లిబరలిజం తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -187

70-న్యు డీల్  ,అమెరికన్ లిబరలిజం  తో నాలుగు సార్లు అమెరికన్ ప్రెసిడెంట్ అయిన – ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్-4(చివరి భాగం )

రెండవ ప్రపంచ యుద్ధం లోకి7-12 -1941న జపాన్ ప్రభువులు అమెరికాలోని పెరల్ హార్బర్ పై ఆత్మ హత్యా సదృశ పాశవిక దాడులతో ఆక్రమించే ప్రయత్నం లో  అమెరికా బలవంతాన లాగ బడింది .ఇలా చాల దేశాలలో జరిగినా రూజ్ వెల్ట్ దీన్ని ‘’ప్రజలలో విశ్వాసం ఉన్న వారికి నియంతలపై విశ్వాసం ఉన్న వారికి మధ్య జరిగే యుద్ధం ‘’అన్నాడు .చర్చిల్ తో చర్చించి ఐక్య రాజ్య సమితి ఏర్పాటు చేయించాడు .ఉత్తర ఆఫ్రికా పై ఆంగ్లో అమెరికన్ దాడి చేయించాడు .మిత్ర దేశ సైన్యాల పరస్పర సహకారం తో నాజీ నియంతృత్వాన్ని ఎదుర్కొవాలన్నాడు .టెహరాన్ లో మొదటి సారి రష్యా నియంత స్టాలిన్ తో సమావేశమై యుద్ధం లో గొప్ప ముందడుగుకు సిద్ధమై యూరప్ పడమటి తీరం పై విరుచుకుపడి జర్మని సర్వనాశనానికి పూను కొన్నాడు .

  1944లో అన్ని సంప్రదాయాలకు భిన్నంగా నాలుగో సారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేశాడు .పూర్వం అంత కాకపోయినా మంచి మేజారిటీతోనే నెగ్గాడు .ప్రజలకు ఆయనపై పూర్తీ విశ్వాసం ఉంది .విపక్షులు కాకి గోల చేశాయి .రిపబ్లికన్ అభ్యర్ధి ధామస్ యి డ్యూయీ కి కేవలం 99ఎలెక్టోరల్ ఓట్లు మాత్రమే వచ్చాయి .రూజ్ వెల్ట్ కు 432 .దేశావ్యాప్తంగా వేలాదిమందితో పరిచయాలు ,మిలియన్ల కొద్దీ  ఆరాధకులు ,ఉన్నప్పటికీ సన్నిహితులు అతి తక్కువ మందే ఉండేవారు .ఆయనపై భారం అధికమైంది .62 ఏళ్ళ వాడు బాగా ముసలాడిగాకనిపిస్తున్నాడు .జుట్టు తెల్లబడింది కవళికలు బలహీనమై  భావ వ్యక్తీకరణ గంభీరమై  ముఖం పాలి పోయింది.ఒంటరివాడై దిగులుగా ఉన్నాడు .యుద్ద౦ ఎలాంటి ముగింపు ఇస్తు౦దోనని ఆందోళన పడుతున్నాడు .శాంతి భయ పెడుతోంది .శాంతికోసం మళ్ళీ యాల్టా లో చర్చిల్ స్టాలిన్ లతో భేటీ వేశాడు .ఈ సమావేశం బాధాకర వివాదాలను ,అనంతమైన వైరుధ్యాలను కలిగించింది . నిందించే వాళ్ళు ‘’బుజ్జగింపులు ‘’,ద్రోహం ‘’,అమ్మేశాడు ‘’అన్నారు .ఈ వ్యతిరేకత ఆయన చనిపోయినా ,డెమొక్రాట్ లు1952లో  ఘోరం గా ఓడిపోయేదాకా ఆగలేదు  .రష్యా సైన్యం పోలాండ్ ను ఆక్రమించి,పడమటి వైపుకు దూసుకొస్తున్నాయి .రూజ్ వెల్ట్ బేరాలు ,ఒడంబడిక లలో మునిగాడు కొన్ని బెడిసి కొట్టాయి .శాశ్వత శాంతి స్థాపన సాధ్యమే నని పూర్తిగా నమ్మాడు కాని అది తప్పు అని తేలింది .యుద్ధం ముగియటానికి ,అతి త్వరగా పూర్తీ అవటానికి తొందర పడ్డాడు .ఒడంబడికలన్నీ రష్యా ఉల్లంఘించింది .దీన్ని రూజ్ వెల్ట్ ముందే గ్రహించి ఉండాల్సింది .కాని ఆయన ఆశతో ,భయం తో పరస్పర అవగాహన ,సౌహార్దత పొందవచ్చు అనుకొన్నాడు .

   కొన్ని వారాల తర్వాత 63వ పుట్టిన రోజున కాంగ్రెస్ కు యాల్తాసమావేశ విషయాలు వివరించి చెప్పాడు .అలసి సొలసి వార్మ్ స్ప్రింగ్స్ కు  మార్చ్ చివరలో విశ్రాంతికి వెళ్ళాడు   .రెండు వారాల తర్వాత ఆయన పోర్ట్రైట్ పూర్తి అయ్యాక అకస్మాత్తుగా ఒక రోజు  విపరీతమైన తల నొప్పి వచ్చి బాధ పడ్డాడు .మరొక మూడు గంటల లోపే సెరిబ్రల్ హేమరేజ్ వచ్చి 1945ఏప్రిల్ 12 సాయంత్రం 5-47గం లకు తుది శ్వాస విడిచాడు .ఈ విషాద వార్తా దేశమంతా వార్తామాధ్యమాల ద్వారా జనాలకు తెలిసింది .అమెరికా మొత్తం అచేతనమై వణికి పోయింది .ఆయనను నమ్ముకొని  ఆయనపైనే ఆధార పడి ఈ 13 ఏళ్ళు జీవించిన మిలియన్ల జనం ఒక్కసారిగా నిశ్చేస్టు లయ్యారు .ఆయన అంత్య క్రియలనాడు ఆబాల వృద్ధ జనం అందరూ ఆపుకోలేని ఏడుపుతో పొర్లి పొర్లి దుఖించారు .ప్రపంచ వ్యాప్తంగా నాయకులు ఒకరినొకరు కలుసుకొని ఊరడించు కొన్నారు .ఆయనకు నలుగురు కొడుకులు ,ఒక కుమార్తె. భార్య అన్నా ఎలినార్ గొప్ప మానవతా వాది,ప్రజాసంబంధాలు బాగా కలిగిన ప్రధమ మహిళ.

  రూజ్ వెల్ట్ పై పన్నీరు చల్లారు బురదాచిమ్మారు .ఆయన పాలనలో కాపిటలిజం బాగా పెరిగిందని ,స్వేచ్చా వాణిజ్యం దెబ్బతిందని,తన క్లాస్ వారిని మోసగించాడని ఆరోపణలున్నాయి .అయినా ఆయన చేసిందిఅంతా  ప్రజా సంక్షేమం కోసమే .అభి వృద్ధి విధానం లో న్యు డీల్ గొప్ప ముందడుగు .సామాన్యమానవుడు అంటే ఆలోచన లేని వాడుకాడని ఆతను ఒక వినియోగ దారుడు అని గుర్తించి గౌరవించిన వాడు రూజ్ వెల్ట్ .ఈ సామాన్య మానవులే వినియోగ దారులుగా ప్రవర్తించక పొతే తన క్లాస్ వాళ్ళు నట్టేట మునిగే వాళ్ళు అంటాడు .కేపిటలిజం అమెరికాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉంది అన్నాడు .’’వైట్ హౌస్ లో కుంటాడు ‘’అని శత్రువులు దెప్పినా ,ఆయన్ను అర్ధం చేసుకోన్నవాళ్ళు ఆరాధించారు .ఆయన్నుమరింత హాయిగా జీవించగలిగే  ప్రపంచాన్నిచ్చిన ప్రపంచ  పౌరుడు అన్నారు .స్టీఫెన్ వింసేట్ బెంట్ కవి మాటలలో రూజ్ వెల్ట్ ‘A country squire from Hyde Park with a Harvard  accent –who never failed the people –and whom the people will not fail ‘’

    మాంచి దాటీ వక్త యే కాని గొప్ప రచయిత కాదు రూజ్ వెల్ట్ .వివాదం లో ,అసమ్మతి ప్రకటనలో గొప్పవాడు కాదు కాని గొప్పతనం పొందాడు .దాన్ని ప్రతి సందర్భం లోనూ వికిరణ  కాంతి లాగా ప్రదర్శించేవాడు .ఆయన ప్రతి పాడించిన ’’ ది సమ్మరి ఆఫ్ ఫోర్ ఫ్రీడంస్ ‘’ప్రపంచ వ్యాప్త ప్రచారం పొందింది .’’the first is the  freedom of speech and expression –everywhere in the world .The second is freedom of every person to worship god in his own way –everywhere in the world .The third is freedom from want –everywhere in the world .The fourth is freedom from fear which translated into world terms ,means a worldwide reduction of armaments to such a point  that no nation will be in a position to commit an act of physical aggression against any neighbor –anywhere in the world .That is no vision of a distant millennium .It is a definite base for a kind of world attainable in our own time and generation ‘’అన్న మహోన్నత మానవతా మూర్తిమత్వం రూజ్ వెల్ట్ ది .   రూజ్ వెల్ట్ మైనారిటీల హీరో .ముఖ్యంగా ఆఫ్రో అమెరికన్ ల ,కేధలిక్కుల, జ్యూ ల సంక్షేమాన్ని అమలు చేశాడు .చైనా ,ఫిలిప్పినో అమెరికన్ల అభిమానం ,మద్దతు పొందాడు ,న్యు డీల్ లో వీరందరి అభి వృద్ధికి దోహద పడ్డాడు .ఆఫ్రికన్ అమెరికన్ ల పౌరహక్కులకోసం ప్రయత్నించాడు . అమెరికాలోఉన్నపౌరసత్వం లేని  ఇటలీ పౌరులు ఆరు లక్షలమంది పై  ఉన్న ఆంక్షలను 1942అక్టోబర్ లో తొలగించాడు .లక్షా ఇరవై వేలమంది జపనీయులను వెస్ట్ కోస్ట్ ను వదిలి పొమ్మన్నాడు . Reflecting on Roosevelt’s presidency, “which brought the United States through the Great Depression and World War II to a prosperous future”, said FDR’s biographer Jean Edward Smith in 2007, “He lifted himself from a wheelchair to lift the nation from its knees.

ఆయన హైడ్ పార్క్ నివాసం జాతీయ చారిత్రిక చిహ్నంగా మార్చారు .వాషింగ్టన్ డి సి లో ఏడున్నర ఎకరాలలో ఆయన మెమోరియల్ ఏర్పాటు చేశారు .

Inline image 1Inline image 2

   సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3 7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.