ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210 78 – -భావ చిత్ర కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -210

78 –   -భావ చిత్ర  కవిత్వ వ్యాప్తి చేసిన అమెరికన్ కవి -ఎజ్రా పౌండ్ -3(చివరిభాగం )

సృజన సాహిత్య కుదుపులతో విపరీత ధోరణితో  పారిస్ లో కూడా తనసహాయకులను చికాకుపెడుతూ ,ఉద్దీపన కలిగించాడు .తన విపరీత పాండిత్యం తో కవులను మెడలో బిళ్ళల్లాగా చేసుకొని వినోదించాడు .ఈ కాలం లోనే కొత్త వగరు శైలిని ,సంభాషణా రూపం తో ,విరుద్ధ భావనలతో రూపొందించు కొన్నాడు .35 వ ఏట ‘’హఘ్ సేల్విన్ మాబర్లి ‘’అనే మిరుమిట్లు గొలిపే వ్యంగ్యం ,చమత్కారం ,రోత కలిగించే పుస్తకం ప్రచురించాడు .సాంకేతిక పరిణతి ఉన్న గొలుసులా ,వినసొంపైన భాగాలతో ,తెచ్చిపెట్టుకొన్న మొరటుతనం తో ,ఇంద్రియ పరోక్ష వివరాలతో కూడిన మహా ప్రవాహంగా మధ్యమధ్యలో సంబంధం లేని గుర్తుకొచ్చే విషయాలు అడ్డు పడుతుండగా కొత్త తరహా కవిత్వం చెప్పాడు .దీనినే ఇలియట్ కవి ‘’’a’positive document of sensibility .it is compact of a certain man in a certain place at a certain time ,and it is also the document of an epoch –it is genuine tragedy and comedy and it is in the best sense of Arnold’s worm phrase a ‘’criticism  of life’’అని విశ్లేషించాడు .

పౌండ్ రాసిన ‘’కాంటోస్ ‘’ఒక శృంఖల రచన .అందులో విడిపోతూ కలుస్తున్న ఆశావహ ఏక పాత్రాభినయాలు (మొనోలాగ్స్ )ఉన్నాయి వాటిని పాతికేళ్ళుగా రాస్తూనే ఉన్నాడు .కొందరు దాన్ని ఆయన సాహిత్య శిఖరారోహణం ,ఒక ఎపిక్ అన్నారు మరి కొందరు అర్ధం పర్ధం లేని సంబంధం లేని సాహిత్య దిగాజారుడుతనం అన్నారు .ఇది 100ఆధ్యాయాలు ..మొదటి 16 అధ్యాయాలు 1925 లో ,వెలువడితే మిగిలినవి ఆ తర్వాత 20 ఏళ్ళలో వచ్చాయి .1945 లో పౌండ్ పీసా  జైలు లో నిర్బంది౦చ బడినప్పుడు వచ్చిన 10 అధ్యాయాలను ‘’పీసాన్ కాంటోస్’’అన్నారు . ఈ మహా కావ్యాన్ని  చదవటానికి కుస్తీ పట్టినవాళ్ళు మింగుడు పడక అది కోడ్ భాషలో ఉందని దాన్ని చేదించి చెప్పే వివరణ ఉంటె కాని బుర్రకు యెక్కదని బుర్రలు పగలకొట్టుకొన్నారు .వాళ్ళు పొరబడ్డారు కాని పూర్తిగా అబద్ధం మాత్రం కాదు .సంపూర్నమైనదికాకపోయినా చాలా స్పష్టంగా నే ఉంటుంది .ఈ కావ్యాన్ని దున్నాలంటే యెన్ సైక్లో పీడియాలు ,పరభాషా డిక్షనరీలు ,సంస్కృతిక రాజకీయ చరిత్రలు ,పౌండ్ సమకాలికుల గురించి విస్మృత పుకార్లు ,ఆయన కున్న పరిచయాలు ,ఆయన రచనలలోని తికమకలు ,క్రమరాహిత్యాలు ,ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాలు ఆధారాలుగా ఉండాల్సిందే .ఈ కాంటోస్ పై స్పందన వెను వెంటనే కాకుండా నిదానంగా ,భావోద్రేక రహితంగా వచ్చింది .దీనిపై రిచార్డ్ ఎబెర్ హార్ట్ రాస్తూ ‘’the student is recommended to read them about six times  before their flavor can diffuse through the blood ‘’పౌండ్ కున్న జాతీయాల వెదుకులాట ,ఆయనకున్న బహుభాషా పాండిత్యం మనకు అర్ధమై మనం కూడా తప్పకుండా ఉపయోగిస్తాం .

బాగా భాషా పాండిత్యం ఉన్న వాళ్ళే ఇందులోకి చొరబడగలరు .గ్రీకుల ,రినైసేన్స్ ల మొదటి ప్రపంచ యుద్ధకాలపు విషయాలు ‘’ఇంఫెర్నో ‘’లోను ,డబ్బు బాంక్ లావాదేవీలలో అవినీతిని ‘’ప్యురాగేటోరియో’’లో ,వాతావరణ అంతాన్ని ‘’పారాడిసో’’లో వర్ణించాడు .మన సంస్కృతికి పుట్టినిల్లు అయిన ప్రపంచం యొక్క యదార్ధ స్థితిని తీరం నుంచి గమనించి రాసిన సాటిలేని చరిత్ర  .ఎడ్వర్డ్ ఫిట్జరాల్ద్ ‘’there hangs a dismal mist of un resolved confusion ‘’అని చెప్పాడు .మామూలు భాషను కవిత్వం తో రంగరించటమే పౌండ్ శైలి అయింది .యేట్స్ కవి పౌండ్ ను ‘’సెక్స్ లెస్ అమెరికన్ ప్రొఫెసర్ ‘’గొప్ప మార్పు తెచ్చిన వాడు అంటూ ‘’a brilliant  improvisator who had more style than form, a style continually interrupted ,broken ,twisted into nervous obsession ,night mare ,stammering confusion ‘’అని తేల్చాడు .ఈ కన్ఫ్యూజన్ ఆయన శిష్యులు కూడాపడినా ఆయన శైలి తమ పాలిటి గాస్పెల్ –దైవ వాక్యం గా భావించారు .వాళ్లకు కావలసిన అత్యవసర విషయాలన్నీ పౌండ్ అందించాడు .ఆయన రాసిన ‘’స్పిరిట్ ఆఫ్ రోమాన్స్ ‘’,ఇన్స్టి గేషన్స్,పోలిట్ ఎస్సేస్ ,,సోషల్ క్రెడిట్ ,యాన్ ఇంపాక్ట్ ‘’మొదలైన రచనలన్నీ సంప్రదాయ రొమాంటిక్ విధానాలకు వ్యతిరేకాలే .

ఫ్రాన్స్  వదలి  ఇటలి  1924 లోచేరి  రివేర్రా దగ్గర  రాపల్లో లో ఉన్నాడు .1939 లో కొద్దికాలం అమెరికా వెళ్లి వచ్చాడు అక్కడ ఫాసిజాన్ని మెచ్చు కొని ముసోలిని జెఫర్సన్ తో పోల్చి వ్యతిరేకతను కొని తెచ్చుకొన్నాడు .ఆయన అనుయాయులు విస్తు పోయారు .చాలాకాలం అమెరికాకు దూరం గా ఉండటం వలన  మతి భ్రమణ వలన తమ’’గురూజీ  ‘’ఇక్కడి పరిస్తితులను తెలుసుకోకు౦డా గుప్పించిన కామెంట్ లన్నారు .విమర్శను తట్టుకోలేని రక్తం పౌండ్ ది .ఇటలీకి మళ్ళీ చేరి ఫాసిస్ట్ ధోరణి మితిమీరగా 1941 లో రోమ్ నుంచి షార్ట్ వేవ్ రెడియోద్వారా ప్రచారం చేశాడు  అమెరికాను ,దాని విధానాన్ని దుమ్మెత్తి పోశాడు . ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ ప్రజాస్వామ్యాన్ని హతమారుస్తున్నాడని చెప్పాడు. చివరికి ఇవన్నీ అతన్ని అమెరికా దేశ ద్రోహి గా ముద్ర వేసే స్థితికి తెచ్చుకొన్నాడు 1945 లో పౌండ్ ను బంధించి అమెరికాకు చేర్చింది ప్రభుత్వం .వాషింగ్టన్ జైల్లో పెట్టి విచారణ చేసింది .విచారణకు నిరాకరించాడు .నలుగురు మానసిక వైద్యులు పరీక్షించి పౌండ్ మానసిక స్థితి ఆరోగ్యం గా లేదని రిపోర్ట్ ఇచ్చారు .మరణ శిక్ష పడితేకాని పిచ్చి కుదరదు అన్నారు .కాని  తర్వాత సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్లో 14 2- 1946న  మానసికరోగిగా అంటే ఉన్మాదిగా చేర్చి వైద్యం అందించారు ..12 ఏళ్ళు కేసు నడిచింది .పౌండ్ ఇక ఏమాత్రం విచారణకు నిలబడ లేడనిప్రజలు , ప్రజా సంఘాలు కవులు ,రచయితలూ వాల్ట్ విట్మన్ కవి నాయకత్వం లో పెద్దపెద్దనిరసనలు చేసి  విడుదల చేయమని ప్రబుత్వం పై ఒత్తిడి తెచ్చారు .1958 లో హాస్పిటల్ నుండి విడుదలై ఇటలీకి వెళ్ళిపోయాడు. ఇటలీ తన పెంపుడు తల్లి అంటూ ఫాసిస్ట్ పద్ధతిలో సెల్యూట్ చేసి ‘’అమెరికా ఒక పిచి వాళ్ళ శరణాలయం ‘’అని స్టేట్మెంట్ ఇచ్చాడు ,

63 వ ఏట ఇంకా నేరగానిగా విచారణ జరుగుతుండగానే పౌండ్ కు ‘’పిసాన్ కాంటోస్ ‘’రచనకు గాను వెయ్యి డాలర్ల బోలింజన్ ప్రైజ్ను ఫెల్లోస్  అందజేశారు .దీన్ని స్వీకరించటానికి ప్రభుత్వ అనుమతి అవసరమైంది .ఈ ఫెల్లోస్ లో ఎక్కువ మంది అమెరికన్ కవులే ఉన్నారు .వాళ్ళు పౌండ్ రాజకీయాలతో తమకు సంబంధం లేదని ,ఆయన కవిత్వానికిచ్చిన అవార్డ్, రివార్డ్ అనీ తెలియ జేశారు .కొన్ని నెలలు దీనిపై ప్రతిస్తంభన ఏర్పడింది .వస్తువా,విదానమా అనే ఈ వివాదం  యా౦ డ్రూమేల్లాన్ బెల్లిన్జేన్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నాటి నుంచేఉంది .పౌండ్ రాజకీయ భావనలు క్షణికోద్రేకమైనవే   కాని ఆయన చేసిన కవితా తపస్సు అద్వితీయమణి  అమోఘం అనితర సాధ్యం అని గుర్తించారు .ఆయన నవ రచయితలలో చాంపియన్ మాత్రమేకాదు మార్గ దర్శి .నిర్లఖ్యానికి పౌండ్ పూర్తీ వ్యతిరేకి ,దానిపై నిరంతర పోరాటం చేసినవాడు .’’పౌండ్ అంతం ఆయన ఆది ‘’అవుతుందని క్రిటిక్స్ అన్నారు .అయన రాసిన ‘’I am weathered the storms –I have beaten out my exile ‘’అనేది అందరికి ఆదర్శమైంది .పౌండ్ తన అనుయాయులకు కొత్తగా ఏదీ బోధించలేదు కాని వాళ్ళు కవిత్వాన్ని ఎలా చెప్పాలో ఉదాహరణ పూర్వకం గానిరూపించిన మార్గ దర్శి .కవిత్వాన్ని సంగీతం లో రంగ రించి రాశాడు .’’కౌంటర్ పాయింట్ ‘’కు ప్రాధాన్య మిచ్చాడు .అనువాదకుడుగా పౌండ్ గొప్ప చరిత్ర సృష్టించాడు .చవరికి మనచలం లాగా చెంపలేసుకొని ‘’the worst mistake I made was that stupid ,suburban prejudice of anti Semitism ‘’అన్నాడు పశ్చాత్తాపం తో . ‘’

పౌండ్ చెప్పిన కవితా సిద్ధాంతాలు –సామాన్య భాషలో సరైన మాటను ఉపయోగించి దానికి తళుకులు బెళుకులు అద్దకుండా రాయాలి .రిథం ను పాత పద్ధతిలో కాకుండా ,కొత్త రైమ్స్ ను కొత్త మూడ్స్ ననుసరించి ఫ్రీ వెర్స్ లో రాయాలి .కవిత్వ ఉత్పత్తి అస్పష్టంగా ఉండిపోవాలి .అంతర్జాతీయ భావనా పరమావధిగా రాయాలి .టెక్నిక్ కు ప్రాధ్యాన్యం ఎక్కువ ఉండాలి .కమ్యూనికేషన్ కంటే శైలికే అధిక ప్రాధాన్యమివ్వాలి .ఈ సెంటిమెంట్ కల్లోలం సృష్టించి ‘’ఫ్రీ వేర్స్ ఫ్యూరోర్  ‘’అని పించుకోన్నది .తన కాంటోస్ కు రాసిన సూచికే 320పేజీలు  ఉంది .ఇదంతా చైతన్య స్రవంతి అంటే స్ట్రీం ఆఫ్ కాన్షస్ నెస్ ‘’రచన అప్పటికి అది చాలా కొత్త . హ్యూమన్  కామెడీని అనేక గొంతుకలతో ,అనేక పరిమాణాలలో కోణాలలో చెప్పానని చెప్పుకొన్నాడు పౌండ్ .ఒక నిర్దుష్ట ప్రణాళిక తోనే రాశాడు ఆషామాషీ వ్యవహారం కాదు .ఇందులో వస్తువు వ్యతిరేక వస్తువు ,చరిత్ర పునరావృత్తాలు ,ఉంటాయి .కొన్ని కవితా పంక్తులు –‘’hang it all Robert Browining –there can be but the one ‘’Sordello ‘’and my Sordello –lo sordels sifo di Mintovans –so  shu –churned in the sea ‘’

Inline image 1  Inline image 2

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-7-16 –ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.