ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -183
69-ప్రయోగాత్మక ప్రపంచ ప్రసిద్ధ ఫ్రెంచ్ చిత్రకారుడు –పాబ్లో పికాసో -5(చివరి భాగం )
పికాసో చూపిన సాహసం దౌర్జన్యం పై ఏహ్యభావ ప్రకటన ,టెర్రర్ ను రేకెత్తించే చిత్రాలు ‘’గుయెర్నికా ‘’లో ప్రస్పుటంగా తెలియ జేశాడు .కాని అందులోని సంకేతాలు ,రాక్షసులు ,విరిగి పోయిన శరీరభాగాలు ,వక్రీకరించబడిన ఎద్దులు ,అరిచే గుర్రాలను గ్రే ,బ్లాక్ ,తెలుపు రంగుల్లో భయంకరంగా ఉన్నా స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేయనట్లు గా చిత్రించాడు .1937లో జరిగిన పారిస్ వరల్డ్ ఫెయిర్ లో పికాసో ప్రదర్శించిన విస్తృత చిత్రాన్ని చాలా నిశితంగా పరీక్షించి తన పుస్తకం లో చాలా పేజీలు కేటాయించి రాశాడు ఆల్ఫ్రెడ్ హెచ్ బార్ .’’సైన్స్ అండ్ సొసైటీ ‘’లో వెర్నాన్ క్లార్క్ ఉదాహరించిన ‘’గుర్నేకా చిత్రం ఉన్న స్థితిని అన్నిధోరణుల పరాకాష్టగా ,కళాత్మక౦గా ,మానసికంగా ,పాత విధానాలపై నిర్మించిన కొత్త విధానంగా ఉంది ‘’అని మెచ్చినట్లు తెలిపాడు .న్యు యార్క్ మెట్రో పాలిటన్ మ్యూజియం అండ్ ఆర్ట్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ హెన్రి టేలర్ ‘’బాబెల్స్ టవర్ ‘’సామాన్యాన్ని పెద్ద ప్రకటన గా చెప్పాడు ‘’అని వెక్కిరించాడు .కానిఆంగ్ల కవి ,రచయితా హెర్బర్ట్ రీడ్ మాత్రం ‘’A monument to disillusion ,to despair ,to destruction .His symbols are are banal ,like the symbols of Homer ,Dante ,Cervantes .It is a great work of art transcending all schools and categories ,is being born and being born lives immortally ‘’అని మహా మెచ్చాడు .పికాసో ఒక ప్రపంచ మహా విపత్తు ను సామాన్యుడికి ఇప్పటికిప్పుడు అర్ధమయ్యేట్లు కాని చిత్ర భాష లోరచించాడు .’’ఈ చిత్రం పూర్తిగా తనను తాను వివరించుకోక పోయినా ,దాన్ని తేలికగా అనుకూలంగా రక్షించు కొంటుంది .ఇది సరి పోయేంత డోసులో లేని మహోన్నత చిత్రంకాదు అన్నవారికిఅది రాబోయే కాలం లో జరిగే అనర్ధాన్ని చాటి చెబుతుంది .బహుశా మనం ఉన్న శతాబ్దం లోనే ఆ వికృత రూపాన్ని చూస్తాం ‘’అన్నాడు బార్ .
1937నుండి పికాసో గీసిన చాలా చిత్రాలు చాలా నిరాశతో భంగ కరం గా ఉన్నాయి .మనం చూస్తున్న అవిటి అనాకారి మానవ రూపాలు ,మానవులు పరస్పర కలహం దౌర్జన్యం ,హింసలతో ఆవిర్భవి౦ఛినవే ,కావాలని వినాశనం కొని తెచ్చుకొన్నవే .క్రమంగా పికాసో ఉపరితల ప్రదర్శనకు దూరమై ,సామాన్య మానవుడికి అప్పటికప్పుడు అర్ధమయ్యే రీతి లేని విధంగా శక్తి వంతమైన నిగూఢ కళను చేబట్టాడు .సాద్రుశ్యత లేని విధంగా సాంకేతికతతో భయ విహ్వలంగా ,ముఖం లోపలి భావాలను పికాసో చిత్రిస్తున్నట్లు ,ముసుగువెనక ఉన్న బుద్ధి ,మనసు లాగా చిత్రిస్తున్నాడు .కవళికలను పునః పంపిణీ చేస్స్తున్నట్లు ,రేఖాచిత్ర దృశ్యంగా(ప్రొఫైల్) ముఖంకూడా బాగా కనిపించేట్లు ముక్కు కన్ను ఉన్న స్థానం లో ,ఉండేట్లు గీశాడు .’’The simultaneity of two different aspects has a distinctive purpose .Picasso hopes to give a feeling of the live and active person not a static replica –he presents a face with all its complexity ofplanes in motion ,moving not only in space but time ‘’అని వీటికి భాష్యం చెప్పారు .అతని చిత్రాలు వింతగా ,అర్ధం చేసుకోవటానికి వీలు లేనివిగా ఉన్నాయ౦టే ,దానికి కారణ౦ మన విజన్ .మనం ఎప్పుడూ ఒకే దృష్టితో వస్తువులను చూడటానికి ఇప్పటిదాకా అలవాటు పడటం ,ఒకటే విషయాన్ని చూడటమే దీనికి కారణం .అందుకే ఒకేసమయం లో అనేక విషయాలు, పార్శ్వాలు చూసే దిక్సూచి లాంటిది మనకు లోపించటమే. బ్లేక్ కవి ‘’ఆగరీస్ ఆఫ్ ఇన్నో సెన్స్ ‘’కవిత పికాసో కు బాగా తెలుసు నని పిస్తుంది .ఆ కవితా సౌందర్యం బ్లేక్ మాటలలోనే –
‘’we are led to believe a lie –when we see with ,not through the eyes ‘’కంటి తో చూసిన అబద్ధాన్ని నమ్మటానికి అలవాటు పడ్డాం కాని కంటి లోంచి చూసింది కాదు .పికాసో చేసిన,చూపిన రెండు ముఖాల తలలతో బాటు మరింత లోతుగా నైరూప్యానికి అన్వేషణ సాగించాడు .ఒక పీడకల లాంటి ఐరానిక్ నాటకం రాశాడు .ఇంకా తెగువతో ప్రాజెక్ట్ లను చేయాలని ఆలోచిస్తుండగా రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది .,జర్మన్ సైన్యం పారిస్ ను ఆక్రమించినప్పుడు పికాసో అక్కడే ఉన్నాడు .తన కళ ను దిగజారి పోయిన కళ అని ఈసడించిన నాజీలు ,అతని ప్రాణానికి ప్రమాదం తెచ్చారు .పారిపోవటానికి నచ్చ చెప్పుకోలేక పోయాడు ..యుద్ధ కాలమంతా పారిస్ లోనే ఉంటూ శత్రు దేశం తో చేతులు కలిపి పని చేయటానికి తిరస్కరించాడు .దీనికి విరుద్ధంగా తన ‘’గుయెర్నికా ‘’చిత్రాలను అందరికి పంచి పెడుతూ ఆనందిస్తున్నాడు .లిబరేషన్ –విముక్తి తర్వాత క్లాడే, పలోమా అనే ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు .తన వయసుకు 42ఏళ్ళ జూనియర్ అయిన ఆవిడ ద్వారా .ఫ్రెంచ్ రేవేర్రా మీద యాన్టైర్ దగ్గరున్నవల్లారిస్ కు చేరాడు .మళ్ళీ ఆయన ఆర్ట్ మార్పు చెందింది .ఈ పెయింటింగ్ లు కొత్త అత్యుత్సాహం ,కొంత ఉపశమనం మరికొంత తేలిక హృదయం తో .అలరించాయి .నిరంతర అన్వేషణ సృజన శీలి కనుక లితోగ్రఫీ లో కొత్త టెక్నిక్ ప్రయోగించి ,సరి కొత్త పాత మాధ్యమం పింగాణీని కనిపెట్టి మట్టిని పిగ్మేంట్ ల్లాగా సృజనతో కొత్త ఆకారాలు చేశాడు .నీడింగ్ , వస్తువుల్ని కాల్చటం ,ప్రాచీన ప్లేట్ల మీద ,డేగిసాలమీద గీశాడు .మట్టి కుండల్ని అనేక రూపాలతో చేశాడు .మేక లాంటి జగ్గులు ,స్త్రీ లాంటి జాడీలు ,టీ పాట్ లను పక్షి ముక్కు స్పౌట్స్ (జారే ప్రదేశం )లు తయారు చేశాడు .
70 వ పడిలో కూడా నిరంతర సృజన శీలి గానే ఉన్నాడు .పూర్తిగా విగ్రహ వినాశకారి అయ్యాడు .1952లో ఒక ‘’మిడటరేనియన్ లాండ్ స్కేప్ ‘’ను దట్టమైన రంగుల కాంపోజిషన్ తో పూర్వం ఎప్పుడూ చిత్రించని విధంగా భిన్నంగా చిత్రించాడు .’’మాసకర్ ఇన్ కొరియా ‘’మరో కనికరం లేని సమకాలీన భయంకర చిత్రం .1953మే లో అంతకు పూర్వం ఎవరూ చూడని తన ‘’వన్ మాన్ ‘’50చిత్రాల ప్రదర్శనను రోమ్ నగరం లో ఏర్పాటు చేశాడు .ఇవి మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్ భవనం లో 14 గదులలో అమర్చాడు .విమర్శకులు యదా ప్రకారం అతని కొత్త విధానాలను ఒకటి కాదని వేరొక దానికి మొగ్గటాన్ని విమర్శిస్తూనే ఉన్నారు .ఆయన అభిమానులు ఒక దానిలో పరి పూర్ణత సాధించాకే ఇంకో దానిని స్వీకరిస్తున్నాడని అన్నారు .ఆయన్ను వ్యతిరేకించేవారు ఈ మార్పులన్నీ ఆయన కు సీరియస్ నెస్ ఉద్దేశ్యం లేక పోవటంగా(గాంభీర్య రాహిత్యం గా ) ఆయన విధానానికే తప్ప అర్ధానికి విలువ ఇవ్వటం లేదని దెప్పారు .అయన కళ ఎప్పుడో అర్ధ రహితమై పోయిందన్నారు .’’మోడరన్ ఆర్ట్ ‘’పుస్తకం లో ధామస్ క్రేవన్ ‘’పికాసో కు జీవితంపై ఆసక్తి లేదు ఆయనకు యాంత్రిక చిత్ర నిర్మాణమే ఉన్న కళ మాత్రమె కావాలి .తన చురుకైన తెలివిని నిరింద్రియ ప్రపంచం ను కళా రాహిత్యంగా చేయటానికి శ్రమిస్తున్నాడు .ఆయన కళ పరిపూర్నమైనదే ఎందుకంటె ,అది ఏమీ ఇవ్వదు కనుక .అది స్వచ్చమైనది కారణం అది సంతృప్త మానవ ప్రక్షాళన చేస్తుంది కనుక .అది క్లాసిక్ –ఎందుకు అంటే అది చచ్చిపోయింది కనుక .’’అని రాశాడు .
పికాసో ఇలాంటి ఉడత ఊపులకు జవాబు ఇవ్వలేదు .కాని గుయెర్నికా లాంటి పెయింటింగ్ లతో ,తన రచనలతో మాత్రమే జవాబిచ్చాడు .ఆయన ‘’artists who live with spiritual values cannot remain in different to the conflicts about them struggles ‘’in which the highest values of humanity and civilization are at stake’’ అని రాశాడు .రూపం అనేదే నిర్హేతుక స్వేచ్చ కలదే అయినా తాను ‘’నైరూప్యకళ ‘’(ఆబ్స్ట్రాక్ట్ )ఉందని నమ్మనని ,కళ కు ఉన్న లోతైన ధర్మం మానవుని భావోద్వేగాలను సమతుల్యం ,క్రమతలను సాధించటమే ‘’అన్నాడు పికాసో .’’if the subjects I have wanted to express have suggested different ways of expression I have never hesitated to adopt them ‘’అని చెప్పాడు రాతలలో .’’నేను ఎప్పుడు ఏది చెప్పాలను కొన్నా ,దాన్ని నేను అనుభవించిన విధానం లోనే ,చెప్పాల్సిన పద్ధతిలోనే చెప్పాను .విభన్నమైన ఉద్దేశ్యాలు తప్పని సరిగా విభిన్న విధానాలలో చెప్పాల్సిన అవసరం ఉంది .దీనికి పరిణామ క్రియకాని ,లేక అభి వృద్ధి కాని అన్వయించదు.కాని ఒక ఆలోచన కు అనువర్తనం అయి చెప్పాల్సిన దాన్ని అతి విస్పష్టంగా ఆవిష్కరించే వీలు కలుగుతుంది .’’అని చెప్పాడు పికాసో .’’painting of his pictures as ‘’the result of sudden vision ,rather than of calculated manipulation of form ‘’అని విశ్లేషిస్తూ జేమ్స్ త్రాల్ సోబే చివరగా ‘’he was and remains one of the most extraordinary creators of imagery in the long history of art ‘’అని ముగించాడు .91 వ ఏట మహా చిత్రకారుడు పాబ్లో పికాసో 8- 4 -1973న ఫ్రాన్స్ లోని మొగిన్స్ లో మరణించాడు .
పికాసో చిత్రకళా సోపానాన్ని చూస్తుంటే మన కృష్ణా జిల్లా గుడి వాడకు చెందిన ఆధునిక చిత్రకారులు శ్రీ ఎస్ ,వి రామా రావు గారు జ్ఞాపక మొస్తున్నారు .ఆయన కూడా చిత్ర కళ లో అనేక ప్రయోగాలు చేసి ,నిరంతర ప్రయోగ శీలియై నైరూప్య చిత్రకళ అవధిని దాటి సుమారు 50 ఏళ్ళనుంచి అమెరికాలో ఉంటూచిత్రకళా లోతులనుతరచి ‘’ఆధునిక పికాసో ‘’అని పించుకొన్నారు .మంచి కవి కూడా .తమ కవితలను సంకలనాలుగా తెచ్చారు .ఈ మధ్య ఆరేళ్ళ నుంచి ఢిల్లీ లో ఉంటూ మరొక కొత్త ప్రక్రియ కోసం తపిస్తున్నారు . శ్రీ రామోజీ రావు గారి ఆధ్వర్యం లో నడుస్తున్న ‘’తెలుగు వెలుగు ‘’మాసపత్రిక మే సంచికకు ఇంటర్వ్యు ఇస్తూ ‘’నేను పికాసో కంటే గొప్ప వాడిని ‘’అని స్పష్టంగా చెప్పిన చిత్రకారులాయన .నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు రామారావు సావిత్రి ,శాంతకుమారి నటించి ఆత్రేయ రచన చేసి పెండ్యాల సంగీత దర్శకత్వం చేసిన శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం చలన చిత్రానికి కళా దర్శకత్వం వహించింది రామా రావు గారే .
ఇప్పుడు పికాసో గురించి మరికొన్ని సంగతులు తెలుసు కొందాం –ఆయన చిత్ర యాత్రలో మొదటికాలం బ్లూ పీరియడ్ .ఇది 1901నుంచి మూడేళ్ళు సాగింది .ఈ కాలం లో బార్సెలోనా ,పారిస్ ల మధ్య తిరిగాడు .ఇప్పుడు గీసిన ‘’ది ఫ్రూగల్ రిపాస్ట్ ‘’లో గుడ్డివాడు కళ్ళున్న స్త్రీ ఉంటారు .ఆయన చిత్రాల్లో గుడ్డితనం పునరావ్రుత్త మౌతుంది .’’బ్లైండ్ మాన్స్ మీల్’’గొప్ప చిత్రం .19 04నుండి 06వరకు ఉన్న రెండవ కాలాన్ని ‘’రోజ్ పీరియడ్ ‘’అంటారు .సర్కస్ జనాన్ని ఆరంజ్ ,పింక్ రంగులలో చిత్రించాడు .హీర్లేక్విన్ అనే హాస్యగాడిని గళ్ళ దుస్తులతో చిత్రించాడు .స్నేహితురాలు భార్య ఫెర్నాడే ఆలివర్ ను ఈకాలం లో చాలాచిత్రాలలో చూపాడు .లియో గేర్త్రుడ్ స్టెయిన్ ల అభిమానం పొందాడు .1907లో పారిస్ లో డేనియల్ హెన్రి కావీలర్ పెట్టిన ఆర్ట్ గాలేరీలో చేరాడు .
తరువాతది ఆఫ్రికన్ ప్రభావ కాలం .ఇది 1907నుంచి రెండేళ్ళు సాగింది .ఇదే తర్వాత క్యూబిజం లోకి దారి తీసింది .1909 నుంచి 12వరకు ఉన్నకాలాన్ని అనలిటికల్ క్యూబిజం పీరియడ్ అన్నారు .మోనో క్రోం బ్రౌనిష్ ,న్యూట్రల్ రంగులు వాడాడు .తర్వాత సిన్దేటిక్ క్యూబిజం లోకి ,తర్వాతా కోల్లెగ్ లోకి ప్రవేశించాడు(19 12-19).1911 .లో ఇటలీ చిత్రకారుడు లియోనార్డో డావిన్సి చిత్రించిన పరిసిద్ధ ‘’మోనాలిసా ‘’చిత్రాన్ని దొంగిలించాడని అరెస్ట్ చేశారు .విచారణ జరిగి వదిలేశారు .1915-17మధ్య రేఖీయ చిత్రాలకాలం .స్క్వేర్ కట్ డయమండ్స్ తో ప్రయోగాలు చేశాడు .ఈ కాలాన్ని ‘’క్రిస్టల్ పీరియడ్ ‘’అంటారు .
1917లో ఇటలీ మొదటిసారి వెళ్ళాడు .నియో క్లాసిక్ చిత్రాలు గీశాడు .1925లో సర్రియలిస్ట్ రచయిత ఆండ్రే బేటన్ -పికాసో ను తమవాడు అని ప్రకటించాడు .’’దేశ డిమో సిల్లెస్ మొదటిసారిగా యూరప్ లో తిరిగి సృష్టించాడు .సర్రియలిస్ట్ ఎక్సి బిషన్ లో క్యూబిస్ట్ ప్రదర్శన చేశాడు .1930లలో హీర్లేక్విన్ బదులు మినోటార్ను ఎక్కువగా గీశాడు .1935 నుంచి 1959వరకు 24 ఏళ్ళు పికాసో 300కు పైగా కవితలు రాశాడు 1949లో మూడవ అంతర్జాతీయ శిల్ప సదస్సు ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో జరిగింది .ప్రపంచ వ్యాప్తంగా 250మంది శిల్పులు పికాసో తో సహా పాల్గొన్నారు .మళ్ళీ శైలి మార్చాడు .చికాగో లో 50అడుగుల ఎత్తు ఉండే విగ్రహాన్ని నిర్మించటానికి పికాసోను ఆహ్వానించారు .దాన్ని ఇప్పుడు ‘’చికాగో పికాసా ‘’అంటారు .ఆయన జీవితం చివరలో చేసినవన్నీ మిశ్రమ శైలికి చెందినవే .
జీవితకాలం లో పికాసో యాభై వేల పనులు చేశాడు .అందులో 1885 పెయింటింగ్ లు ,1228శిల్పాలు ,28 80 సిరామిక్స్ ,సుమారు 12వేల డ్రాయింగ్ లున్నాయి . రంగును భావ వ్యక్తీకరణకు బాగా ఉయోగించిన వాడు పికాసో .పెయింట్ లో ఇసుక కూడా కలిపి రావాల్సిన ఎఫెక్ట్ సాధించాడు .అయన క్యూబిక్ విధానం ఆబ్స్ట్రాక్ట్ పద్ధతిలోకి దారి తీసింది .ఆయనది ‘’అతి విశాల చిత్ర స్వీయ చరిత్ర ‘’(వాస్ట్ పిక్టోరల్ ఆటో బయాగ్రఫి ).ఆయన చిత్రాలు అత్యంత ఎక్కువ ఖరీదుకు అమ్ముడయ్యాయి .’’గార్కాన్ ఆ లా పైప్ ‘’చిత్రం 104మిలియన్ డాలర్లకు లండన్ లో అమ్ముడయి రికార్డ్ సృష్టించింది .20 16 జూన్ 21న ‘’ఫెమ్మి అస్సేస్సే ‘’చిత్రం 43 .2మిలియన్ డాలర్లకులండన్ లోని సౌత్ బె లో కొన్నారంటే ఆయనపై అభిమానం ఈనాటికీ యెంత ఉందో తెలుస్తోంది .అదీ పాబ్లో పికాసో చిత్ర విజయం ..
ప్రఖ్యాత గుయెర్నికా చిత్రం
సశేషం చికాగో లో 50అడుగుల పికాసో చేసిన శిల్పం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-7-16 –ఉయ్యూరు