ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -196

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా

‘’విజయవంతమైన జీవితానికి తగిన లక్షణాలేవీ నాలో లేవు ‘’అని చెప్పుకోన్నవాడు జెక్ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ..రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన అంతర్జాతీయ అపనమ్మకం ,ప్రపంచ వ్యాప్త అభుద్రత భావం లను గురించి ముందే ప్రజలను తన అవాంతర ఉపమాన నీతి కధలతో జాగృతం చేసిన జెకోస్లోవేకియాయువ రచయిత ఫ్రాంజ్ కాఫ్కా 3-జులై 1883 న ప్రేగ్ లో జన్మించాడు .మొదటి నుండి వంటరివాడు .అణచబడిన అణగారినజాతివాడు ..ఆస్ట్రియన్ సామ్రాజ్యం లో జెక్ ప్రజలు మైనారిటీలు .అతను జ్యూఅవటం తో మైనారిటీలలో మరీ మైనారిటీ వాడయ్యాడు .పరిసరాలకు తగినట్లు ప్రవర్తించటం చేత కాకపోవటం మరీ వంటరి వాడిని చేసింది .తల్లి జ్యూయీ లోవీ చాలా సున్నిత మనస్కురాలు .ఆమె అసాధారణ వైపరీత్యం ఉన్న మహిళ.శతాబ్దాల తరబడి లూవీలు విద్యా వేత్తలు ,దార్శనికులు ..బాల్యం నుండి కాఫ్కా వారిలో ఒదిగిపోయాడు .తండ్రి హెర్మన్ కాఫ్కా బడా వ్యాపారి  ,హోల్ సేల్ బిజినెస్ లో పూటుగా సంపాదించాడు .అందుకనే ఫాన్సీ వస్తువులు ఇంట్లో బాగా వాడుకలో ఉండేవి .తండ్రి యెడల కొడుకు ప్రవర్తన బాధాకరంగా సందిగ్ధంగా ఉండేది .తండ్రి పర్సనాలిటి ,వ్యాపారం లో బుద్ధి సూక్ష్మత ,నిర్ణయ సామర్ధ్యాలను చూసి అసూయ పడేవాడు ఈ అర్భక కుర్రాడు .ఆయన శక్తిని ఆరాది౦చాడుకాని ఆయన క్రూరత్వాన్ని అసహ్యి౦చు కొన్నాడు .

   దీన్నించి ఇక ఎప్పుడూ తేరుకోలేక పోయాడు .36 వ ఏట తండ్రికి ‘’పుస్తకం అంత’’’’ఎ లెటర్ టు మై ఫాదర్ ‘’ఉత్తరం రాసి అందులో ఆరోపణలు ఫాంటసీలు ,స్వీయ రక్షణలు గుప్పించాడు .ఉత్తరం ఇలా ప్రారంభించాడు ‘’ప్రియమైన నాన్నా !ఒకప్పుడు నువ్వు నా గురించి ఎందుకు భయం అని అడిగావు .అప్పుడు ఏం జవాబు చెప్పాలో భయం తో నాకు తెలియలేదు .’’అని కొనసాగిస్తూ తన బలహీనతలను తండ్రి సామర్ధ్యాలను వరసపెట్టి చెప్పుకొచ్చాడు .తండ్రికున్న సాఫల్యత తనకున్న అభద్రతాభావం వైఫల్యం అన్నీ రాశాడు .’’మనిద్దరినీ బేరీజు వేస్తె నేను కొంచెంకాఫ్కా లలోని  లోయీ ని.అయితే జీవించటానికి  ,బిజినెస్ విజయవంతం చేయటానికి, డామినేట్ చేసి జయించటానికి  కావలసిన కాఫ్కా లక్షణాలు నాకు లేవు .నీ సంగతి చూస్తె కాఫ్కాలలోని బలం ,ఆరోగ్యం తిండి పుష్టి ,మాట్లాడే నేర్పు స్వీయామోదం ,ఆధునిక ఆడంబరం ,పట్టుదల ,ఏకాగ్రత ,ప్రజల గురించిన జ్ఞానం ,ఒకప్రత్యేక హుందా తనం నీ సొమ్ము .కుర్చీలో కూర్చుని ప్రపంచాన్ని ఏలే తెలివి తేటలు నీవి .నీ నిర్ణయం ఎప్పుడూ తప్పదు .మిగిలిన వన్నీ ఆడంబరం అసాధారణం .నీ ఆత్మ విశ్వాసం మహత్తరమైనది .నీది స్థిర బుద్ధి .జెక్ లకు వ్యతిరేకంగా నాటకంగా మాట్లాడగలవు .జర్మన్ల, జ్యూస్ ల  విషయం లోనూ ఇదే ధోరణి నీది . ఇవన్నీ ఏదో కారణం ఉండికాదు కారణం లేకుండానే .నిన్ను ఎవరూ దేనిలోనూ ఓడించలేరు .ఎప్పుడూ నువ్వే విజేతవు .ఇలాంటి రహస్యమైన గుణం నీది .నియంతల౦దరిది ఇదే ధోరణి .వాళ్ళు లాజిక్ తోకాక మేజిక్ తో ,తెలివి తేటలతోకాక పరనాలిటీ తో అవతలి వారిని దెబ్బ తీస్తారు .’’అనిరాశాడు ఈ ఉత్తరం ఒక రకం గా కాఫ్కా జీవిత చరిత్ర యే.చిన్నప్పుడు కాఫ్కా పిరికి తనాన్ని ,మనిషిగా అపనమ్మకాన్ని వ్యక్తపరిచింది .తండ్రి మహోన్నత వ్యక్తిత్వం అడుగడుగునా కాఫ్కా అసమర్ధతను  ,వ్యక్తం చేసింది .’’you made me lose all possible self confidence and exchange a boundless sense of guilt for it ‘’అని ఆవేదన చెందాడు కాఫ్కా 

.Inline image 1

సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్- 7-7-16 ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.