ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -201 75- అమెరికాలో మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 201

75-   అమెరికాలో  మొదటి సాహిత్య నోబుల్ బహుమతి పొందిన    -సింక్లైర్ లెవిస్ -2(చివరిభాగం )

రియలిస్ట్ ,సేటైరిస్ట్ ,విజనరీ అయిన లెవిస్ భౌతికాభి వృద్ధిని నిరసించాడు .’’యారో స్మిత్ ‘’లో డాక్టర్ –సైంటిస్ట్ ను వ్యాపార ధోరణికి అసహ్యించాడు ‘’ఎల్మేర్ గంట్రి లో హైక్లాస్ ప్రీచర్లను ,క్వేకర్లనూ ,దొంగ సన్యాసులను ,మతాన్ని లాభసాటి వ్యాపారం చేసే రివైవలిస్ట్ లను ఉతికి ఆరేశాడు .’’ది మాన్ హు న్యు క్కాల్ రిడ్జ్ ‘’ఓ అంటే నా రాని బిజినెస్ మాగ్నేట్లపై రాసిన పెద్ద కార్టూన్ .ఇందులో ముఖ్యపాత్రధారి లోవెల్ స్మాల్జ్ పెద్దమోసగాడే అయినా పై అధికారుల ప్రతినిధి .ఎందుకూ పనికిరాని డాడ్స్ వర్త్ అందరితో ఆటలాడుకొంటూ  .ముందుకు తోస్తూ శూన్యం లోకి నేట్టేసేవాడు .’’వర్క్ ఆఫ్ ఆర్ట్ ‘’ అమెరికాలో ఆర్టిస్ట్ అంటే విజయాలు సాధించటమేకాక ,హోటల్ నడపటం లోనూ సామర్ధ్యం ఉన్నవాడు అనే నిర్ణయానికి వస్తాం .ఒకసారి తన జాతీయం ఏర్పడ్డాక క్లిష్టమైన ,అసమ్మతిని తీవ్రంగా చేశాడు .ఆతను కారికేచర్ కు ఎక్కువ పాత్రకు తక్కువ అని తీర్మానించారు .సామాన్య భాషలో అసామాన్యంగా రచనలను నిర్మించటం ఆయన ప్రత్యేకత .ఫోటోగ్రాఫర్ కూడా అంత చక్కగా వెలుగు నీడలను ప్రదర్శించలేడు.ఆయన ఒక సందేహాస్పద రిపోర్టర్ .గొప్ప నైపుణ్యం ఉన్నవాడే కాక దక్షుడైన సంస్కర్త .1926 లో ‘’యారోస్మిత్ ‘’కు పులిట్జర్ బహుమతి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరించటమేకాకుండా  వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్య చేశాడు .సాహిత్య స్వేచ్చా ప్రియుడుకనుక గౌరవాలు బిరుదులూ చాలా ప్రమాదకరమైనవి అంటాడు .దానివలన ఇలాగే రాయాలని అలా రాయకూడదనే దానికి లోనౌతాడు రచయితా అన్నాడు .నాలుగేళ్ల తర్వాత వచ్చిన నోబెల్ ప్రైజ్ విషయం లో స్పందిస్తూ దాన్ని తీసుకొంటున్నందుకు క్షమించమని కోరాడు .దియోడర్ డ్రీజర్ ,విల్లా కేధర్ ,జేమ్స్ బ్రాంచ్ కాబెల్ లు ఈ బహుమానాని అన్నివిధాలా అర్హులని ,వారు అమెరికన్ వ్యవస్థలను హేళన చేయకుండా సంయమనం పాటించారని అన్నాడు .

  లెవిస్ మరింత నిర్ణయాలకు శస్త్ర చికిత్సలకు  సిద్ధ పడ్డాడు .50 దాటాక అల్ప ,విపరీతమైన ఇతి వృత్తాలను ఎన్నుకొన్నాడు .వారానికొకటి రాసి వదిలాడు .మొదట ‘’ఆన్ వికర్స్ ‘’ ను సామాన్య విషయం తీసుకొని రాసాడు తర్వాత ‘’ఇట్ కన్ నాట్ హాప్పెన్ హియర్ ‘’లోఅమెరికా లో  రాబోయే ఫాసిస్ట్ సామ్రాజ్యాన్ని ఊహించి చెప్పాడు .ఒక సెటైర్  ఫైరీ టేల్ ను తర్వాత స్మగ్గ్లర్ల ,డబ్బు నీతి విషయం లో కష్టం అధికారుల ద్వంద్వ ప్రవృత్తిని ఎండగడుతూ ‘’గిడియాన్ ప్లానిష్ ‘’రాశాడు ..జాతుల సమస్య,నీతి అది అమలవటం లో అపహాస్యం గురించి రాశాడు .వీటన్నిటిని బట్టి ఆయన్ను సంస్కర్త అన్నారు .క్రమంగాకంజర్వేటివ్ అవుతున్నాడు . ‘’లేబర్ నవల ‘’రాయాలనుకొన్నాడు .యూనియన్లను ,వర్కర్లను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోయాడు .యువత పై మమత ఉన్నా వాళ్ళ తీవ్రవాదాన్ని ఒప్పుకోలేదు .’’ప్రాడిగల్ పేరెంట్స్ ‘’నవల రాసిన 22 నవలలో  నాసిరకమే .అది యువతరం పై తీవ్ర విమర్శే .

రెండవ సారి విడాకుల తర్వాత వెర్మాంట్ కౌంటి వదిలి డోరోతి దాంప్సన్ తో న్యూయార్క్ లో   కలిసిఉంటూ , ,మిన్నెసోటా లోని దూలత్ లో ,మాసాచూసేట్స్లోని విలియంస్ టౌన్ లో విలాసవంతమైన విశాల భవనం లో ఉన్నాడు .పూటుగా తాగిన తర్వాత పిచ్చి ప్రేలాపనలతో ,బెదిరింపులతో స్నేహితులకు దూరమై పోయాడు .అంతులేని సంపద మధ్య చింతతో వంటరి వాడయ్యాడు .దీనికి తోడు జబ్బు చేసింది .బలవంతం మీద మందుమానేసి ప్రత్యామ్నాయంగా స్వీట్లు కాన్డీలు బస్తాలకొద్దీ లాగించేవాడు . తర్వాత వీటికీ స్వస్తి చెప్పాల్సి వచ్చింది .అయినా చదువు ,పరిశోధనా , రచన మానలేదు . 64 లో చారిత్రాత్మక నవల ‘’ది గాడ్ సీకర్ ‘’రాశాడు .అదేమీ గొప్పదని పించలేదు .జబ్బుతో ఉన్నా  మరో గొప్ప నవల’’ వరల్డ్ సో వైడ్ ‘’ రాయాలనే ప్రయత్నం లోనే ఉన్నాడు.ఇటలీ కి వెళ్లి ఊరేగింపులో పాల్గొని న్యుమోనియా తో అకస్మాత్తుగా కుప్ప కూలాడు .తనకు స౦బ౦ధించిన అన్నిటికీ దూరమైన రోమ్ నగరం లో 10-1-19 51న 64వ ఏట లెవిస్ మరణించాడు .

లెవిస్ రచనలలో ఆదర్శవాదం వ్యంగ్యం తో మిళితమై ఉంటుంది .తన దారి ఏదో తెలుసుకాని లెవిస్ కు గమ్యం తెలియదు .ముసలి లెవిస్ యువ లెవిస్ ను వ్యతిరేకిస్తాడు .పరిణత దశలో కూడా తన లక్స్యాలేమిటో ఆయనకు తెలియదు .ఆయన యుటోపియన్ అయినా యుటోపియాస్ లను  చూసి నవ్వు కొంటాడు .ఆయన యాంటి సెంటి మెంటలిస్ట్ .రోటరీక్లబ్బులంటే వెక్కిరింపు .అసాధారణ మనిషి .క్రియాశీలక రాడికలిజం తో గొడవ పడి ,రెబెల్ నుంచి రోటేరియన్ గా మారాడు .లాభసాటి సోషలిజాన్ని ,లాభా పేక్ష లేని కేపిటలిజం తో కలుపుదామని ప్రయత్నించిన సుమనస్కుడు .కళా కవితా దీపకాంతిని వాటిని వ్యతిరేకించే వారిపై ప్రసరింప జేసే ప్రయత్నం చేశాడు .దీనిఫలితం వ్యర్ధ కలల కళాకారులు ,కాసుల బంధం లో చిక్కుకున్న కవులు ఏర్పడ్డారు .ఆయన ఆదర్శాలకు ఆచరణ విదానాలకు చాలా వ్యత్యాసం ఉంది .లెవిస్ సాగా లో ముఖ్యమైనది ‘’బాబ్బిట్ ‘’నవల,అందులో ఆతను దృఢమైన పౌరుడు ,ము౦దే అల్లుకుపోయిన బూర్జువా ,అన్నీ కలిసిన బిగి౦పు న్నవాడు  .వెదర్ ప్రూఫేడ్ మధ్యతరగతి మనిషి .లెవిస్ అతన్ని ప్రేమించటం కంటే ఎక్కువగాద్వేషిం చాడు .బాబ్బిట్ ,ఆయన  సృస్టికర్త లెవిస్ లు స్వయం క్షోభకులుఅయినా స్వీయ సాధన ఉన్న స్వయం రక్షకులైన ‘’సయామీస్ ట్విన్స్ .‘’ఇద్దరినీ విడదీసి వేరు చేయలేము. .

అమెరికన్ దేశభాష ను ,విధానాలను మొదటిసారిగా అతి ఖచ్చితంగా రికార్డ్ చేసినవాడు లెవిస్ .ఇంగ్లీష్ నవలా కారుడు యి. ఏం. ఫార్ స్టర్ ‘’lodges a piece of continent in the worlds imagination ‘’ అని చాలా చక్కగా చెప్పాడు .పిక్విక్ ,డాన్ క్విక్సోట్,సీగ్ ఫ్రీడ్.రాస్కలోనికోవ్ సిరానో లాగా లెవిస్ పాత్రలు ,  ఆయన దేశమైన అమెరికా  ప్రతినిధులు .సింక్లైర్ లెవిస్ పుస్తకం లో జార్జ .ఎఫ్ .బాబ్బిట్ పుట్టే దాకా ,అమెరికాఫిక్షన్ లో మార్క్ ట్వేన్ గారి టాం సాయర్ తర్వాత ఇలాంటి పాత్ర రానేలేదు .అంతర్జాతీయంగా ఒక గుర్తింపు పొందిన సిటిజన్ గా ఆపాత్ర నిలిచిపోయింది .    1940  లలో అమెరిలాలో లెక్చర్ టూర్ చేస్తూ ‘’ఆధునిక యువతీ మంచిగా ఉందా ‘?పల్లా? పట్నమా?యాంత్రికత నాగరికతకు చేటా?మొదలైన సమస్యలపై కిక్కిరిసిన ప్రేక్షకుల సమక్షం లో మాట్లాడాడు ’.-19 43 లో హాలి వుడ్ లో ఒక సినిమాకు డోరే  స్కారి తో  కలిసి పనిచేయటానికి వెళ్ళాడు .సినిమాపేరు ‘’స్టారం ఇన్ ది వెస్ట్ ‘’రెండవ ప్రపంచ యుద్ధానికి అన్యార్ధమైన కధ.పూర్తికా రాజకేయం కనుక అది ముందుకు సాగలేదు .ఆయనవి 22 నవలలు ,7 భాగాలలుగా చిన్న కధలు ,నాలుగు నాటకాలు ,సుమారు పది  వ్యాసాలూ నాలుగు కవితా సంకలనాలు  రాశాడు .

Inline image 1Inline image 2Inline image 3

   సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-9-7-16- ఉయ్యూరు

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.