ఇది విన్నారా ,కన్నారా !-9
18-మాధుర్య వైదుష్య కలబోత శ్రీమతి మండా సుధారాణి
156-ఈ తర౦ అగ్ర గాయకులలో అగ్రశ్రేణిలో ఉన్నవారు శ్రీమతి మండా సుధారాణి .ఒకే సమయం లో రెండు చేతులతో రెండు వేరు వేరు తాళాలనువేసి ‘’తాళావధానం’’చేసిన విద్వాంసురాలు .విశాఖ కళా సమితి లో ఈ విన్యాసం చేసిఅబ్బుర పరచారు .
157-గతి ,తాళాలపై మహాదికారం ఉన్నందు వలననే సుదారాణిగారిని 18ఏళ్ళ చిన్నవయసులో మద్రాస్ సంగీత అకాడెమి నిర్వహించిన పల్లవి పోటీలలో బహుమతి పొందారు .
158-‘’మనో ధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం ‘’గ్రంధం రాసి భారత ప్రభుత్వం చేత ఫెలోషిప్ అందుకున్నారు .అనేక సభలలో ,సెమినార్లలో సంగీత విషయ పరిశోధన పత్రాలను సమర్పించారు ,సోదాహరణ ప్రసంగాలూ చేశారు .ముత్తు స్వామి దీక్షితుల విలక్షణత పై ప్రత్యేక పత్రం సమర్పించారు .’’షట్ కాల పల్లవి ‘’పై సోదాహరణ ప్రసంగం చేశారు .ఆమెకు వచ్చిన అవార్డులు ,రివార్డులు లెక్కలేనన్ని .ప్రతిభకు పట్టాభిషేకమే అవన్నీ .
159-అమెరికాలో చాలా రాస్ట్రాలలో కచేరీలు చేశారు .1984లో సంగీతం లో డిప్లమో ,1993లో మాస్టర్స్ చేసి సర్వ ప్రధమంగా నిలిచారు .
160-‘’వాగ్గేయ కారుల సంగీత ,సాహిత్య సౌరభాన్ని గాయకుడు తానుస్వయంగా అనుభవించి గానం చేస్తే ఆ వాగ్గేయకారుని అనుభూతి శ్రోతలకు చేరుతుంది ,కచేరీ అప్పుడే రక్తి కడుతుంది ‘’అంటారు సుధా రాణి .
161-అగ్రశ్రేణి గాయకులైన అరియ కుడి ,శెమ్మంగుడి వంటివారు రస ద్రుష్టి తో చేసిన కృషి వలన సంగీతం తరతరాలుగా వ్యాపిస్తూ ,భాషా ,ప్రాంతీయ తత్వాలకు అతీతంగా దక్షిణ దేశమంతా ‘’ఒకే సంగీత కుటుంబం ‘’గా నిలబడింది ‘’అన్నారు .బౌద్ధిక సంగీతం కంటే హార్దిక సంగీతం వైపు మొగ్గుతారు
19-ప్రయోగ శీలి శ్రీ వైజర్స్ సుబ్రహ్మణ్య౦
162- వైజర్స్ జానకీ, శేషగిరిరావు దంపతుల కుమారుడే శ్రీ బాల సుబ్రహ్మణ్యం .ఎన్నో ఏళ్ళ క్రితం శ్రీ నారు మంచి సుబ్బారావు గారు రచించిన పుస్తకం తప్ప ఆంద్ర సంగీతకారుల చరిత్ర మనకు లేదు. ఆ లోటు తీరుస్తూ బాల గారు ‘’తెలుగు సంగీత విద్వాంసులు ‘’పేరుతొ 200మంది కి పైగా వయోలిన్ ,గాత్ర,వీణవిద్వాంసుల చరిత్ర రాసి లోటు తీర్చారు .భార్య శ్రీమతి పావని తోకలిసి ‘’ప్రణవం ‘’పత్రికను నడుపుతూ మహోపకారం చేస్తున్నారు .
163-‘’భైరవి సంగీత అకాడెమి ‘’స్థాపించినెలకు వందమందికి పైగా సంగీత శిక్షణ నిస్తున్నారు .ఆడియో స్టూడియో తోపాటు విద్యార్ధుల కచేరికి వీలుగా చిన్న ఆడిటోరియం కూడా నిర్మించి ప్రోత్సహిస్తున్నారు .
164-సంగీతం లో ఎంత దక్షులో ,పరిశోధనలోనూ అంతే.’’సంగీత౦-భౌతిక శాస్త్రం ‘’అనే మోనోగ్రాఫ్ రాశారు .తిరు వెంకట కవి సంగీత సార సంగ్రహం ‘’పరిశోధన గ్రంధం రాసి ఏం .ఫిల్.పొందారు .’’అజ్ఞాత వాగ్గేయ కారులు ‘’పేరుతొ పరిశోధాత్మక డాక్యుమెంటరి శ్రీ వెంకటేశ్వర భక్తీ చానల్ కు చేసిచ్చారు .
20-బహుభాషా గాయని –శ్రీమతి ద్వారం లక్ష్మి
165-భగవద్దత్తమధురాతి మధుర కంఠ స్వరం తో ద్వారం భావనారాయణ ,వెంకట లక్ష్మి దంపతులకు జన్మించిన శ్రీమతి ద్వారం లక్ష్మి యెన్ సి ఇ ఆర్ టి లో శిక్షణ పొంది 14 భాషలలో పాడిన ఘనత సాధించారు .
166-ఏం ఎల్ వసంత కుమారి లక్ష్మిగారిని ఆవహించారా అన్నట్లు లక్ష్మిగారి గాత్రం ఉంటుంది .నేషనల్ టీచర్స్ కోర్ కు నాయకత్వం వహించి పార్లమెంట్ భవనం లో ప్రధాని సమ్ముఖం లో కార్య క్రమం చేశారు .భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంగా 20వేల మంది గాయకులతో కార్యక్రమాన్ని చేశారు .
మండా సుధా రాణి ద్వారం లక్ష్మి
సశేషం