ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -180
69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -2
సర్కస్ ఆటమాత్రమే కాదు అది చేసేవాళ్ళ జీవితాలపై అభిమానం ;అధ్యయనం పికాసో జీవితాన్ని మలుపు తిప్పింది .వీరిపై కళా ఖండాలు అనదగ్గ చిత్రాలు గీశాడు .అందులో బఫూన్లు విషాదంగా కనిపిస్తారు .అప్పటిదాకా ఉపయోగించిన బ్లూ కలర్ ను వదిలేసి రోజ్ కలర్ లో కి దిగాడు .లేకపోతే పింక్ కలర్ వాడాడు .దీనివలన భౌతిక అందం తగ్గి౦చాదు .హాలండ్ వెళ్లి వచ్చాక బ్లూ పీరియడ్ ను వదిలేసి గుండ్రని రమ్యాక్రుతులు ,రక్తం మాంసం తోఉన్న ,వయోరహిత ఔన్నత్యాన్ని కలిపించాడు .ఇదంతా ఇంకా 25 దాటని కుర్ర చిత్రకారుని ప్రతిభ .రిల్కీ చిత్రాల్లా సగం కాంతి తో నిత్య వాస్తవికతకు దూరంగా ఉండేవి .తీవ్రంగా ఉన్నా ప్రశాంత ఆహ్లాదంగా కనిపించేవి కాని అవి వ్యక్తీకరణ లేనట్లు ఉండేవి .శైలి కోసం ఆయన పడుతున్న ఏక మానసిక స్థితి గుర్తించాం అన్నాడు. ‘’మారిస్ రేయ్నాల్ ..సంప్రదాయంగా ఉన్న అన్ని సరిహద్దుల్ని అధిగమించి కొత్త క్లాసిజం వైపు అడుగులేస్తున్నాడు .దీనితో అత్యంత ఖచ్చితత్వం వచ్చింది .అతని రోజ్ పీరియడ్ లో వచ్చిన కూర్పులు పెయింటింగ్ లో ఉత్తమమైనవి ,మాస్టర్ పీస్ అనిపించుకోన్నవాటికి పోలిక లో సరి పోతాయి .
25ఏళ్ళకే పికాసో సుస్థిర చిత్రకారుడైనాడు .ఆయన చిత్రాలను కొనటం ,వాటిపై గొప్ప వ్యాఖ్యానాలు చేయటం వంటివి ప్రఖ్యాత చిత్రకారుడు విమర్శకుడు అయిన జేర్త్రూడ్ స్టెయిన్ లాంటి వాళ్ళు చేశారు .రష్యన్ డీలర్ సెర్జీ శేకిన్ 50 పెద్ద కాన్వాస్ లు కొన్నాడు.తన చిత్రాన్ని గీయటానికి పికాసో దగ్గర మోడల్ గా ఎనభై సిట్టింగులు ఇచ్చానని స్టెయిన్ చెప్పింది .దాదాపు చిత్రం పూర్తీ అయిందికాని అది పికాసో కు నచ్చక ముఖాన్ని చెరిపేశాడు .కొంతకాలం ఎక్కడెక్కడో తిరిగి వచ్చి మోడల్ లేకుండానే ముఖ కవళికలను గొప్పగా చిత్రించాడు .వస్తువు ను చూసి చేయటం కంటే ఇమాజినేషన్ తో చేయటం దీనితో ప్రారంభించాడు .
‘’వైల్డ్ బీస్ట్ ‘’లని పిలువ బడేమాతిస్సే ,రౌవాల్ట్ ,వ్లామింక్ ,డిరైన్ మొదలైన అతని పెర్షియన్ స్నేహితుల చిత్రాలు పికాసో లో ఆలోచనలు రేపి స్వయం ప్రతిపత్తిగల కళ ను సృస్టించే అవకాశం ఉంది అనే భావన కలిగింది .అప్పటికి ఇంకా ప్రాతి నిధ్యాన్ని వదిలి పెట్టటానికి సిద్ధంగా లేడు . ప్రధానమైన బహుశా పూర్తిగా చిత్ర సంబంధ మైన ‘’కళ కళ కోసమే ‘’అని నిందించిన దానికి మరింత అనువర్తనం గా ,సహజానికి విరుద్ధం కాకుండా ,యదార్ధం కానట్లుగా ఉండే వక్రీకరించని ,సృజనాత్మక కళను పికాసో ఊహిస్తున్నాడు .అతని స్నేహితులు ఆఫ్రికన్ నీగ్రో ల మాస్క్ లు ,కొయ్య శిల్పాలుకనుక్కొంటే పికాసో పదునైన కోణాలు ,ఆకస్మిక స్తరాలు(ప్లే న్స్),నాటకీయ,జ్ఞాన శూన్య క్రౌర్యం తో వక్రీకరణల పై మోజు పడ్డాడు .అవన్నీ ఈస్తేటిక్ షాక్ ఇచ్చాయి .సంప్రదాయ కళను ద్రుష్టి కోణాన్ని సవాలు చేసి పెయింటింగ్ కు నూతన పరిమాణాన్ని ఆవిష్కరించాయి . ఆ పరిణామమే క్యూబిజం .అయినా పికాసో రేఖీయ ఆక్రుతుల అవకాశాలకోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .’’ఆఫ్రికా దేశపు ఆదిమ జాతుల విగ్రహాలు అసలైన విలువ కలవని అనుకొని ,తన ఈస్తేటిక్ అనుభవాలను మార్చు కొంటూ ,ప్రపంచపు కొత్త చిత్రాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తూ ,సహజ అనుభవం ,అతీంద్రియ అనుభవం ఒకదానిపై ఒకటి పడి ఒక ప్రత్యేక వాస్తవ చిత్రాన్ని తయారు చేసే కృషి కొనసాగించాడు పికాసో ‘’అన్నాడు క్రిస్టియన్ జేర్వోస్ .
ఆ’’ ప్రత్యెక వాస్తవం’ను కొట్టవచ్చేట్లు 26వ ఏట’పెయింట్ చేసిన ’ లెస్ డేమాసేల్స్ డి అవిగ్నాన్’’లో చూపించి కళాప్రపంచాన్ని ఒక కొత్త వివాదాస్పద ఈస్తెటిక్స్ తో పెద్ద కుదుపు కుదిపాడు .దీనిపై జేర్వోస్ సమీక్షిస్తూ ‘’this about- face of all aesthetic values marked the beginning of a period which revolutionized painting and enriched all art .’’అని అంటే ,ఆల్ఫ్రెడ్ హెచ్ .బార్ జూనియర్ ‘’పికాసో –ఫిఫ్టి యియర్స్ ఆఫ్ హిజ్ ఆర్ట్ ‘’లో ఈ చిత్రం మొట్ట మొదటి క్యూబిస్ట్ చిత్రం –అది సాధారణ రూపాలను అవి వస్తువులైనా స్టిల్ లైఫ్ చిత్రాలైనా ,పరదాలైనా వాటిని సెమి అబ్ స్ట్రాక్ట్ డిజైన్ లుగా జారిపోయేట్లు , స్తరాలమార్పులతో ,బోలు ప్రదేశంగా అదిమి మార్చాడు .ఇదే క్యూబిజం .అదొక సంధికాలపు చిత్రం ,ప్రయోగ శాల ,అంతకు మించి యుద్ధ భూమి ,విచారణ, ప్రయోగం .కాని అది కూడా ఒక దారుణమైన ,చైతన్య వంతమైన శక్తి –ఆ కాలం లో ఐరోపా కళ లో అన్నిటిని మించి అద్వితీయమైనది .’’అన్నాడు .
తన స్నేహితుడు ,సాటి చిత్రకారుడు జార్జెస్ బ్రేక్ తో కలిసి పికాసో బలీయ మైన వెంచర్లను శక్తి వంతమైన క్యూబిజం లోకి మార్చాడు .ప్రముఖ చిత్రకారుడు సిజానే –లాండ్ స్కేపులు ,సాధారణ వస్తువులు శంకువులు స్తూపాలు గోళాలుగా అమరి ఉంటాయని సూచించాడు .ఈ ఇద్దరుకలిసి దాని క్యూబ్ అంటే ఘనం లోకి వ్యాప్తి చెందించారు .ప్రిజం ,త్రిభుజ౦ ,మరికొన్ని పదునైన కోణాలు కల వానిగా ,సాలిడ్ జామెట్రీ అనుకరణ గా మార్చారు .మరో చిత్రకారుడు స్యురాట్ పెయింటింగ్ ను ‘’the art of hallowing surface ‘’అన్నాడు .పికాసో విరుద్ధ కళ ను తయారు చేసే ప్రయత్నం లో ఉన్నాడు .ఉపరితలాన్ని శుద్ధ ఘన పరిమాణం ద్రవ్య రాసి తో నిర్మించాడు .తనకు కనిపించిన ప్రతి దాన్నీ విశ్లేషించి వ్యక్తిగత భౌతిక కంటి తో కాక తనమనో నేత్రం తో ఊహను జోడించి చిత్రించాడు .’’ఇప్పడు పికాసో వస్తువును ఒకే అనేక పార్శ్వాలనుండిఅంతర్ నేత్రం తో దర్శించినట్లు గమనిస్తాడు . ఆర్టిస్ట్ ఊహ కు అనుగుణంగా భౌతిక వస్తు పధకం కాక వస్తువు పూర్తిగా ఒక్కసారే దర్శనమిస్తుంది .వస్తువు యొక్క ప్రాతినిధ్యం గా ఆర్ట్ ఉండాలి .అది స్వయం సమృద్ధ మవ్వాలి ‘’అనేది పికాసో సిద్ధాంతం అని మారిస్ రెయ్నాల్ అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-6-16-ఉయ్యూరు