ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -168
64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-2
ఏక కాలం లో జరిగిన సంఘటనలు ఒకరికి కనిపించినట్లుగా మరొక పరిశీలకుడికి కనిపించటం లేదు .ఉదాహరణకు ఒక గడియారం చూసేవాడికి దానికీ సాపేక్ష వేగం లో ఉన్నట్లయితే నెమ్మదిగా నడుస్తుంది అనిగమనించారు.ఇప్పుడు పొడవు కాలాలను మార్చే వీలు కలిగింది .ఈ రెండిటిని కలిపి ఐన్ స్టీన్ ‘’స్పేస్ టైం ఇంటర్వల్ ‘’ను గుర్తించి దూరం ,వ్యవధి చూపరులకు స్థిరంగా ఉంటుందని కనిపెట్టాడు .దీనివలన విశ్వం లోని స్థల,కాల సమస్యలు పరిష్కారమైనాయి .వీటన్నిటి వలన తేలిన విషయ౦ ఏమిటీ అంటే –అతి వేగంగా కదిలే ద్రవ్యరాశి తాను స్థిరంగా ఉన్నప్పటికంటే ఎక్కువ బరువుగా ఉంటుంది అని .ఈ ద్రవ్య రాశి మార్పు కాఫ్ మన్ శాస్త్రజ్ఞుని ప్రయోగాల వలన ద్రవ్యరాశి ,శక్తికి మధ్య ఉన్నప్రఖ్యాత ‘’ పరస్పర అంతర సంబంధం ‘’కు దారి చూపింది .
న్యూటన్ గారి ఫిజిక్స్ లో ఒక కదిలే వస్తువును తోస్తే ,ఆ తోపు దాని వేగాన్ని పెంచి ,దాని చోదక శక్తి (ఎనర్జిఆఫ్ ప్రొపల్షన్ )కదిలేవస్తువులో గతి శక్తిగా మారుతుంది .తోపులు ఎక్కువైతే స్పీడ్ కూడా ఎక్కువౌతుంది .దీనికి పరిమితి లేదు .కాని ఐన్ స్టీన్ .ద్రవ్య రాశిని వేగవంతం చేస్సినా స్పీడ్ కాంతి వేగాన్ని మించలేదు అని చెప్పాడు .దీనర్ధం –కాంతి వేగం దగ్గర ద్రవ్య రాసిపై ఇచ్చిన తోపు కొద్దిగా మాత్రమె స్పీడ్ పెంచటానికి తోడ్పడి ,మిగిలినది అంతా ఆ వస్తు ద్రవ్య రాశిని పెంచాటానికే తోడ్పడుతుంది .ద్రవ్య రాశిలో పెంపు ,ఇచ్చిన తాపు శక్తికి అనులోమానుపాతంగా ఉంటుంది .దీనినే ఐన్ స్టీన్ ప్రఖ్యాత సూత్రం E=mc2 అంటారు .ద్రవ్య రాసి అంతా కేంద్రీకృత శక్తి అనే అభిప్రాయాన్ని చెప్పాడు .ఇదొక విప్లవాత్మక సిద్ధాంతం .దీని అర్ధం –వస్తువులోని గుప్త శక్తి (లేటెంట్ ఎనర్జీ )E,దాని ద్రవ్య రాశి ,(M),కాంతి వేగం యొక్క వర్గం (స్క్వేర్ )తో C2తో హెచ్చి౦చగా వచ్చిన లబ్దానికి సమానం .ఇదే తర్వాత రేడియో యాక్టివ్ విచ్చిన్నానికి దారి చూపించింది .
క్యూరీల ఈ భావాలు ఎక్కువ ద్రవ్య రాశుల కోసం చేసే అన్వేషణకు దారి చూపింది .ఇదే అత్యంత శక్తికి నిలయమైన ఆటంబాంబు నిర్మాణానికి అవకాశం కల్పించింది .’’నేను అటామిక్ ఎనర్జీ విడుదల పిత ను కాను ‘’అని ఐన్ స్టీన్ చెప్పుకొన్నాడు .’’అటామిక్ వార్ ఆర్ పీస్ ‘’అనే తన గ్రంధం లో ఐన్ స్టీన్ ‘’అందులో నాపాత్ర పరోక్షమైనది .అంతటి మహా శక్తి నా జీవితకాలం లో విడుదల అవుతుందని నేను ఊహించలేక పోయాను .అది సిద్ధాంత రీత్యా సాధ్యం అనే నేను చెప్పాను .అకస్మాత్తుగా కనుగొన బడిన చైన్ రియాక్షన్ అది త్వరలోనే సాధ్యమైపోయింది .అయితే నేను చైన్ రియాక్షన్ ను ముందుగా ఊహించలేక పోయాను .’’అని రాశాడు .1939లో అమెరికా భౌతిక శాస్త్రవేత్తలు అమెరికా ఆర్మీ, నేవీ అధికారులను అటామిక్ ప్రాజెక్ట్ ప్రాధాన్యత ను గురించి ఒప్పించ లేక పోయారు .ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ కు ఐన్ స్టీన్ అణుశక్తి విస్మరించలేనిదని,ఒక ఉత్తరం రాశాడు .దీనితో శత్రు దేశమైన జర్మనీకంటే ముందే అటామిక్ బాంబ్ ను తయారు చేసే పనిలో అమెరికన్ సైంటిస్ట్ లు ముందడుగు వేశారు .ఇవన్నీ ఐన్ స్టీన్ పూర్వమే చెప్పిన స్పెషల్ రిలేటివ్ దీరీకి పుట్టిన కొమ్మలే .1915లో ఆయన చెప్పిన జనరల్ రిలేటివిటి యే విశ్వం పై ఉన్న అనేక భావాలను కొత్తగా ఆవిష్కరించింది .గణితంలో రోజు రొజుకూ ఆవిష్కా రమౌతున్న నూతన సిద్ధాంతాలు ,తన స్వంత సాంకేతిక పరిజ్ఞానాలతో ఐన్ స్టీన్ ‘’ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వివలేన్స్ ‘’అంటే సమానార్ధక సూత్రం ను సాధించాడు .దీనివలన గురుత్వాకర్షణ శక్తికి ,వేగ వృద్ధి లేక త్వరణం లకు మూల విభేదం లేదని తెలిసింది .’’కాని త్వరణం యొక్క శక్తి అసలు శక్తి కాదని ,ఒక కారు అకస్మాత్తుగా స్టార్ట్ ఆయే టప్పుడు,ఆగేటప్పుడు ,ప్రక్కలకు తిరిగేటప్పుడు దాన్ని అనుభవించగలం ,అదే కదలికల స్థితి లో మార్పు .అంతరిక్షం ధర్మాలు అతి పెద్ద ద్రవ్య రాశుల దాగ్గర మరిపోతాయిఅని ఐన్ స్టీన్ కనిపెట్టాడు .దీన్ని వంపు లేక వక్రత అన్నారు .ఇదే నాలుగవ పరమాణం (ఫోర్త్ డైమెన్షన్ ).ఇది న్యూటన్ చెప్పిన గురుత్వాకర్షణశక్తిని సమర్ధిస్తుంది .కాని సమీకరణం లో ఉన్న అదనపు పదం మనకు దగ్గరున్న సూర్యుడు లాంటి అతి భార వస్తువుల విషయమై కొద్ది తేడాలు కనిపించాయి . ఇదే సూర్యునికి దగ్గరున్న బుధ గ్రహ విషయం లో ఉన్న తేడాలను పరిష్కరించింది .
అంతరిక్ష లక్షణమైన గురుత్వాకర్షణ శక్తి అనుకొంటే ,అది ఒక శక్తి కాకపొతే ,కాంతి కూడా గురుత్వాకర్షణకు గురవ్వాలి ,కాంతి కిరణం గురుత్వాకర్షణ క్షేత్రం లోకి ప్రవేశిస్తే , అది తన దారి నుంచి ప్రక్కకు తొలగిపోతుంది లేక వంగుతుంది .ఇదంతా సాధారణ భౌతిక శాస్త్ర వేత్తలకు కల లాగా అనిపించింది .కాని ఐన్ స్టీన్ మాత్రం తన సిద్దాంతాన్ని ప్రయోగ పూర్వకంగా రుజువు చేయచ్చునని చెప్పాడు .సూర్యుని గురుత్వాకర్షణ లో ఉన్న ఒక నక్షత్రం యొక్క మార్గాన్ని పరీక్షించి చేసి చూడమని సలహా ఇచ్చాడు .సాధారణంగా నక్షత్రాలు రాత్రిపూట మాత్రమే కనిపిస్తాయి . కాని గ్రాహణం రోజున మాత్రమె నక్షత్రాలను సూర్యుడిని ఒకే సారి చూడగలం .ఈ విషయాన్ని గురించి ‘’ది యూనివర్స్ అండ్ డాక్టర్ ఐన్ స్టీన్ ‘’పుస్తకం లో లింకన్ బార్నెట్ ‘’గ్రహణం సమయం లో సూర్యుని నలుపు వైపునుంచితీసిన నక్షత్రాలఫోటోలను ,మిగాతాకాలం లోనినక్షత్రా ఫోటోలను పరీక్షించి చూడమన్నాడు .సూర్యుని చుట్టూ ఉన్న నక్షత్రాలనుండి వచ్చే కాంతి లోనికి అంటేసూర్యుని వైపుకుఆయన గురుత్వాకర్శనశక్తి క్షేత్రం ద్వారా ప్రయాణించినపుడు ఒంగుతుంది .భూమి మీది వీక్షకులకు అ నక్షత్రాల ప్రతి బింబాలు వాటి యదార్ధ స్థితి నుంచి బయటికి తొలగినట్లు కనిపిస్తుంది .ఐన్ స్టీన్ ఈ విక్షేపం (డిఫ్లేక్షన్ )యొక్క ప్రమాణం ను గణి౦చాడు.సూర్యుని దగ్గరున్న నక్షత్ర కాంతి విచలనం (డీవిఏషన్)1.75సెకన్లు అని ఖచ్చితంగా గుణించి చెప్పాడు .ఐన్ స్టీన్ చెప్పిన విషయాలను గుర్తించిన శాస్త్ర వేత్తలు ప్రపంచ వ్యాప్తంగా 29-5-1919 నాడు భూ మధ్య రేఖ పై చేరి ఫోటోలు తీశారు .వాటిని తర్వాత డెవలప్ చేసి పరీక్షించి చూస్తె సూర్య గురుత్వాకర్షణ క్షేత్రం లో నక్షత్ర కాంతి విక్షేపం సరాసరి 1.64 సెకనులు అని గణించి తెలిపారు .ఇది ఐన్ స్టీన్ ఊహించి చెప్పిన దానికి అతి దగ్గరలో ఉండటం విశేషం .ఆయనది ఊహ తో చెప్పింది .ఇది ప్రయోగాత్మకం గా రుజువు చేసి చెప్పింది .అంతటి మేధావి ఐన్ స్టీన్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-6-16-ఉయ్యూరు