ఇది విన్నారా ,కన్నారా !-6
10-గాత్ర వాయులీన విద్వన్మణి-శ్రీ నేతి శ్రీరామ శర్మ
95-అతి సామాన్యంగా కనిపించే శ్రీ నేతి శ్రీరామ మూర్తి గారు సంగీతం లో విద్వన్మణి. వీరికి తల్లీ తండ్రీ ,గురువు ,మనసెరిగిన మిత్రుడు ప్రత్యక్ష దైవాలు .వీరి వాయులీనవిమల గాంధర్వం .గుంటూరు జిల్లా నూతక్కి గ్రామస్తులు .తండ్రి శ్రీ నేతి లక్ష్మీనారాయణ భాగవతార్ శ్రీ ఆది భట్ల నారాయణ దాసు గారి ద్వితీయ శిష్యులు .దాసుగారి మొదటి శిష్యులు శ్రీ వాజ పేయాజుల సుబ్బయ్య గారు .ఏఇద్దరు శిష్యులను లవ కుశులు అనేవారు .
96-నేతివారు 1958నుండి -88దాకా రేడియోలో నిలయ విద్వాంసులు .’’మనకు విద్య ఉందికదా అని దాన్నంతా ప్రదర్శించ కూడదు .ముఖ్య కళాకారునికి లోబడి వాయించాలి .కచేరీ రక్తి కట్టించాలి ‘’అనే సహృదయులు
97-నేతి వారి విద్వత్తు కు తగ్గట్లు సువర్ణ ఘంటా కంకణం ,కనకాభి షేకం పొందారు .శ్రీపారుపల్లి పంతులు గారు పాడుతుంటే ‘’జీవం తో ఉన్న తంబూరా తంత్రులు మోగిస్తున్నట్లు ఉంటుంది ‘’అని మెచ్చిన రస హృదయులు సరస హృదయులు .
98-ఒక సారి హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ టి ఆర్ .మహా లింగం గారి గాన కచేరీ కి శ్రీ మతి ద్వారం మంగతాయారు గారు పక్క వాద్యం వాయించటం మొదలు పెట్టి అనారోగ్యం తో మూర్చ పోగా నేతివారు అనుకోకుండా అంతటి దిగ్దంతునికి వయోలిన్ వాద్యం వాయించి రక్తి కట్టించారు
99-పుంభావ సరస్వతీ మూర్తులైన శ్రీరామ శర్మగారు సంగీత సభలకోసం ఎన్నో వేల రూపాయలు దానం చేసిన వితరణ శీలి .
100-గాయక సార్వ భౌమ పారుపల్లి రామ క్రిష్నయ్య పంతులు ‘’సంగీత సభ ‘’ఏర్పరచి సంగీత సరస్వతికి సేవ చేసిన మహనీయులు నేతి శ్రీరామ శర్మ గారు.
11-సంగీత సాహిత్య విద్వాంసులు శ్రీ యెన్ సి హెచ్ ,కృష్ణ మాచార్యులు
101-కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలో జన్మించిన శ్రీ నల్లాన్ చక్ర వర్తుల కృష్ణ మాచారి గారు ఎన్నో ప్రౌఢ మైన హరికధాలను సంస్కృతాంధ్రాలలో రచించారు ..పారుపల్లి వారి శిష్యరికం లో ఎదిగిన వారు .
102-త్యాగరాజ స్వామి వారి ‘’నౌకా చరితం ‘’ను సంస్కృతం లోకి అనువదించిన గీర్వాణ వైదుష్యం వీరిది .
103-ఈ రోజుల్లో భారత దేశం లో సంస్కృతం లో హరికధ కాలక్షేపం ఉత్తమ స్థాయిలో చేస్తున్న శ్రీ ఉమా మహేశ్వర రావు గారికి ఆచార్యులవారు గురువు .తామూ ఎన్నో సంస్కృత హరికధలు దేశమంతటా చెప్పారు .
104-కవిత్వం భావుకత లలో నిష్ణాతులు .’’త్యాగ రాజ గేయార్ధ కుంచిక ‘’అనే ఉద్గ్రంధం రాసి శ్రీ కల్లూరి వీరభాద్రశాస్త్రి గారికి అంకితమిచ్చారు
105-‘’మనం బాణీ ణి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు .ముర శ్రీరంగం అయ్యంగారు అనే మహానుభావుడు ఏర్పాటు చేసిన బాణీయే ‘’ఆంధ్రదేశపు బాణీ ‘’అన్నారు .
106-సంగీతం మోక్షమిస్తుందని ఒక గొప్ప వ్యాసాన్ని సంస్కృత భాషలో రాస్తూ ‘’గీతి గానేన యోగస్స్యాత్-యోగాదేవ శివైక్యతా-‘’ఇత్యుక్త ప్రకారేణ త్యాగ రాజః గానేన యోగం ,యోగేన శివైక్యం ప్రాప్యతే ఇతి నిశ్చనుమః –శివైక్యం నామ జీవన్ముక్తి రేవ ‘’అని ముగించారు .
12-శ్రీ కొమాండూరి శేషాద్రి
107-పాడుతున్నది వాయిస్తున్నది ఏమిటో ,అందులోని మర్మమేమిటో సోపత్తికంగా వివరించి చెప్పగల విద్వాంసులు శ్రీ కొమాండూరి శేషాద్రి గారు .వీరిది సంగీత వంశం .
108-2008లాయింగ్లాండ్ లో పర్యటిస్తూ సంగీత కచేరీలు సోదాహరణ ప్రసంగాలు చేసి శ్రోతల హృదయాలను ఉర్రూత లూగించారు .
109-లండన్ దగ్గర ఒక చోట సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ఆదేశం తో 108మంది చేత18కృతులను ఏక కంఠం గా పాడించి సేబాష్ అనిపించారు .
110-అమెరికాలోని పిట్స్ బర్గ్శ్రీ వేంకటేశ్వరాలయం ఆహ్వానంతో ఒక ఏడాదిలో ఆరు నెలలకోసారి గా రెండు సార్లు విజిటింగ్ అధ్యాపకులుగా ఉంటూ ,నిత్య బోధనా జరిగాక సాయంవేళ రాగ ,కృతి ,భావ ,త్రిపుటి లపై మహా వాగ్గేయ కారుల రచనలపై చర్చాగోస్తులు జరిపారు .దీనితో వారు ప్రామాణికమైన ప్రసంగా కర్త గా ,వ్యాఖ్యాతగా ,విశ్లేషకునిగా ,తులనాత్మక వివరణ కర్త గా రాణించి వినుతి కెక్కారు .
111-శిష్యులు కోరిన రాగం లో అప్పటికప్పుడే కృతి రాసి గోష్టిలో నేర్పటమూ చేశారు.
112-రాగం ‘’ఆఠాణా’’అంటే బందీ నుంచి విముక్తి చేసేది అని అర్ధం చెప్పారు కొమాండూరి వారు .’’ఠాణా’’అంటే పోలీస్ స్టేషన్ .అ అంటే లేనిది అంటే బందీ కానిది అని వివరణ ఇచ్చారు .
113-వాక్యం రసాత్మకం కావ్యం అన్నట్లుగానే ఆచార్యులవారు ‘’నాదం రసాత్మకం కీర్తనాని ‘’అన్నారు రాగానికి స్వరం ఆధారం .అ కారా ఉకారాదుల చేత అది నూతనత్వాన్ని పొంది ,సంచారులచేత అనుష్టానం అవుతుంది .లక్ష్య సిద్ధికలిగి లక్షణ భావం నేర్చిన నేర్పరికి మాత్రమే ‘’రాగాత్మను స్థాపన చేయటం తెలుస్తుంది ‘’అంటారు .
114-‘’భరత,శార్న్గ్య దేవ,రఘునాధ నాయకుల అఖండ వీణ పరిశోధనలు లోకానికి శ్రుతి రూపం లో బయట పడి తర్వాత నాద మూర్తులైన త్యాగ రాజాదుల కృతుల చేత మర్యాద పొందాయి .నిశ్చయంగా వీణా వాదన నైపుణ్యం రాగ వికాస క్రమానికి పెద్ద పీట వేసింది ‘’అని ఖండితంగా చెప్పారు శ్రీకోమా౦డూరి.
115-‘’రాగం నాదా౦తర్భాగం .రాగం స్వర వర్ణ రూపంగా బహిర్గతమై దానిలోనే నాదం అంతర్వాహినిగా ప్రసరిస్తుంది .మూలమే నాదం మిగిలినవి అంగాలు ‘’అన్నారు .
116-హిందూస్తానీ ,కర్నాటక విద్వాంసుల లో భేదాన్ని వివరిస్తూ ‘’హిందూ స్థానీ గాయకులు రాగాన్ని గ్రహన్యాస మూలకంగా నాద పూర్ణంగా కూర్చటం వాళ్ళ రీతి .కర్నాటక గాయకులూ స్వర ప్రాధాన్యం టో వాగ్గేయ కారుల కృతుల రూపంగా నాదాన్ని ప్రకటిస్తారు .వీరిలో స్వర కల్పనమార్గం తో ,లయ బంధం తో కల్పనలు చేయటంద్వారా వీళ్ళ శైలిలో విలక్షణత కనిపిస్తుంది ‘’అని విశ్లేషించారు .
117-‘’హిందూస్తాని నాద సంబంది .కర్నాటకం స్వరసంబంది .నాదాన్ని రసాత్మకం గా వాళ్ళు చూపిస్తే మనం మరింత చాతుర్యం తో అంతర్లీన స్వర సౌందర్యాన్వేషణలో నాదాన్ని ప్రబల పరుస్తూ సాహిత్యాన్ని ప్రదర్శిస్తాం ‘’అంటారు .
118- శీ శేషాద్రిగారి కి పెద్దకుమార్డు శ్రీ రాజన్ ,చిన్నకుమారుడు వెంకట కృష్ణ చెరొక ప్రక్కన కూర్చుని వీరు మధ్యలో కూర్చుని వయోలిన్ వాయిస్తుంటే శ్రోతలకు గాంధర్వ లోకం లో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు ఆచార్య వీరభద్రయ్య .
119-‘’అర్ధ వంతం రుచి మంతమైన ‘’సాహిత్యపు పలుకుబడి ‘’నేర్చిన కృతి ఆత్మ దర్శితం అవటం అని వార్యం .’’అని వారి అభిప్రాయం .
120-శేషాద్రి వారి ఆరు నీతి సూత్రాలు –నీకు రాదు అని ఎవరితోనూ అనరాదు ,మనం కష్ట పడినా విద్యార్ధులకు అవగాహన కల్పించాలి ,భావావేశం తో పాఠం చెప్పాలి ,ప్రేమతో బోధించాలి ,పదిసార్లు వాళ్లకు చెబితే మనకు అది క్షుణ్ణంగా తెలుస్తుంది ,నిస్పృహా ,నైరాశ్యాలు అధ్యాపకుడికి పనికి రావు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -7-6-16-ఉయ్యూరు