ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -192

72-20 వ శతాబ్ది ప్రముఖ ప్రభావ రష్యన్ స్వర కర్త –ఇగార్ స్ట్రావిన్స్కి-2 (చివరి భాగం )

సాధారణ సంగీత సూత్రాలకు విరుద్ధంగా పెట్రౌచాకా ,షాకెర్ లను చేశాడు .ఆకస్మిక అంతర్వేశనం(ఇంటర్ పోలేషన్ ) ,దారుణ దాట్లు,సంబంధం లేని ఫ్రేజులుతో  ఒక తరాన్ని అంతటిని ప్రభావితం చేశాడు .సంగీత కర్తలు కొత్తగా చెప్పాలన్న ఆలోచనలకు వచ్చారు .వీటితోపరిచయం లేని వారు నేర్చుకొని చేయాల్సి వచ్చింది .స్ట్రా విన్స్కి ఎక్కడా రాజీ పడలేదు .వినేవారికి చేసేవారికి అసూయ కలిగించలేదు  .తన నెర్వస్ ఎనర్జికి సమాధానం చెప్పాడు .శబ్ద జంఝకు,వైరుధ్యానికి  విముక్తి కల్గించి దూసుకు పోయాడు .1914లో స్వల్పకాలం రష్యాలో గడిపాడు .ఇదే చివరి దర్శనం .తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళాడు .దీనివలన రష్యా నేపధ్యం తో ఏవేవో చేయాలనే ఊహ కలిగింది .వెంటనే రష్యన్ జానపద గీతాలతో ‘’ప్రిబౌతి ‘’,ను ఒకే గాత్రం తో ఎనిమిది వాయిద్యాలతో ను ,’’బెర్స్యూఎస్ డి చాట్ ‘’ను మూడు క్లారినెట్ లతో ,’’రేనార్డ్ ‘’ను రష్యన్ ఫోక్ మేలదీస్ తో ఒపెరాను చేశాడు .రష్యా విప్లవ సమయం లో రోమ్ లో ఉండి పోయాడు .అక్కడే ‘’వోల్గా బోట్ మన్స్ సాంగ్స్ ‘’పేరఒక ఆర్కెస్ట్రా కు రాశాడు .దీని డయాఘిలేవ్ నిర్మాణం లో చేశాడు .

మరో రష్యన్ ఆధార ‘’లేస్ నోసెస్ ‘’అనే పెళ్లి సందడి ని రష్యా సంప్రదాయ జానపద బాణీలతో నేపధ్యం తో శతాబ్దాలక్రితం రష్యా పల్లెటూర్లలో  జరిగే  పెళ్లి వేడుకలలోని అన్ని విషయాలకు పునః ప్రాణ ప్రతిష్ట చేశాడు .’’ఆ ఆచారాలు కట్టుబాట్లు నాకోసమే ఉన్నాయా అన్నట్లు స్వేచ్చగా వాడుకొన్నాను సంగీతం లో ఆడుకొన్నాను ‘’అన్నాడు .అదొక బృహత్తర ,నమ్మశక్యం కాని17 విభిన్న వాయిద్యాల సమ్మేళనం .దీన్ని గురించి వివరిస్తూ ‘’there were no strings or wood winds  no harmonic pleasantries  or instrumental sonorities ,choruses  piled on top of choruses –dwarfed the soloists –the constant use  of voices ,chanting in authentic folk accents even shouting and at times screaming ,is a guarantee against any intrusion not nakedly indigenous ‘’అని అర్ధర్ బెర్జేర్ ‘’మ్యూజిక్ ఫర్ ది బాలెట్ ‘’లో రాశాడు .ఎల్ హిస్ట్ రే డు సోల్దాట్’’ ను స్విస్ లో ఉండగానే చేశాడు .దెయ్యం వలలో చిక్కిన ఒక రష్యన్ సైనికుడి కద.యుద్ధ సమయం కనుక చాలా పొదుపుగా చేశాడు .స్టేజి పైఒక ప్రక్క  వివరించే వాడు ,రెండవ వైపు 7 వాయిద్యాలు మాత్రమే ఉంచాడు .ఈ రెండిటినడుమ నాటకం నడుస్తుంది .చిన్న చిన్న ఎపిసోడ్ లతో ఒకదానికొకటి ఉన్న సంబంధం తో నడిచే దీన్ని ఆయన ‘’రాగ్ టైం ‘’అన్నాడు .అప్పటికే 1916కె అమెరికాలోని నూతన సంగీతం ఆయన చెవిన పడింది .తనతో ఎంతో జాజ్ సంగీతాన్ని తెచ్చుకొన్నాడు 11-11-1918 ‘’ఆర్మిస్టిస్ ‘’రోజున ఒక నివాళిగా భవిష్యత్తులో తన దేశం కాబోతున్న అమెరికాకు కానుకగా ఇచ్చాడు.దీన్నీ ‘’రాగ్ టైం ‘’అనే అన్నాడు .11 వాయిద్యాలతో అద్భుత శబ్ద సృష్టి చేశాడు .తనను తానే అధిగమించాడు .

  ప్రేక్షకులకు స్ట్రా విన్స్కి ‘’ఆబ్స్ట్రాక్ట్ మ్యూజిక్ ‘’ను కోరుకొంటున్నారు .టోన్ పోయెమ్స్  ,ప్రోగ్రాం మ్యూజిక్ లపై వీటిని రాశాడు .ఎక్కువ మంది అభిప్రాయం ప్రకారం ఆయనకు దియేటర్ పరిధి దాటిన విస్తృత స్వర సమ్మేళనాలు ఉండాలని కోరుకొన్నారు .అవే ఆయన సంగీత విలువలను ,ఆచరణీయఅంశాలను గా మారుస్తాయి .35వయసులొ స్విస్ ను వదిలి ఫ్రాన్స్ చేరి 16ఏళ్ళ తర్వాత పౌరసత్వం పొందాడు .హార్మానిక్ రిధమిక్ అతి ని వదిలి నిరాడంబర నియో క్లాసిజం వైపుకు మారాడు .’’సంగీతం సరైన విజ్ఞానం .కనుక దానినుండి ఏదో సందేశం లేక అర్ధం ఆశించరాదు దాన్ని దానిగానే అనుభవించాలి ‘’అన్నాడు .నలభై లలో చేసినదంతా స్వచ్చమైన ఆబ్ స్ట్రాక్ట్ సంగీతమే .

నలభై దాటాక క్లాసికల్ మ్యూజిక్ వైపుకు కదిలాడు .గాలి వాయిద్యాలకోసం ఒక ఆక్టేవ్ రాశాడు .పియానో వయోలిన్ ల మేళనం వదిలేశాడు .గాలి వాద్యాలపైనే ఎక్కువగా పని చేశాడు .అవి స్వచ్చమైనవి ,ప్రతిధ్వనినిచ్చి మానసికానందాన్ని చ్చేవి అన్నాడు .స్వచ్చమైన నాదం కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు .గతాన్ని మళ్ళీ నెమరేసుకొన్నాడు .’’పల్సినేల్ల ‘’లోపాత మాధుర్య స్వరాలను వాడాడు .పెర్గోలేసి ,చికో విస్కీ ల సుస్వరాలను వాడుకొన్నాడు .దీనిపై స్పందిస్తూ ‘’శిశు జననం తర్వాత రేప్ నిజమే ననిపిస్తుంది ‘’అని సమర్ధించుకొన్నాడు .ఇతర సంగీత కర్తల ట్యూన్స్ ను చక్కగా వాడి కొత్తతరానికి పరిచయం చేశాడు .

 ఇటలీ పర్యటనలో ఉండగా తాను మరీ మరీ ప్రాచీనం వైపు వెడుతున్నానని భావించాడు .దీనిఫలితంగా తన స్నేహితుడు జీన్ కాక్టువా ను ‘ఫ్రెంచ్ భాషలో ఉన్న ’ఈడిపస్ రెక్స్ ‘’ను లాటిన్ లోకి అనువాదం చేయమని కోరాడు .కొద్దిగా తనకు లాటిన్ వచ్చుకనుక అందులోని పదాలను ఫోనెటిక్ సామగ్రికోసం వాడుకోవచ్చు అనుకొన్నాడు .శబ్దాలపై ఒత్తిడి కల్పించి ఇంద్రియాలు వాటి జాగ్రత్త అవి పడేట్లు చేయాలని సంకల్పించాడు  .ఈ ఒపేరా –ఆర టోరియో  తర్వాత మరొకటి క్లాసిజ ప్రకాశం తో ‘’అపోలాన్ ముసగేట్స్ ‘’చేసి మొదటి సారి 1925లో అమెరికా వెళ్లి అక్కడ ఎలిజబెత్ స్ప్రేగ్ కూలిడ్జ్ తో ఆవిష్కరింప జేశాడు  .మళ్ళీ తంత్రీ వాయిద్యాలు ఉపయోగించి ఆర్కెస్ట్రా తో డామినేట్ చేయింఛి బహు సొగసైన వీనుల విందైన ,మార్మిక అస్థిరత తో మారు మోగింఛి సంగీతం లో రస ధునులు సృష్టించిన బాష్ ,హాండెల్ లను గుర్తుకు తెచ్చాడు . .

1929లో  డయాఘలేవ్ మరణం తర్వాత పూర్తిగా దియేటర్ సంబంధం లేని సంగీతాన్నే కూర్చాడు యూరప్ లో ఉంటున్నా ద్రుష్టి అమెరికావైపే ఉండేది .19 30 లో బోస్టన్ సింఫనీ  50 వ వార్షికోత్సవానికి ఒక సింఫనీ రాయమని ఆహ్వానించారు .’’19 వ శతాబ్ది నుండి వార సత్వంగా వచ్చిన సింఫనీ మనకు భాష ,ఆలోచనలు రెండిటిలోనూ విదేశీ వాసన కలది ‘’అని భావించి ఉపేక్షించాడు .కనుక మానవ స్వరాలను ఆర్కెస్ట్రా స్వరాలతో కలిపి నియోక్లాసిక్ పీరియడ్ కు చెందిన అద్భుత స్వర సృష్టి చేశాడు .తన జీవితచరిత్రలో దీనిపై రాస్తూ ‘’సింఫనీ భిన్నస్వరాలతోఅభి వృద్ధి చెందినఒక విశేషమేకాని కాని నా ఆలోచనల మేరకు విస్తృత పరచాలనుకోన్నాను .కనుక కోరల్ ,వాయిద్యాల కలగలుపు తో వినూత్న అందాన్ని తెద్దామనుకోన్నాను .రెండిటికి సమాన ప్రాదాన్యమిచ్చి ఒకదాన్ని మరొకటి ఆక్రమి౦ చ కుండా జాగ్రత్త పడ్డాను .పదాలను ప్రత్యేకంగా సృష్టించి పాడించాను .సాల్టర్ నుంచి దీన్ని వాడుకోవాలనే ఆలోచన వచ్చింది .’’సింఫనీ ఆఫ్ సాల్మ్స్ ‘’లో స్ట్రా విన్స్కి పదాలను నాదాల కోసం లాటిన్ లోని వల్గేట్ నుంచి గ్రహించాడు ..50 ఏళ్ళు వచ్చేసరికి మరింత ఘనమైన స్వర కర్త అయ్యాడు .వయోలిన్ ,పియానోలకు ‘’యుగళ కన్సర్తెంట్ ‘’చేశాడు .’’పెర్సేఫోన్ ‘’కంసర్ట్ కు రెండు పియానాలతో  సమకూర్చాడు .16 వాయిద్యాలతో మరో కంసేర్ట్ చేశాడు .

 20వ ఏట రెండవ కజిన్ నడేజా సౌలిమాను పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలకు త౦డ్రి అయ్యాడు .పెళ్లి అయిన 33 ఏళ్ళకు భార్య చనిపోయింది .యూరప్ అంటే విసుగు పుట్టి అమెరికాకు వెళ్ళిపోయాడు .అక్కడ మాసా చూసేట్స్ లోని  బెడ్ ఫోర్డ్ లో 58వ ఏట వేరాసుడేకేన్ ను పెళ్ళాడి ,మూడవ పిత్రు దేశమైన అమెరికాలో స్థిరపడి 63వ ఏట అమెరికన్ పౌరుడయ్యాడు .70 వయసులో పూర్తీ ఒపేరా ‘’ది రేక్స్  ప్రోగ్రెస్ ‘’ను 18న్ వ శతాబ్ది కి చెందినవిలియం హోగార్త్ శిల్పరచనకు  పరవశుడై ,దానినాదారంగా 20 వ శతాబ్ది కధనుమాంచి శక్తి వంతంగా దూకుడుగా డబ్ల్యు హెచ్ ఆడెన్ , చెస్టర్ర్ కాల్ మన్  కవులు కల్పిత కధగా మలిచిన దాన్ని తీసుకొని ,తనదికాని భాషలో ఉన్నదాన్ని అక్షర నాదాలను బట్టి సోనాట్ యూనిటీ గా పరివర్తన చెందించాడు .ఇప్పుడుకూడా విమర్శకులు అది స్వీయమా ,లేక ఇతర స్వరకర్తలైన హాన్డెల్, మొజార్ట్  టేకోవ్ స్కి ల   కాపీ యా?అని ప్రశ్నించారు   .కాని ఇర్వింగ్ కోలేడిన్ మాత్రం అంతగా మెచ్చక పోయినా ,ఆడెన్ ,కల్లాం పాఠాన్ని అతి నూతనంగా ,తెలివిగా ,చిరస్థాయిగా నిలిచే సంగీతం తో ప్రకాశింప జేశాడు .ఇది ఏనాటికైనా మనతరం లోనే కాదు భవిష్యత్ తరాలలో కూడా అరుదైన ప్రయోగం అని పించు కొంటుంది  అన్నాడు .

స్ట్రా విన్స్కి చిత్రాన్ని పికాసో ,కాక్టువాలు అద్భుతంగా గీశారు .’’లైఫ్ ‘’మేగజైన్ లో విన్త్రాప్ సార్జంట్ దీనిపై రాస్తూ ‘’ఒక కొత్త ఇమేజ్ లాఉంది .బరువైన హారన్ రిమ్మేడ్ కళ్ళ అద్దాలతో అయన దేనిమీదో ముందు ద్రుష్టి పెట్టిన గొల్లభామ లాగా కనిపిస్తున్నాడు ‘’అని  కామెంట్ చేశాడు (his aquiline nose and heavy horn –rimmed glasses give him the look of a deeply preoccupied grasshopper ‘’ )ఇక్కడ ‘’ప్రీ ఆక్యు పైడ్’’అంటేఒక మేధావి  ఏదో విషయం పై నిరంతర అన్వేషణలో మునిగి ఉన్నట్లు ‘’అని అర్ధం చెప్పారు .’’his willingness to write to order had made him more a craftsman than a creator ‘’అని గిట్టని వాళ్ళు విశ్లేషించారు .అంటే ఆయన సృజన కర్త కంటే గొప్ప కళాకారుడు .కాని ఆయన అభిమానులు మాత్రం ‘’అంతటి జీవకళ ,ఉత్సాహం వైవిధ్యం ,ప్రతి సూక్ష్మ విషయం పై దృష్టి,దాన్ని స్వర్ణమయం చేసే నేర్పు ,అసాధారణమైన  మిరుమిట్లు గొల్పే ప్రయోగాలు ,ప్రశాంత సాధనా, సాఫల్యత, ఆగ్రహ లయల అనుసంధానం, ,అంతటి క్రమపద్ధతి  నిర్మాణం స్ట్రా విన్స్కి సంగీతం లో తప్ప ఇంకెక్కడా కనిపించదు కాక కనిపించదు ‘’అని ప్రశంసించారు .పొగడ్తల తెగడ్తల , దూషణ భూషణ లేమీపట్టించుకోకుండా తన పనేదే తానూ చేసుకు పోయాడు .కొత్త శ్రుతులకోసం ,కొత్త వాయిద్య సమ్మేళనాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు .ఆతను ఎలా పని చేస్తాడంటే ‘’  He lives only on music ,shaping ,cutting ,and correcting it on a desk as severe as an architect;s drafting table .అంతటి దీక్ష తపన ,అంకితభావం తాదాత్మ్యం ఆయనది .ఆయనకు  ప్రేరణ ఒక లేబర్ . ‘’He knows how to sublimate instinct to a regular force ‘’అని ఆయన పనితనాన్ని డచ్ క్రిటిక్ ఫ్రాంక్ ఆనేన్ విశ్లేషించాడు .స్ట్రా విన్స్కి కి ‘’A thing of beauty is not a joy until it conforms to discipline bringing form out of chaos ,fulfilling the stern definition of St.Thomos ‘’Beauty is the essence and glory of order ‘’

6-4-19 71న అమెరికాలో 89వ ఏటఅమర సంగీతమ౦  అందించిన  స్ట్రా విన్స్కి అమరుడయ్యాడు .

 

    ఆయన జీవితం లో 1-రష్యన్ పీరియడ్ -19 07 -19, 2-నియో క్లాసికల్ పీరియడ్ -19 20-54,3-సీరియల్ పీరియడ్ -19 54 -68అనే నాలుగు దశలు నడిచాయి .ఆయనను ‘’one of music;s truly epochal innovators ‘’అంటారు .కాంపోజిషన్ శైలిని ఎప్పటికప్పుడు మార్చటం ఆయన గొప్ప ప్రత్యేకత .అందులో స్పష్టత ,తాదాత్మ్యాలను కాపాడు కొన్నాడు .అనేక రకాల వాయిద్యాలతో మానవ స్వరాలతో ,ఏక వాయిద్యం నుంచి అనేక వాయిద్య సమ్మేళనాలతో  చరిత్ర సృష్టించాడు .ఆయనకు రాయల్ ఫి హార్మోనిక్ సొసైటీ గోల్డ్ మెడల్ ను ,అందజేస్తే సానింగ్ మ్యూజిక్ ప్రైజ్ ను లియోని ఇచ్చింది .బెస్ట్ క్లాసికల్ పెర్ఫార్మార్ గా ,బెస్ట్ క్లాసికల్ కంపోజర్ గా ఆర్కేస్ట్రాలోను సోలో లోను పొందాడు జీవిత సాఫల్య పురస్కారం మరణానంతరం 1987 లో అందజేశారు .తన జీవితం లోసంగీతపరమైన  అనేక గ్రంధాలు రాశాడు ,’’క్రానికల్ ఆఫ్ మై లైఫ్’’అనే ఆటో బయాగ్రఫి రాసుకొన్నాడు మరికొందరితో కలిసీ రచనలు చేశాడు .

  Inline image 4  Inline image 2Inline image 3

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-7-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.