ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –203
76-స్పోర్టివ్ హ్యూమరిస్ట్ ,అన్ సోషల్ సటైరిస్ట్ గామారిన అమెరికన్ జర్నలిస్ట్ –రింగ్ లార్డేనర్-2(చివరి భాగం )
కధలన్నీ ‘’హౌ టు రైట్ షార్ట్ స్టోరీస్ అండ్ రౌండ్ అప్ ‘’పేరుతో వచ్చాయి .క్రిటిక్స్ విశ్లేషణలో చాలా దూరం పోయారు .ఆకాలపు ఉత్పత్తులపై ఏవగింపు చూపాడని ,అమెరిక కేపిటలిజం పై సాదికారిక విమర్శ చేశాడని ,మరణావస్త లో ఉన్న సాంఘిక వ్యవస్థ పై తీవ్ర కధనం చేశాడని అన్నిరకాల వ్యాఖ్యానం చేశారు కాని వారు అందులోని కామిక్ ఎలిమెంట్ ను ,యెంత మూసుకుని ఉందామనుకొన్న వారినైనా పళ్ళికిలించేట్లు నవ్వి౦చాడని మర్చిపోయారు .అతని ఆటగాయి తనం రచనలు భావ రహిత వర్ణనలు ,సరిగ్గా తగ్గట్టు ఉండే డైలాగులు సందర్భోచిన శ్లేషలు ఎవరినైనా ఆకట్టుకొంటాయి .’’కోరా స్పాన్ ఎట్ యే స్పాట్ ‘’క్లేమో యూటి వంటివాటిలో పొసగని సర్రియలిజాన్ని ,’’పబ్లిక్ బూత్ఇన్ యే బాత్ రూమ్ ‘’’’త్రీ అవుట్ సైడర్స్ క్లీన్ గో’’ అక్రాస్ ది స్టేజ్జ్ త్రీ టైమ్స్ ‘’లలో స్టేజ్ దర్శకత్వం పై చతురోక్తులు గుప్పించాడు .మేధావుల కౌగలి౦తలకు,వాళ్ళు ఊహించిన స్థాయిలో ఎదగ లేక పోయానేమోననేభయ పడ్డాడు .స్వీయ చరిత్ర’’ది స్టోరీ ఆఫ్ యే వండర్ మాన్ ‘’లో తనను తాను నిందించు కొన్నాడు .తాను చనిపోయాక తన సెక్రెటరి పగ తీర్చుకోనేట్లు ఒక చాప్టర్ దానికి చేర్చాలన్నాడు అందులో ‘’యజమాని వెళ్ళిపోయాడు ,ఆయనకు ఎవరు వారసులు ?బహుశా ఆయన ఇంకా పుట్టి ఉండ డేమో !బహుశా అలాంటి వాడు పుట్టడేమో అసలు .అదే నేరు కోరేది ‘’అంటూ రాయాలట.ఇలాంటి రాతలు ఆయన రోగ లక్షణాలను తెలియ జేస్తుంది అన్నారుజనం .
ది యాంగ్ విజిటర్స్ కు పేరడిగా ‘’ది యంగ్ ఇమ్మిగ్రంట్స్ ‘’రాశాడు .భయాన్ని తనపై పరిహాసం తోకప్పి పుచ్చుకొన్నాడుఇది క్రమంగా లైంగిక ప్రకోపానికి దారి తీసింది .ఇదేదో అశ్లీలమైన మాటకాదు -దీనర్ధం స్వీయాన్ని నాశనం చేసుకోవటమే .తానున్న సమాజం పై విమర్శ చేస్తూ తాను అశ్రద్ధ కు గురయ్యాడు .తన సున్నిత మనస్తత్వాన్ని వ్యంగ్యం తో కప్పి పుచ్చుకొన్నాడు. ఆయన పాత్రలు తమను లోకం తిట్టుకొంటారని తెలియదు .
1926 లో ఆయనభారీ ఆరోగ్య శరీరం వ్యాధి గ్రస్తమై దగ్గు .అలసట ఆయాసాలకు గురైంది .టి బి వచ్చిందని ప్రారంభ దశలోనే ఉందని డాక్టర్లు కనిపెట్టి చెప్పినా డిప్రేస్ అయ్యాడు .చాలా రోజులు డిప్రెషన్ లోనే ఉండిపోయాడు .జబ్బుకంటే డిప్రెషన్ ఎక్కువ బాధించింది .అర్ధం చేసుకోలేక పోయాడు .అపరాధభావం వెంటాడింది .ఏదో జరిగిందని దాన్ని జరగకుండా జాగ్రత్త పడలేక పోయానని అనుకొన్నాడు .అప్పటికే ప్రసిద్ధ రచయిత అయిపోయాడు .కాని కీర్తి గూర్చి అనుమానించాడు.తనలో తానూ మాట్లాడుకోవటం మొదలు పెట్టాడు .జన౦ మీద అనుమానం ఎక్కువైంది .
‘’ది పోర్టబుల్ రింగ్ లార్దేనర్ ‘’పుస్తకం లో ముందుమాట రాస్తూ గిల్బర్ట్ సేల్దేస్ ‘’మార్క్ ట్వేన్ టెంపరమేంట్లో సగం ఉన్నవాడు స్విఫ్ట్ అంతటి ఆలోచనా పరుడూ కాదు కాని ,ఈ ఇద్దరిలాగానే ఎవరూ తమవైపు కన్నెత్తి చూడని ఉపేక్షిత జనాన్ని పలకరించిన వాడు .ఆప్రజల భాషా ఆలోచనలే ఆయన రచనలలో ప్రతి ఫలించాయి .అందుకే వారు ఆయన్ను ప్రేమించారు .’’అన్నాడు .ఫిక్షన్ రాయటం ఆపేసి ఇంటికే పరిమితమయ్యాడు కాని ‘’నో విజిటర్స్ ‘’,అవుట్ టు లంచ్ ‘’న్యూయార్క్ ‘’లు పత్రికల కాలంస్ లో ప్రత్యక్షమయ్యాయి.ఆయన ప్రాముఖ్యత ఏనాడు తగ్గలేదు కాని ఆయన దాన్ని ఆనందించి అనుభవించలేక పోయాడు .నలభై లలో జబ్బుపడి హస్పిటల్ లో చేరి రెండేళ్ళు ఉన్నాడు .గదిలో ఉన్న రెడియో కొంత కాలక్షేపానికి ,కొంత సెటైర్ ప్రాక్టీస్ చేసు కొవటానికి ఉపయోగ పడింది . ‘’he turned out some of the best reviews of broadcasting ever produced ‘’కాని పెరిగిపోతున్న డిప్రెషన్ ను ,ఓడిపోవటాన్ని అధిగమించలేక పోయాడు .జాగ్రత్తగా ఉన్నా బాగా అలసిపోయాడు .గుండె ఆగి లాంగ్ ఐలాండ్ లోని ఈస్ట్ హాంప్టన్ స్వగృహం లో 25-9 -1933 న 48 ఏళ్ళకే అందర్ని నవ్వించిన నవ్వుల రేడు రింగ్ లార్డ్ నర్ రివ్వుమని చుక్కల్లో చేరాడు .
లార్డ్ నర్ కు జీవితాంతం దియేటర్ తో సంబంధం ఉండేది .అతని మూడు అంకాల నాటకం బ్రాడ్వే లో ప్రదర్శింపబడి ,మూడు సార్లు తెరకెక్కింది .ఆయన గొప్ప స్వరకర్త ,గీత రచయిత కూడా .ఆయన రాసిన ‘’జాంజిబార్ ‘’జూన్ మూన్ ‘’లు తను కూర్చిన బాణీలతోనే ప్రదర్శించి ముద్రించారు .బెర్ట్ విలియమ్స్ కు ఒక రికార్డ్ సాంగ్ రాశాడు .ఓల్డ్ క్వార్టర్ కు లిరిక్స్ రాశాడు .స్కాట్ ఫిట్జ రాల్ద్ ,జాజ్ యుగ రచయితలతోను దోస్తీ మస్తుగా ఉండేది . ఫిట్జ రాల్డ్ చివరినవల ‘’టెండర్ ఈజ్ ది నైట్ ‘’లో విషాద పాత్ర ‘’ఏబ్ నార్త్ ‘’కు మోడల్‌గా లార్డ్ నర్ ఉంటాడు .లార్డ్ నర్ ప్రభావం అత్యంత౦గా ఉన్నవాడు ఎర్నెస్ట్ హెమింగ్ వే .హెమింగ్వే తన హైస్కూల్ న్యూస్ పేపర్ కు ‘’రింగ్ లార్డ్ నర్ ‘’అనే మారు పేరుతో ఆర్టికల్స్ రాసేవాడు ఈ ఇద్దరూ 1928 డిసెంబర్ లో మార్క్ పెర్కిన్స్ చోరవతో కలుసుకొన్నారు కాని స్నేహం పెరగలేదు .జే డి సాలింజేర్ తన ‘’కాచర్ ఇన్ ది రై ‘’,ఫరానీ అండ్ జూయీ ‘’నవలలో లార్డ్ నర్ ను ఉదాహరించాడు .బ్లాక్ సెక్స్ స్కాండల్ కు సంబంధించిన ‘’ఎయిట్ మెన్ అవుట్ ‘’సినిమాలో రచయితా దర్శకుడు జాన్ స్టీల్స్ లార్డ్ నర్ పాత్ర పోషించాడు .మేనల్లుడుజూనియర్ రింగ్ లార్డ్ నర్ స్క్రీన్ రైటర్ –రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికన్ కాంగ్రెస్ ను ధిక్కరించినందుకు బంధింప బడి ,’’హౌస్ అన్ –అమెరికన్ యాక్టివిటీస్ కమిటి ‘’ముందు సంజాయిషీ చెప్పనందుకు బ్లాక్ లిస్టు లో పెట్టబడిన వాడు ..అతని స్క్రీన్ ప్లే లకు రెండు సార్లు అకాడెమి అవార్డ్ లభించింది .కనుక లార్డ్ నర్ లందరూ రచనా రింగు రంగం లో సుప్రసిద్దులే ,లార్డ్ లే .రచనా వారసత్వం నిలుపుకొన్న వారే .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10—7-16 –ఉయ్యూరు