ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -జులై -గబ్బిట దుర్గాప్రసాద్

ఇద్దరు చిట్టగాంగ్ వీర నారీమణులు(వ్యాసం)- గబ్బిట దుర్గాప్రసాద్

భారత దేశ స్వాతంత్ర్య సమరం లోబెంగాల్ రాష్ట్రం లోని చిట్టగాంగ్ జిల్లాకు కు ప్రత్యెక ప్రాధాన్యత ఉంది .అక్కడి వీర నారీమణులు సాయుధ పోరాటం చేసి చరిత్రకెక్కారు .వారిలో కల్పనా దత్తా ,ప్రీతి లతా వాడేదార్ ల గురించి తెలుసు కొందాం .

1- కల్పనా దత్తా

కల్పనా దత్ అనే పేరుతో పిలువ బడే కల్పనా దత్తా జాతీయ బెంగాలీ విప్లవ నారి .బెంగాల్ లో చిట్టగాంగ్ జిల్లా సిరిపూర్ గ్రామం లో 1913 జులై 27న జన్మించింది .చిట్టగాంగ్ లో చదివి మెట్రిక్ పాసై కలకత్తా చేరింది .బెతూనే కాలేజి లో సైన్స్ లో డిగ్రీ కోర్స్ లో చేరింది . అక్కడే వీణా దాస్, ప్రీతీ లాల్ వాడేకర్ ల ఆధ్వర్యం లో నడుస్తున్న చిన్న విప్లవ సంఘం ‘’చాత్రి సంఘం ‘’లో సభ్యురాలై చురుకైన కార్య కర్త అయింది .

1930 ఏప్రిల్ 18న జరిగిన చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ లో చిట్టగాంగ్ లోని ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ తరఫున సూర్య సేన్ తో కలిసి పని చేసింది .1931లో సూర్య సేన్ కల్పనకు ,ప్రీతీలత కు చిట్టగాంగ్ లోని యూరోపియన్ క్లబ్ పై దాడి జరిపే బాధ్యతను అప్పగించాడు .కాని ఒక వారం ముందే ఆమె ఆ ప్రాంతం లో సంచరిస్తుండగా అనుమానమొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది .బెయిల్ పై విడుదలై సాయుధ పోరాటం కోసం అండర్ గ్రౌండ్ లోకి వెళ్లి పోయింది .1923 ఫిబ్రవరి 17న వారి స్థావరాన్ని గుర్తించి పోలీసులు చుట్టుముట్టి సూర్య సేన్ ను అరెస్ట్ చేశారు .కల్పన వారికి అందకుండా తప్పించుకొన్నది .సుమారు పదేళ్ళ తర్వాత 19-5-1933న ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు .చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ పై రెండవ సారి జరిగిన విచారణ లో యావజ్జీవిత ఖైదు విధించారు .కాని 1939లో ఆరేళ్ళ తర్వాత విడుదల చేశారు .

కలకత్తా యూని వర్సిటీ నుండి1940లో సైన్స్ లో డిగ్రీ పొందింది .భారత కమ్యూనిస్ట్ పార్టీ లో చేరి 1943లో వచ్చిన బెంగాల్ కరువు ,ఆ తర్వాత బెంగాల్ విభజన లలో బాధితుల సేవాకార్యక్రమాలలో పాల్గొని ఆదుకోన్నది .అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రెటరి పూర్ణ చాంద్ జోషి ని వివాహ మాడిఇద్దరు కుమారులను కన్నది .పెద్దకొడుకు చాంద్ జోషి గొప్ప జర్నలిస్ట్ .హిందూస్తాన్ టైమ్స్ లో పనిచేశాడు .ఆయన 1985లో రాసిన ‘’భి౦ద్రేన్ వాలే –మిత్ అండ్ రియాలిటి ‘’పుస్తకం బహుళ ప్రచారం పొందింది . ‘’చిట్టగాంగ్ ఆయుధ దోపిడీ జ్ఞాపకాలు ‘’అనే స్వీయ జీవిత చరిత్రను కల్పన రాసింది .ఇది 1945లో ఆంగ్లభాషలో అచ్చయింది .1946 బెంగాల్ శాసన సభకు జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చిట్టగాంగ్ నుంచి పోటీ చేసింది కాని గెలవలేదు .తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్ స్టిట్యూట్ లో చేరి ,అక్కడే రిటైర్ అయింది .8-2-1995న 82ఏళ్ళ వయసులో స్వాతంత్ర సమార యోధురాలు కల్పనా దత్త మరణించింది .

కల్పనా దత్తా పై సినిమా తీశారు .అందులే దీపికా పడుకొనే కల్పన పాత్ర ధరించింది .హిందీలో తీసిన ఈ సినిమా పేరు ‘’ఖేలేన్ హం జీ జాన్ సె ‘’.ఇందులో చిట్టగాంగ్ సాయుధ దోపిడీ ,ఆతర్వాత జరిగిన పరిణామాలు చిత్రించారు .పూర్వపు నాసా సైంటిస్ట్ వేదవ్రత పైన్ దర్శకత్వం వహించాడు .12-102012న ఈ సినిమా విడుదలైంది .

2-ప్రీతీ లతా వాడేదార్

మధ్యతరగతి వైద్య బ్రాహ్మణ కుటుంబం లో ఇప్పటి బంగ్లాదేశ్ లోఉన్న చిట్టగాంగ్ ఉపజిల్లా పాటియా లోని దాల్ఘాట్ గ్రామం లో 5-5-1911న ప్రీతిలతా వాడేదార్ జన్మించింది .తండ్రి జగబందు వాడేదర్ చిట్టగాంగ్ మునిసిపాలిటీ గుమాస్తా .తల్లి ప్రతిభా మాయి గృహిణి .వారి 6గురు సంతానం లో ప్రీతి రెండవది .ఇంట్లో ‘’రాణి ‘’అని ముద్దుగా పిలిచేవారు .తండ్రికి వంశ పారంపర్యంగా వచ్చిన ‘’దాస్ గుప్త’’ బిరుదు ఉంది .పిల్లకు తనకున్న శక్తి సామర్ధ్యాలతో ,ఆర్ధిక వనరులతో విద్య నేర్పించాడు .చిట్టగాంగ్ లోని డాక్టర్ ఖాస్ట గిర్ ప్రభుత్వ బాలికల పాఠ శాలలో చేర్పించాడు .మెట్రిక్ పాసై౦ది. అక్కడే టీచర్ గా ఉన్న విద్యార్ధుల అభిమానం పొందిన’’ ఉషాదీ’’ చెప్పే ఝాన్సి లక్ష్మీ బాయి చరిత్ర లతా ,ఆమె సహ విద్యార్ధులలో జాతీయ భావన ను ప్రేరేపించింది .ప్రీతి లో సాహసం ధైర్యం రావటానికి ఇదే కారణమైంది .కల్పనా దత్తా ఈమెకు సహ విద్యార్ధిని.ప్రీతికి కళా సాహిత్యాలు ప్రీతి పాత్రమైనాయి .ఢాకా లోని ఈడెన్ కాలేజి లో చేరి ఇంటర్ లో మొదటి స్థానం సాధించింది .అనేక సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేది .. లీలానాగా నడిపే శ్రీ సంఘం లో దిపాలీ సంఘం ఆధ్వర్యం లో పని చేసింది .

కలకత్తా వెళ్లి బెతూనే కాలేజి లో చేరి రెండేళ్ళు ఫిలాసఫీ చదివి డిస్టింక్షన్ తో గ్రాడ్యుయేట్ అయింది . కాని బ్రిటిష్ అధికారులు ఆమె సర్టిఫికేట్ ను యూని వర్సిటీ జారీ చేయకుండా నిలిపేశారు .చనిపోయాక 2012లో ఆమెకూ,వీణా దాస్ కు మరణానంతర డిగ్రీ ప్రదానం చేశారు .డిగ్రీ తర్వాత చిట్టగాంగ్ చేరి నందన్ కానన్ అపర్ణాచరణ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పని చేసింది . భారత స్వాతంత్రయుద్ధం వార్త విని తానూ పాల్గోనాలనినిర్ణయించు కొన్నది .సూర్య సేన్ ఆమె భావాలను గమనించి తమతో విప్లవ సంఘం తో కలిసిసాయుధ పోరాటం లో పని చేయమని ఆహ్వానించాడు .1932జూన్ 13న దాల్ఘట్ కాంప్ లో సూర్యా సేన్ ,నిర్మల్ సేన్ లను కలిసింది .సహా విప్లవ కారుడు వినోద్ బీహారీ చౌదరి ఆడవాళ్ళను చేర్చుకోవద్దని అభ్యంతరం పెట్టాడు .ఆయుధాలను చేరవేయటం లో అనుమానం రాకుండా ,పట్టుబడకుండా నైపుణ్యం గా చేర వేసే సామర్ధ్యం స్త్రీలకకేఉందని చెప్పి సూర్య సేన్ ఒప్పించి చేర్చుకొన్నాడు .

చిట్టగాంగ్ ఇన్స్పెక్టర్ జనరల్ క్రైగ్ ను హత్య చేయటానికి సూర్య సేన్ విప్లవ దళం నిర్ణయించింది . రామకృష్ణ బిశ్వాస్ ,కాళీ పాద చక్రవర్తి లకు సేన్ ఈ బాధ్యతఅప్పగించాడు . కాని వీళ్ళు పొరబాటున చందాపూర్ ఎస్పిని, త్రయాణీ ముఖర్జీని కాల్చి చంపారు .దీనికి బిశ్వాస్ ను చక్రవర్తిని ప్రభుత్వం 2-12-31న అరెస్ట్ చేసింది .విచారణ తర్వాత బిశ్వాస్ ను ప్రాణం పోయే దాకా ఉరితీసే శిక్ష విధించారు .చక్ర వర్తిని సెల్యులర్ జైలు కు ప్రవాసం పంపారు .చిట్టగాంగ్ నుంచి ఆలీపూర్ జైలు కు వెళ్ళటానికి కుటుంబ సభ్యుల వద్ద డబ్బు లేదు .కలకత్తాలో ఉంటున్న ప్రీతి లతను ఆలీపూర్ జైలు కు వెళ్లి బిశ్వాస్ ను కలుసుకోమని పంపారు .

సూర్య సేన్ బృందం తో కలిసి విప్లవ కార్యక్రమాలు చేస్తూనే ప్రీతి టెలిఫోన్ ,టేలిగ్రాఫ్ ఆఫీసులపై దాడి నిర్వహించింది .రిజర్వ్ పోలీస్ లనుజలాలాబాద్ పోరాటం లో పట్టుకొన్నది.విప్లవకారులకు ప్రేలుడు సామగ్రి అందజేసే బాధ్యతను ప్రీతీ లతా స్వీకరించి సమర్ధ వంతంగా నిర్వహించింది .’’కుక్కలకు ,ఇండియన్ లకు ప్రవేశం లేదు ‘’అని వ్రేలాడ దీసి ఉన్న ప్రహర్తాలి యూరోపియన్ క్లబ్ పై ఆ వాక్యం పై ఉన్న తీవ్ర ఆవేదన నిరసనలతో 1932లో దాడి చేయాలని సూర్య సేన్ ప్రణాళిక సిద్ధం చేశాడు .దీన్నిఅమలు చేయటానికి మహిళకు బాధ్యత ఇవ్వాలని సేన్ భావించాడు .కాని కల్పనా దత్త వారం రోజులు ముందే అరెస్ట్ అయింది .అందుకని ఈ బాధ్యతను ప్రీతిలతకు అప్పగించాడు సేన్ .ప్రీతిలత కొటోవాలి సముద్ర తీరం చేరి ఆయుధ విద్య లో శిక్షణ పొంది ఆరితేరి౦ది ..ప్లాన్ అంతా సిద్ధం చేసుకొన్నది .

డిసెంబర్ 23న దాడికి పక్కా ప్లాన్ సిద్ధమైంది .బృందానికి పొటాషియం సయనైడ్ ఇచ్చి పట్టుబడితే మింగేసి చనిపోమ్మని ఆజ్ఞలు జారీచేశాడు నాయకుడు సేన్ .దాడి చేసే రోజు న ప్రీతి పంజాబీ మగ వాడి దుస్తులు ధరించింది .ఆమె అనుచరులు కాళీ శంకర్ డే,శాంతిలాల్ చక్రవర్తి పంచాచొక్కా వేషం వేసుకొన్నారు .మహేంద్ర చౌదరి ,సుషీల్ డే,పన్నా సేన్ లు లుంగీ చొక్కా తో సిద్ధమయ్యారు . ఈ విప్లవ బృందం ఆ రాత్రి 10-45కు క్లబ్ దగ్గరకు చేరి,దాడి ప్రారంభించారు .అప్పుడు క్లబ్ లో 40మంది ఉన్నారు .విప్లవ బృదం మూడు గ్రూపులుగా చీలి దాడి చేయాలని భావించింది .క్లబ్ లోపల ఉన్న కొందరు పోలీస్ ఆఫీసర్లు తమ రివాల్వర్ లతోఎదురు కాల్పులు సాగించారు .ప్రీతిలత కు చిన్న బులెట్ గాయం అయింది .పోలీస్ రిపోర్ట్ ప్రకారం ఈ దాడిలో సల్లివాన్ అనే ఇంటి పేరున్న స్త్రీ ,చనిపోయిందని నలుగురు మగాళ్ళు ఎందరో ఆడవాళ్ళు గాయపడ్డారని ఉంది .
గాయ పడిన ప్రీతి లతను వలపన్ని బ్రిటిష్ పోలీసులుపట్టుకొ బోయారు .

ఆమె సయనైడ్ మింగి అరెస్ట్ కాకుండానే వీర మరణం పొందింది .మర్నాడు ఆమె శవాన్ని గుర్తించి ప్రీతిలత చని పోయిందని తేల్చారు .ఆమె వస్తువులను సోదా చేస్తుంటే బిశ్వాస్ ఫోటో ,విప్లవ సాహిత్యం బుల్లెట్లు ఈ దాడి కి సిద్ధం చేసిన ప్లాన్ ప్రతి దొరికాయి .పోస్ట్ మార్టెం తర్వాత ఆమెకు తగిలిన బులెట్ గాయం చాలాస్వల్పమైనదని ,సయనైడ్ తీసుకోన్నందుకే చనిపోయిందని తెలిసింది .బెంగాల్ చీఫ్ సెక్రెటరి లండన్ లోని బ్రిటిష్ ప్రభుత్వాధికారులకు సందేశం పంపుతూ’’ ప్రీతి, టెర్రరిస్ట్ బిశ్వాస్ భార్య కాదని . దాల్ఘాట్ లో అరెస్ట్ ను తప్పించుకొ బోయే సమయం లో కెప్టెన్ కేమరాన్ పడిపోయినప్పుడు పోలీస్ కాల్పులలో మరణించిన నిర్మల్ సేన్ భార్య అని కొంత సమాచారం ఉంది’’ అని తెలియ జేశాడు .

బంగ్లా దేశ్ రచయిత సాలీనా హోస్సైన్ రాస్తూ ‘’ప్రీతీ జీవితం అందరికి ఆదర్శమని ,ఆమె జ్ఞాపకార్ధం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారని , ఆ ట్రస్ట్ ప్రీతిని బీకన్ లైట్ అంటే దారి దీపం అనీ అందిఅని చెప్పింది .ఆమె పుట్టిన రోజును ట్రస్ట్ బంగ్లా దేశ్, భారత దేశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తోందని ,చిట్టగాంగ్ లో ఒక వీదికి ‘’ప్రీతిలత వాడేదార్ మార్గం ‘’అని పేరు పెట్టి గౌరవించారని ,2012లో ఆమె బస్ట్ సైజ్ కాంస్య విగ్రహాన్నిచారిత్రాత్మక యూరోపియన్ క్లబ్ దగ్గరున్న ప్రహర్తాలి రైల్వే స్కూల్ సమీపం లో ఏర్పాటు చేశారని ,రాసింది .2010లో వచ్చిన బాలీవుడ్ సినిమా ‘’ఖేలేన్ హం జీ జాన్ సే’’లో ప్రీతిలత పాత్రను విశాఖా సింగ్ పోషించింది .2012లో వచ్చిన చిట్టగాంగ్ హిందీ సినిమాలో ప్రీతిలత వాడేదర్ గా వేగా తమోషియానటించింది .
భారత స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న సమయం లో ఈ ఇద్దరు వీర విప్లవ నారీమణులను గురించి తెలుసుకొని ధన్యులమవుదాం .వారి బలిదానానికి నివాళు లర్పించి ఋణం తీర్చుకొందాం ..

-గబ్బిట దుర్గా ప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Share

– See more at: http://vihanga.com/?p=17320#sthash.3uf19uRp.dpuf

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.