ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -182

69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో –4

34వ ఏట రియలిజాన్ని వదిలేసిన పదేళ్లకు ఒక్క సారిగా మళ్ళీ వెనక్కి మళ్ళి ,అతి జాగ్రత్తగా తన స్నేహితుల, సహాయకుల నేచుర లిస్టిక్ గ్రాఫిక్ పోర్ట్రైట్ లు గీశాడు .’’ఈ క్లాసిక్ పీరియడ్ ‘’రోమ్ కు వెళ్లి విస్తృత పరచాడు .అక్కడ ‘’పెరేడ్ ‘’అనే ఒక బాలెట్ కు కర్టెన్, స్క్రీన్ ,కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు .దీన్ని సెర్జీ డయాఘిలేవ్ నిర్మిస్తే ఎరిక్ సాటీ సంగీతం సమకూర్చాడు .అక్కడ స్ట్రావేన్స్కిఅనే కంపోజర్ ను కలిసి ఆయన ‘’రాగ్ టైం ‘’ కవర్ కు స్కెచ్ వేశాడు .రష్యన్ బాలెట్ బృందం తో బాగా ఉల్లాసంగా గడిపాడు .వారితో రిహార్సల్ లను రోమన్ సెల్లార్ల  లో  చేస్తూ రాత్రి వేళ చంద్రకాంతిలో తిరుగుతూ నేపుల్స్ ,పాంపీలు తిరిగి చూస్తూ ,ఆ ట్రూప్ లో డాన్సర్ యువతి వోల్గా కొక్లోవా ను పెళ్లి చేసుకొని ,పాల్ అనే కొడుకుకు  జన్మ నిచ్చాడు .మూడేళ్ళ వయసులో తీవ్రమైన కాంక్ష కళ హాస్య గాడిగా ఒకటి ,నాలుగో ఏట అందమైన ఆకర్షణ,కొద్దిపాటి విచక్షణ తో ఫ్రెంచ్ పాంటోమైమ్ లోని విచార పాలిపోయిన ముఖం ,వదులైన తెల్లటి బట్టలతో పాయి౦టెడ్ హాట్ పెట్టుకొన్న వాడిగా   ఒకటి  మొత్తం రెండు కొడుకు పాల్ చిత్రాలను చిరస్మరణీయంగా చిత్రించాడు తండ్రి పికాసో .  ముప్ఫై లలో ఎప్పుడూ పికాసో పరిణతి చెందినవాడిగా కనిపించాడు .కాని యే శైలికి కట్టు బడక ,నైరూప్య (ఆబ్ స్ట్రాక్ట్ ), క్యూబిక్ నమూనాలు ,అలంకరణ ఉన్న లాండ్ స్కేప్ ,సున్నిత లైన్ డ్రాయింగ్ చిత్రాలు గీస్తూ ‘’ఇంగ్రేస్ ‘’చిత్రకారుని నాజూకు ,సొంపుతో తో పోటీ పడే చిత్రాలు తయారు చేశాడు .

  ముప్ఫై ల చివరలో పికాసో ‘’నియో క్లాసికల్ పీరియడ్ ‘’ప్రారంభమైంది .సెమి ట్రాపికల్ ఫ్రెంచ్ రేవేరాలో ఉంటూ పూల ముక్కల్ని పరిణతి చెందింప  జేస్తూ ,పండ్లను 17 ,18 శతాబ్దాలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ లాఅమరుస్తూ ,వస్తువులను ఆకర్షణ తోకళకళ లాడేట్లు గుండ్రంగా ,అసలు ఇది వరకు ఎప్పుడూ క్యూబ్ ను చూడని వాడిలాగా మెస్మరైజ్ చేశాడు .నలభైలలో అతని చిత్ర రూపాలు హీరోయిక్ సమతుల్యత తో గీశాడు .మొదటి ప్రపంచ యుద్ధం  అనంతర పరిణామాలు పికాసోను మళ్ళీ పూర్వపు మానవత్వ భావాలకు చేర్చాయి.అనేక సార్లు గీసిన ‘’వుమన్ ఇన్ వైట్ ‘’ఇప్పుడు సున్నితంగా కొంతవరకు  అభివ్యక్తీకరణంగా  ఉన్నాయి  .  కాని అందులో ఎక్కువ భాగం పురాతన శిలను నరికి మలచినట్లు ఉండేవి .అవి ద్రుఢత్వం  లో క్లాసికల్ గాఉండటమే కాక ఆవి విషయం  కంటే రూపానికి ప్రాధాన్య మిచ్చి నట్లు ఉండేవి .అంతేకాదు హుందా ,గౌరవం కలబోసినట్లు ఉండేవే కాని రొమాంటిక్ ప్రయోగాలతో ఏర్పడ్డవి కాదు .ఈ పికాసో పెయింటింగ్ లను ‘’Monumental ,impassive ,immovable are a few of the adjectives with which the critics described the heavy –limbed sculptural paintings ‘’.‘’

  తరువాత 12 ఏళ్ళలో పికాసో అనేక రూపవిక్రియ లకు( మెటామార్ఫసెస్ )లోనైనాడు .వైర్ లతో తుప్పు పట్టిన ఇనుము ,కొయ్య లతో  నిర్మాణాలు చేశాడు .సర్రియలిస్టిక్ కవిత్వం రాశాడు .శిల్పకళ లో ప్రవేశించి ,అతి పెద్ద తలకాయలు ,జంతువులను రూపమార్పిడిచేశాడు .స్మారక చిహ్నాల ప్రాజెక్ట్ లు చేబట్టాడు .నైరూప్య వరదలో నుండి బయటపడి హింసాత్మక ,తిరుగు బాటు ధోరణి తో ,అవాంచనీయ లక్షణాలతో ,గాఢమైన అలజడితో సరసమైన సొగసైన ఒంటికాలిపై నిలబడి ,రెండవ కాలు సమాంతరంగా జాపినట్లున్న కేవలం ఆనందం కలుగ జేసే డిజైన్ లను రూపొందించాడు .అంటే ఇప్పుడు పికాసో ప్రవహించే గీతలో అందాన్ని దర్శింఛి ఆ వైపుకు తన దృష్టిని కేంద్రీకరిస్తున్నాడన్న మాట .దీనిలో ఆకృతిని దాటి అర్ధం లేదని లేక ఆక్రుతే పరమార్ధమని అదే పరిపూర్ణ మైన రూపం అని భావించాడు .

   స్పానిష్ సివిల్ వార్ పికాసో యాభైలలో ఉండగా వచ్చింది .యుద్ధ సన్నద్ధమౌతున్న లాయలిస్ట్ ల తో స్పెయిన్ లో ఉన్నాడు .ఆయన్ను యుద్దోత్సాహం లేని ,ఫ్రాన్స్ లోనివసిస్తున్న  స్పానియార్డ్ గా మొ ప్ర.యు కాలం లో భావించారు .ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరంగా  ఉన్నా , .ఫ్రాంకో నాయకత్వం వహిస్తున్న నిరంకుశత్వ తిరుగు బాటు దారులకు ,వారి మిలిటరీ క్రూర విప్లవ భావాలకు ఎదురు నిలిచి పోరాడుతున్న రిబలికన్ ప్రభుత్వానికి పికాసో మద్దతు చూపే కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నాడు .మాంచి ప్రచార కర్తగా దూసుకు పోతూ ‘’పారడో’’కు డైరెక్టర్ అయి మ్యూజియం లోని విలువైన వస్తువులు దుండగుల చేతుల్లో వినాశనం కాకుండా కాపాడ గలిగాడు .అందుకే ఆయన ‘’painting is not done to decorate  apartments .It is an instrument of war for attack and defense against the enemy ,against brutality and darkness ‘’అని అన్నాడు ..నాజీ విమానాలు స్పానిష్ ఫాసిస్ట్ లతో చేతులు కలిపి గ్యూర్నికాలోని ప్రశాంత బ్రాస్క్యు టౌన్ పై బాంబుల వర్షం కరిపించి తుడిచి పెట్టేసినప్పుడు పికాసో అందరూ భావించినట్లుఅతని సర్వోత్కృష్టమైంది కాకపోయినా అత్యంత భావాత్మకవ్యక్తీకరణమైన  ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నాడు .300 చదరపు అడుగుల అతి పెద్ద కేన్వాస్ మీద యుద్ధపు క్రూరత్వాన్ని,ముఖ్యంగా ఇప్పడు జరుగుతున్నా యుద్ధ అనాగరకత్వాన్ని   నిరశిస్తూ రాశాడు .తన భావాలను తెలియ బరుస్తూ ‘’The Spanish struggle  is the fight of  reaction against the people ,against freedom ‘’అన్నాడు .పెయింటింగ్ లో ఉండి’’నా జీవితమంతా కళాత్మకమే ,ప్రతిక్రియపై ,కళ మరణం పై నిరంతర సమరమే . మిలిటరీ కులం స్పెయిన్ దేశాన్ని బాధా మరణ సముద్రం లో ముంచేసింది అని నేను విస్పష్టంగా నా అసహాయతను వ్యక్త పరుస్తున్నాను ‘’అని చెప్పిన ప్రజాభిమాని పికాసో .

Inline image 1

            సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -1- 7 -16 –ఉయ్యూరు

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.