ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -125

51-మతాత్మక హింసాత్మక ఫ్రెంచ్ చిత్రకారుడు –జార్జెస్ రౌవాల్ట్-2(చివరి భాగం )

1917లో బ్లాయ్ మరణం వరకూ రౌవాల్ట్ ,బ్లాయ్ లు  మంచి స్నేహితులుగా ఉన్నప్పటికీ మన పెయింటర్  ధోరణి మార్చుకోలేదు .అత్యాచారాలు మరింత దారుణంగా చిత్రించాడు .వీటిని తానుకూడా సంస్థాపకులలో ఒకడైన ‘’సెలూన్ డీ ఆటోమ్ని’’లో ప్రదర్శించాడు .దీనిపేరు తర్వాత ‘’సెలూన్ డెస్ ఫావెస్’’గా మారింది .’’వైల్డ్ బీస్ట్ ‘’లనబడే ‘’ఫావెస్’’లలో మాటిస్సే ,డిరైన్ ,ఫ్రీజ్ ,రౌవాల్ట్ లున్నారు .వీరందరి నూతన ఆవిష్కరణలు అ రోజుల్లో మామూలుగానే సంప్రదాయ వాదులు విమర్శించారు .వీళ్ళ సృజనను నిగూడం,అశ్లీలం ,కుటిల కృత్రిమ ,పిచ్చి దురవగాహన అగమ్య గోచర కళఅన్నారు .వీరిలో రౌవాల్ట్ నే ఎక్కువగా అందరూ దూషించారు .కారణం అతని అతి చీకటి లక్షణ మానసిక  చిత్రాలే .ఈ విమర్శ ,తిట్లు మరో సారి మరి కొంతకాలమైన తర్వాత  జరిగిన  ప్రదర్శన తర్వాత మరీ పెరిగింది . .బ్లాయ్ మళ్ళీ ‘’నేను నీకు రెండు మాటలు మాత్రమే  చెప్ప దలచాను. ఆ తర్వాత నువ్వు నాకు పోగొట్టుకొన్న స్నేహితుడు గానే మిగిలిపోతావు’.మొదటిది నువ్వు అందవిహీన చిత్రాలపైనా ,అసహ్యించుకొని తల తిరిగేట్లు చేసే వాటినే చిత్రించాలని ఉబలాట పడుతున్నావు .రెండవది నువ్వు నిజంగా దైవ ప్రేమికుడివే అయితే ,విధేయతగల అత్మగలవాడి వైతే నువ్వు ఇలాంటి భయంకర చిత్రాలు గీయవు ‘’ అని రౌవాల్ట్ కు ఉత్తరం రాశాడు .

కాని రౌవాల్ట్ చిత్రకళ అవమానకరమైనదని ,మానవుని కి౦చపరచేదని,దైవం పట్ల విశ్వాసం లేనివని ,ఆత్మ న్యూనత కు చిహ్నాలని ఎవరూ నిరసన తెలుపలేదు .అలాగే అతని బాధా తప్త హృదయాన్నీ,వేదననూ కూడా అర్ధం చేసు కొన్న వారు లేక పోయారు .అతని చిత్రాలు ద్వేషం ,రోషాలతోగీసినవికావు .అవిఆధునిక ప్రపంచ హీన స్థితిని   అంతరాత్మ అవసరం ,సానుభూతి ,సహవేదన లను ప్రదర్శించే చిత్రాలు .వయసు 30 దాటాక ముందుకు దూకే భరోసా లభించింది .అతని చిత్రశైలి మొరటు వ్యంగ్యం ,సామాన్య ప్రజల ,రైతుల ,స్నానం చేసేవారల నిత్యం కనిపించే ఆడ మగ పిల్లా జెల్లా ల ఇష్టాల మధ్య  గడిచింది  ,రంగులు మరీ దట్టమైనాయి .ప్రాముఖ్యం పెంచే నల్ల సరిహద్దు ఆకృతులు ఏర్పడ్డాయి .అతని అసలైన వ్యాపారమైన రంగు గాజు పనులు ఇప్పుడు శక్తి వంతమై నమ్మకం కలిగేట్లు బోధనా మయం గా న్నాయి  .ఇదే రౌవాల్ట్  ను గుర్తించే అతిముఖ్యమైన శక్తివంతమైన శైలి అయింది .నలభైలలో చిత్రించిన నీరస క్లౌన్లు ,యాభై ఎనిమిది లో వేసుకొన్న సెల్ఫ్ పోర్ట్రైట్ ,అరవై లలో వేసిన శిలువ ,యేసు క్రీస్తు చిత్రాలు మత భావ విశేషాలతో రాణించాయి .60కి పైగా పెద్ద కాన్వాసులు చిత్రించాడు .లితోగ్రాఫులు,పెర్సనల్ చిత్రాలు ,సర్కస్ జనం చిత్రాలు అన్నీ కలిపితే వంద దాకా గీసినట్లే లెక్క .తన స్వంతా కవిత్వం ‘’పాసేజేస్ లేజెండరీస్ ‘’కు తానె చిత్రాలు వేసుకొన్నాడు .వందకు పైగా వుడ్ కార్వింగ్స్ చేశాడు .సుమారు ఇరవై కిపైగా చెక్కాడు .వయసు మీద పడుతున్నా అతని శైలి  తీవ్రత ఏమాత్రం తగ్గ లేదు .75వ ఏట ‘’బిబ్లికల్ లాండ్ స్కేప్ ‘’,ది ఇంఫంట్ క్క్రైస్ట్ అమాంగ్ డాక్టర్స్’’చిత్రించాడు .వాటిని చూస్తె భక్తిభావం ఉట్టిపడుతుంది .

మిగతా చిత్రకారులకంటే గొప్ప అదృష్ట వంతుడు రౌవాల్ట్ .కారణం ఆయన జీవించి ఉండగానే అందరూ ఏవ గి౦చు కొన్న, దూరం చేసిన, దూషించిన చిత్రాలనే గొప్ప చిత్రాలుగా ప్రపంచ  విమర్శకులు గుర్తించి మెచ్చుకొన్నారు .ఈ అదృష్టం చాలామంది కి దక్కలేదు .రౌవాల్ట్ యొక్క అసామాన్యతను జేమ్స్ ట్రాల్ సోబీ సమీక్షిస్తూ ‘’ A devout Catholic and devotional painter in a period when artists more often run the gamut of anti religious feeling from indifference to irreverence –a painter of sin and redemption in the face of prevailing estheticism and counter estheticism –an artist with a limited vision of unlimited ferocity in contrast to many other leading painters who have scanned and pivoted but seldom started fixedly for long ‘’అని వివరించాడు .

రౌవాల్ట్ ను ఏ ఇతర సమకాలీన  ఆర్టిస్ట్  తో పోల్చాలి అన్నదొక ప్రశ్నఉంది . అతన్ని ఒక కవిగానే గుర్తించాలి చిత్రకారునిగా కాదు .అతని అసాధారణ జుగుప్సాకర ,ఊపిరి సలపని చిత్రాలు మహా కవి టి .ఎస్ .ఇలియట్ ‘’అపూర్వ కావ్యం ‘’దివేస్ట్ లాండ్ ‘’తో ను యాష్ వేడ్నస్ డే’’జర్నీ ఆఫ్ ది మాగీ ,ఫోర్ క్వార్టర్స్ ‘’కవితలతో పోల్చవచ్చు .ఇలియట్ లాగానే రౌవాల్ట్ గాఢనిరాశ మార్గం నుండి తెగించిన నమ్మకం లోకి ప్రయాణించాడు. ఏదీ ప్రశాంతంగా పరిష్కారం కాదు. పాపం ,ప్రక్షాళన లు నిరంతర ప్రక్రియలు .విదూషకులు,క్రీస్తులు అందరూ మనుషులకంటే .ఎక్కువ బాదే అనుభవించారు .’’ఇలియట్ లాగానే రౌవాల్ట్ కూ క్రూరత్వం  సానుభూతి ప్రేరేపిస్తాయి అని పిస్తాయి ..బాధలలోనే మోక్షం ఉంది ‘’అన్నాడు లూయీ అంటర్ మేయర్ .

1891లో రౌవాల్ట్ ‘’ది వే టు కావల్రి ‘’చిత్రించాడు .1907లో స్పిరిట్యు వలిజం కు,జాక్వెస్ మారిటన్ యొక్క    అస్తిత్వవాదానికి ఆకర్షితుడయ్యాడు.మానవ ప్రక్రుతిపైననే అతని దృష్టి కేంద్రీకరించాడు .A tree against the sky possesses the same interest ,the same character ,the same expression as the figure of a human ‘’అంటాడు రౌవాల్ట్ .1917నుంచి క్రిస్టియన్ మత విశ్వాస చిత్రాలు గీశాడు .1937లో చిత్రించిన ‘’దిఓల్డ్  కింగ్ ‘’అతని ఫైనేస్ట్ ఆర్ట్ గా గుర్తించారు . 1930నుండి లండన్ న్యూయార్క్ చికాగో లలో ప్రదర్శన నిర్వహించాడు .1948లో ‘’సైకిల్ మిసేరేరే ‘’చిత్రించాడు .జీవితం చివరి రోజుల్లో ౩౦౦కు పైగా తన చిత్రాలను తగల బెట్టేశాడు వీటి ఖరీదు నేటి లెక్కల ప్రకారం అర మిలియన్ డాలర్లకు పైనే ఉంటుంది .దీనికి కారణం ఆయన ఏం చెప్పాడంటే తానిక  వాటిని పూర్తీ చేయలేనుకనుక అన్నాడు .1958లో చిత్రకారుడు రౌవాల్ట్ పారిస్ లో 87వ ఏట మరణించాడు .

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-3-16-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.