ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -171
65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్
ఆయన అనుయాయులు ‘’మా తండ్రి ‘’’’మాజీవిత సూర్యుడు ‘’అంటూ దేవుడని ,సర్వజ్ఞుడని ,సర్వ శక్తి వంతుడని ,తప్పు చేయని మొనగాడని ‘’అంటారు .ఆయన వ్యతిరేకులు ‘’క్రూర మేధావి ,మనస్సాక్షి, యోగ్యతా లేని అయోగ్యుడని ,అమానుష వ్యక్తీ అని ,దయలేని మాకి విల్లీ అని ,చేసిన వాగ్దానాల ను ,నమ్మిన వారిని నట్టేట ముంచే రకమ’’ని అంటారు .ప్రపంచం లో చాలా మందికి 80కోట్లకు పైగా జనాల భవిష్యత్తును చేతుల్లో పెట్టుకొని,చరిత్రలో యే నాయకుడూచలాయించని విశేషాధికారాలను చలాయించి చర్చిల్ చెప్పినట్లు ‘’అస్పస్టత లో చుట్టబడిన రహస్యం ‘’(ఎ మిస్టరిరాప్పేడ్ ఇన్ ఎనిగ్మా )అయిన వాడు ఇనుప తెర అని పిలువ బడిన సోవియెట్ యూనియన్ కు ఉక్కు నియంత జోసెఫ్ స్టాలి న్.
రష్యాలో చిన్న జార్జియాలోని గోరి గ్రామం లో 21-12-1879 న జన్మించాడు .అసలు పేరు ‘’జోసెఫ్ విస్సారియోనోవిచ్ జుగాష్వి లి .వంశం సనాతనమైనదే అయినా కలగా పులగం .తండ్రి చదువులేని చెప్పులు కుట్టేవాడు .ఎప్పుడూ తాగి తందనాలడుతూ కొడుకును చితక్కోట్టేవాడు .తల్లి భక్తురాలైన చాకలి .తన గారాబు బిడ్డ ‘’జో జో ‘’ప్రీస్ట్ అవాలని కోరుకొనేది .చాలా ఎక్కువ కష్టపడుతూ కొడుకును ఒక చర్చి స్కూల్ లో చేర్చింది .అతనికి 15ఏళ్ళు రాగానేస్టాలిన్ కి టిఫ్ఫ్లిస్ దియోలాజికల్ సేమిటరి లో స్కాలర్షిప్ సాధించింది .అక్కడే నాలుగేళ్ళు చదివాడు .చర్చిలో ప్రార్ధన భక్తితో భావోద్విగ్నంగా పాడుతుంటే గొంతు వణికేదఅని కొందరు రాస్తే , .ఇది అబద్ధం అని రికార్డ్ లు తెలియ జేశాయి .కాని’’ కరకు వీధి రౌడీ రాజు ‘’అని ,బయటి నుంచి వచ్చిన నిషేధించిన సాహిత్యాన్ని ఇష్ట పడి చదివే వాడని ఒక కదఉంది .మరొక దాని ప్రకారం ‘’లిటరరీ ఇవల్యూషన్ ఆఫ్ ది నేషన్స్ ‘’ను చర్చి మెట్ల పై కూర్చునిచదివేవాడని , అలాంటివి చదువుతున్నట్లుగా 13సార్లు గమనించినట్లు రికార్డ్ ఉంది . సేమిటరి లో సోషలిస్ట్ ఉద్యమ భాగమైన ‘’సీక్రెట్ సోసైటీ ‘’సభ్యుడయ్యాడు .అధికారుల పై తిరగబడి నందుకు స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు స్టాలిన్ ను .
కుటుంబం తో సంబంధాలు తెంచుకొని టిఫ్లిస్ అబ్సర్వేటరిలో నైట్ డ్యూటీ చేస్తూ స్వంత కాళ్ళపై నిలబడ్డాడు .పగటి పూట రైల్వే ,రవాణా వర్కర్లకు మార్క్సిస్ట్ సిద్ధాంతం పై అవగాహన కల్పింఛి వారిని సంఘటిత పరచేవాడు . .21ఏళ్ళు రాక ముందే ఒక ఒక ప్రదర్శనలో పాల్గొని కోసాక్ ల చేత అడ్డు కో బడ్డాడు .రహస్య స్థావరాలలో దాక్కొని తనను ‘’కోబా ‘’అనేజార్జియన్ పౌరాణిక హీరో పేరుతొ పిలిపించుకోనేవాడు. 22ఏట సోషల్ డెమోక్రాటిక్ లేబర్ పార్టీ కమిటీ సభ్యునిగా ఎన్నికయ్యాడు .బేటం వెళ్లి ఆయిల్ వర్కర్లు చేసే సమ్మెలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు .లెనిన్ రాసిన ఇస్క్రా (ది స్పార్క్ )పుస్తకాన్ని దొంగ చాటుగా తెప్పించుకొని జైలు లో మార్క్స్ ను అతని సిద్ధాంతాన్ని లెనిన్ అమలు పరచిన తీరును అధ్యయనం చేశాడు .పార్టీ బోల్షేవిక్కులు అనే వామ భావాలున్నవారు ,మితవాదు లైన మెంషెవిక్కులు గా చీలినప్పుడు లెనిన్ ను,అతని అతివాదులను సమర్ధించాడు .ఆ తర్వాత 12ఏళ్ళలో 6సార్లు జైలుకు వెళ్ళాడు .అరెస్ట్ అయిన ప్రతిసారి ఏదో రకంగా తప్పించుకొని బయటకు రావటం మళ్ళీ ఉద్యమకార్యం లో పని చేయటం జరిగేది .ఒక సందర్భం లో విప్లవ కార బృందానికి నాయకత్వం వహించి రెండు కారేజీలలో వస్తున్నా ప్రభుత్వ ధన౦340 000రూబుళ్ళ ను కైవశం చేసుకొని బోల్షెవిక్ పార్టీకి అందజేశాడు .వయసు ఇరవైలలో ఉండగానే అతని భౌతిక ఆకారానికి ,ధైర్య సాహసాలకు ,సిద్ధాంత నిబద్ధతకు అందరూ మెచ్చి అతన్ని ఉక్కు మనిషి –అంటే స్టాలిన్ అన్నారు. అదేఆయన పేరై పోయింది .30వ ఏట జారిస్ట్ రాజుల పాలన లో రాజకీయ ఖైదీ గా ఉండిరెండు వరుసలలో ఉన్న సైనికుల మధ్య ఒకే లైన్ లో ఆయనా, ఆయన అనుచరులనూ బలవంతంగా నడి చేట్లు చేసి రైఫిల్ బట్స్ తో కుళ్ళ బొడిచారు .దీన్ని సవాలుగా తీసుకొని సైన్యం వేగం గా వెళ్ళమన్నా ఉక్కు హృదయం తో గట్టిగా నిలబడి అతి నెమ్మదిగా కదులుతూఉంటే, వాళ్ళు కింద పడేట్లుచేసి విపరీతంగా దెబ్బలతో రక్తంకారేట్లు హింసించి తల పగిలేట్లు చేస్తే నేల మీద పడిపోయి,నిజంగానే ఉక్కుమనిషి అంటే స్టాలిన్ అనిపించుకొన్నాడు .ఇంతటి నిబద్ధతను తన అనుచరులు అలవరచుకోవాలని స్టాలిన్ అభి మత౦ .వారు అలాంటి స్పందన కలిగించక పొతే మహా క్రూరంగా ప్రవర్తించేవాడు .
జైలు నుంచి జైలుకు మాతుతూ ‘’ప్రావ్డా’’పత్రిక పెట్టటానికి తోడ్పడ్డాడు .అదే బోల్షేవిక్కుల అధికార పత్రిక అయింది .1912లో కామ్రేడ్ వేషం లో ఉన్న ప్రభుత్వ గూఢచారి మాలినోవ్ స్కి చేత మోసగింప బడి మళ్ళీ అరెస్ట్ అయి సైబీరియాకు పంపబడ్డాడు .అక్కడ యే రకమైన సమాచార వ్యవస్థాలేదు .ఇక స్టాలిన్ పని అయి పోయినట్లే అని అందరూ అనుకొన్నారు .మొదటి ప్రపంచ యుద్ధం రష్యన్ నిరంకుశత్వం ఎక్కువ కాలం నిలబడలేడనే ఆశ చిగురింప జేసింది .కాని 1917లోరష్యా విప్లవం జరిగి ,ప్రాంతీయ ప్రభుత్వమేర్పడి ,స్టాలిన్ తో పాటు మిగిలిన రాజ కీయ ఖైదీలను విడుదల చేస్తే కాని, ఆయన ఆశలు నెరవేరలేదు . 40ఏళ్ళ వయసులో జర్మనీ మీదు గా పెట్రోగ్రాడ్ వచ్చి,అమెరికా నుంచి వచ్చిన ట్రోట్ స్కి తోకలిసి లెనిన్ తో చేతులు కలిపాడు .ట్రోట్ స్కి లెనిన్ కు బాగా ఇష్టుడు .బాగా చదువుకొన్నవాడు మహా వక్త ,రచయితగా చాతుర్యం ఉండటం తో లెనిన్ అభిమానాన్ని సంపాదించాడు స్టాలిన్ ను యుద్ధ రంగానికి పంపారు .అక్కడక్లాస్ విజ్ ను అధ్యయనం చేసి ,ప్రష్యన్ సేనాని యుద్ధ తంత్రాన్ని అలవరచుకొని కౌ౦టర్ రివల్యూషన్ ను అణచేశాడు .
1922లో లెనిన్ కు మొదటి సారి గుండె జబ్బు వచ్చినప్పుడు స్టాలిన్ ట్రోట్ స్కి లమధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకొన్నాయి .రె౦డేళ్ళతర్వాత లెనిన్ మరణం తో విభేదాలు తారా స్థాయికి చేరాయి .స్టాలిన్ సమర్ధత ,నిశ్చయ నిర్ధారణను లెనిన్ నమ్మినా అతని లక్ష్యాన్ని నమ్మలేకపోయాడు .తన విల్లు లో లెనిన్ ‘’కామ్రేడ్ స్టాలిన్ పార్టీకి జనరల్ సెక్రెటరీ గా ఉండి,అధికారాన్ని అంతా హస్త గతం చేసుకొన్నాడు .కాని ఆ అధికారాన్ని ఎలా సద్వినియోగం చేయవచ్చో అతనికి తెలియదు .అతను చాలా క్రూర మోటు మనిషి .అతని తప్పుల్ని సమర్ధించ లేను .అతనిని తప్పించమని పార్టీ సభ్యులని కోరుతున్నాను .అతని స్థానం లో విధేయుడు ,నెమ్మదైనవాడు,చ౦చలత్వ౦ తక్కువగా ఉన్న మరొకరిని నియమించండి .కామ్రేడ్ ట్రోట్ స్కి ఇవన్నీ కలిగి ఉన్న వాడని ,పార్టీ ప్రెసిడెంట్ కు సమర్ధుడని ,ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తీ అని ,నిర్వహణ బాధ్యత బాగా ఉన్నవాడని నా నమ్మకం ‘’అని రాశాడు .
లెనిన్ మరణానంతరం స్టాలిన్ ,జినోవీవ్ ,కామేనోవ్ అనే త్రయం ఏర్పడింది .ట్రోట్ స్కి కి ఇందులో చోటు లేదు .కాలం గడుస్తున్న కొద్దీ స్టాలిన్ ఒక గ్రూప్ ను మరొక గ్రూప్ పై ఉసి గొలుపుతూ వినోదం చూస్తూ ట్రోట్ స్కి సమ్మతిని విస్మరించాడు .చాలా బలీయమైనచురుకైన రాజకీయ వేత్త గా , నాయకుడై తనను ఎవరూ ధైర్యంగా ఎదిరించ లేని పరిస్థితి కలిగించాడు .ట్రోట్ విస్కీ ప్రపంచ వ్యాప్త విప్లవం వస్తుందని కలలు కంటున్నాడని అది అసాధ్యమని ,అన్ని విప్లవాత్మక ప్రయత్నాలు ఒక్క దేశం యొక్క సోషలిజం వల్లనే సాధ్యమనీ జనాలకు చెప్పి ఒప్పించాడు .ఆ దేశమే రష్యా అన్నాడు . ట్రోట్ స్కి కి అర్ధమై పోయింది స్టాలిన్ వ్యక్తీ గత సుగుణాలతో కాకుండా అవ్యక్త యంత్ర సామర్ధ్యం తోపూర్తీ అధికారాలను గుప్పిట్లో పెట్టు కొన్నాడని గ్రహించాడు .’’స్టాలిన్ ఆయ౦త్రాన్ని తయారు చేయలేదు,కాని దాన్ని స్వాధీనం చేసుకొన్నాడు ‘’అని’’స్టాలిన్ –యాన్ అప్రైసల్ ఆఫ్ ది మాన్ అండ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ‘’పుస్తకం లో రాశాడు ట్రోట్ స్కీ . మనిషిని తెలివి తేటలతో దగ్గరకు చేర్చు కోడనీ ,నీచ నికృష్ట ,హేయ నీతి బాహ్య విధానాలతో లొంగ దీసుకొంటాడనీ కూడా రాశాడు .బానిసత్వ దేశాన్ని విమోచనం చేయటానికి ఎంతో కృషి చేసిన ట్రోట్ స్కి ని దేశ బహిష్కరణ చేశాడు స్టాలిన్ .12ఏళ్ళ తర్వాత ట్రోట్ స్కి మెక్సికో లో హత్య చేయబడ్డాడు .ఇనుప తెర రష్యాలో ఉక్కు మనిషి స్టాలిన్ పాలన ప్రారంభమైంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-6-16-ఉయ్యూరు