ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -132
54-అమెరికాలో తన తరం లో అత్యంత సృజనశీలి గా పేరొందిన స్టీఫెన్ క్రేన్
యుద్ధం లో సైన్యం చేసిన సాహసాన్ని ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’అనే అమరమైన నవలగా 23వ ఏట అసలు యుద్ధభూమిని చూడనే చూడకుండా రాసిన అమెరికన్ యువ రచయిత స్టీఫెన్ క్రేన్ .దీన్ని ‘’అట్లాంటిక్ మంత్లి ‘’పత్రిక ‘’సాహిత్యం లో కొత్త ఫాషన్(వైఖరి ) ప్రవేశ పెట్టాడు క్రేన్ ‘’అని గొప్పగా రాసింది .ప్రముఖ రచయిత హెచ్ జి వెల్స్ ‘’కొత్త శకానికి ఇది నూతన ఆవిష్కారం .పాత విదానాలన్నిటిని వెనక్కినెట్టేసిన నవల ‘’అన్నాడు .ఇందులోని తీవ్రత అంతా రచయిత చర్యా రాహిత్యమే .తన సృజన సామర్ధ్యాన్ని అతి వేగా వంతంగా ఖర్చు చేసి అపూర్వ అనన్య సామాన్య రచనలు చేసి 30ఏళ్ళకే పరమపదించాడు క్రేన్ .
తలిదండ్రులైన జోనాధన్ టౌన్లిక్రేన్ ,స్టీఫెన్ క్రేన్ ల 14మంది సంతానం లో చివరివాడు స్టీఫెన్ క్రేన్ .అమెరికాలోని న్యూయార్క్ లోన్యు జెర్సీ లో 1-11-1871న జన్మించాడు .తొమ్మిదవ ఏట మేధడిస్ట్ మినిస్టర్ అయిన తండ్రి చనిపోయాడు .తల్లి కూడా అంతే పవిత్రంగా జీవిస్తూ పిల్లల బాధ్యతా తీసుకొంది.మతసంబంధమైన వ్యాసాలూ రాసి ప్రచురించేది .తల్లికున్న ఈ సుగుణం కొడుకు క్రేన్ కు అబ్బింది .టీనేజ్ లో కుటుంబం యాస్బరి పార్క్ లో ఉండగా సంఘంలోని గుసగుసలు ,వేసవి యాత్రికుల విషయాలు గ్రహించేవాడు .సిరాక్యూజ్ యూని వర్సిటి లాఫెటీ కాలేజి లో లో విద్యార్ధి గా చేరి ,కాలేజి రిపోర్టర్ గా ‘’ది న్యూ యార్క్ ట్రిబ్యూన్ ‘’కు పనిచేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదింఛి ఖర్చులకు వాడుకొనేవాడు .పెద్దగా చదువు పై శ్రద్ధ ఉండేదికాదు కాని సంతృప్తికరమైన విద్య అబ్బింది .పాఠ్య పుస్తకాలను అలాఅలా తిరగేసేవాడు కాని అందులోని విషయాలన్నీ యిట్టె గ్రహించేసేవాడు . పొడవుగా సన్నగా అసలైన కొంగ అంటే క్రేన్ లాగా ఉండేవాడు .నీలి కాంతివంతమైన కళ్ళు ,క్రీడాకారుడిగా కనిపించేవాడు . వాస్తవంగా మంచి ఎత్లేట్ .బేస్ బాల్ టీం కెప్టెన్ క్రేన్ .
18ఏళ్ళకే తల్లీ చానిపోయింది .కుటుంబం చాలాపెద్దది .కనుక ఒంటరిగా జీవి౦చాలనుకొన్నాడు .తనదారి తాను చూసుకోవటం మంచిదనే నిర్ణయానికి వచ్చాడు .యువ రచయితలూ కళా కారుల బృందం లో చేరి న్యు యార్క్ లోనిదిగువ తూర్పు ప్రాంతం లో లాడ్జింగ్ లలో అద్దెకు ఉంటూఅయిదేళ్ళు గడిపాడు .అప్పుడప్పుడు స్కెచ్ లు రాస్తూ ,జర్నలిజం లో ప్రవేశింఛి ఆకలితో చావకుండా బతికాడు .21వ ఏట ఒక నవల రాస్తే ఏ పబ్లిషర్ కూడా ప్రచురించటానికి ముందుకు రాలేదు .అదే ‘’మాగ్గీ –ఎ గర్ల్ ఆఫ్ ది స్ట్రీట్స్ ‘’నవల .దీన్ని ప్రీస్ట్ లైన తలిదండ్రుల కొడుకైన క్రేన్ రాశాడు .అది ఒక వ్యభిచారి అయిన స్త్రీ వృత్తాంతం .బురదలో పుట్టి వికసించిన పుష్పం ఆమె .మురికి వాడలలోని ముడి హింస ను ,ఆ మనుషులు మాట్లాడే బజారు భాషలో రాశాడు .చివరికి ఎవడో ఒక బకరా పబ్లిషర్ అచ్చు వేయటానికి రెండు షరతులపై ఒప్పుకొన్నాడు .పుస్తక ముద్రణ ఖర్చు క్రేన్ పెట్టుకోవాలి .పబ్లిషర్ పేరు పుస్తకం లో ఎక్కడా కని పించ కూడదు .తన సోదరుల దగ్గర అప్పు చేసి డబ్బు సమకూర్చుకొన్నాడు .తీరా పుస్తకం బయటికి వస్తే జర్నలిస్ట్ గా ఉన్న తన పరువు పోతుందేమోనని భయ పడ్డాడు .’’జాన్ స్టన్ స్మిత్ ‘’అనే మారు పేరుతో పుస్తకం అచ్చు వేయించాడు .చచ్చీ చెడి వందకాపీలు అమ్ముడయాయి .మిగిలిన వాటిని కాల్చి గదిని వెచ్చ చేసుకొనేవాడు .అంతకు ముందే సిస్టర్ కారీ నవలతో డ్రైజర్ నేచురలిస్ట్ నవలకు దారి చూపాడు దాని ప్రభావం క్రేన్ రాసిన ఈ నవల పై ఉందని కొందరు విమర్శకులన్నారు .కాని హామ్లిన్ గార్లాండ్ ఈ నవలను బాగా మెచ్చాడు .విలియం డీన్ హోవెల్స్ ‘’as present in the working out of this poor girl;s squalid romance as any classic fable ‘’అని కీర్తించాడు .కదా కంటే కూడా గొప్పగా మురికి కూపం లో దరిద్రం తో అలమటించిన ఒక పేద పిల్ల ఏ ఇతర క్లాసిక్ కద కంటే గొప్పగా ఉంది అన్నాడు .
పేపర్లు బాగా ప్రోత్సహించాయి .దీనితో రెండవ నవలకు శ్రీకారం చుట్టాడు .అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిననవల ‘’ది రెడ్ బాడ్జ్ ఆఫ్ కరేజ్ ‘’ఇంకా ఇరవై నాలుగు ఏళ్ళు రాకుండానే 1895లో దీన్ని క్రేన్ ప్రచురించాడు .ఈ నవలకు నేపధ్యం అమెరికన్ సివిల్ వార్ .అదిఅటామిక్ యుగం ముందు జరిగే ఏ యుద్ధమైనా కావచ్చు .అన్నీ అలాగే జరుగుతాయి .తికమక పెట్టె ఆ పరిస్థితులలో ఏ సైన్యమైనా అలానే ప్రవర్తిస్తుంది .ఆనాటి ప్రజలు పిరికితనం ,సమయానికి తగినట్లు మొండి ధైర్యం తో ,భయాలను సిల్లీ జోకులతో కప్పి పుచ్చుకొంటూ , ప్రగల్భాలు ,ఆత్మ స్తుతి డాబు లతో ఉండేవారు .కధను ఒకదాని తర్వాత ఒకటి గా వచ్చే ఫ్లాష్ లతో మనుషులను అజ్ఞాతం లో ఉంచుతూ మహా వేగం గా నడిపించి రాశాడు .కొద్ది వీరత్వం ,యుద్ధ మహా భీభత్సం కళ్ళకు కట్టించాడు .ఇందులోని సైన్యం సామాన్య రైతులు ,కమ్మరివారు ,గుమాస్తాలు ,కంచర గాడిదలను తోలేవారు .వీరిలో ఎవరికి యుద్ధం ఎలా జరుగుతుందో అపాయం ఎలా తప్పించుకోవాలో ఏమాత్రం తెలియని వాళ్ళు .అయినా యుద్ధం చేస్తున్నారు .క్రేన్ ఈస్తటిక్ అన్వేషణ భయ భ్రాంతుల కు అధీనం లో ఉంది .అందుకే అన్ని యుద్ధ రచనలు వేరు వేరుగానే ఉంటాయి .ఇందులోని సంఘర్షణ ను అనేక స్థాయిలలో వర్ణించాడు క్రేన్.రక్తపాతం అడుగున సౌందర్యం కనిపిస్తుంది చనిపోయే సైనికుడు తన గాయాలను బాధను లెక్క చేయకుండా ముందుకు సాగి పోతాడు .ఆకాశం లో సూర్యుడు ఎర్రగా పొరలాగా ఉన్నాడని వర్ణించాడు .యుద్ధ భూమిని కవిత్వీకరించి మన తిక్కన మహా కవిలాగా తీర్చి దిద్దాడు .ఆ వర్ణ క్రేన్ మాటల్లో ‘’In the gloom before the break of day their uniforms glowed with a deep purple hue .From across the river the red eyes were still peering .In the eastern sky there was a yellow patch like a rug laid for the feet of the coming sun ,and against,black and pattern like ,loomed the gigantic figure of the colonel on a gigantic horse ‘’
ఈ నవలను ఎందరు ఎన్ని విధాల మెచ్చుకొన్నా లాభాల వర్షం కురిపించలేక పోయింది .ఒక వంద డాలర్లే చేతిలో పడ్డాయి .కాని ఈ నవలతో స్టీఫెన్ క్రేన్ అమెరికన్ సేలిబ్రిటి అయ్యాడు .ఆయనకు మెక్సికో వెళ్ళే అవకాశమిచ్చారు .1896లో గ్రీసు టర్కీలు యుద్ధానికి దిగినప్పుడు న్యూయార్క్ జర్నల్ ఎడిటర్ ఈ యుద్ధ వార్తలను రాయటానికి సర్వ సమర్ధుడు క్రేన్ ఒక్కడే అని భావించి బాధ్యతలను అప్పగించాడు .ఆనదంగా క్రేన్ వెళ్ళాడు .అక్కడ అనేక మోసాలలో అభియోగాలను ఎదుర్కొన్నాడు .అతనికిస్టమైన ఒక అమ్మాయి బజారు బిచ్చ గత్తెఅని అరెస్ట్ చేశారు .క్రేన్ ఆమె ను రక్షించ బోతే పోలీసులు వీరి గదిలో మత్తు పదార్ధాలు దొరికాయని అభియోగం మోపారు .వేరొకమ్మాయి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి ఆతను తన దగ్గర డబ్బు అప్పు తీసుకోన్నాడని డబ్బు వాపసు ఇప్పించమని కోర్టు కెక్కింది .26ఏళ్ళ వయసులో ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-5-16-ఉయ్యూరు