ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –203
77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్
సమకాలీన సంఘం లో ఇమడలేక ,,స్వయం వేధకు బలైన మేధావి ,ప్రపంచ వ్యాప్త ఒత్తిడులకు బలహీనత తో భరించలేని ఉద్రిక్తలకు లోనైన ఆధునిక ఆంగ్ల నవలా రచయిత డేవిడ్ హెర్బర్ట్ లారెన్స్ . ‘’మనది ముఖ్యంగా విషాద యుగం ‘’ అనే వాక్యం తో ప్రారంభించి’’మనం దాన్ని విషాదంగా తీసుకోవటం లేదు .ఉపద్రవం జరిగిపోయింది .మనం శిధిలాల క్రింద ఉన్నాం. మనం కొత్త చిన్న ఆవాసాలనునిర్మించుకోవాలి ,కొత్త ఆశలు నింపుకోవాలి .అది కష్టమైన పనే .భవిష్యత్తుకు దారి సున్నితంగా ఉండదు అయినా అడ్డంకులను చేదించు కొంటూ మనం ముందుకు సాగాలి .ఎన్ని అవా౦త రాలోచ్చినా, మిన్ను విరిగి మీద పడినా మనం బతకాల్సిందే ‘’అని ‘’లేడీ చాటర్లీస్ లవర్ ‘’నవల రాశాడు .
లారెన్స్ 11-11-1885 న డేర్బి షైర్ , నాట్టింగ్ హాం షైర్ ల మధ్య ఉన్నబొగ్గు గనుల పట్టణం ఈస్ట్ వుడ్ లో పుట్టాడు .తండ్రి సంతానం లో ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు .అందులో డేవిడ్ హెర్బర్ట్ అతి చిన్నవాడికంటే పెద్దవాడు .కాంతి హీనమైనఇటుకల ఇంట్లో,కొండ దిగువ రోడ్డులో ఉండేవాడు .తండ్రి సంతకం కూడా చేయలేని చదువులేని పగటి కూలి ,జీవితమంతా బొగ్గుగని పని చేశాడు . తల్లి సాధారణ మాజీ స్కూల్ టీచర్ .ఆడంబరం ,అసహనం ,పెత్తనం ఉన్న స్త్రీ .భర్త తాగుబోతు అయినా ఆయన ఊహలకు మేడలు కడదామనుకోనేది . ఆతను మంచి డాన్సర్ ,చక్కని స్వరం ఉన్న గాయకుడు ,చతురోక్తులతో నవ్వించే హాస్యగాడు .లారెన్స్ చిన్నప్పటినుంచి బలహీనంగా ఉండేవాడు .చిన్నప్పుడు న్యుమోనియా సోకి మళ్ళీ పెద్దగా కోలుకోలేక పోయాడు .బాల్యం లోవచ్చిన నరాల బలహీనత ,దగ్గు జీవితాంతం అంటి పెట్టుకొనే ఉన్నాయి .సిగ్గరి .ఆకట్టుకొనే స్వభావం లేని విద్యార్ధి అయినా స్కాలర్షిప్ సాధింఛి నాటింగ్ హాం హైస్కూల్ లో 16 వ ఏట చేరి, పక్కింటి అమ్మాయి జెస్సి చేంబర్స్ తో ప్రేమలో పడ్డాడు. అది రొమాంటిక్ లిటరరీ లవ్ .దీన్నే ఫిక్షన్ గా ‘’సన్స్ అండ్ లవర్స్ ‘’పేరుతొ రాశాడు .తల్లి ప్రభావం తోప్రేమ అంటే భౌతిక ఆనందం కాదు మానసిక విషయం అని గ్రహించాడు భోతికత తో దాన్ని దిగజార్చ కూడదని తెలుసుకొన్నాడు .ఈవిషషయాలన్నీ జేస్సితో చర్చించే వాడు .
17 వ ఏట చదువుకొంటూ తన ఊళ్ళో పిల్లలకు చదువు చెప్పాడు . ఆ గనికార్మిక పిల్లలకు నాలుగేళ్ళు బోధించాడు .బాటని,ఫ్రెంచ్ లను చదివి నేర్చాడు .ఫ్రెంచ్ భాషను ప్రొఫెసర్ ఎర్నెస్ట్ వీక్లీ దగ్గర చదివాడు .23 ఏళ్ళకు దక్షిణ లండన్ లోని క్రియోడన్ లో ఉన్న డేవిడ్సన్ రోడ్ స్కూల్ లో పైక్లాస్ పిల్లలకు చదువు చెప్పాడు . ఇక్కడసాహిత్యం బోధించటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు .కాని సున్నితమైన పూల చిత్రాలు బహు అందంగా గీసేవాడు .పెద్దమనిషి అయినానని చెప్పుకోవటానికి కని సన్నని మీసం పెంఛి బాలుడిని కాదు అని రుజువు చేసుకొన్నాడు .జుట్టులేని చెంపలు ,బలహీనమైన గడ్డం ములక్కాడల్లా వేలాడే చేతులు , మాట్లాడేకొద్దీకీచుమనే మృదు స్వరం అప్పటి లారెన్స్ లక్షణాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -10-7-16 –ఉయ్యూరు