ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197 74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్ నవలా రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -197

74-ఆధునిక సాహిత్య ప్రభావ శాలి జెక్  నవలా  రచయిత-ఫ్రాంజ్ కాఫ్కా -2

కాఫ్కా తనకు నరాల బలహీనత ,తప్పు చేస్తున్నానేమోననే భయం ,పట్టుకొని పీడిస్తున్నాయి .స్కూల్ లో ఆతను అందరికంటే పెద్దవాడు .తమ్ముళ్ళు ఇద్దరూ ముందే చనిపోయారు .చెల్లెళ్ళు ముగ్గురికీదూరమై ఒంటరి వాడై పోయాడు .జర్మన్ ఎల మెంటరిహైస్కూల్ లలో చదివి ప్రేగ్ యూనివర్సిటిలో తనకిష్ట మైన సాహిత్యం భాష లను చదివాడు .డిబేటింగ్ సొసైటీ లో చేరి యువ ,ప్రయోగ శీల రచయితలను ప్రోత్సహించాడు .21 వ ఏడు వచ్చాక తాను  లోయీ డ్రీమర్ గా ఇక ఉండలేననుకొన్నాడు .ఏదో ఒకటి  చేసి కస్టపడి డబ్బు సంపాదించి జీవించాలని నిర్ణ యించుకొన్నాడు .తండ్రి బిజెనెస్ లోకి రమ్మని ఒత్తిడి చేసినా ఆ వైపుకు కన్నెత్తి చూడక ,తనకున్న వాదనా పటిమ ను లాయర్ గా ఉపయోగి౦చు కొందామనుకొని లా చదివాడు .23 కే‘’డాక్టర్ ఆఫ్ లా’’ అయ్యాడు. కాని ప్రాక్టిస్ పెట్టలేదు .ఒక చిన్న ఇన్సురెన్స్ ఆఫీస్ లో గుమాస్తాగా చేరి ,తర్వాత పైకి ఎదిగాడు .ఆస్ట్రియన్ ప్రభుత్వ శాఖలో పని చేస్తూ ఖాళీ సమయం లో ఆత్మకధ రాస్తూ లోపలి టెన్షన్ లకు విముక్తి కలిగించే ప్రయత్నం చేశాడు .

ఒంటరిగా ఉండాలన్న భావాన్ని వదిలేసి గ్రూపులతో కలిసి ఉంటున్నాడు .మహా కవి దార్శనికుడు ,జర్మన్ రచయితా గోదే ను ఆవిష్కరించే సామర్ధ్యం ఉన్న రుడాల్ఫ్ స్టేనర్ పరిచయమై ప్రవర్తనా శీల అధ్యయన శాస్త్రం ( యాన్త్రోపోస్కోపి ),తాంత్రిక శాస్త్రాలవైపు ఆకర్షింప బడ్డాడు .కొంతకాలం తానే ‘’కాబాలిస్ట్ ‘’అయ్యాడు .మాక్స్ బ్రాడ్ ,ఫ్రాంజ్ వేర్ఫెర్ మొదలైన వారి ప్రభావంతో ‘’జియోనిస్ట్ ‘’అయ్యాడు .ఇద్దరు ముగ్గురికంటే సన్నిహితంగా ఉండేవాడుకాదు .బృంద ఆలోచనలలో పాల్గొనే వాడుకాదు .ఒక గంట మాట్లాడాక నరాల ఒత్తిడి పెరిగిపోయేది పెదిమలు ఆకస్మికంగా బిగుసుకు పోయేవి ,అసాధారణమైన నల్ల కళ్ళు మండిపోయేవి .విపరీతమైన తలనొప్పి వచ్చి బాధ పడేవాడు .29 వయసులో బెర్లిన్ వయ్యారి  పొగడ్తలతో ఉబ్బు లింగమై పోయాడు . ఆమెతో సాన్నిహిత్యం ప్రేరణ భయమూ కూడా కలిగించాయి.రెండేళ్ళతర్వాత పెళ్లి చేసుకోమని అడిగాడు .ఎంగేజ్ మెంట్ జరిగింది కూడా కాని మూడు నెలలకే దాన్ని కాఫ్కా రద్దు చేయించాడు .తన అకసమిక  నిర్ణయానికి లెంపలేసుకొని క్షమాపణ కోరాడు చాలా సార్లు .తన నరాల బలహీనత ,టి బి లక్షణాలు ఏకరువు పెట్టాడు కాని జబ్బుకంటే మానసికంగా బలహీనమయ్యాడు .’’హనీ మూన్ ఆలోచన అంటే నాకు భయమేస్తుంది ‘’అని చెప్పుకొన్నాడు ఒకసారి .’’నాప్రేమ ఉక్కిరి బిక్కిరికి భయం, నా విదానాలకింద సమాధి అయింది  ‘’అని మాక్స్ బ్రాడ్ కు జాబు రాశాడు .గృహస్త జీవితానికి సంసార బాధ్యతలకు  అనుకోకుండా స్వస్తి  చెప్పినవాడిని చూస్తె ;;కర్క్ గాడ్ ‘’గుర్తుకొస్తాడు కాఫ్కా నేరాన్ని తండ్రిపై నెట్టేసి తప్పించుకొన్నాడు .తండ్రికి రాసిన ఉత్తరం లోనే ఈ అధ్యాయాన్నీ చేర్చి  ‘’సంసారం  ఈడ్చాలంటే నీలాగా సర్వ సమర్డుడనై ఉండాలి  .కానీ నాకవేమీ లేవు .అంటే మంచీ చెడూ లేవునాకు .అవి నీలో సహజంగా ఉన్నాయి .అందర్నీ ప్రేమిస్తున్నట్లే ఉంటావుకాని ఎవరినీ నమ్మవు ‘’అని ఏకరువుపెట్టాడు .జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకొని 34 వ ఏట మళ్ళీ ఒకమ్మాయికి లైనేసి ఎంగేజ్ మెంట్ చేసుకొన్నాడు .కాని విషయం పక్వంకాకుండానే అతని అధైర్యం ,అనాసక్తత వలన ఒక్కసారిగా బ్రేక్ పడింది  .మళ్ళీ సీరియస్ గా జబ్బుపడి ఒంటరివాడయ్యాడు .

అప్పటికే తాను  రాసిన వ్యాసాలూ ,కొన్ని చిన్నకధలు చేర్చి ‘’దిస్టోకర్ ‘’పేరిట ముద్రించాడు .ఇది ప్రైజ్ పొందింది .ఇదే  తర్వాత వచ్చిన ‘’అమెరికా ‘’అనే ఫాంటసి లో చోటు చేసుకొన్నది .మిగిలిన రచనలు అతని అతి తక్కువ స్నేహబృందానికి తప్ప లోకానికి తెలియ లేదు .చనిపోయాక మూడు నవలలు విడుదలై అనువాదం పొందాయి .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ఆరోగ్యం బాగా దెబ్బ తిన్నది .డబ్బులకేమీ ఇబ్బంది లేదు కాని అప్పుడు బొగ్గు కొరత ఏర్పడింది .కనుక వెచ్చదనానికి అవకాశం లేక రక్తం కక్కుకోనేవాడు .అతనికి ‘’పల్మనరి కటార్  ‘’జబ్బు వచ్చిందని ,అందుకని ఎవరొ ఒకరు  తోడు ఉండాలికనుక సాజ్ దగ్గర జురావు ఎస్టేట్ లో ఉన్న చిన్న చెల్లెలి దగ్గర ఉండమని డాక్టర్లు సలహా చ్చారు .అక్కడ ఆరోగ్యం కొంత నయమైంది .’’ది ట్రయల్ అండ్ ది  కాజిల్’’ రాయటం లో విశ్రాంతి లేక దగ్గు పట్టుకోంది.తర్వాత చాలా శానిటోరియం లలో చేరాడు .

40 వ ఏట 18 ఏళ్ళ జ్యూయిష్ అమ్మాయి డోరా డిమాంట్ తో ప్రేమలో పడి ఇద్దరూ కలిసి ప్రేగ్ కు వెళ్ళారు .కాని మళ్ళీ ప్రేమ విఫలమైంది.జబ్బు తీవ్రమై ప్రమాద స్థితికి చేరింది .తలిదండ్రులకు తెలిసి అతనికి తక్షణ వైద్యం కోసం తీసుకొని వెళ్లి వీనర్ వాల్డ్ శానిటోరియం ‘లో చేర్చాలనుకొని ఓపెన్ కారు లో తీసుకు వెడుతుంటే మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు అకస్మాత్తుగా తుఫాను చుట్టు ముట్టింది .ఒళ్లంతా తడిసి ముద్దఅయి ఒణుకుతూ అచేతన స్థిలో చేరాడు .అక్కడ రోగులు విపరీతంగా ఉన్నారు .కాఫ్కాను బాధ తో చచ్చిపోతున్న ఒకవ్యాదిగ్రస్తుడి ప్రక్క బెడ్ లో పడుకోబెట్టారు .తర్వాత కీర్లింగ్ శానిటోరియం లో ఒక ప్రత్యేకగదిలో పెట్టారు . అక్కడే కాఫ్కా 3- 6-1924 న 41వ పుట్టిన రోజు ఒక నెల ఉందనగా  ఈ లోకం నుంచి కనుమరుగైపోయాడు శాశ్వతంగా  .స్వగ్రామానికి తీసుకొని వెళ్లి జ్యూయిష్ పద్ధతిలో ప్రాగ్ –స్ట్రాస్స్ చిన్జ్ లో  ఖననం చేశారు ,అతని చెల్లెళ్ళు ముగ్గురూ విజ్ కాన్సేంట్రేషన్ కాంప్ లో నాజీ దురాగతానికి బలైపోయారు  . మగ నలుసు కూడా ఎవరూ  మిగల లేదు .

Inline image 1Inline image 2

  సశేషం

  మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -8-7-16 –ఉయ్యూరు

 

 

 

   

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.