సాహితీ బంధువులకు శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
సరసభారతి శ్రీ దుర్ముఖి ఉగాది వేడుకలలో3-4-16 ఆదివారం ”మా అన్నయ్య ”పై కవి సమ్మేళనం నిర్వహించిన సంగతి మీకు తెలిసిందే . 30కి పైగా వచ్చిన కవితలు చిక్కగా చక్కగా ఉన్నాయి .వీటి ని ఇదివరకు సరస భారతి ”మాఅ క్కయ్య ”పై కవి సమ్మేళనం నిర్వహించి పుస్తక రూపం లో తెచ్చినట్లే ఈ సారి కూడా ఈ కవితలను పుస్తక రూపం లో అందజేయాలన్న కోరిక ఉందని వేదికపై తెలియ జేయగానే సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతంరాజు మల్లికాంబ గారు వెంటనే స్పందించి తాను ఈ పుస్తకానికి స్పాన్సర్ గా ఉంటానని సభా ముఖం గా తెలియ జేశారు .పుస్తకాన్ని తమ తలి దండ్రులకు అంకితమివ్వాలని కోరారు ఆమెను కరతాళ ధ్వనులతో అభినందించాం .ఈ బాధ్యతను రమ్య భారతి సంపాదకులు శ్రీ చల పాక ప్రకాష్ గారిని స్వీకరించ వలసినదిగా కోరగా వెంటనే అంగీకరించారు వీరిద్దరికీ కృతజ్ఞతలు .
పుస్తకం మరింత మంది కవుల కవితలతో ఉంటె, నిండుదనం ,సార్ధకత ఉంటుందని భావించాం . కనుక ”మా అన్నయ్య ”పై ఇంకా ఎవరైనా కవితలు రాసి పంప దలచి నట్లయితే 20-4-16 లోపు రాసి నెట్ ద్వారాకాని పోస్ట్ లో కాని నాకు కాని ,ప్రకాష్ గారికి కాని పంపవలసినదిగా కోరుతున్నాం-దుర్గా ప్రసాద్