ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -200 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్

 ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 200

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్

అమెరికాలో సాహిత్యం లో మొదటి సారి నోబుల్ పురస్కృతి  సింక్లైర్ లెవిస్ కు  దక్కింది అంటే అది పారడాక్స్ అన్నారు .కారణం ఆయన రాసినవి  స్థానిక విషయాలకు సంబంధించిన చౌకబారు పుస్తకాలు .అవి స్థానిక సాంఘిక ప్రమాణాలకు మాత్రమే సరిపోయేవి .అమెరికా బిజినెస్ మనస్తత్వానికి కాపట్యానికి వ్యతిరేకి .7-2-1885 న అమెరికా మిన్నేసోటలోని సౌక్ సెంటర్ లో పుట్టాడు .తాను పుట్టింది   సెంట్రల్ వెస్ట్ లోని సంస్కృతికి విరుద్ధమైన ,కిక్కిరిసిన ఇళ్ళతో నైతికంగా దిగజారిన గోఫర్ ప్రయరి లో అని చెప్పుకొన్నాడు .తండ్రి గ్రామీణ వైద్యుడు .తండ్రి పై అభిమానాన్ని నవలలో చెప్పుకొన్నాడు .అటు పల్లెకాక ,ఇటు పట్నామూకాని ఊరు అది .చిన్నప్పటినుండి తూర్పుగాలి పై ధ్యాస ఉండేది .లోకల్ స్కూళ్ళలో చదివి ఏల్స్ వెళ్లి ,ఒక సాహిత్య పత్రికకు సంపాదకుడై 1908 లో గ్రాడ్యుయేట్ అయ్యాడు ‘వికృతంగా పొడుగ్గా ఎముకలపోగుగా ,ఉబ్బిన కనుబొమలతో  గట్టి నుదురు తో ‘’యవ్వనం లో కనిపించేవాడు .అండర్ గ్రాడ్యుయేట్ గా ఉండగానే కాల్పనిక శృంగారం ను కవిత్వం వచనం కలగలిపి కధలు రాశాడు .మొదటి రచనలన్నీవిపరీతమైన ఎమోషన్ తో నైపుణ్యంగా రాసిన  వచనాలే .45వ ఏట ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకొని అప్పటిదాకా రాసింది వ్యర్ధమేనని భావించి అసలైన జీవిత చిత్రణ చేయాలనుకొని మిన్నెసోటా ప్రయరి గ్రామాల నేపధ్యం తో రాశాడు .

           అప్టాన్ సింక్లైర్ స్థాపించి ఏంగిల్ వుడ్ లోని కొ ఆపరేటివ్ కాలని గురించి తెలిసి సోషలిజం దెబ్బతినటానికి కారణాలను అన్వేషించాడు .న్యు జేర్సిలో హేల్పర్లు అవసరం అని గ్రహించి తానే స్వయంగా కాపలాదారుగా ,లాండ్రి మాన్ గా సేవలు అందించాడు .తాను  అసంతృప్తితో పేరుపెట్టిన హేలికాన్ హాల్ దగ్ధమైతే ,నిరాశ చెందినా ధైర్యంగా నిలబడ్డాడు .పనామా కు చేరి ,ఆ విస్తృత కాలువ త్రవ్వకం పనుల్లో పై ఉద్యోగం రాక ,కాలి ఫోర్నియా చేరుకొన్నాడు .డబ్బుల్లేక అప్పులతో ఏడాదిన్నర గడిపాడు .చిన్నకధలు రాసి పత్రికలకు పంపిస్తే అంతే వేగంగా తిరిగొచ్చేవి ..మళ్ళీ తూర్పు పై గాలి మళ్ళి,ఇయోవాలో రిపోర్టర్ గా చేరి ,వాషింగ్టన్ డి సి లో జూనియర్ అసిస్టంట్ గా పనిచేసి ,25 ఏళ్ళ వయసులో న్యు యార్క్ లో ఒక పబ్లిషింగ్ హౌస్ లో వారానికి 15 డాలర్ల కు చెవిటి వారికి ప్రత్యేకమైన మేగజైన్ లో సబ్ ఎడిటర్ గా పని చేశాడు .’’లేబర్ మార్కెట్ లో ఇదే నా అసలైన విలువ ‘’అని జోక్ చేస్తూ  19 30  లో నోబెల్ ఫౌండేషన్ లో ఆటో బయాగ్రఫి రాస్తూ చెప్పుకొన్నాడు .ఇదీ ఆయనకేమీ నచ్చలేదు .తానూ ఏదైనా గొప్ప సాహిత్యం రాసిఉంటేకళ్ళకద్దుకొని పెద్ద జీతం ఇచ్చేవారు అనుకొన్నాడు .తరువాత అయిదేళ్ళు ఆఫీస్ బాయ్ గాఒక పబ్లిషర్ వద్ద ,రాతప్రతి సరి చేసే వాడుగా ,’’అడ్వెంచర్ ‘’పత్రికకు అసిస్టంట్ ఎడిటర్ గా ,యాడ్ రైటర్ గ ,కేటలాగర్ గా ,బుక్ రివ్యూయేర్ గా పనిచేసి పొట్ట గడుపుకొన్నాడు .మొదటి పుస్తకం ‘’హైక్ అండ్ ది ఏరోప్లేన్ ‘’అనే ఒక కుర్రాడి కద 25 వ ఏట రాసి’’టాం గ్రాహం ‘’అనే మారు పేరుతో  ప్రచురించాడు  .

  29 వ ఏట గ్రేస్ హేగ్గర్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని ,11 ఏళ్ళ తర్వాత విడాకులిచ్చాడు .19 28 లో జర్నలిస్ట్ ,కాలమిస్ట్ దోరోతి థామ్సన్ ను పెళ్ళాడాడు .14 ఏళ్ళ కాపురం తర్వాత విడాకులు .మొదటి భార్యకు పుట్టిన కొడుకు కు ‘’వెల్స్’’అని తన అభిమాన రచయిత హెచ్ జి వెల్స్ పేరు  పెట్టుకొన్నాడు .యితడు రెండవ ప్రపంచయుద్ధం లో చనిపోయాడు .వెల్స్ ప్రభావం మొదటినవలలపై బాగా ఉంది .’’ది ట్రయల్ ఆఫ్ ది హాక్ ‘’నవల మిడ్వెస్ట్ లోని ఒక కార్పెంటర్ కొడుకు ప్రాంతీయ సాంప్రదాయాలనుండి విముక్తుడై ,నిరంతర సంచారిగా చివరికి కొత్త నావికా ప్రపంచం లో అడుగు పెట్టటం కధ.బిజినెస్ వృత్తిలోని స్త్రీ పోరాటాలను ‘’ది జాబ్ ‘’లో ,మధ్యవయసుసాహసం మధ్యతరగతి ప్రేమ మందహాసం ‘’ది ఇన్నోసెంట్ ‘’లో ,తూర్పు సమాజపు పిల్ల .మధ్య ప్రాచ్య మెకానిక్ ల మధ్య ప్రేమాయణం విభేదాలు ,స్స్వేచ్చ కోసం తపన ‘’ఫ్రీ ఎయిర్ ‘’లో రాశాడు .ఇవన్నీ 30 ఏళ్ళ లోపే  రాశాడు .35 వయేట ఈ విధానానికి గుడ్ బై చెప్పి రాజీలేని నిజాయితీ ,జంకని వాస్తవికత లతో రచన చేశాడు .ఇప్పటిదాకా సంతోష పెట్టటానికే రాశాడు .ఇప్పడు నిజం చెప్పటానికి ,ఆ నిజం యెంత ఘాటుగా ఉన్నా జనం చదవక పోయినా ఫరవాలేదన్న భావం తో రాశాడు .ఈ ధోరణిలో ‘’మెయిన్ స్ట్రీట్ ;’’రాశాడు .ఇదొక బాంబు ప్రేలుడు లాగా జనానికి షాక్ ఇచ్చింది .స్థానిక సరిహద్దులు దాటి విస్తృత పరిధిలో రాసిన రచన ఇది .కనుక వివాదాస్పదమై  ,ఒక మిలియన్ కాపీలు అమ్ముడై సంచనం సృష్టించి ,అన్ని యూరోపియన్ ఆసియా భాషలలోకి అనువాదం పొంది అంతర్జాతీయ ఖ్యాతి పొందాడు .ఆయనలోని తిరుగుబాటు మనస్తత్వానికి ,సంకుచితత్వ౦పై పోరాటానికి  డాలర్ ప్రభావంతో క్రూసిఫిక్స్ అయిన పల్లెటూరుజనం పై సానుభూతికి నిదర్శనం .అమెరికన్ మార్మిక కధలన్నీ అమెరికా గ్రామాలు మహోన్నతమైనవని సంతోష భరితమైనవని తెలియ జేస్తుంటే ఈ అమెరికన్ రచయిత లెవిస్ దాన్నంతటిని పుక్కిటి పురాణం –మిత్ అని చెప్పటం వివాదాస్పదమైంది .’’hundreds and thousands  read the book with the same masochistic pleasure that one has  sucking an aching tooth ‘’లక్షలాది జనం ఈ పుస్తకాన్నిబాధా సర్ప దస్ట ఆనందం తో  పంటి నొప్పితో బాధ పడుతూ చప్పరిస్తున్నట్లుగాచదివి ఆనందించారు అని అర్ధం .

 మొదట్లో ,ఆ తర్వాత రాసిన నవలమధ్యలో దాదాపు 200కధలు రాస్తూ ప్రచురించి అమ్మాడు .ఇందులో కొన్ని సెలెక్ట్ చేసి ‘’సేలేక్తేడ్ షార్ట్ స్టోరీస్ ;;గా 1935 లో 50 వ ఏట ముద్రించాడు . ఇందులో ఆయనకే నచ్చనికధలు కొన్ని ఉన్నాయి .ఈలోగా ఆయన బుర్రంతా నవల ప్లాట్ లతో నిండిపోయింది .మెయిన్ స్ట్రీట్ తర్వాత ప్రసిద్ధ నవల ‘’బాబ్బిట్ ‘’ప్రచురించాడు .రెండూ విపరీతమైన క్రేజ్ సృష్టించాయి ఒకదాన్ని మించి ఒకటి .బాబ్బిట్ ఇంగ్లాండ్ లో హాగ్ వాల్పోల్ ము౦దుమాటలతో 200  అమెరికన్ ఎక్స్ప్రెషన్స్ తో  అచ్చయింది .మెయిన్ స్ట్రీట్ చిన్న టౌన్ కు ప్రతినిధి అయితే బాబ్బిట్ పెద్ద సిటికి ప్రాతినిధ్యం పొందింది .ఇందులోనూ మోసాలు ,హిపోక్రసీలు ,జిమ్మిక్కులు ,ధనమేరా అన్నిటికీ మూలం అదే విజయసాధనకు కొలబద్ద అనిపించటం మంచి జీవితానికి  వ్యాపారమే కొలమానమవటం దర్శనమిస్తాయి . వీటిలోని మానవుడికి ‘’the standard advertized wares –toothpastes ,socks ,tires ,cameras ,instantaneous hot water heaters –were his symbols and proofs of excellence –at first the signs then the substitutes for joy and passion and wisdom ‘’అనిపిస్తుందని నిజాలు నిర్భయంగా చెప్పాడు .


సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -9-7-16 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.