ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173 65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -173

65-ఇనుపతెర ఉక్కు నియంత జోసెఫ్ స్టాలిన్ -3(చివరి భాగం )

 

 

అన్ని అధికారాలుస్టాలిన్ హస్తగతం  అయ్యాయి .సోవియెట్ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో సంవత్సరానికి నాలుగు సార్లు పార్టీ మీటింగులు జరిగేవి .1925నుంచి 1939వరకు ఉన్న 14ఏళ్ళలో నాలుగు మీటింగ్ లే జరిగాయి .1939తర్వాత అసలు జరగనే లేదు .దేశ స్థిరత్వానికి స్టాలిన్ విపరీతంగా ప్రచారం నిర్వహించాడు .స్టాలిన్ కు  కమ్యూనిజాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశ్యం కంటే ప్రపంచానికి రష్యా నాయకత్వం కావాలని ప్రయత్నించాడు ..కార్పతో యుక్రెన్ రష్యాలో కలిసిపోయాక పోలాండ్ ,హంగేరి ,యుగోస్లోవియ బల్గేరియా జేకోస్లోవేకియాలు స్టాలిన్ నియంత్రణ లోకి వచ్చాయి .ఈ దేశాలలోని నాన్ కమ్యూనిస్ట్ పార్టీ లన్నిటి అస్తిత్వాన్ని దెబ్బతీశాడు .ఈ’’సాటిలైట్’’దేశాలను గ్రిప్ లో ఉంచుకోవటానికి కొంత హింస తప్పలేదు ,జెకోస్లోవేకియా విషయం లో ఇదే జరిగింది .1948లో మార్షల్ టితో స్టాలిన్ తో విభేదించి ఆ దేశం కమ్యూనిస్ట్ దేశమే అయినా క్రెమ్లిన్ ఆదేశాలను ‘’బే ఖాతర్’’ చేసింది.ఈ దేశాలు జారిపోకుండా ఉండటానికి   స్టాలిన్ ఆ దేశాదిపతుల మాట వినాల్సిన్దేనన్నాడు .ఇప్పటి దాకా ప్రాముఖ్యమున్న అగ్రశ్రేణి కమ్యూనిస్ట్ నాయకులైన రుమేనియా లోని అన్నా పాకేర్ ,జెక్ లోని స్లాన్కీ ,పోలాండ్ లోని గోముల్క హన్గేరిలోని రాజ్క్ బల్గేరియాలోని కొస్తోవ్ లను ప్రక్షాళనం చేశాడు .

   ఈ రకమైన అననుకూల పరిస్థితులు ‘’కోల్డ్ వార్ ‘’ప్రచ్చన్న యుద్ధానికి దారి తీశాయి .స్టాలిన్ అందుబాటులో ఉండక ,అవిధేయుడుగా ఉండిపోయాడు .మార్షల్ ప్లాన్ లో భాగ స్వామి కాలేదు .తన దేశానికి ఆర్ధిక సాయం చాలా అవసరం .ఎన్నో ఫాక్టరీల అస్తిత్వం ప్రశ్నార్ధక మౌతోంది .యుద్ధాలవల్ల నిత్యావసర వస్తువులు దొరకటం లేదు దొరికినా విపరీతమైన ధరలతోజనం అల్లల్లాడి పోతున్నారు .వ్యవసాయ ఉత్పత్తి అడుగంటింది .కాని రష్యా అద్భుతమైన విమానాలు ,సబ్ మేరీన్లు ,జెట్ యుద్ధ విమానాలు ,గైడెడ్ మిసైల్ ,అటామిక్ ,హైడ్రోజెన్ బాంబ్ లను తయారు చేసింది .పశ్చిమ దేశాలు దీన్ని వ్యతిరేకించాయి నిరసనలు తెలిపాయి .శాంతి సమావేశం స్టాలిన్ కు ఇస్టం లేదు .’’sincere diplomacy is no more possible than dry water or iron wood ‘’అన్నాడు .’’హౌ రష్యా ఈజ్ రూలేడ్ ‘’అనే పుస్తకం లో మిర్లీ ఫైన్సాడ్’’పార్టీలో  నాయకుల మధ్యఉన్న  పరస్పర ద్వేషం ,పార్టీ నాయకత్వం పై అవిశ్వాసం ,రహస్య పోలీస్ దళం ,పాలనా వ్యవస్థ ,సైన్యం పారిశ్రామిక నిర్వహణ స్టాలిన్ కు కలిసి వచ్చాయి .పార్టీలోని గ్రూపులు తోలు బొమ్మలాట వంటివికావు చాలా శక్తి వంతమైనవి .వీటిని నిర్వీర్యం చేసి పాలించాడు స్టాలిన్ .మరొక ఆయన ‘’Stalin’s workers state was a combination of the economic exploitation of early capitalism with the political terror of modern totalitarianism ‘’అని స్టాలిన్ పాలన లోని రష్యా గురించి అన్నాడు .రష్యా ప్రజలకు స్టాలిన్ పాలనకు మధ్య స్పష్టమైన విలక్షణత ఉంది .దీన్ని వివరిస్తూ స్టీవెన్ ‘’the problems created in a decent people by the forced maintenance of power will some how in the end destroy that power ‘’అని హెచ్చరించాడు .

  ‘’అధికారం అవినీతి కి నిలయమౌతుంది .పూర్తీ అధికారం పూర్తీ అవినీతికి నిలయమౌతుంది ‘’అని ఎప్పుడో లార్డ్ యాక్టన్  చెప్పాడు .స్టాలిన్ సర్వాధికారి అయ్యాడు .స్టాలిన్ చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాడు .స్టాలిన్ రెండో అభిప్రాయానికిఅవకాశం , విలువ ఇవ్వలేదు .విరుద్దాభిప్రాయమేర్పడితే దాన్ని ఫిరాయింపు అని ముద్ర వేసేవాడు .వారితో బహిరంగంగా క్షమాపణ చెప్పించేవాడు .కళ సంగీతం సాహిత్యం స్టాలిన్ దయా దాక్షిణ్యాల మీదనే ఆధారపడ్డాయి ఆయనకేవారు నచ్చితే వారికి సత్కారం .’’state is not meant to be of service to the individual ,but that ,on the contrary man was meant to serve the state’’అన్నది స్టాలిన్ అభిప్రాయం .

  70వ ఏడు వచ్చేసరికి స్టాలిన్  వ్యక్తీ నిష్ట పూర్తిగా పెరిగింది .ప్రతి మ్యూజియం ,ప్రభుత్వ ప్రతి బిల్డింగ్ అందులోని  , ప్రతిగది అయన చిత్రపటం వేలాడేట్లు చేసుకొన్నాడు .ఆయన విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టించుకొన్నాడు ప్రతిస్కూల్ లోనూ ఆయన విగ్రహాలను విద్యార్ధులు చూసేట్లు ఏర్పాటు చేశాడు .ఆయన ఉద్దేశ్యం ఎక్కడ చూసినా స్టాలిన్ కనపడాలి ,ఆయన దృష్టికి రాని విషయం ఉండ కూడదు అని .ప్రపంచ జనాభాలో మూడవ వంతు ఉన్న రష్యా కు ఆయన సర్వాధికారి .కనుక ఆయన్ను అందరూ పొగడాలి .మెచ్చుకోవాలి .ఆప్రజల భాగ్య విధాత స్టాలిన్ అని అబ్బుర పడాలి .1953లో స్టాలిన్ కు మొదటి సారి గుండెపోటు వచ్చింది. దాన్ని రహస్యంగా ఉంచి అత్యధిక శ్రద్ధతో మందులతో నివారించారు .రెండవ సారి వచ్చింది బ్రెయిన్ హేమరేజ్ కు దారి తీసి చావు ముంగిట్లోకి వెళ్ళాడు .శక్తి వంతమైన వైద్య విధానాలేవీ పని చేయలేదు .నాలుగు రోజుల తర్వాత రక్త ప్రవాహం క్షీణించి 5-3-1953న నియంత స్టాలిన్ మృత్యు కౌగిలి చేరాడు .74వ ఏడు రాకుండానే ,29 ఏళ్ళు అధికారం చెలాయించి స్టాలిన్ మరణించాడు ..

    రష్యాలో స్టాలిన్ కంట్రోల్ లో సైన్స్ టెక్నాలజీ ఆర్ట్,సాహిత్యం అన్నీనడిచాయి .అగ్రానమిస్ట్ త్రోఫిం లిసేంకో మాటలకు విలువ ఇవ్వక ,మాన్దేలిన్ జెనెటిక్స్ ను కాదని లేమేర్కియాన్ ఇంహేరిటేన్స్ కు ప్రాధాన్యమిచ్చి హైబ్రేడేషన్ ను ప్రోత్సహించాడు .బయాలజీ పై పూర్తీ అవగాహన లేనందున రష్యా వ్యవసాయ ఉత్పత్తి బాగా తగ్గిపోయింది .సైంటిస్ట్ లందరూ వ్యతిరేకించి వీధిపోరాటం చేశారు. ఆధునిక జెనెటిక్స్ మార్గ దర్శి నికోలాయ్ వావిలోవ్ తో సహా అరెస్ట్ చేసి అంతం చేశాడు .

   మగపిల్లలతో సమానంగా ఆడపిల్లకు ఉచిత విద్య ,ఉద్యోగం సంక్షేమం కల్పించాడు .ఆరోగ్య రక్షణ కల్పించి జీవన పరిమితి పెంచాడు .టైఫాయిడ్ ,కలరా మలేరియాలు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకొన్నాడు .వందలాది విదేశీ ఇంజనీర్లను ఆహ్వానించి దేశ పురోభి వృద్ధిలో భాగ స్వాములను చేశాడు .స్త్రీ సంక్షేమాన్ని పకడ్బందీ గా అమలు చేశాడు .స్త్రీలు హాస్పిటల్ లో కనే ఏర్పాటు చేసి ,సకల సౌకర్యాలు కల్పించాడు .రవాణా సౌకర్యాలు వృద్ధి చేసి అనేక కొత్త రైలు మార్గాలు నిర్మించాడు .రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా మహిళ అన్నిటా అగ్ర గామి అయింది .

  పుట్ట్టుక తో జార్జియన్ అయినా రాజకీయం లో ఆరితేరి రష్యన్ జాతీయతనే అనుసరించాడు .రష్యా చరిత్ర,సంస్కృతీ నాయకుల వారసత్వాలను ను నిలబెట్టాడు . రష్యేతర మైనారిటీలకంటే రష్యా ప్రజలు పెద్దన్నయ్యలు అనేవాడు .పెయింటింగ్ శిల్పం సంగీతం ,సాహిత్యాలలో అప్పటిదాకా వ్యాపించిన  ఎక్స్ పెరి మెంటలిజం  ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్ మొదలైన వాటిని నిరుత్సాహ పరచి ‘’సోషలిస్ట్ రియలిజం’’ కు ప్రాదాన్యమిచ్చాడు .ఆయనకు బహు ఇష్టమైన నవల ‘’ఫారో ‘’.జార్జియన్ సాంప్రదాయ కుటుంబం లో జన్మించినా మతాన్ని కాదని ఎదీస్ట్ అయ్యాడు .ప్రభుత్వమూ దీనినే ప్రోత్సహించింది .మత సంబంధ కట్టడాలను ప్రోత్సహించలేదు .1945 ,48లలో రెండు సార్లు స్టాలిన్  నోబెల్ బహుమతి కి నామినేట్ అయ్యాడు .కాని రాలేదు .

   మూడు లక్షల పోలిష్ ప్రజలను బందీలను చేసి అందులో 25వేలమందిని చంపేశాడు .యుద్ధానికి చెందిన అనేక వివాదాస్పద ఆర్డర్లు జారీచేశాడు .జపాన్ చేతుల్లోంచి కొరియాను స్వాధీనం చేసుకొన్నాడు .స్టాలిన్ కు మావో కు విభేదాలు౦ డేవి.స్టాలిన్ చాగ్ కై షేక్ ను సమర్ధించాడు .చియాంగ్ ను మావో ఓడించాక స్టాలిన్ మావో ను సమర్ధించాడు .ఇస్రాయిల్ ఏర్పాటును బాగా సమర్ధించి ,అక్కడ ప్రభుత్వం ఏర్పడగానే దాన్ని మొదటి సారిగా గుర్తించాడు .గోల్డా మేయర్ మొదటి విదేశాంగ మంత్రిగా రష్యాలో పర్యటించింది .జెక్ ద్వారా ఇస్రాయిల్ కు ఆయుధ సామగ్రి అందించి ,తర్వాత’’ తూ నా బొడ్డూ ‘’అన్నాడు .రష్యా ప్రచ్చన్న యుద్ధం పై వచ్చిన ‘’ఫాల్సి ఫయర్స్ ఆఫ్ హిస్టరీ ‘’పుస్తకాన్ని ఎడిట్ చేసి కొంత తానూ అందులో రాశాడు . At the end of May 1945, Stalin proposed a victory toast to the Soviet people, and to the virtues of the Russian majority in particular:

I should like to propose a toast to the health of our Soviet people, and in the first place, the Russian people. (Loud and prolonged applause and shouts of ‘Hurrah!’)

I drink in the first place to the health of the Russian people because it is the most outstanding nation of all the nations forming the Soviet Union.
I propose a toast to the health of the Russian people because it has won in this war universal recognition as the leading force of the Soviet Union among all the peoples of our country.
I propose a toast to the health of the Russian people not only because it is the leading people, but also because it possesses a clear mind, a staunch character, and patience.[283]

   అని విక్టరీ టోస్ట్ తీసుకొన్నాడు .

    స్టాలిన్ చనిపోయాక ఏర్పడిన ‘’కిస్సా కుర్సీ కా ‘’ఆటలో ఎందరో పోటీ పడినా చివరికి1958లో పూర్తీ అధికారాలను దక్కి౦చు కోన్నవాడు కృశ్చెవ్ .’’మర్డరస్  టిరంట్ ‘’అని రష్యా ప్రజలు స్టాలిన్ ను అన్నా ఇప్పటికీ ఆయనకు వోటు వేసేవారి శాతం 35 ఉంది అంటే ఆశ్చర్య మేస్తుంది .2008 లో రష్యన్ టెలివిజన్ నిర్వహించిన ‘’నేం ఆఫ్ రష్యా ‘’పోటీలో స్టాలిన్ మూడవ వ్యక్తిగా ఎంపికయ్యాడు .

   తాను తాగుతూ చుట్టూ ఉన్న వాళ్ళతోబలవంతంగా  తాగించటం స్టాలిన్ వేడుక .రష్యన్ వోడ్కా కంటే జార్జియన్ వైన్ ఇష్టపడే వాడు .స్టాలిన్ కు అమెరికన్ కౌ బాయ్ సినిమాలు చాలా నచ్చేవి అని కృశ్చెవ్ చెప్పాడు .స్టాలిన్ పొందిన బిరుదులూ చాలా ఉన్నాయి అందులో కొన్ని –హీరో ఆఫ్ ది సోవియెట్ యూనియన్ ,హీరో ఆఫ్ ది సోషలిస్ట్ లేబర్ ,ఆర్డర్ ఆఫ్ విక్టరి ,ఆర్డర్ ఆఫ్ లెనిన్ ,మెడల్ ఫర్ విక్టరి ఓవర్ జర్మని ఆర్డర్ ఆఫ్ ది రెడ్ స్టార్ ,హీరోఆఫ్ ది మంగోలియన్ పీపుల్ రిపబ్లిక్ .స్టాలిన్ కవిత్వం తో పాటు 14రచనలు చేశాడు .ఏది ఏమైనా రష్యా లో స్టాలిన్ ఒక లెజెండ్ అన్నది మాత్రం యదార్ధం 

   Inline image 1   Inline image 2Inline image 5

.Inline image 3Inline image 4

    సశేషం                                                                      

         మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-6-16-ఉయ్యూరు

  

           

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.