ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -181
69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -3
అన్నీ విసర్జించే ప్రయత్నం లో వస్తు నిర్మాణం కంటే వాటి కారక అంశాలకు సంబంధించిన సూత్రాలను స్థాపించే ప్రయత్నం లో ఉన్న పికాసో పూర్వపు రూపం కోసం వస్తువుల ఆకారం మార్చి ,పూర్వపు బలమైన రంగుల్ని వదిలేసి పొడిలక్షణాలను ,విలక్షణమైన ఆకర్షణ ను కలిపించాడు .దీనికోసం కోల్డ్ గ్రే ,ఆకర్షణ లేని బ్రౌన్ పాలిపోయిన సా౦డోయిష్ ఎల్లో బ్రౌన్,స్తబ్దత గా కనిపించే 19వ శతాబ్దిలో మోనో క్రోం ఫోటోగ్రాఫ్ లలో వాడిన రెడ్డిష్ బ్రౌన్ రంగులను ఉపయోగించాడు .తీవ్రత అంచులదాకా వెళ్లి ,తన వస్తువుల నుండి సారాన్ని పీల్చి స్వచ్చ మైన రూప కల్పనను కాపాడుతూ చిత్రించి ,అస్తవ్యస్తత తో పోగు చేసిన అనవసర వివరాలకు స్వస్తి చెప్పాడు .నిశిత కోణ రూప భేదాలను ,అవి ఎలాంటి అక్రమ ప్లాస్టక్ ప్లేన్ లైనా ,పికాసో అనాటమీ ని అతి శాస్త్రీయంగా భాగాలుగా విడగొట్టిఆపరేషన్ విజయవంతం అయినా ,తరచుగా వ్యక్తీ బతక నట్లు ప్రయోగాలు చేశాడు .సమాంతర ,నిలువు లకు ముసుగేసి అసలు వస్తువే దాదాపు కనిపించకుండా పోయేట్లు చిత్రించాడు .అందులో ఒక సలహా ,అస్పష్ట సూచన ,ఉండి ధీం అంటే నేపధ్యం వైవిధ్య సంక్లిష్ట త తో ఒక ‘’ఐడియో గ్రామ్’’లాగా మారి పోయేట్లు చేశాడు.The true Picassophile divides this period into proto –cubism ,analytical cubism ,hermeti ccubism ,synthetic cubism ,-there is even a completely contradictory but solemnly announced ‘’curvilinear cubism ‘’.ఇన్ని విధాలుగా ఆయన చిత్రకళ రూపాంతరం చెందింది .అన్నీ ప్రయోగాలే .ఎందులోనూ అసంతృప్తే .అందుకే ప్రయోగాలమీద ప్రయోగాలు అంతులేకుండా చేశాడు పికాసో .
తన అభి వృద్ధి గురించి అతి తక్కువగా పికాసో వివరించేవాడు .క్యూబిజం కు దాదాపు బానిస అయ్యానని సమర్ధించుకొనే వాడు .1923మే నెలలో ప్రచురితమైన ‘’ది ఆర్ట్స్ ‘’పత్రికలో ‘’క్యూబిజం మిగిలిన యే రకమైన పెయింటింగ్ కంటే తేడా ఉన్నది కాదు .అవే సూత్రాలు అవే మూలకాలు ఇందులోనూ ఉన్నాయి .నిజానికి క్యూబిజాన్ని ఇవాల్టి వరకు ఎవరూ అర్ధం చేసుకో లేక పోయారు .కొంతమందికి అందులో ఏమీ కనిపించలేదు .ఏమీ లేదు అన్నారు కూడా .నేను ఇంగ్లీష్ చదవ లేను .ఇంగ్లీష్ పుస్తకం నాకు బ్లాంక్ పుస్తకం .దీనర్ధం నేను ఎవరిపైనో నింద వేస్తున్నాననికాదు విమర్శిస్తున్నానని కాదు . లెక్కలు ,కేమిస్ట్రి,ఫిజిక్స్ ,సైకో అనాలిసిస్ ,మ్యూజిక్ మొదలైనవి నాకు అర్ధం కానంత మాత్రాన అవి క్యూబిజానికి సంబంధించినవి కావు అనటాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నాను .ఇదంతా సాహిత్యమే .సిద్ధాంతాలతో ప్రజలకు అంధత్వం ,చెడుఫలితాల నిచ్చినంత మాత్రాన అర్ధం పర్ధం లేనిది అనటం అర్ధం చేసుకోలేక పోతున్నాను .క్యూబిజం తనను తాను పెయింటింగ్ హద్దుల్లో ఉంచుకొని ,ఎప్పుడూ దాని హద్దు దాట నని అది మభ్య పెట్టలేదు . .విషయం ,రూపాలను గతం లో విస్మరించగా మేము పెయింటింగ్ లలో పరిచయం చేసిన వస్తువులు తేడాలుగా ఉండవచ్చు .పరిసరాలను మా కళ్ళు మెదడూ ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి .’’అన్నాడు పికాసో .తన కళ్ళు ఎప్పుడూ తెరుచుకొని ఉండటమే కాదు పికాసో తన విమర్శకులను ఒక అత్యున్నత వివాద వైరుధ్యాలలో పడేస్తూ 20ఏళ్ళు దాటగానే’’ లెజెండ్’’ అని పించుకొన్నాడు .30 వ ఏట తన 84 చిత్రాలతో 1911 ఏప్రిల్ లో అమెరికాలో ఏక వ్యక్తి ప్రదర్శన నిర్వహించాడు .
క్యూబిజం తో ఉన్న ఆర్ట్ అంతా ఖర్చు చేసి ఆగిపోలేదు .అంతకన్నా మరింత తీవ్రమైన ప్రయోగాలు చేశాడు .కొంతకాలం ‘’కోల్లెజేస్ ‘’తో ఆడు కొన్నాడు .కోల్లెజేస్ అంటే ఫోటోగ్రాఫ్ లు ,కాగితం ముక్కలు,గుడ్డ ముక్కలు మొదలైన అనేక రకాల వస్తువులను ,ఆర్టిస్టిక్ గా అంటించటం .అలాగే ఉపరి తలాలపై పేపర్ ,మొదలైన వస్తువులను ఒకదానిపై ఒకటి ఇష్టమొచ్చినట్లు అతికింఛి ,వాటిపైకాని వాటి చుట్టూ కాని పెయింట్ చేయటం చేశాడు .అంటే అతి సామాన్య వస్తువుల నుంచి అందాన్ని రేకేత్తించటం ,చేశాడు .న్యూస్ ప్రింట్ పై ,తాడు ముక్కలపై ,లినోలియం అంటే లిన్ సీడ్ ఆయిల్ ,పౌడర్డ్ కార్క్ లను కాన్వాస్ పై దట్టంగా అంటించటం సాండ్ ,క్లాత్ ,గ్లాస్,గుర్తించలేని విధంగా కొయ్యను ,షీట్ మ్యూజిక్ అంటే ప్రింటెడ్ మ్యూజిక్ ను చార్కోల్ ,ఇంకు లేక ఆయిల్ లతో కలిపి అతికించటం చేశాడు .ఇదంతా కోల్లెజ్ టెక్నిక్ .ఇది ఒక సరళీకృత మోజాక్ .నేత విధానంకు ప్రాధాన్యమిచ్చి ,అతి సాధారణ చెత్తా చెదారం ను మిశ్రమం చేసి అపూర్వ ,అసాధారణ ,అవాస్తవిక అందాన్ని చేకూర్చి ఒక రకంగా ‘’పెయి౦టర్స్ పార డాక్స్ ‘’(చిత్రకారుని విరుద్ధత )ను వింత ,విలక్షణ అందమైన నిరాడంబర రూప కల్పన చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -30 -8-16- ఉయ్యూరు