ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -188
71-చైతన్య స్రవంతి కి ప్రాణం పోసిన –జేమ్స్ జాయిస్
పుట్టిన దేశం ఐర్లాండ్ అంటే అమిత భక్తీ ,ఐరిష్ ప్రజలంటేయూరప్ లో ఆలస్యంగా వచ్చిన జాతి అనే విపరీత ద్వేషం ఉన్నవాడు జేమ్స్ జాయిస్ .స్వయం నిర్ణయం తో జీవితమంతా ప్రవాసం లో గడిపాడు .దరిద్రం, పక్షపాత ధోరణి ,అనారోగ్యం, దాదాపు గుడ్డితనం తో పోరాడుతూబతికాడు .యవ్వన దశలో ఐరిష్ రినైసంస్ అనే సంకుచిత జాతీయత కు వ్యతిరేకంగా ,పోరాడాడు .’’సెల్టిక్ ట్వి లైట్’’ను కల్టిక్ ట్వాలైట్అంటేకృత్రిమ వస్త్రాలంకరణఅంటూ నిరశి౦చాడు .సెల్టిక్ ఉద్యమ౦ లో ముఖ్యుడైన కవి విలియం బట్లర్ ఈట్స్ తో ‘’మనం చాలా ఆలస్యంగా కలుసుకొన్నాం .నువ్వు నా ప్రభావం పడటానికి చాలా ముసలాడివై పోయావు ‘’అన్నాడు .ఐరిష్ రివైవల్ కు చెందిన మిస్టిక్ సింబాలిజం ,స్థానిక పురాతన గాధలను తిరస్కరించి ,ఒక కొత్త హింసాత్మక భాషను కొత్త సింబల్స్ తో దానికి చెందిన ధారావాహిక జటిల విషయాలతో ఒక విస్తృత మైన తికమక పెట్టె ఆధునిక ప్రపంచ పురాణం రాశాడు.
అసలు పేరు జేమ్స్ ఆగస్టైన్ ఆలోసియస్ జాయిస్ .2 -2 -1882 న ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ దగ్గర జన్మించాడు .తల్లి గొప్ప సంగీత విద్వాంసురాలు .అది భర్తకు చర్చి కి మధ్య విభజన పొందింది .తండ్రి ఏదీ పట్టని , బాధ్యత లేని అందగాడు .తండ్రి నుంచి తీవ్ర స్వభావం ,సుస్వర గాత్రం వచ్చాయి .తనకు పుట్టిన 17మంది పిల్లలో జాయిస్ తన అభిమాన పుత్రుడు అని చెప్పుకోనేవాడు తండ్రి .అరవ ఏట జేసూట్ స్కూల్ లో చేరి ,తర్వాత కాన్గోస్ వుడ్ కాలేజి లో 3 ఏళ్ళు చదివాడు .తొమ్మిదో ఏట తండ్రి పొగడ్తలకు ఉబ్బిపోయి ఒక విలువైన అభినందన రాస్తే ,దాన్ని అచ్చు వేయించి తండ్రి డబ్లిన్ అంతా పంచిపెట్టాడు .11వ ఏట మరో జెసూట్ సంస్థకు కు చెందిన బెల్వేదర్ కాలేజి లో చేరి 4 ఏళ్ళు చదివాడు .ఇక్కడ తానూ రాసిన వ్యాసాలకు బహుమతులు పొందాడు .అందులో ముఖ్యమైనది ‘’నా అభిమాన హీరో ‘’.15వయసులోనే ఆయనకు నిరంతర దేశ సంచారి ,తుఫాను బాధితుడు యులిసెస్ అభిమాన హీరో అయ్యాడు .
16 నుంచి 20 వెళ్ళే వరకు యూని వర్సిటి కాలేజిలో చదివి చాలా పవిత్రమైన విద్యార్ధి అనిపించుకొని జెసూట్ ఆర్డర్ లో చేరుదామనుకొన్నాడు .ఇతరభాషా సాహిత్యాలను విపరీతంగా చదవటం తో అభిరుచి మారింది .20 కె లాటిన్ ఫ్రెంచ్ ,ఇటాలియన్ భాషలలో ఇంగ్లీష్ లో లాగానే ప్రావీణ్యం సాధించాడు.ఇబ్సెన్ అసలు సాహిత్యం చదవాలనుకొని నార్వేజియన్ భాష నేర్చాడు.18లో ‘’ఇబ్సన్స్ న్యు డ్రామా ‘’అనే వ్యాసం రాస్తే ప్రముఖ పత్రిక ‘’ఫోర్ట్ నైట్లి రివ్యు ‘’ప్రచురించింది . నార్వేజియన్ నాటక రచయిత ఇబ్సన్ కు జాబు రాసి అందులో ఆయన సత్యా రాదనను ,ఆయన కు కళా నియమాలపై ఉన్న ఉదాసీనతను అభినందించాడు .20 లో డిగ్రీ పొంది ‘’డబ్లిన్ గాంగ్ ‘’తో ఉండటం ఇష్టం లేక డబ్లిన్ వదిలి పారిస్ చేరాడు .’’ఎ పోర్ట్రైట్ ఆఫ్ ఆన్ ఆర్టిస్ట్ అస్ ఎ యాంగ్ మాన్ ‘’రచనలో దీన్ని వివరిస్తూ ‘’నాకు నమ్మకం లేని నా స్వంత ఇల్లు అయినా పితృ దేశమైనా లేక నా చర్చ్ అయినా నేను సేవ చేయలేను ‘’అన్నాడు .దీన్ని మరింత చేదుగా దూషణ భాషలోకవిత లో ఇలా చెప్పాడు –
‘’This lovely land always sent –her writers and artists to banishment –and in a spirit of Irish fun-betrayed her own leaders ,one by one ‘’.
పారిస్ కు ఒక సిఫార్సు ఉత్తరం రెండు పూడు పౌండ్లడబ్బు , కొన్నికవితలతో తో చేరాడు .అక్కడ ఏదో ఒక కాలేజి లో మెడిసిన్ చదవాలనుకొన్నాడు ,కాని దానికి ముందే డబ్బు కట్టాలని తెలుసుకొని విరమించుకొన్నాడు .డబ్బు సంపాదించే కవితలేవీ రాయలేక పోయాడు .కనుక చేతిలో పైసా కూడా లేకకడుపు మాడ్చుకొని దాదాపు పస్తులతో గడిపాడు .అతనికి అందుబాటులో ఉన్నది కోకా ఒక్కటే .అదే ఆయన యులిసేస్ లో సంస్కారపర౦గా సింబాలిక్ అయింది .తి౦డిలేకపోతే కండ ఉండదు కనుక జబ్బు పడ్డాడు .విపరీతమైన పంటి నొప్పి బాగా బాధించింది .పంటి చికిత్సకు డబ్బుల్లేవు .ఈ దెబ్బ తిన్న దంతాలవలననే తరువాత కంటి వ్యాధి వచ్చి కళ్ళు కనపడకుండా పోయాయి .ప్రొఫెషనల్ సింగర్ అవుదామని ఉంది .సంగీతపాఠాలు నేర్చుకొందామనుకొంటే గురు దక్షిణ కు గుడ్డి గవ్వ కూడా లేదు .ఆరు నెలల తర్వాత ఇంటికి రమ్మని కబురొచ్చింది తల్లి చావు బ్రతుకుల్లో ఉంది కొడుకును మత ప్రచారకునిగా ఉండమని కోరితే కాదు పోమ్మందుకు ఆమె జబ్బు మరీ పెరిగి చనిపోయింది
21 వ ఏడు సందడిగా గడిచింది .పూటుగా తాగి చేత పెన్నీ కూడా లేకుండాచింకి బొంత తో కొంప వదిలి వచ్చేశాడు .మురికి కూపాల గదులలో బతుకుతూ మారుతూ గడిపాడు .డాల్కీలోని క్లిఫ్తన్ స్కూల్ లో టీచర్ గా చేరి ఇతర భాషలను నేర్వటం మళ్ళీ మొదలు పెట్టాడు .నేషనల్ ఫెస్టివల్స్ లో టెనార్ పోటీలలో పాల్గొని అంతకు పూర్వం జన మెక్ కొమార్క్ లాగా విజయం సాధించాలనుకొన్నాడు .ప్రేక్షకులు ,న్యాయ నిర్ణేతలు ఆతని విధానాన్ని బాగా మెచ్చారు .అతనికే ప్రైజ్ వస్తుందని అందరూ అనుకొన్నారు. కాని మూడవ పరీక్ష సైట్ రీడింగ్ టెస్ట్ కు తాను సంగీతం చదవలేదని కనుక పూర్తీ న్యాయం చేయ లేనని చెప్పి అంగీకరించలేదు . రాజీ మార్గం వదిలేసి అక్కడినుండి బయటికి వెళ్ళిపోయాడు .అతని స్వర మాధుర్యం గ్రహించిన ఒక కోచ్ కొద్ది పాటి ఫీజు తో ఒపేరా సంగీతం నేర్పు తానని ముందుకొచ్చాడు .కాని ఆయనతో నిబంధనల గురించి మాట్లాడటానికి ఇష్ట పడలేదు .డాల్కేలో నారా బర్నాకిల్ అనే అమ్మాయిని ప్రేమించి 1904అక్టోబర్ లో పెళ్లి చేసుకొన్నాడు .కొత్తదంపతులు స్విట్జర్లాండ్ చేరారు .అక్కడ అనుకొన్న ఉద్యోగం రాక ,ట్రీస్టీచేరి బ్ర్లిత్జ్ స్కూల్ లో భాషా బోధకుడు గా కుదిరాడు .
ఇకపై పాతికేళ్ళ జాయిస్ జీవితం అంతా బాధ ,ప్రవాస చరిత్రే .ఒకదానిపై ఒకటి రోకటి పోట్లే.ముద్రణకు కానీ లేదు .ఆదరణ లేదు .అసంతృప్తి అసహనం ,అనుకొన్నది ఆలస్యంగా జరగటం ,డిప్రెషన్ లతో బాధామయ గాధ అయింది జేవితం .23 లో కొన్ని చిన్న కధలు రాసి ముద్రణకిస్తే పబ్లిషర్ కు అందులో ఉన్న నేచురలిజం చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పి పుస్తకం పూర్తీ అయినా చేతికివ్వలేదు .మరొకడు ఒప్పుకొని అచ్చువేసి జాయిస్ స్వంతంగా ప్రింట్ చేసుకొంటానంటే జాయిస్ కు అమ్మకానికి కూడా ఒప్పుకో లేదు .కోపం వచ్చి టైప్ ను ధ్వంసం చేసి కాగితాలను చింపి పారేశాడు .ఇది అచ్చు వేయటానికి పదేళ్ళు పట్టింది .1914లో లండన్ లో ఇదే ‘’డబ్లినర్స్ ‘’గా వెలుగు చూసింది .
జాయిస్ ముద్రించిన మొదటి పుస్తకం ‘’చేంబర్ మ్యూజిక్ ‘’కవితా సంపుటి 25 వ ఏట వెలువడింది.ఇందులో శ్లేష ,పరిహాసం ఉన్నాయి .ఈ విరుద్ధ విపరీత ప్రతి వాద కవిత్వ౦ తోనే జాయిస్ గుర్తింపు పొందాడు .ఇది ప్రయోగం కాదు .పూర్తిగా సంప్రదాయమే .17 వశతాబ్ది గాయకుల ,ఫ్రెంచ్ సింబాలిస్ట్ ల ,విలియం బట్లర్ ఈట్స్ తొలి లిరిక్కుల ప్రతిధ్వనులే ఇవి .దీని తర్వాత రచనలన్నీ తన సృజన ,కొత్త విషయాలతో రాసినవే .మైనర్ ఎలిజబెతేన్ సంగీతం అంటే జాయిస్ కు ప్రాణం . వచనాన్ని వదిలేశాక నలభైలలో మళ్ళీ కవిత్వం రాసి ‘’పోయెమ్స్ ఆఫ్ పెనీచ్ ‘’పేర ప్రచురించాడు .’’డబ్లినర్స్ ‘’అనువాదం .దీనిలోరిపోర్టర్ గా జాయిస్ ఉంటాడు .తాను పుట్టిన సిటి డబ్లిన్ లోని విషాద గాధల వివరణ .ఒకరకంగా స్వీయ చరిత్రకూడా .మొదటి మూడు కధలలో తనబాల్యం లో కొన్ని భాగాలున్నాయి .మిగిలినవన్నీ తన సమకాలికుల గర్వం పొగరు దాష్టీకం లపై దయారహిత వ్యాఖ్యానాలే .వ్యంగ్య చిత్రణే.ఇందులోని టు గాలంట్స్ ,ఈవేలిన్ ,కౌంటార్ పార్ట్ ,ది డేడ్ ఎపిసోడ్ లు బాగా ఆలోచింప జేసి యధార్ధాన్ని తెలియ బరుస్తాయి .చివరిది చాలా పదునైన సున్నితమైనకధ.ఇందులో పూర్తీ రియలిస్ట్ ,పూర్తిగా సింబలిస్ట్ గా మారుతాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-7-16 –ఉయ్యూరు