ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -194

73-ఆంగ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ ,సైన్స్ ఫిలాసఫర్ –ఆర్ధర్ ఎడ్డింగ్టన్-2

  పూర్వపు సైంటిస్ట్ లు నక్షత్ర౦ లోని పరిస్థితులను అతి సామాన్యంగా చెప్పారు .కాని ఎడ్డింగ్ టన్ ధేర్మో డైనమిక్స్ ను ,అటామిక్ ఫిజిక్స్ తో మిక్స్  చేసి సేఫీడ్ వేరియబుల్స్ అంటే కొన్ని నక్షత్రాలు క్రమప్రకారం వాటిలోని కాంతి తగ్గి మళ్ళీపెరగటం ,మళ్ళీ పెరుగదలనుంచి కాంతి క్రమంగా తగ్గిపోవటం వంటి ప్రత్యేక సమస్యలను అధ్యయనం చేసి చెప్పాడు .కొన్ని నక్షత్రాలలో గరిష్ట కాంతి కి చేరటానికి కొన్ని గంటలే పడితే ,మిగిలినవాటిలో చాలా ఎక్కువ కాలంఅంటే సంవత్సరకాలం  పడుతుందని చెప్పాడు .కాంతి లో వచ్చే ఈ మార్పులు నక్షత్ర ఉష్ణోగ్రత లో మార్పులు తెచ్చి ,ఒకదాని తర్వాత ఒకటి తగలబడి చివరికి నక్షత్రం మొత్తం కుంచి౦చుకు పోతుంది .ఎక్కువ కాంతి కల నక్షత్రాలు ఈ మార్పుకు నెమ్మదిగా గురౌతాయి .వాటిలోని పరిస్థితులను కూలంకషంగా అధ్యయనం చేసి నక్షత్రాల బరువుకు ,వాటి పల్సేషన్ ఫ్రీక్వెంసి  కు ఉన్న సంబంధాన్ని సూత్రప్రాయంగా వివరించాడు .వాటి సుమారు బరువు ,కాంతి లను పరిశీలనద్వారా తెలుసుకొన్నాడు .తర్వాత సూత్రాన్ని చాలా ఖచ్చితం చేసి చెప్పాడు .సేఫీడ్స్ పీరియడ్ నుంచి దాని ద్రవ్య రాశి కనుక్కోవచ్చు ,దానిద్వారా దాని అసలు కాంతి ఎంతో తెలుసుకోవచ్చు .ఈ సేఫీడ్స్ ను లైట్ హౌస్ లు గా భావిస్తే  వాటి ఫ్లాషింగ్ సిగ్నల్ ద్వారా వాటి కాండిల్ పవర్ తెలుసుకోన్నట్లే వాటి కనిపించే కాంతి ,దూరాలను లెక్కించవచ్చు .

 చాలా సందర్భాలలో నెబ్యూలాలు మన మొత్తం గెలాక్సీ లోని నక్షత్రాలకంటే ,మిల్కీ వేకు చాలా దూరం లో ఉంటాయి .అంటే మన సూర్యుడు ఒక పెద్ద టౌన్ కు శివారు లో నక్షత్రాలు మన చుట్టూ కాంతి నిచ్చేటట్లు కనిపిచ టమన్నమాట . మన గెలాక్సీ కి బయట ఉన్న నెబ్యూలాలు దూరపు సిటీ లోని తక్కువ కాంతిగా(ఫైంట్ ) కనిపించే లైట్లు అన్నమాట .వీటి దూరాలను వీటి’’ డిగ్రీ ఆఫ్ ఫైంట్ నెస్ ‘’ ను బట్టి కాంతి సంవత్సరాల ద్వారా  తెలుసుకోవచ్చు ..అతని సేఫీడ్ వేరియబుల్స్  అంత రిక్ష యాత్రికులకు విలువైన ఏక రీతి కొలమానాన్ని అంద జేసింది .సాధారణ నక్షత్ర గర్బవిషయ౦  అంత అద్భుతమైనదేమీ కాకపోయినా అది రేడియేషన్ ప్రేసర్ కు వినియోగించి మొదటి సారిగా స్టెల్లార్ అంతర్భాగాలను తెలుసుకోవటానికి సహకరించింది .ఈ రేడియేషన్ పీడనం  నిజంగా అది బాగా ప్రకాశ వంతంగా ఉన్నప్పుడున్న  ఒక శక్తి లేక  కాంతి  తోపుడే నక్షత్ర  నిర్మాణాన్ని ప్రభావితం చేసే ముఖ్య అంశం .’’ఆన్ ది రేడియేటివ్ ఈక్విలిబ్రియం ఆఫ్ స్టార్స్ ‘’లో రాసి వివరించాడు .దీనిలో   అతని కీలక భావనలు అన్ని రకాల నక్షత్రాల ద్రవ్య రాశి, ప్రకాశాలకున్న సంబంధాన్ని ,వాటికి ఉష్ణం, కాంతి లను ఎర్పరచటానికి    జరిగే వివిధ పరమాణు చర్యలను తెలుసుకొన్నాడు .

   రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ కి 19 12 నుంచి 17వరకు సెక్రెటరిగా ఉన్నాడు .డచ్ గణిత వేత్త విల్లెం డీ సిట్టర్ తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .ఈయనకు  రిలేటివిటిపై ఉన్న అభిరుచి గమనించి ఐన్ స్టీన్ రాసిన జెనరల్ దీరీ పుస్తకాన్ని కొన్ని వివరణ పత్రాలను  పంపాడు . అది యుద్ధ సమయ౦ కనుక ఈ విషయం ఇంగ్లాండ్ లోనే ఉండి పోయింది .జామె ట్రికల్ ,న్యూమేరికల్ రీజనింగ్ కు  అది బాగా ఉపయోగ పడుతుందని గ్రహించాడు .సంఖ్యల మూల లక్షణాలు ,అంత రిక్ష శోధనలో మునిగాడు .తన పనిలో తానూ మునిగిఉన్నా జనరల్ దీరీ ఆఫ్ రిలేటివిటిని సహచరులకు ప్రజలకు  వివరించి చెబుతున్నాడు .1918 లో 91పేజీల ‘’రిపోర్ట్ ఆన్ రిలేటివిటి ‘’అనే బృహత్తర వ్యాసం రాశాడు. మరుసటి ఏడాది సూర్యుని శక్తి వంతమైన గురుత్వాకర్షణ క్షేత్రం లో కాంతి పుంజం  వంగిపోవటం పై ఐన్ స్టీన్ చెప్పిన జోస్యాన్ని అధ్యయనం చేసే అన్వేషణ యాత్రలో పాల్గొన్నాడు .1920 లో ‘’స్పేస్ ,టైం ,గ్రావిటేషన్’’పుస్తకం ప్రచురించాడు .ఇందులో ఐన్ స్టీన్ సిద్ధాంతాలను తన విభజనలతో వివరించాడు ఇది సైంటిఫిక్ అన్వేషణలో విధానాలను ఫలితాలను బాగా వివరించింది .దీనితర్వాత ‘’స్టార్స్ అండ్ ఆటమ్స్ ‘’,’’ది నేచర్ ఆఫ్ ది ఫిజికల్ వరల్డ్ ‘’,ది  ఎక్స్పా౦ డింగ్ యూనివేర్స్ ,’’న్యు పాత్ వేస్ ఇన్ సైన్స్ ,’’ది ఫిలాసఫీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ‘’గ్రంధాలు రాశాడు .తన భావజాలాన్ని సాన్ద్రతరం చేసి విస్పష్టం చేశాడు ,సైన్స్ కున్న ఊహాజనిత లక్షణాన్ని మెచ్చుకొన్నాడు .

   జటిలమైన గణితాన్ని సమగ్ర౦ గా మార్చే ప్రయత్నం చేశాడు .గ్రావిటేషన్ ను సొట్ట గా పోల్చాడు .అదే స్పేస్ టైం లమెత్తని వస్త్రం అన్నాడు .వస్తువులు గ్రావిటి వలన ఆకర్షింప బడుతాయి .దీన్ని ఎలా పోల్చవచ్చు అంటే –మంచు తో ఉన్న చెరువు పై దొర్లే  రాయి ఐస్ లోని డిప్రెషన్ (అణచటం ) కు ఆకర్షింప బడి నట్లు ఉంటుంది .విశ్వం అంతా వక్రంగా నాలుగవ పరిమాణం లో దానింతటికి అదే మూసుకు పోయినట్లు ఉంటుందే తప్ప అనంతం కాదు అని తన రిలేటివిటి సిద్ధాంతం తో చెప్పాడు ..ఆస్ట్రో ఫిజికల్ గణనాలు ఒక అంత రిక్ష నౌక కనబడే  ఒక సరళ రేఖ పై చాలా దూరం ప్రయాణం చేస్తే ,అది వ్యతిరేక దిశ  నుండి తిరిగి వస్తుంది అని తెలియ జేస్తున్నాయని చెప్పాడు  .ఆయన ఖగోళ విషయాలలో మరో ముఖ్యమైంది –నెబ్యూలాలు మనకు దూరంగా కదిలి పోతున్నాయి అని .’’the  fundamental view point was not the apparent recession of nebulae ,but the expansion of the whole four –dimensional curved universe ‘’ఈ వ్యాప్తి నిరంతర ఎంట్రోపి అభి వృద్ధి తో  సంబంధం  కలిగి ఉంటుంది .విశ్వం లోని శక్తి అనేక రకాలుగా వాడుకోబడి లేక నశింపు పొందుతుంది కాని మళ్ళీ సృష్టింప బడదు అని తెలిపాడు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -7-7-16 –ఉయ్యూరు

 

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.