ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -176

67-   జర్మన్ జాతీయ భావ సోషలిజం వ్యాప్తి చేసిన -ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ -2(చివరి భాగం )

   స్పెంగ్లెర్ భవిష్యత్తును ఆనందమయ పెసిమిజం గా చూశాడు .నీషే చెప్పినభయ సంత్రుప్తులతో కూడిన  ‘’శాశ్వత పునరా వృత్తం ‘’(ఎటర్నల్ రికరెంస్ )కోసం ఎదురు చూశాడు .ఇప్పుడు ఆ వ్రుత్త౦ పూర్తయింది .ఇప్పుడు స్పి౦గ్లేర్  కొత్త ఆవ్రుత్త౦ జీర్ణించి నశించిపోయిన నాగరకత నుంచి ఆరోగ్యకర ఉత్సాహ పరచే బార్బేరిజం గా ఆవిర్భవిస్తుంది అన్నాడు .మరొక కొత్త ఉన్నత యువ క్రూర సంస్కృతీ ఏర్పడి వ్యాపించి రాజ్యమేలుతుంది అని ఊహించాడు .’’ఆస్వాల్డ్ స్పెంగ్లెర్ –ఎ కల్చరల్ ఎస్టి మేట్’’అనే పుస్తకం లో హెచ్ .స్టువార్ట్ హగ్స్ ‘’మానవాభివృద్ధిలో ఆయన చెప్పిన వృత్త సిద్ధాంతం ,సంశయ వాదం ,మానవ నైతిక శక్తి సామర్ధ్యాలు ఒక భ్రమ గా కొట్టిపారేశాడు .ప్రజాస్వామ్యం పవిత్ర మోసం  మాయ అన్నాడు .ప్రపంచ శాంతి సాధన అసాధ్యమేకాదు,అనవసరం కూడా అన్నాడు .20 వ శతాబ్దం శాంతికి,అభి వృద్ధికి ,ప్రజాస్వామ్యానికి  బహుదూరంగా తన సమకాలీనులు ఊహించిన  దానికి విరుద్ధంగా ఉండి భయ విహ్వలత ,ఇ౦ పీరియలిజం ,నిరంతర యుద్ధ ప్రమాద కర శకం గా ఉంటుందని భవిష్యత్తు చెప్పాడు ‘’అని రాశాడు .

  స్పెంగ్లెర్ చెప్పిన’’ మానవ తలరాత’’సిద్ధాంతం  నాశనమై ,మళ్ళీ తల ఎత్తిపుంజుకొన్న జర్మని విషయం లో నిజమైంది .జర్మన్లు తమ ఓటమి ప్రపంచ వ్యాప్త పతనం లో ఒక భాగమే నని ,పుట్టుకొచ్చిన నాజీలు ఆయన చెప్పిన భవిష్యత్తుకు ఉత్సాహపడి ,ప్రపంచం లో ఆర్య జాతి ఒక్కటే సర్వోత్క్రుస్టమైనదని నమ్మి ప్రచారం చేసి వినాశకర హి౦సాత్మకతను పెంపొందించారు .  అందువల్ల నాజీ నాయకత్వానికి స్పెంగ్లెర్ కొంతకాలం దేవుడే అయ్యాడు .కాని ఆయన నియంత్రణ ,స్వీయ ఆహ౦ కారాలపై ఉన్న అపనమ్మకం ఆయన్ను నేషనల్ సోషలిజం లో పాల్గొన నీయ కుండా చేసింది .ఆయన్ను వేది౦చకపోయినా ,కార్యక్రమాలు పరిమితమై  క్రూర పైశాచిక జర్మనీలో నిస్తబ్ద౦ గా ఉండి పోయాడు .మిగిలిన జీవితకాలం అంతా ఏకాంత౦ గా గడిపాడు .56వ ఏట అకస్మాత్తుగా అనారోగ్యం పాలై ,కొన్నేళ్ళు విపరీతమైన తలనెప్పి తో బాధ పడుతున్నా ఆరోగ్యంగానే ఉంటూ విపరీతమైన గుండె పోటు వచ్చి దార్శనికుడు స్పెంగ్లెర్ 8-5-1936న మరణించాడు .

  స్పెంగ్లెర్ తోపాటు మరికొందరు కూడా నాశనమఔతున్న నాగరకతను గూర్చి వ్యధ చెందారు .ఇటలికి చెందిన చరిత్ర కారుడు  జియాం బాట్టి స్టా వికో ‘’అనేక చారిత్రాత్మక పునరావ్రుత్తాలు జరిగి ,అనేక నాగరక దశలు దాటి ఒక అనాగారకతనుంచి మరొక అనాగారకతకు చేరుకొంటుంది ‘’అని చెప్పాడు .1890 లో అమెరికాకు చెందిన హెన్రి ఆడమ్స్ ‘’ప్రజాస్వామ్య భవిష్యత్తు ప్రమాదం అంచులో ఉంది .ఉన్న ఆధారాలను బట్టి మనం ఇంకా రెండు వందల ఏళ్ళకు పైగా మూర్ఖ స్తబ్దతలో ఉండి పోవాల్సి వస్తుంది ‘’అని చెప్పాడు .ఆయన సోదరుడు బ్రూక్స్ ఆడమ్స్ పడమటి నాగరకత శిదిలమౌతుందని ఊహించాడు .మనకున్న అధిక శక్తులు అనేక  టెన్షన్ లను  సృష్టించి ఆధునికమానవుని అస్తిత్వాన్ని భగ్న పరుస్తాయి .ఒత్తిడి ఇక తట్టుకోలేనప్పుడు ఒక స్తబ్ద కాలం ఆవరించి ,ఖర్చాయి ఖాళీ అయిపోయి కాని యుద్ధం వలన కానీ లేక రెండిటి వలనకూడా అంతమవుతుంది .లేక విచ్చిన్నమై నాగరక జనాభా నశించి ,మళ్ళీ వెనక్కి అడుగులు వేస్తూ ఆదిమ జీవ  సమాజం లోకి చేరుతుంది ‘’అని   ‘’ది లా ఆఫ్ సివిలిజేషన్ అండ్ డీకే’’లో రాశాడు బ్రూక్స్ .

‘’ ప్రజాస్వామ్యం  బలహీనతకు పర్యాయ పదం ‘’(డెమాక్రసి ఈజ్ అ సినానిం ఫర్ దిసల్యూషన్)అని,శాంతి మరణానికి పరచిన దారి అని ,జీవితం గురించి ఫిలాసఫర్స్ కు అవగాహనే లేదని ,ఫిలాసఫీ నిరర్ధకమైనదని ,అభ్యుదయం అనేది లేదని ,అది క్షీణతకు వృద్ధి అని  స్పెంగ్లెర్ తప్ప ఎవరూ చెప్పలేదు .ఆయన వ్యాసాలు కొన్ని మరణానంతరం ముద్రి౦పబడినాయి .’’ది డిక్లైన్ ఆఫ్ ది వెస్ట్ ‘’’’ది అవర్ ఆఫ్ డెసిషన్ ‘’లపై  .వయసు ముప్ఫై లో రాసిన వాటి పై వచ్చిన విమర్శలపై స్పందించలేదు .తన పాఠ కులు మరింత ఆశ్చర్య పోయేట్లు వారిని ఉత్తేజ పరుస్తూ మన నాగరకతను సుదీర్ఘ కాలంగా వర్ధిల్లిన చైనా ఈజిప్ట్ ,ఇండియా ,గ్రీక్ మరి కొన్ని దేశాల వాటితో పోల్చాడు .యూరప్ ,అమెరికాల మనసు ఆత్మను ముసలిదైపనికి రానిదైన ‘’ఫాస్టియన్’’అన్నాడు .అది అసాధ్యాన్ని కల కంటోంది అని చెప్పాడు .’’we have not the freedom to choose ,to reach to this or to that ,but only the freedom to do what is necessary or do nothing .And a task that historic necessity has set will be complished with the individual or against him ‘’

  చాలామంది చరిత్ర కారులు స్పెంగ్లెర్ సిద్ధాంతం ‘’తప్పని సరి వినాశనం ‘’మరియు,శతాబ్దాల పోరాటం ద్వారా సాధించుకొన్న  జ్ఞానోదయ అనాసక్తత సిద్ధాంతం లను ఒప్పుకోలేదు .కొద్దిమంది  ఆయన చెప్పిన దానికి అంతప్రభావం ,వ్యాప్తి ,శక్తి లేవన్నారు .క్విన్సీ హౌయీ ‘’ది వరల్డ్ బిట్వీన్ టు వార్స్ ‘’అనే గ్రంధం లో ‘’ఆయన్ను అర్ధం చేసుకొన్న వారికి తమవాడు అయ్యాడు .వాళ్ళందరూ జూలియస్ సీజర్  లు కాలేదు .కాని జరగ బోయే అనర్ధాన్ని తట్టుకొనటానికి సర్దుబాటు కు సంసిద్ధ మౌతారు ..విల్సన్ ,లెనిన్ ల ఆవిర్భావం స్పెంగ్లెర్ చెప్పిన భవిష్యత్తుకు మద్దత్తు ఇచ్చినట్లయింది .20వ శతాబ్ది లో గొప్ప వాళ్ళ పాత్ర ఏమిటో విడమర్చి చెప్పింది .విలియం జేమ్స్ చెప్పిన కార్య సాధక ఫిలాసఫీ ని నీరు కార్చింది .’’his worship for’’ technics ‘’suited the scientific temper of the times .He offered a fatalistic formula to replace Westeren man’s lost religious faith .His fame spread from defeated Germany to shell shocked Europe to the bewildered United States .it became more and more apparent that nobody had won the war and that everybody had won the war and that everybody had lost it ‘’అని విశ్లేషించారు .

   అతని పద్ధతులు శాస్త్రీయం కాకపోవచ్చు కాని ఆయన మెటాఫిజికల్ అనుమానాలు ,యదార్ధమైనవే .తూర్పు ,పడమర దేశాల మధ్య జాతి వర్ణ విభేదాలు ఆయన చెప్పిన నాటి కంటే ఇరవయ్యవ శతాబ్దం లో పూర్తిగా రుజువయ్యాయి .సమాజాలు యుద్ధాలవల్ల బలహీమమై పోతున్నాయి .ఆర్ధిక సంక్షోభం లో కూరుకు పోయాయి .ఆసియా ఆఫ్రికాలలోఅనిశ్చిత పరిస్థితులు ,ప్రపంచ వ్యాప్త జాతీయ నినాదాలు ,అంతర్జాతీయ యుద్ధోన్మాదం ,ప్రపంచం లో రష్యా పెత్తనం ,ఆయుధ పోటీ ,ఆటం ,హైడ్రోజెన్ బాంబ్ ల విధ్వంసక శక్తి అన్నీ పూర్తీ వినాశానానికే దారి చూపిస్తున్నాయి .’’The decline of the West remains a fearful and continuing portent (దుశ్శకునం )’’అన్నాడు అంటర్ మేయర్ .

   1938లో వరల్డ్ లీడింగ్ పర్సనాలిటీ పోటీలో మాల్కం కౌలీ మొదటి వాడుగా వస్తే స్పెంగ్లెర్ అయిదవ వాడుగా నిలబడ్డాడు .ఐరోపా ఫిలాసఫర్లు మార్టిన్ హీద్జేర్ ,లుడ్విగ్ విట్టేంగ్ స్టీన్ లపై ఈయన ప్రభావం ఎక్కువ .అమెరికా ఫిలాసఫర్ లలో హెమింగ్వే ,ఫిట్జెరాల్డ్ ,జాన్ డాస్ పాస్సో ,హెన్రి మిల్లర్ లపై అత్యధిక ప్రభావం చూపాడు . ఇంగ్లాండ్ లో హెచ్ జి వెల్ల్స్,మాల్కం లోరీ ,యేట్స్ లు జర్మనీ ఆస్త్రియాలలో అనేక మంది  లాటిన్ అమెరికా దేశాలలో చాలామంది ఆయన ప్రభావానికి గురైన వారే .వీరంతాస్పెంగ్లేర్ ను పునర్జీవితుడిని చేసినవారే .దాదాపు పదిహేడుగ్రంధాలు రచించాడు .

Inline image 1Inline image 2Inline image 3

    సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-16-ఉయ్యూరు   

  

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.