ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -208 78 – -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు 208

78 –   -ప్రతీక కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్

తన పోరబాట్లఅస్తిత్వంతో బతుకు విషాదం చేసుకొన్నఆధునిక అమెరికన్ కవి ఎజ్రా పౌండ్ .రాజకీయ ప్రచారం లో ఉద్దండుడు.ఈ ప్రాపగాండా తో తనలోని ఆర్టిస్ట్ ను  వాచాలత్వం,  బూతులతో సన్నిహితులను దూరం చేసుకొని చివరికి దేహ ద్రోహ నేరం మోపబడి న విధి వంచితుడు .30-10-1885 న అమెరికాలోని ఇడాహోరాష్ట్రం లో హైలీ లో పుట్టాడు .ఆతనిది న్యు ఇంగ్లాండ్ వంశం .తల్లి లాంగ్ ఫెలో కవికి దూరపు చుట్టం .తండ్రి ప్రభుత్వ ఉద్యోగి ,మొదటి ప్లాస్టర్డ్ హౌస్ నిర్మించిన మార్గ దర్శి .చిన్నతనం లోనే పెన్సిల్వేనియా కు తీసుకు పోబడి తూర్పు వాతావరణం లో పెంచబడ్డాడు  .15 ఏళ్ళకు అక్కడి యూని వర్సిటి లో చేరి కార్రిక్యులం లేని  తులనాత్మక సాహిత్యం చదివి జీర్ణించుకొన్నాడు .16 వయసులో స్పెషల్ స్టూడెంట్ గా నమోదయ్యాడు .18 వ ఏట న్యూయార్క్ హామిల్టన్ కాలేజి లో చేరి ,ఇరవైకే గ్రాడ్యుయేట్ అయి రోమాన్స్ లాంగ్వేజెస్ లో ఫెలో అయి పెన్సిల్వేనియా యూని వర్సిటిలో ,ప్రొఫెసర్ సమాన హోదా గల ఇంస్ట్రక్ట్క్తర్ అయ్యాడు .21 కె మాస్టర్ డిగ్రీ పొంది ,స్పెయిన్ ఇటలి ఫ్రాన్స్ లు తిరిగొచ్చాడు .ఒక ఏడాది స్పానిష్ నాటక రచయిత లోప్ డి వేగా పై పరిశోధన చేశాడు .1907 లో తిరిగి రాగా ఇండియానా రాష్ట్రం క్రాస్ ఫోర్డ్స్ విల్ లో వాబాష్ కాలేజి లో ఫాకల్టిలో చేరమని ఆహ్వానం అందుకొన్నాడు .ఆ టౌన్ సాహిత్య సంప్రదాయాలకు ,ముఖ్యంగా బెన్హర్ రాసిన ల్యు వాలెస్ చనిపోయిన ప్రదేశం గా గుర్తింపు పొందింది .నాలుగు నెలల తర్వాత బోహిమినియనిజం తో   సంప్రదాయ విరోధి అని నిందలు మోపి ఉద్యోగం ఊడ గొట్టారని పౌండ్ చెప్పుకొన్నాడు .

     పుట్టుకతోనేవిద్యా వేత్తగా  బోధనా  సామర్ధ్యంఉన్నా విఫలమైన టీచర్ గా నిరాశ చెంది , తన బహిష్కృత అమెరికన్ లకు చదువు నేర్పాలను కొని , యూరప్ కు  వెళ్లి  జేబులో ఎనభై డాలర్లతో జిబ్రాల్టర్ చేరి కొంత డబ్బు వడ్డీకిచ్చి దానితో బతుకుతూ గడిపాడు .ఇటలీ వెళ్లి మొదటి పుస్తకం ‘’ఎ ల్యూం స్పేంటి ‘’1908 లో వెనిస్ లో ప్రచురించాడు .ఇది చిన్నపుస్తకమే అయినా తన విద్యకు తగిన ఉన్నత రంగుల ప్రతి బి౦బాలతో పగిలిన అద్దం పెంకుల్లా ఉంది .కొన్ని నెలల తర్వాత లండన్ లో ఉన్నాడు. అక్కడ  ఆధునిక యువ రచయితలతో కలిసి ,వారి వైవిధ్య కార్యక్రమాలకు నాయకత్వం వహించి చైనా జపాన్ కవిత్వమైన ఫెనలోసా సంపుటికి ఎక్సి క్యూటర్ బాధ్యత చేబట్టాడు.25 వఏట మరో రెండు చిన్న పుస్తకాలు ‘’పర్సోనే ‘’’’,ఎక్సల్టేషన్స్ ‘’రాసి ముద్రించాడు  .తర్వాత ‘’కాన్జోని ,’’రిపోజిల్స్ ‘’కూడా రాసి మొత్తం అయిదు పుస్తకాలను 27 ఏళ్ళకే ప్రచురించాడు .29 కి డోరోతి షేక్స్ పియర్ ను పెళ్లి చేసుకొని ఒక కొడుకుకు తండ్రి అయ్యాడు .

   పౌండ్ రాసిన మొదటి  కవితలు ప్రాచీన ఫ్రెంచ్ ఆధునిక ఇంగ్లీష్ ప్రభావ సమ్మేళనాలే .ప్రోవెన్షియల్ కవులు,మధ్యయుగపు ప్రేమ గీతాలతో బ్రౌనింగ్ ,విలియం మారిస్ ,స్విన్ బరన్, ప్రి రాఫలైట్స్ కవిత్వాల రంగ రింపు ప్రాముఖ్య యాస తో ఉంది .మధ్యలో అనేక వైరుధ్యాలు ,కొత్తదనం తాజాదనం కృత్రిమ ఆకర్షణ తో ఉంది .బాలడ్స్ సేస్టినా,ఫ్రెంచ్ కవితల అనువాదం  పాత వాసనతో కొత్తగా,వాడుక భాషలో స్వీయ చైతన్య స్పూర్తితో ఉంది .ఉదాహరణకు –  ‘’come ,my songs ,let us speak of perfection –we shall get ourselves rather disliked –the gilded phaloi  of the crocuses –are thrusting at the spring air ‘’

 

Inline image 1Inline image 2

        సశేషం

 మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-13-7-16-ఉయ్యూరు

 

 

‘’

 

 

 

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.