘాతాలకు లోనైనప్పుడే అంతం సాధ్యం అన్నాడు .లెనిన్ రాతలపై అంతులేని చాలారకాల వ్యాఖ్యానాలున్నాయి . ఇతర నియంతల లాగా కాకుండా లెనిన్ అధికార దాహం, మోజు లేని వ్యక్తీ .ఏక వ్యక్తీ పాలనను ఎదిరించి ,అధికారం సాధించి దాన్ని తనకోసం కుటుంబం కోసం ఉపయోగించకుండా ప్రజాక్షేమం కోసం ప్రజా భాగ స్వామ్యం తో ,ప్రజల చేతికి అధికారం అందించిన వాడు .’’the word must be Power to the Soviets ,land to the peasants ,bread to the hungry and peace to the people ‘’అని కలవరించి కలవరించి ఆ కలను యదార్ధం చేసిన విప్లవ వీరుడు, రష్యా ప్రజలకు అధికారం అందజేసిన మహోన్నత నాయకుడు వ్లాడిమిర్ నికోలాయ్ లెనిన్ .

అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ తరువాత ,రష్యాలో అంతటి ఆరాధన పొందిన నాయకుడు లెనిన్ .లెనిన్ విగ్రహ౦  లేని గ్రామం లేదు .ఆయన పేర పోస్టేజి స్టాంపులు ,సంస్థలు వెలిశాయి .లెనిన్ చెప్పిన ప్రతిమాటా మంత్రమే అయింది.ప్రభావం చూపింది .లెనిన్ రచనలు అనేక సార్లు ముద్రణ పొంది ప్రపంచమంతా విస్తరించాయి అన్నిభాషల అనువాదాలు వచ్చాయి .లెనిన్ ఒక లెజెండ్ అయ్యాడు .లెనిన్ మణానంతరం స్టాలిన్ మార్క్సిజం –లెనినిజం ను  బాగా వ్యాప్తి చేశాడు .లెనిన్ ప్రభావానికి లోనుకాని దేశం లేదు

.

సశేషం                                                     మారు వేషంతో

మీ-గబ్బిట దుర్గాప్రసాద్-22-3-16-ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.