ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -206

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 206

77-మేధస్సు కంటే అంతః ప్రేరణ గొప్ప అన్నఆధునిక  ఆంగ్ల నవలా రచయిత డి.హెచ్ .లారెన్స్ -4

అమెరికా ఆగ్నేయ భాగం లో ,మెక్సికో లో లారెన్స్ తనకు తాను నాయకుడు ,మత ప్రవక్త గా ప్రవర్తించాడు .సృజన శీలఆలోచనా పరులను ,ఆర్టిస్ట్ లను ,వర్కర్లను ఒక చోట చేర్చే ప్రయత్నం చేశాడు .భారతీయుడులాగా అవినీతి ఆశ్రిత పక్షపాతం ,నిరాశా లేని ప్రపంచాన్ని కలగన్నాడు .ఇక్కడే రూసో భావమైన ‘’బ్లడ్ స్ట్రీం కాన్షస్ నెస్ ‘’ను సమర్ధిస్తూ ఇరవై వ శతాబ్ది యాంత్రిక జీవితాన్ని నిరసించాడు .డార్క్ గాడ్స్  ‘’’’లాస్ట్ మాజిక్ ‘’లలో చిక్కుకొన్నా తన ప్రతిభ వ్యక్తమయే ‘’ది ప్లూమేడ్ సర్పెంట్ ‘’,’’మార్నింగ్ ఇన్ మెక్సికో ‘’నవలలు రాశాడు .వీటిలో ఆయనకున్న సూర్యారాధన ,మాయలు ,మంత్రాలు ,ప్రక్కృతి ఆరాధన అన్నీ చెప్పాడు . ప్రజాస్వామ్య వ్యతిరేకత ,అధికార కాంక్ష ,అరిస్టాక్రటిక్ మేధావులతో కలయిక ,అన్నీ ఆయన్ను ఫాసిస్ట్ అనుకూలుడు అని అనిపించాయి .

  క్రమంగా రచనలో స్పష్టత ,హృదయం లోకి సూటిగా దూసుకు పోయే లక్షణం పెరిగింది .జీవితం లో చివరి ఎనిమిదేళ్ళ రచనలు మహా అతి అయ్యాయి .ఇండియన్ ,కీటకం ,సూర్యాస్తమయం ,ఆవు లలో ఆయన దేన్నీ తీసుకొన్నా అదొక క్రియాశీల చిహ్నమై పోయి,ఆయన ప్రాణావశ్యక బాధ్యతా అయింది .’’మామూలు వస్తువులలో ఉన్న నిగూఢ అంతరార్ధాన్ని విడమర్చి చెప్పే నేర్పు లారెన్స్ సాధించాడు ,.తాత్కాలిక భావోద్రేకాల ప్రాముఖ్యతనూ  గుర్తించి వాటికి తీవ్రమైన ప్రాముఖ్యముందని వివరించాడు .ఆయన్ను విమర్శించేవారికి చేతి నిండా పనే ఉన్నా ఆయనమాత్రం సృజన రచయితలకు దివ్యానుభావాన్ని అందజేశాడు .చాల జటిలమైన విషయాలను రాయటం మొదలు పెట్టాడు ‘’రచనలో సంగీతం ప్రవహిస్తుంది .చిత్రం గీసి చూపిస్తున్నట్లు రాస్తాడు .చలనం లో లయ సృష్టిస్తాడు .రంగులు ఉపయోగించకుండానే చీకటి వెలుగులు సృష్టిస్తాడు .నాట్య విలాసం ఉంటుంది .పదాలను విడగోట్టుతూ ,తేలిపొయేట్లు చస్తాడు .ఒక్కోసారి అర్ధంకంటే శబ్దమాదుర్యానికే ప్రాణం పోస్తాడు .ఇలా చేయటానికి ఎంతో గుండె ధైర్యం కావాలి .ఉంది కనుకనే రాశాడు .ఒక్కో సారి విఫలుడు అవుతాడు .లారెన్స్ రచన  గోడలో పగులు లాగా ఉండి కొత్త ప్రపంచాన్నిదర్శింప జేస్తుంది ‘’అని చాలా గొప్పగా  మహోత్క్రుస్టంగా ఎనైస్ నిన్ అనే విశ్లేషకుడు ‘’లారెన్స్ యాన్ యాన్ ప్రొఫెషనల్ స్టడి ‘’‘లో రాశాడు .

   ఈ చంచల ప్రపంచం లో లారెన్స్ ఒక ముఖ్య ఆవాసాన్ని ,భార్య ఫ్రీడా యొక్క అత్యంత విశ్వాసాన్నిపొందటం మూలంగానే  ఇంత గొప్ప రచనలు చేయగలిగాడు .ఒక్కో సారి భార్య ఫ్రీడా కూడా శాంతినివ్వలేక పోయేది .పోట్లాటల మాటల యుద్ధాలు శారీరక హింస ,పరస్పర ఆరోపణలు  ఉన్నా మళ్ళీ కలిసిపోయేవారు . లారెంస్ వలన పిల్లలు కావాలని భార్య ఫ్రీడా కోరుకొనేది .లారెన్స్ కు అదంటే ఇష్టం లేదుపైగా ఆమాట అంటే విపరీతమైన కోపం వచ్చేది . .ఆమే అర్ధం చేసుకొని  రాజీ పడి సర్దుకొని భర్తనే పిల్లాడిలాగా చూసుకొ౦టూఅతని సృజనను ప్రోత్సహిస్తూ ఓదారుస్తూ ఉండేది .సాంఘిక స్థితిలో,శిక్షణలో ,స్వాభావంలో  ఇద్దరివీ  వేరు వేరు తరగతులే  .కాని అరిస్టో క్రాట్ కు కూతురైన ఆమె ,పరిస్తితులను అవగాహన చేసుకొని ఆతనికి సహచరి అయి ,నేలతల్లి లాంటి సహనాన్ని అలవరచుకొని ద్రుఢంగా,అత్యంత సాధారణ మహిళగా మెలగింది .ఆమె పై ఆధారపడి బతకటానికి భర్త లారెన్స్ కస్టపడి పోరాటం చేశాడు .స్త్రీల వలననే లారెన్స్ సాహిత్య ప్రేరణ పొందాడు .వారితోకలిసి పనిచేశాడు .సన్స్ అన్డ్ లవర్స్ నవలలో చాలా భాగం లారెన్స్ స్వీట్ హార్ట్ జెస్సీ చే౦బర్స్ కధలోని ఓడిపోయిన హీరోయిన్  రాసింది .రెండో నవల ‘’ట్రేస్ పాసర్స్ ‘’ను తనతో పనిచేసిన  ఇరవైల  వయసులో దగ్గరకు చేరిన హెలెన్ కోర్క్అనే టీచర్   రాసిన రాత ప్రతి నాధారంగా రాసిందే .ఆస్ట్రెలియన్ కద’’ది బాయ్ ఇన్ దిబుష్ ‘’అనేది స్కిన్నర్ రాసిన .’’ది హౌస్ ఆఫ్ ఎల్లిస్ ‘’కు, మారు రూపం .అలాగే కేధరిన్ కార్స్ వెల్ ,మేబెల్ డాడ్జ్  లుహాన్ అనే స్త్రీల జీవితాలనాదారమైన కదలనే రాశాడు .ఇతర స్త్రీలు లారెన్స్ ను తమ వాడిని చేసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారుకాని భార్య ఫ్రీడా ,వాళ్ళ నీడా పీడా పడ కుండా ఆయనకు కావాల్సిన మహిళగా రుజువు చేసుకొన్నది .

   40 వ పుట్టిన రోజు తర్వాత 1925 లో లారెన్స్ తిరిగి వచ్చే ఆశతో   అమెరికా వెళ్ళాడు .కాని ఆ ఆశ నిరాశే అయింది .సూర్య నమస్కారాలు సముద్ర స్నానాలపై  ఉన్న ఆరాటం అనేక ప్రదేశాలను తిప్పించింది .స్విట్జర్లాండ్ లోని ఫ్లారెన్స్ కు సమీపం లో జెనోవా దగ్గరకు చేరాడు .అక్కడినుంచి ఆస్ట్రియా ,జెర్మని ,బాలరిక్ ఐలాండ్స్ తిరిగి చివరికి ఫ్రాన్స్ వచ్చి ఇక్కడే ఉండిపోయాడు .ఇక్కడే చిరస్మరణీయ వచన రచనలను ,అత్యుత్తమమైన ,ఆయన కోపోద్రిక్తమైన కవితలను రాశాడు .లారెన్స్ కున్న శారీరక ,మానసిక నిరోధాలను (ఇన్హిబిషన్స్)అత్యున్నత స్థితిలో ‘’లేడీ చాటర్లీన్స్ లవర్ ‘’నవలలో ఆవిష్కరించాడు .ఇందులో సెక్స్ పై  కోరిక ,పవిత్ర ప్రేమ ల పై ద్వంద్వాలపై తెగించిన ఆరాటం ఉంటుంది . సమకాలీన సాహిత్యం లో దీనిపై వచ్చినంత వ్యతిరేకత దేనికీ రాలేదు .పశు ప్రేమతో కొన్ని అధ్యాయాలున్నా అందులో లోతైన సానుభూతి ఉంటుంది .అసలు దీనికి మొదట్లో లారెన్స్ పెట్టాలనుకొన్న పేరు ‘’టెండర్ నెస్ ‘’.ఈ పుస్తకాన్ని అశ్లీలం అని  సెన్సార్ చేశారు,నిషేధించారు’.కాని లారెన్స్ దీన్నిఆధునిక యుగం లోని  ముతక వికారం ,మానసిక బౌద్ధిక వంధ్యత్వాలు ,త్వరపరచే లింగ ఇంద్రియ జ్ఞానం ల  మధ్య సమతూకం తో రాశానని చెప్పుకొన్నాడు .అసలైన సౌందర్యం ,అసలైన మంచితనం మూలాలఅన్వేషణ అందులో ఉందన్నాడు .’’Lawrence laid sex and those basic words for it on the salver of his art and held them up before creation and prayed that both might be transmuted to the highest that man could use ‘’.

Inline image 1Inline image 2

 

   సశేషం

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.