ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు –204
77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -2
పంతులు ఉద్యోగం ,రచనల మధ్య నలుగుతున్నప్పుడే లారెన్స్ తల్లి చనిపోయింది .బంధ విముక్తి అయి౦ దనుకోలేదు .ఆమెపై ఆరాధన పెరిగి సుళ్ళు తిరుగుతోంది .ప్రపంచం తనముందు కరిగిపోతోంది అనిపించింది .తర్వాత తానూ కరగిపోయాడు .అన్నీ కోల్పోయాను అనుకొన్నాడు .చావు మిస్టరీ నుండి రక్షించాలి అని ,జీవితంలో వెంటాడే చావు భయం నుండి బయట పడాలని భావించాడు .తరువాత రెండేళ్లలో ప్రేమింప బడటం కోసం చాలా అమ్మాయిల చుట్టూ తిరిగాడు .ఒకమ్మాయితో ఎంగేజ్మెంట్ దాకా వచ్చాడు కాని తల్లి జ్ఞాపకాలు ఇంకా బలమై పోయాయి .తల్లితో తప్ప అంతటి అనుబంధం వేరే యే అమ్మాయితోనూ అసాధ్యం అనిపించింది .శారీరక జబ్బు తోపాటు సైకో సోమాటిక్ లక్షణాలూపెరిగి వస్తున్న దగ్గు క్షయ లక్షణాలేమో అనుకొన్నాడు .కొంత భయం, కాస్త విరామం కోసం టీచింగ్ మానేశాడు .కవితల్లో ,సంభాషణలలో దీన్ని వివరిస్తూ ‘’నేను మళ్ళీ బోధనలో ఉండాలని కల వస్తుంది అది దారుణమైన కల అనుకొంటా.’’అని రాశాడు .
27 వయసులో’’ ఫ్రీడా వాన్ రిచ్ తోఫెన్ వీక్లీ ‘’అనే 32 ఏళ్ళ జర్మన్ జన్మ కల ముగ్గురు పిల్లలున్న తన మాజీ ప్రొఫెసర్ కూతురు తో ప్రేమలో పడ్డాడు .ఆమెలో పరిపక్వ మాతృత్వానికి ముగ్ధుడై తన ప్రేమను వ్యక్తం చేశాడు .ఆమె కూడా తల ఊపటం తో ఇద్దరూ జర్మనీ ఆస్ట్రియా ఇటలికి ‘’జంప్ జిలానీ’’ .ఏడాదిన్నర తర్వాత ఆమె విడాకులు పొందాక పెళ్లి చేసుకొన్నారు .ఈ లవ్ స్టోరీ మూడవ కవితా సంపుటి ‘’లవ్ పోయెమ్స్ అండ్ ఎమోరీస్ ‘’లో ను ‘’లుక్ వుయ్ హావ్ కం త్రూ ‘’అనే ఆటోబయాగ్రఫీ లోను దట్టించాడు.చివరికవితలు చాలా విషాద భరితం గా ఉంటాయి .ప్రేమ ద్వారా శాంతి కోసం తపిస్తున్న వాడు లారెన్స్ .28 వ ఏట ఇటాలియన్ లేక్ గార్డా లో ఉండగానే మూడవ నవల పూర్తీ చేశాడు .అది బాదాకలిత ఆత్మా వేదన .’’శీలవతీ ,అంతస్శుద్ధి ఉన్న స్త్రీ దిగువతరగతిలో ఉంటుంది .ఆమెకు తన జీవితం లో తృప్తి ఉండదు .మొదట్లో భర్తపై ఆరాధన ,దానిఫలితంగా పిల్లల పుట్టుక ,పిమ్మట వీరిపై మమకారం ,వీళ్ళు పెరిగి ప్రయోజకు లయ్యాక వాళ్ళపై విపరీతమైన ప్రేమ ,ఆలాంటి ప్రేమను కొడుకులు తల్లికి ఇవ్వక పోతే మానసిక క్షోభ ,మాత్రమేకాక ఆమె తమ జీవితాలలో అత్యంత శక్తి వంతు రాలవటం .ప్రేమించినదాన్ని పెళ్ళాడి కొడుకు తల్లికి వ్యతిరేకి అవటం .ఇలా ఒక సుదీర్ఘ సీరియల్ లా ఆమె జీవితం సాగి పోతూ ఉంటుంది అంతం ఉండదు .కొడుకు తన ఆత్మను వదిలి ,అమ్మ చేతుల్ని దులిపెసుకొని దూరమై పోతాడు .చివరికి పిల్లలు అన్నీ పోగొట్టుకొని దిగంబరులౌతారు ‘’ ఈ పుస్తకం పై మంచి రివ్యు ను రాస్తూ ‘’రెండు గొప్పముఖ్య పాత్రలను అందమైన బంధం తో ముడి వేసే కద.విరామమెరుగని కొడుకు,నాయిక లక్షణాలున్న తల్లి ఇందులో ముఖ్యపాత్రలు .సోఫోక్లిస్ మళ్ళీ పుట్టి కొత్త కాలం లో భీభత్స సంఘర్షణ లను మహాద్భుత౦గా కళాత్మకంగా వర్ణించా డేమో ననిపిస్తుంది .
29 వ ఏట మొదటి కదా సంపుటి ‘’ది ప్రష్యన్ ఆఫీసర్ ‘’ప్రచురించాడు .’’ది రెయన్ బో ‘’నాలుగవ నవల .ఈ దశలోనే’’ అంతః ప్రేరణ మేధాస్సుకన్నా మిన్న ‘’అనే ఎరుక కలిగింది .’’నా గొప్ప మతం-రక్తం ,మాంసం ,లపై నమ్మకం ,అవి తెలివి తేటలకంటే గొప్పవి అని .బుద్ధి తో మనం తప్పులు చేస్తాం .కానిమన రక్తం అనుభవించేది నమ్మేది ఎప్పుడూ సత్యమైనదే అవుతుంది .లారెన్స్ ఇన్స్టింక్ట్ లు ఆయన మేధస్సుకొంటే గొప్పది కావచ్చుకాని ఆయన నమ్మకాలు మాత్రం ఇబ్బందుల్లో ప్రజా వ్యతిరేకతలో పడేశాయి ఆయనను .రైన్ బో నవల చట్టవ్యతిరేకమై ,ఇంగ్లాండ్ లోని మూడు ప్రముఖ పత్రికలు లెస్బియనిజం ను ప్రోత్సహిస్తున్నాడని గగ్గోలు పెట్టాయి .పబ్లిషర్ స్క్రిప్ట్ చదవలేదని తప్పించుకొన్నాడు .దీనితో చట్టం తనపని తానూ చేసుకొని పోయి మొదటి ఎడిషన్ వెనక్కి తీసుకొన్నాడు .చదువరులుమాత్రం లారెన్స్ ఊహకు ,మంత్రముగ్ధ రచనకు అబ్బురపడ్డారు .విభేదించిన విమర్శకులుకూడా అది flushed with a moving animal vitality ‘’అని మెచ్చుకొన్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-7-16- ఉయ్యూరు
‘’