ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -124

51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్

ప్రముఖ చిత్రకారుడు వాన్ గో ను మినహాయిస్తే ,అంతటి మతాత్మక చిత్రకారుడు అనిపించుకోవటమేకాక హింసాత్మక చిత్రాకారుడు అనిపించుకొన్నాడు జార్జెస్ రౌవాల్ట్ .పరిశోధనాత్మక చిత్రకారుల పరంపరలో సాగి సిజన్నే ,రేనార్ వంటి అనుభూతివాద చిత్రాకారులకు భిన్నంగా రౌవాల్ట్ చిత్రాలుంటాయి. సిజన్నే తేలిక రంగుల దగ్గరే ఆగిపోతే ,రౌవాల్ట్ ముదురు రంగులైన ఎరుపు ,క్రోం బ్రౌన్ లను  మహా ఇష్టంగా వాడి ,నల్ల బార్డర్ లతో షోకు చేశాడు .రేనార్ సౌందర్యం తో నిష్క్రమిస్తే ,రౌవాల్ట్ భయంకరంగా ,హద్దులను అదిగమించి ,మార్మిక వేదనలను కల్లోల భయానక చిత్రాలుగా గీశాడు .దీనికి కారణం ఆతను జన్మించిన నాటి పరిస్తితులే కావచ్చు .

27-5-1871న ఫ్రాన్స్ దేశపు రాజధాని పారిస్ నగరం లో ఆ దేశ శత్రువు కమ్మ్యూన్ లు తీవ్రంగా పారిస్ పై బాంబు దాడులు చేస్తుండగా ,తల్లి రక్షణ కోసం  పురిటి నెప్పులతో ఒక సెల్లార్ లో తలదాచుకొన్న సమయం లోజార్జెస్ హెన్రి  రౌవాల్ట్ పుట్టాడు .ఇదేదో రొమాంటిక్ గా అనిపించవచ్చు కాని పూర్తీ యదార్ధం .తాతయ్య  సంరక్షణలో పెరిగాడు .ఈ తాత తన మనవడు ఆర్టిస్ట్ కావాలని ఆకాంక్షించాడు కూడా .తాతకు ఆనాటి ఆర్టిస్ట్ లైన కాలట్ ,రేమ్బ్రాంట్ ,కార్బెట్ ,మానేట్ లు అభిమానులు .

రౌవాల్ట్ తండ్రి పియానో ఫాక్టరీలో వడ్రంగం లో నగిషీ పని చేసేవాడు .14వ ఏట కొడుకు ఒక రంగుల గ్లాస్ వస్తువులు చేసేవాడిదగ్గర సహాయకుడిగా పని చేశాడు  .అక్కడ తనపని కొలిమి మంటను పర్య వేక్షించటం ,కిటికీలలోనుంచి  బయట పడిన గాజు ముక్కల్ని ఏరి రిపైర్ చేయటం .ఇది అతనికి బాగా నచ్చింది .ఇక్కడ పని చేస్తూనే సాయంకాలం ‘’ఈకోల్ నేషనల్ డెస్ ఆర్ట్స్ డెకోరాటిఫ్స్ ‘’లో చేరి చదివాడు .20వ ఏట ‘’ఈకోల్ డెస్ బీక్స్ ఆర్ట్స్ ‘’లో పేరు నమోదు చేయి౦చు కొన్నాడు .ఇక్కడే  గుస్టేవ్ మొరేవ్ ప్రభావానికి లోనయ్యాడు .మొరేవ్  రెండవ శ్రేణి రొమాంటిక్ ఆర్టిస్ట్ అయినా చాలా సహన శీలి .శిష్యులను అది చేయి ఇలాచేయి అని బలవంత పెట్టేవాడు కాదు .వారే స్వయంగా తెలుసుకొని ముందుకు వెళ్లాలని కోరుకోనేవాడు .మిడి మిడి జ్ఞానం పనికి రాదనీ హితవు చెప్పేవాడు .’’Art is a furious tracking down of the inner feelings solely by means of plastic expression ‘’అన్నది మొరావ్ అభిప్రాయం .’’ఈ ఫ్యూరియస్ ట్రాకింగ్ డౌన్ ‘’ను రోవాల్ట్ పట్టుకొని తన మనోభావాలను కళ లో ప్రదర్శించాడు .రౌవాల్ట్ మొరావ్ కు ప్రియ శిష్యుడయ్యాడు .గురు శిష్యులమధ్య గొప్ప సాన్నిహిత్యం ఉండేది అందుకే మొరావ్ చనిపో గానే రౌవాల్ట్ ను ‘’మొరావ్ మ్యూజియం ‘’అధ్యక్షుడిని చేశారు .

యవ్వనం లోనే రౌవాల్ట్ క్లాసిక్స్ అభ్యసించాడు .25వ ఏట తన’’ గ్రాఫిక్ సెల్ఫ్ పోర్ట్రైట్ ‘’ను వేసుకొన్నాడు .కనుక అతనిచిత్రాలలో శారీరక నిర్మాణ దోషాలున్నాయని ,కనుక శరీర నిర్మాణ చిత్రాలు వేయటానికి అసమర్ధుడు అని అనేవారికిది చెంప పెట్టు .రేమ్బ్రాంట్ చిత్రకారుడు 26వ ఏట మాత్రమే ‘’క్వారీ ‘’చిత్రాన్ని గీయగాలిగాడని గ్రహించాలి .

30వ ఏట రౌవాల్ట్ ఒక సన్యాసి లాగా కనిపించేవాడు .ఇరవైల మధ్యలో పెరిగిన బిరుసు  గడ్డం ఇప్పుడు మెత్తనై వంకర్లు తిరిగింది .కళ్ళు  ప్రశ్నార్ధకం గా చూసేవి .అందమైన మూతి .ఎందుకో చాలా  దుఖితుడుగా , చింత తో కు౦గి పోయినట్లు గా కనిపిస్తూ వీటిని తన లాండ్ స్కేప్ లలో ప్రతిఫలింపజేసి  నిరుత్సాహ పరుస్తాడు  .పేలవమైన నీలంరంగుతో ,భారమైన ఆత్మ వేదనతో కనిపిస్తాయిఅవి. .ఇదే సమయం లో అంటే 1903లో ఉత్సాహ భరిత అంకిత భావం తో ఉన్న కేధలిక్ రచయిత రియాన్ బ్లాయ్ తో పరిచయ మేర్పడింది . బ్లాయ్ లోని  ఆధ్యాత్మిక తేజం నీరవంగా నిరుత్సాహం గా ఉన్న రౌవాల్ట్ లో ఉద్దీపన కలిగించింది .రౌవాల్ట్ కు కూడా ఇప్పుడిప్పుడే ఆధునిక ప్రపంచం వెగటు పుట్టి దూరమౌతున్నాడు .బ్లాయ్ లాగానే అతనికీ ‘’At a time everything seemed  lost ,to thrust at God the outcry of dereliction and anxiety for the orphaned multitude which the Father in his celestial heights seems to be abandoning  and which no longer has the strength even to die bravely ‘’అనే గొప్ప ఎరుక మన గజేంద్రుడికి ‘’నీవే తప్ప ఇతః ప్రమబెరుగ’’అన్నఉత్కృష్ట  భావన కలిగి జ్ఞానోదయమైంది .

దీనితో కేన్వాస్ పై  టెర్రర్ ,దుర్ఘటనలను(దిసాస్టర్ ) గాస్పెల్స్ ను గీశాడు .చెడు ను అసహ్యించుకోవటానికి అందంగా లేని వ్యభిచారుల్ని అసహ్యమైన ఇంద్రియ లోలురను ,వికార దిగంబర బానిస విట నపుంసకుల్ని ,వికర్షించే మొహినుల్ని  ,నీచ కుహనామేధావుల్ని ,అలసిన విషాద విదూషకుల్ని (క్లౌన్స్ )  బాగా పరీక్షగా అధ్యయనం చేశాడు గీశాడుకూడా . .ఇవన్నీ  చూసి, విని బ్లాయ్ అవాక్కయ్యాడు .తన శిష్యుడు ఆధునిక’’ ఫ్రా0జేలికో’’అవుతాడేమోననుకొన్నాడు ..సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని సమకాలీనం గా మారుస్తాడని భావించాడు .’’రౌవాల్ట్ దేవతా చిత్రాలను (సేరాఫిం ) గీసే సమర్ధుడు అనుకొంటే ,దీనికి విరుద్ధంగా  ఇప్పుడు అత్యాచారాలు ,ప్రతీకార వ్యంగ్య చిత్రాలు మాత్రమే  గీస్తున్నాడు ‘’అని రాశాడు .

 

సశేషం

మీ-గబ్బిట-దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.