ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -16

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్

‘’ఈ విశ్వం తో దేవుడు పాచికలాట ఆడతాడని నేను అనుకోను ‘’అని చెప్పిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 26వ ఏటనే సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రచురించాడు .అప్పటికున్న మేధావులలో 12మందికి మాత్రమే దాని అంతరార్ధం తెలిసి ఉంటుంది అనుకొనేవారు .40ఏళ్ళ తర్వాత అమెరికన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ హీరోషీమా  పై  6-8-1945న ఆటం బాంబు వేసినప్పుడు 80వేలమంది ప్రజలు దాని ప్రభావం తో చనిపోయారు .అది ఆయన ప్రతిపాదించిన జటిల సూత్ర తార్కిక ప్రభావం .ఇప్పుడు ప్రపంచానికి అర్ధమైనది ఆయువ లెక్చరర్ సిద్ధాంతాలు విజ్ఞాన శాస్త్రం లో విప్లవాన్ని ప్రముఖ ఖగోళ శాస్త్ర వేత్త గెలీలియో తర్వాత తీసుకొచ్చాడని .

    ఐన్ స్టీన్ 14-3-1879న బవేరియన్ జర్మనీలో విట్టెం బెర్గ్ సిటీ లో జన్మించాడు .వారిది ధనిక కుటుంబం .తండ్రి ఇంజనీర్ .అక్కడ ఎలెక్ట్రో టెక్నికల్ సంస్థల అధిపతి .ఈ బిజినెస్ వలన కుటుంబం ఇటలీ లోని మిలన్ కు1894 లో .మారింది .కుర్రాడి చదువు ఎక్కువ భాగం మ్యూనిచ్ లో జరిగింది .కొత్త జర్మనీ మిలిటరీ బూట్లు ,గొప్పలు నచ్చేవికావు .వీటికి దూరం గా బీతొవెన్ ,మొజార్ట్ ల సంగీతానికీ ,తత్వ శాస్త్ర గ్రందాలకే   ఆకర్షితుడయ్యాడు .15వ ఏటికే యూక్లిడ్ ,న్యూటన్ ,స్పినోజా లపుస్తకాలను  కాచి వడపోసేశాడు .దీని వలన ‘’ఓల్డ్ ఫాదర్ బోర్ ‘’అనే నిక్ నేం తో పిలిచేవారు సహాధ్యాయులు .17వయసులోస్విట్జెర్లాండ్ లోని  జూరిచ్ పాలిటేక్నికల్ స్కూల్ లో చదువు పూర్తీ చేశాడు తండ్రి తనలాగే వ్యాపారం లో స్థిరపడటానికి ఏలెక్ట్రికల్ ఇంజనీరింగ్ చదవమని అంటే పోటీ తో ఎప్పుడూ ఒడిదుడుకులతో ఉండే వ్యాపారం కంటే సైన్స్ లోతులు పరిశీలించాటానికే నిర్ణయించుకొన్నాడు . అప్పటికే ఆయనకు ప్రముఖ అమెరికన్ రచయిత ఎమర్సన్  ప్రవచించిన ‘’If a man plant himself indomitably on his instincts ,the world will come round to him ‘’అన్నది వేద మంత్రమై స్పూర్తినిచ్చింది .దానినే అనుసరించాడు .గణితం ఫిజిక్స్ లలో  ప్రత్యేక కృషి చేయాలనుకొన్నాడు .జూరిచ్ యూని వర్సిటీలో చదువుతూనే ,అక్కడి సిటీ హై స్కూల్ లోను తర్వాత స్కాఫాసేన్ లోను విద్యార్ధులకు పాఠాలు బోధించాడు .22వ యేట స్విస్ సిటిజన్ అయ్యాడు .తన తోటి గణిత విద్యార్ధిని మిలీవామారేక్  ను  పెళ్లి చేసుకొన్నాడు .బెర్నే పేటెంట్ ఆఫీస్ లో పనిచేశాడు .అందంగా హుషారుగా ఉండే కుర్రాడు .నల్లని దువ్విన మీసం ,చక్కగా దువ్వుకొన్న నల్ల జుట్టు తో హీరోలాగా ఉండేవాడు .విశాలమైన కళ్ళు ,అందులో విశ్వా౦త రాళాలను శోదిస్తున్నట్లు ఉండే చూపు ఆకర్షణీయంగా అనిపించేవి .

  1905లో ‘’అన్నలెన్ దీర ఫికిక్ ‘’అనే 30పేజీల పేపర్ ను కదిలే ఎలక్ట్రో డైనమిక్ వస్తువులపై రాసి ప్రచురించాడు .ఈమహా వ్యాసం వస్తు గుణాలను ,విశ్వ నిర్మాణం లో ఉన్న అభిప్రాయాలను పూర్తిగా మార్చేసింది .దాని విప్లవాత్మక భావం మొదట్లో ఎవరికీ తెలియలేదు గుర్తి౦చనూలేదు .ఇది 1920కి ఆయన సిద్ధాంతం యొక్క ఆంగ్లానువాదం ‘’ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ,ఎ స్పెషల్ అండ్ జనరల్ దీరీ’’గా ముద్రింపబడి  గోప్పవిలువను సంతరించుకొన్నది .ఇది ప్రపంచ వ్యాప్తంగా ఫిజిక్స్ ,గనణితాలను సవాలు చేసింది .న్యూటన్ అనుచరులు –గతి, స్తిరత్వాలు సంపూర్నమని వాటిని కొలవ వచ్చునని నమ్మారు .కాని ఇప్పుడీ కుర్రాడు ఐన్ స్టీన్ ఆ రెండూ సాపేక్షాలు అని చెప్పి సవాలు విసిరాడు .వేర్వేరు మనుషులు వాటిని వేర్వేరుగా గణి౦చగలరు అన్నాడు .దీనితో ఇప్పటిదాకా అందరూ నమ్మిన పొడవు ద్రవ్య రాశి ,కాలం యొక్క సంపూర్ణత్వం గంగలో కలిసిపోయింది .ఈ మూడిటి ఆధారంగానే మిగిలినవన్నీ కొలిచే విధానం లో పెను మార్పే వచ్చింది .

  ఇది అంతగా కొత్తదేమీకాదు .హెర్బర్ట్ స్పెన్సర్ తూర్పు వెళ్ళేస్టీమర్  మీద అదే వేగం తోకెప్టెన్ పడమరకు నడుస్తుంటే వచ్చే సమస్యను అందరి దృష్టికి తెచ్చాడు .అతడు కడదుల్తున్నాడా లేదా అని ప్రశ్నించాడు .పడవ మీద ఉన్నవాళ్ళకు ఆతను కదులుతున్నట్లే అనిపిస్తుంది .కాని ఒడ్డునుండి చూసేవాడికి అతనిలో కదలిక కనిపించదు .కనుక ఐన్ స్టీన్ కు ముందు నుంచే ఇలాంటి సాపేక్ష కదలిక విషయాలు చర్చలలో ఉన్నాయి .దీనికి విశ్వం లో ఎక్కడో ఒక బిందువు నుండి గణన చేయాలని అనుకొన్నారు .ఇలాంటి గందర గోళ భావాలు ఎన్నో ఉన్నాయి .ఎన్ని లెక్కలు వేసినా బుధ గ్రహం తన మార్గం నుండి పక్కకు తొలగినట్లున్యూటన్ ఆకర్షక  సిద్ధాంతాలలతో  గమనించారు ‘కాని మైకెల్సన్ ,మోర్లీ శాస్త్రవేత్తలు 1887లో భూమి కక్ష్యా మార్గం లో ఒక స్థిర బిందువు ఆధారం గా మార్పుని కనిపెట్ట లేక పోయారు .క్యూరీ దంపతులు రేడియం లోహం నుండి కంటికి కనపడని  శక్తి ప్రవాహం వెలువడుతోందని చెప్పారు .1901లో కాఫ్మన్ శాస్త్రజ్ఞుడు వేగంగా కదిలే ఎలక్ట్రాన్ల భారం స్థిరంగా ఉన్న వాటి కంటే ఎక్కువగా ఉంటుందని తెలియ జేశాడు .వీటన్నిటికీ ఐన్ స్టీన్ సిద్ధాంతం తిరుగు లేని సమాధానం చెప్పి చరిత్ర సృష్టించింది .ప్రకృతి ధర్మాలపైనూతన భావావిష్కరణ జరిగింది .ఈ ఖ్యాతి అంతా ఐన్ స్టీన్ దే

  గణిత శాస్త్ర సింబల్స్ ప్రకారం ప్రతి పరిశీలకుడు తానూ స్థిర బిందువు పై ఉన్నానని భావించే హక్కు ఉన్నదని అన్నాడు .సెకనుకు ఒక లక్షా ఎనభై ఆరు వేల మైళ్ళ వేగం తో ప్రయాణం చేసే కాంతి చూసేవారికి పరిమాణం లో సంకోచి౦చినట్లు గమనిస్తారు .ఈ సంకోచాన్ని 1885లో గుర్తించి లోరెంజ్ –ఫిట్జెరాల్డ్ సంకోచం అని పేరు పెట్టారు ఇది ‘’గణితకృత్రిమత ‘’  .(మేధమాటికల్ ఆర్టి ఫీషియాలిటి’’అన్నారు .కాని ఐన్ స్టీన్ దీన్ని భౌతిక సత్యంగా రుజువు చేశాడు .ఉదాహరణకు ఒక బంతి నిమిషానికి 161000మైళ్ళ వేగం తో కదులుతుంటే గమని౦చేవాడికి దాని మందం సగానికి సగం తగ్గి,ఒక ఫ్లాట్ డిస్క్ లాగా చివరికి అసలు  మందమేలేనట్లుగా  గమనిస్తాడు  .అంటే కాంతి వేగానికి మించిన వేగం తో యే వస్తువూ ప్రయాణి౦చలేదు అని అర్ధం .

Inline image 1

  సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-16-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.