ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -191
72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి
‘’క్రమం యొక్క కీర్తి సారమే సౌందర్యం ‘’అన్నాడు రష్యన్ స్వరకర్త ఇగార్ స్ట్రా విన్స్కి.1913లో పార్శియన్ పబ్లిక్ ముందు ‘’ది రైట్ ఆఫ్ స్ప్రింగ్ ‘’బాల్లేట్ ను అన్ని సంప్రదాయాలను విస్మరించి విభిన్నంగా ప్రదర్శించినపుడు అది విప్లవాత్మకమో ,విధ్వంసకమో శూన్యమో తెలియక జుట్లు పీక్కుని ప్రేక్షకులు నిరసన ,ఆందోళన ,ఈలలు ,అరుపులు ,పిల్లికూతలు ,కేకలతో రాళ్ళవాన తో భీభత్సం సృష్టించారు . ఈ భీభత్సం వాగ్నర్ కు జరిగిన పరాభవాన్ని గుర్తు చేసింది .వేదిక మీద వాద్య ధ్వనులకంటే ,ఈ గొడవే ఎక్కువగా విని పించింది .సభలో ఉన్న అమెరికన్ క్రిటిక్ కార్ల్ వాన్ వేచ్ టెన్ లేచి నిలబడి ‘’ఈ కుర్రాడి సంగీతం వింటుంటే నా నెత్తి మీద అతని చేతులతో ముష్టి ఘాతాలు చేస్తున్నట్లుంది .అన్ని సంప్రదాయాల్ని నాశనం చేశాడు .నా భావోద్వేగం ఏమిటంటే ఆ దెబ్బలు కొంచెం సేపు నాకు బాధ కలిగించలేదు ‘’అన్నాడు .
ఇగార్ స్ట్రా విస్కీ ముఖ్య లక్షణం భావోద్విగ్నత ను ప్రేరేపించటం .సంగీత పరమార్ధం ‘’వస్తువుల విషయాలమధ్య క్రమాన్ని సృష్టించటం ,దీనికి మించి మనిషికి ,కాలానికి మధ్య క్రమత్వం నెలకొల్పటం ‘’అంటాడు ఇగార్ ..ఎమోషన్ ను ప్రసరి౦ప చేయటం లేక సృజనలో అర్ధాన్ని కల్పించటమే కాక స్ట్రా విన్స్కి ఆర్ట్ –ఒక మేధా కార్యక్రమం ,స్వర సమూహాన్ని కొన్ని విరామాలలో క్రమబద్ధం చేయటం అతని ప్రత్యేకత .ఇంద్రియాలకు ప్రత్యేక విన్నపాలను చేయటం ,శృంగార స్పూర్తి కలిగించా-టాన్ని వ్యతిరేకించాడు .అలా చేస్తే కాక్టియాచెప్పినట్లు ‘’హృదయాన్ని బ్లాక్ మెయిల్ ‘’చేయటమే నంటాడు .హేతు వాది .ఎమర్సన్ చెప్పిన ‘’transcendentalism’’అంటే అతీత భావ వాదం ,అందులోని ‘’beauty is its own excuse for being ‘’నచ్చినవాడు .దీన్ని సాధనక్రమం లో సాధించాలనుకొన్నాడు .స్వర కల్పన నిత్యకృత్యం అంటాడు .అలాకాకపోతే వాడని వాయిద్యం పనికి రాకుండా పోయినట్లు ఇదీ పాడై పోతుంది .నిత్యాభ్యాసం లేక పోతే సంగీత కర్త కు ప్రగతి ఉండదు అంటాడు .ఏదైనా సృష్టించే ముందు స్పూర్తికోసం ఎదురు చూడాలి అను కొంటారు ఎక్కువ మంది ..ప్రేరణ ను తాను కాదు అనలేనని ,అది ముందుకు తీసుకుపోయే శక్తి అని ,ప్రతి మానవ క్రియకు అవసరమేనని అంతమాత్రం చేత అది ఒక్కటే ఆర్టిస్ట్ యొక్క ఆస్థికాదని అంటాడు .నిరంతర ప్రయత్నం ,ప్రయాస బుద్ధికి అవసరం .అదే స్ట్రావిన్స్కి సంగీత వైవిధ్యానికి ముఖ్య సోపానాలు .అదే ఆతని ‘’thinking of the music ‘’.
1882లో రష్యన్ కాలెండర్ ప్రకారం జూన్ 5,పాశ్చాత్య కాలమానం ప్రకారం 17 న సెయింట్ ఇగార్ దినోత్సవం నాడుజన్మించాడు .తండ్రి ఫియోడర్ స్ట్రావిన్స్కిప్రసిద్ధ బాస్ సింగర్ .ఇదే మూడోకొడుకు విగార్ కు సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరున్న ఒరానీన్ బాం లో సంక్రమించింది .ఆరేళ్ళ వయసులోనే పియానో పై చిన్న చిన్న విషయాలు వాయించేవాడు .అవి గోప్పవేమీకాడు .19 వయసులో రిమ్స్కి కోరాకాఫ్ కు వాయించినప్పుడూ అభి వృద్ధి కనిపించలేదు.24 లో షిహారజేడ్ కంపోజర్ అతనికి నేర్పటానికి ఒప్పుకొన్నాడు .గురువుగారికంటే ఓరిఎంటల్ మ్యూజిక్ లో చాలా ముందుకు దూసుకు పోయినా తన ప్రేరకుడిని ఎప్పుడూ గుర్తుంచుకొంటాడు .గురువు కూతురు రిమ్స్కి ని పెళ్లి చేసుకొన్నప్పుడు స్ట్రా విన్స్కి ఒక సింఫనీ కవిత ‘’ఫైర్ వర్క్స్ ‘’రాశాడు ,గర్భాదానంతర్వాత నాలుగు రోజులకు రిమ్స్కి కోర్సాకాఫ్ చనిపోయాడు .గురువు స్మృత్యర్ధం శిష్యుడు ‘’చాంట్ ఫోనేబర్ ‘’ కంపోజ్ చేశాడు .
ఇంకా చదువులోనే ఉండి,పియానో పై ఎట్యూడ్స్ ను సాధన చేస్తుండగా రష్యన్ బాలెట్ ను విప్లవావాత్మకంగా మార్చేసిన సెర్జీ డయాఘిలేవ్ తో పరిచయం కలిగింది .ఈయన 70బాలెట్ లను ప్రదర్శించే ఆలోచనలో ఉండి,డేబస్సి,ఫాలా ,ఆలిక్ ,పౌలీన్ రిమ్స్కి లతో సంగీత౦ చేయిస్తున్నాడు .కర్టెన్లు రంగాలంకరణ దుస్తుల డిజైన్ కు పికాసో వంటి ప్రసిద్ధులను నియమించుకొన్నాడు .స్ట్రా విన్స్కి శక్తి సామర్ధ్యాలు తెలిసిన వాడుకనుక చేరమనికోరాడు .అతనికి పని ఎలా చేయించుకో వాలో తెలుసు ..అతని మార్గదర్శకత్వం లో స్ట్రావిన్స్కి స్థానిక రష్యన్ సంగీత కారుడి అవతారం నుండి అంతర్జాతీయ యూరోపియన్ అవతారమెత్తాడు .
1909 లో డయాఘిలేవ్ ప్రోత్సాహం తో స్ట్రా విన్స్కి ‘’ది ఫైర్ బర్డ్ ‘’,తో బాటు మరొక దానికీ సంగీత సమకూర్చాడు .కాని అతనిపై రష్యా సంగీత ప్రభావం ఇంకా దూరం కాలేదు .పియానో శబ్దాలను మిగతా ఆర్కెస్ట్రా మింగేసి కర్ణ కఠోర శబ్దాలను సృష్టించింది .పపెట్ ప్రదర్శన దారుణంగా విఫలమైంది .అయినా డయాఘిలేవ్ స్వయంగా తర్వాత కలిసి జరిగిందేదో జరిగింది దాన్ని పూర్తీ బాల్లేట్ గా మార్చే ప్రయత్నం చేసి సత్తా చూపించమని ప్రోత్సహించాడు .’’పెట్రౌ చకా ‘’లో తన సామర్ధ్యం ప్రదర్శించాడు .రష్యన్ జానపద ట్యూన్స్ వాడి ,స్వంత బాణీ ప్రదర్శించాడు .కొత్త రిధం లను ప్రయోగించాడు .మధురం శ్రావ్యత కలిపించాడు .కాని ఇదంతా చాలా ప్రాధమిక దశకు చెందినదే అనిపించింది .స్వేచ్చా వాతావరణానికి 31 వ ఏడాది లో ప్రవేశించి ‘’లీ సాక్రే డుప్రిన్టేమ్స్’’కు స్వర రచన చేశాడు .చరిత్రాతీత త్యాగ కద ఒక్కసారిగా ఆయన మనసులోకి వచ్చింది .తన ఊహలో ‘’ఒక పాగాన్ ఉత్సవం లో గుండ్రంగా కూర్చున్న వృద్ధ తాపసులు చూస్తూ ఉండగా నడుమ ఒక యువతి డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోవటం .ఆమెను రాబోయే శుభ వసంతానికి బలిగా చేయటం ఇందులో కద.ఒక గుహ ,అందులో వెర్రి ఆవేశపు స్త్రీలు ,హిప్నటైజ్ అయిన కౌమారదశ వారు ,కన్యరికాన్ని కాపాడుకోన్నవాళ్ళు ,వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవటం కలుసుకోవటం ,ఆనందించటం విడిపోవటం అంతా అత్యంత సహజమైన డాన్స్ లతో ప్రక్రుతి శక్తుల నృత్యాలతో తీర్చి దిద్దాడు .నియంత్రణలో ఉన్న హింస ఉండటం తో ఇది మాస్టర్ పీస్ అని పించుకోన్నది .దీనిపై జీన్ కాక్టువా రాస్తూ ‘’ఆటవిక దుఖం బాధ ,చి౦తల పుట్టుకలో భూమి ,పొలాలపై కేకలు, సన్నని మాధుర్యాలు ,శతాబ్దాల కిందటి వాతావరణం ,పశువుల నెమరువేతలు,పూర్తీ ప్రక్రుతి సౌందర్యాన్నిఒడిసి పట్టి చాలా గొప్పగా సిమ్ఫనైజ్ చేశాడు ‘’అని రాశాడు .ఇందులోని సంగీత విలువలు చిరస్మరణీయం .ప్రతిదీ సెంట్రి ఫ్యూగల్ శక్తితో చలించింది .రెండు విభిన్న తాళాలతో శ్రుతి కల్గించాడు .వరుసక్రమంలో మనుషులు వంగటం ,తుఫాను గోధుమ చేను పై విరుచుకు పడ్డట్టు ఆడవాళ్ళ భుజాల మీద నుండి దాటుకు పోవటం,తమ మడమలను కాల్చుకోవటం ఓహ్ పరమాద్భుతం అని పించింది .’’Srtavinsky ;s dancers are not merely electrified by these rhythmic disturbances ,they are electrocuted ‘’ అని మహా ఇదిగా మెచ్చుకొన్నారు అతని సృజన విజ్రుమ్భించి శత పత్ర పద్మ సుందరిలావికసించి మనసులకు హృదయాలకు మహదానందాన్ని పంచింది .అలౌకిక అనుభూతికి లోను చేసింది .రాళ్ళ దెబ్బలు కొట్టిన ప్రేక్షకులను స్వర సమ్మోహనం చేసి తానే ఇప్పుడు సు స్వరాలతో బాది పారేసి ప్రతీకారం తీర్చుకొన్నాడు స్ట్రా విస్కీ.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -5-7-16 –ఉయ్యూరు .