ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -211
789- ఆధునికకవిత్వ మార్గ దర్శి –టి ఎస్ ఇలియట్
అరవై వ ఏట నోబుల్ బహుమతి గ్రహీత ,అనేక విలువైన గ్రంధ రచయిత ,అద్భుత వ్యాసకర్త ,చురుకైన కరపత్ర రచయిత ,రాజీ లేని ఆధునిక కాల సీరియస్ కవి ,మార్గ దర్శి- హాస్య రచనలు రాయటం మొదలు పెట్టాడు .ఇది చాలా ఆశ్చర్య జనకమైంది .అంతకంటే ప్రత్యేకత మరొక్కటి ఉంది –అదే అప్పటిదాకా రాసిన అస్పష్ట గూడార్ధ రచన లనుంచి ముఖ్యంగా కవిత్వం నుండి వైదొలగి ,అద్భుత విజయవంతమైన వినోదాత్మక ప్రసిద్ధి చెందిన నాటకాలు రాసి అట్లాంటిక్ సముద్రానికి అటూ ఇటూ పేరు ప్రఖ్యాతులను పొందినవాడు అమెరికాలో జన్మించి బ్రిటిష్ పౌరుడైన ధామస్ స్టి యార్న్స్ ఇలియట్ అంటే టి ఎస్ ఇలియట్ .26-9-1888 న అమెరికా లోని సెయింట్ లూయీకి చెందిన మిస్సోరిలో జన్మించాడు .ఆరుగురు సంతానం లో చివరివాడు .తండ్రిది న్యు ఇంగ్లాండ్ కు చెందిన ప్ప్యూరిటన్ వంశం .తాత బోస్టన్ నుంచి వచ్చి వాషింగ్టన్ యూని వర్సిటిని, మొదటి యునిట రేనియన్ చర్చిని సెయింట్ లూయీ లో స్థాపించాడు .సివిల్ వార్ ముందు పారిపోయే బానిసల కోసం అండర్ గ్రౌండ్ రైల్వే ను ఏర్పాటు చేసిన వారిలో ఒకడు .తల్లి పౌర సేవకనాయకు రాలు సంస్కర్త ,కవయిత్రి సవోనారాల అనే నాటక కవిత్వం రాసింది .ఆమె ప్రతిభ కొడుకు కు వారసత్వంగా లభించింది .అందుకే న్యు ఇంగ్లాండ్ లో ఇలియట్ ను చేర్చి చదివించారు .మిల్టన్ అకాడెమి ,హార్వర్డ్ యూని వర్సిటీలలో చదివి బి యే తర్వాత ఏం యే పాసై ఇంగ్లాండ్ వెళ్లి సార్బొన్నేలో ,ఆక్స్ ఫర్డ్ లో మెర్టన్ కాలేజి లో చదివి స్కూల్ మాస్టర్ గా పని చేశాడు .అయిష్టంగానే మేస్టర్ గిరీ నాలుగేళ్ళు బ్యాంక్ గుమాస్తాగా ఎనిమిదేళ్ళు లాగాడు . 27 వయేటబాలట్ పై మోజున్న వివిన్నే హైఘ్ ను పెళ్ళాడి లండన్ పబ్లిషింగ్ హౌస్ లో మంచి ఉద్యోగం లో చేరి ,తర్వాత భాగస్వామి అయి ,1927లో బ్రిటిష్ పౌరుడయ్యాడు .కారణం అడిగిన వారికి ‘’ఇక్కడ బతుకుతున్నాను ,ఇక్కడే స్నేహితులతో సరదాగా గడుపుతున్నాను .చట్ట విరుద్ధంగా ఉండటం నాకిష్టం లేదు .పూర్తీ బాధ్యతా తో ఇక్కడే ఉండాలనుకోన్నాను ‘’అని బదులు చెప్పాడు .తానూ మత రీత్యా ఆంగ్లో కేధలిక్ నని ,రాజకీయాలలో రాయలిస్ట్ నని సాహిత్యం లో క్లాసిసిస్ట్ నని చెప్పుకొన్నాడు ఇలియట్ .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-16-7-16-ఉయ్యూరు