ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -170

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -170

 64-మహా మేధావి ,సాపేక్ష సిద్ధాంత కర్త –ఆల్బర్ట్ ఐన్ స్టీన్-4(చివరిభాగం )

    75వ ఏట తాను  రాసిన అనుబంధం లో ‘’క్షేత్ర భావన సాధారణ సాపేక్ష సిద్ధాంతానికి తప్పని సరి .అటామిక్ శక్తి ప్రవర్తన గురించి వివరించటం చాలా కష్టమైన పనే .స0పూర్ణ విశ్వ సిద్ధాంతానికి రుజువులకోసం ఐన్ స్టీన్ ఉపయోగించిన సంకేతాలు (సింబల్స్ )గణితం లో తలపండిన వేత్తలకు  ప్రయోగాత్మకం గా రుజువు చేయటానికి సంవత్సరాల కాలం పడుతుంది .ఈ గణిత సూత్రాలను యంత్రాలకు అనువర్తింప జేయటానికి బుర్రలు బద్దలు కొట్టుకొవాల్సి వచ్చింది .అప్పటిదాకా ఐన్ స్టీన్ భావనలు సమాప్తం అని చెప్పటానికి వీలు లేదు .

  వయసు 75వచ్చే ముందే ఐన్ స్టీన్ ను ప్రపంచమంతా గుర్తించి గౌరవించింది .ఎశ్వివా యూని వర్సిటిలో  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ ఏర్పరచటానికి నిధుల సేకరనకోసం ఆయనతో డిన్నర్ పార్టీలు నిర్వహిస్తే అనేక మిలియన్ల డాలర్లు వర్షం లాకురిసింది . స్థల ,కాల శక్తులపై ఉన్న ప్రతి పాత భావనలన్నీతన మేధా సంపత్తి తో  మార్చేసిన మేధావి శాస్త్రజ్ఞుడు ఐన్ స్టీన్ ముసలి వాడై పోతున్నాడు .కాని అతి గౌరవాలకు అంగీకరించలేదు .ఊహా తీత భావనలతో చూసే ఆ కళ్ళు ఆశ్చర్య చకితులను చేసే మేధస్సున్న వాడు ‘’ఆబ్సేంట్ మైండ్ ప్రొఫెసర్ ‘’అని పించుకొన్నాడు .పండిన జ్ఞానంతో మరింత పండిన తెల్లని జుట్టు తో ఆయన ఒక రుషి తుల్యుడు అనిపించేవాడు .

   గణిత పజిల్స్ పై ఆసక్తి ఎక్కువ ఆటలపై ఆసక్తి లేదు. అసలు చదరంగం ఆట గురించే తెలియదు .గుర్రపు పందాలు ఎరుగడు .బాస్కెట్ బాల ఫుట్ బాల ఆటలు చూసేవాడు కాదు .బోటింగ్ అంటే మహా ఇష్టం .ఆయన అనుభవజ్ఞుడైన  నావికుడు .ఆయనకు అమితాసక్తి కలిగించే ఆట ఒక్కటే ఉంది అదే నడక . క్లై౦బింగ్ అసలు ఇష్టం లేదు .పర్వతాలను చూడగానే నిరుత్సాహం వస్తుంది .అవి తనపై పడతాయేమో ననుకోనేవాడు .పైప్ తాగటం మహా ఇష్టం .విడతలు విడతలుగా తాగటం ఇష్టం .పుస్తకాలు చదవటం మహా ఇష్టం .సైన్స్ తర్వాత ఆయనకు అమితాసక్తి కలిగించింది చరిత్ర ,జీవిత చరిత్రలు ,వ్యాసాలుమాత్రమే .మంచి చిత్రాలు అంటే బాగా ఇష్టం కాని వాటిని కొని సేకరించలేదు .మత సంబంధ కార్యాలకు వెళ్ళే వాడు కాదు .ధర్మందానం ఇష్టమే .నెత్తిన కాప్ పెట్టుకొని యూదుల ప్రార్ధనలలో వయోలిన్ వాయించేవాడు .

    మతానికున్న ప్రాముఖ్యతను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడలేదాయన .ఫిలాసఫర్ ,ఫిజిసిస్ట్ కూడా అయిన ఐన్ స్టీన్ భౌతికత ఆది భౌతికత ల మధ్య విభజన రేఖ గీయలేము అని చెప్పాడు .’The most beautiful thing we can experience is the mysterious .It is the source of all true art and science .To know that what is impenetrable to us really exists manifesting itself as the highest wisdom and the most radiant beauty which our dull faculties can comprehend only in the most primitive forms –this knowledge ,this feeling ,is at the center of true religiousness .In this sense I belong in the ranks of devoutly religious men ‘’అని స్పష్టం చేశాడు .ఐన్ స్టీన్  విశ్వాసానికి ,సైన్స్ కూ సంబంది౦చి నవాడే అయినా ‘’సైంటిఫిక్ రిసెర్చ్ కి విశ్వ మత అనుభవం అతి శక్తివంతమైన ,ఉన్నత మైన ముఖ్య సూత్రం ‘’అంటాడు .విశ్వ రహస్యాలను శోధించి చెప్పిన మహా తత్వ వేత్త లందరూ ఆయనకు ఇస్టులే అయినా ముఖ్యంగా స్పినోజా అంటేమరీ ఆరాధన .అతనిది ‘’జామేట్రిక్ ఫారం ఆఫ్ ఆర్గ్యు మెంటేషన్ ‘’అని సంతోషిస్తాడు .ఈ డచ్ ఫిలాసఫర్ ఆలోచనలే తనను పదార్ధం శక్తి ఒకటే అనే సూత్రం కనిపెట్టటానికి తోడ్పడింది అన్నాడు .స్పినోజాలో ఆలోచన ,దాని విస్తృతి అనే భావన ఉత్తమం గా ఉంది .ఒకే వస్తువు వివిధ రూపాలలో కనిపిస్తుంది ఆయన చెప్పింది గొప్ప విషయం అన్నాడు .నిత్య జీవితం లో ఓర్పు చాలా ముఖ్యం అనేవాడు .దానికి తోడు ఆరోగ్యకరమైన హాస్యం అవసరం అన్నాడు .’’We scientists will not change the hearts of other men by mechanism ,but by changing our own hearts and speaking bravely .We must be generous in giving to the world the knowledge we have of the forces of nature ,after establishing safe guards against abuse .We must realize  can not simultaneously plan for war and peace . When we are clear in hearts and mind –then only shall we find courage to surmount the fear which haunts the world ‘’అన్న దార్శనికుడు ఐన్ స్టీన్ .

  కొద్ది కాలం చిన్న అనారోగ్యానికి గురై ,76వ ఏట రక్తనాళాలు గట్టిపడి పగిలి 18-4-1955న మహా మేధావి శాస్త్ర వేత్త ఐన్ స్టీన్ మరణించాడు .ఆయనకు అత్యుత్తమ నోబెల్ బహుమతితోపాటు లెక్కలేనన్ని పురస్కారాలు లభించాయి .30కి పైగారచనలు చేశాడు .ఆయన అనేక సినిమాలు నవలలు నాటకాలు సంగీతానికి స్పూర్తి .’’మాడ్ సైంటిస్ట్ ‘’,ఆబ్సేంట్ మైండెడ్ ప్రొఫెసర్ ‘’పాత్రలకు ఆదర్శం కూడా .ఆయనకు ప్లంబరింగ్ బాగా వచ్చు .ప్లంబర్ అండ్ స్టీం ఫిట్టింగ్ యూనియన్ లో  సభ్యుడయ్యాడు కూడా .1912నుంచి 1955వరకు ఆయన జరిపిన3 ,500 ఉత్తర ప్రత్యుత్తరాలు హీబ్రూ యూని వర్సిటి ఆర్కైవ్స్ లో చూడచ్చు .ఐన్ స్టీన్ కు నీల్స్ బోర్ శాస్త్ర వేత్తకు మధ్య అనేక వాదోపవాదాలు క్వాంటం మెకానిక్స్ పై జరిగాయి .అవి ఫిలాసఫీకి ,సైన్స్ కు బాగా ఉపయోగ పడ్డాయి .ఐన్ స్టీన్ ,రోడో వస్కి-రోజెన్ పారడాక్స్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది .

  1926లో ఒక స్టూడెంట్ తో కలిసి ‘’ఐన్ స్టీన్ రిఫ్రిజిరేటర్ ‘’కనిపెట్టాడు .దీనికి 19 30లో పేటెంట్ పొందాడు .స్క్రాడిన్జర్కు సలహా ఇచ్చి ‘’బోస్ ఐన్ స్టీన్ గాస్ ‘’తయారు చేయించాడు .సెకండ్ క్వాన్టై జేషన్ తో స్క్రాడిన్జర్ ‘’ధర్మో డైనమిక్ ‘’సూత్రాలను సాధించాడు .మాగ్నేటిజంలో ఐన్ స్టీన్   డీ హాస్స్ ప్రయోగం ప్రసిద్ధమైనది .

  Inline image 3Inline image 4Inline image 1  Inline image 2

             సశేషం

    మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-6-16-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.