1 of 17,890 Print all In new window ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216 80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -216

80-నాటక రచనకు మొదటి నోబుల్ బహుమతి అందుకొన్న అమెరికన్ నాటక కర్త –యూజీన్ ఓ నీల్ -3(చివరి భాగం )

1936 లో ఓ నీల్ కు వచ్చిన నోబెల్ బహుమతి  ఫిలిస్టైన్ లకు చెంప పెట్టు,ఆధునిక అమెరికన్  నాటక రచయిత ఓ నీల్ కు కు గొప్ప ప్రశంస .ఆరేళ్ళక్రితం సింక్లైర్ లెవిస్ ఇచ్చిన వివరణ గుర్తుకొచ్చి నీల్ కూడా ‘’ఈ అత్యున్నత పురస్కారం నాకు మాత్రమె కాదు అమెరికాలోని నా సహచరుల౦దరిదీ .ఈ నోబెల్ బహుమతి రాబోయే అమెరికా దియేటర్ కు చిహ్నం .నా నాటకాలకు రావటం అదృష్టం కాలమూ కలిసి రావటం .మొదటి ప్రపంచ యుద్ధానంతరంనాటకాలురాసిన అమెరికన్ మిత్ర రచయితలందరి పాత్ర ఇందులో ఉంది ‘’అని చాలా నిగర్వంగా ప్రకటించాడు .నీల్ చాలా వినయంగా ఈమాటలు అన్నప్పటికీ అప్పటికి ప్రపంచం మొత్తం మీద షేక్స్ పియర్ బెర్నార్డ్ షా ల తర్వాత ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందినవాడు ఓనీల్ మాత్రమే ..వారిద్దరి నాటకాల తర్వాతఇంగ్లీష్ నాటకాలలో  జనం అమితంగా చదివింది నీల్ నాటకాలనే .

అకస్మాత్తుగా నీల్ అదృష్టకాలం  రచనా శక్తి దెబ్బతిన్నాయి .శారీరకంగా సృజనాత్మకం గా తగ్గిపోయాడు .ఆయన పని ‘’ఆకాశంబున నుండి పాతాళం ‘’లోకి పడిపోయింది  .’’డేస్ వితౌట్ ఎండ్ ‘’తో బాగా ఇబ్బంది పడ్డాడు  .12 ఏళ్ళ తర్వాత ‘’ది ఐస్ మాన్ కమేత్ ‘’కూడా ఫైల్యూర్ అయింది .1946 లోమళ్ళీదియేటర్ కు వచ్చాడు .’’యే మూన్ ఫర్ ది మిషె గాటన్’’కూడా దెబ్బ తిన్నది .అప్పటికే ఒక మిలియన్ డాలర్లు సంపాదించిన నాటక రచయితనీల్ 50 వ ఏట జబ్బు పడి సంతోషం కోల్పోయాడు . కుటుంబ జీవితం ముక్కలైంది .కూతురు ఊనా హాస్యనటుడు చార్లీ చాప్లిన్ ను పెళ్లి చేసుకోవటం క్షమించ లేక పోయాడు. చిన్న కొడుకు షేన్ మత్తుమందుకు బానిసై ఆస్పత్రి పాలైనాడు .టీచర్ ,గ్రీక్ స్కాలర్ అయిన పెద్దకొడుకు1950 లో  ఆత్మ హత్య చేసుకొన్నాడు ..నీల్ వీటన్నిటి వలన మరింత ఆరోగ్యం కోల్పోయి చిక్కి శల్యావశిస్టమైనాడు .బతికి ఉన్న ఆస్థి పంజరమా అనిపించాడు .కళ్ళు నల్లబడి గుంతల్లా ఉన్నాయి .ఎముకల పోగుకు చర్మం  అంటింఛినట్లున్నాడు .56 వ ఏట కండరాల జబ్బు కూడా వచ్చి రాయటం అసాద్యమై పోయింది .తర్వాత చేతితో కలం పట్టుకోలేక పోయాడు .ఆస్పత్రి వైద్యం కూడా ఫలించలేదు .క్రమంగా శారీరక కార్యక్రమాలు బలహీన  పడ్డాయి .పార్కిన్సన్ వ్యాధి వచ్చిందని నిర్ధారించారు .ఆయన వ్యాధిని ‘’ప్రి సేనైల్ ఆర్టీరియల్ స్క్లేరో టిక్ కండిషన్ ‘’గా నిర్ణయించారు .ఆయన రాత అతి చిన్నక్షరాలుగా ఉండేది .ఇప్పుడు చెప్పి రాయిద్దామని ప్రయత్నించాడు.కాని ఇక తనకు సృజన శక్తి కరువైపోయిందని గ్రహించాడు .ఇరవై  ఏళ్ళ క్రితం రాయటం ప్రారంభించిన  చక్రీయ నాటకాలనన్నిటిని  తగల బెట్టించాడు .స్వీయ చరిత్ర లాంటి ‘’లాంగ్ డేస్ జర్నీ ఇంటూ నైట్ ‘’మాత్రం ఉంచాడు .దీన్ని తానూ మరణించిన 25 ఏళ్ళ తర్వాత మాత్రమే ప్రచురించ బడాలి అని కోరుకొన్నాడు .పాపం ఆయన ,ఆయన వ్యాధికి బందీ అయిపోయి పదేళ్ళు అలాగే బతికాడు .పూర్తిగా శక్తి హీనుడైపోయాడు .దీనికి తోడు బ్రాంకియల్ న్యుమోనియా వచ్చి ఆధునిక అమెరికన్ నాటక మార్గ దర్శి యూజీన్ ఓ నీల్ 65  వ ఏట  27-11 -1953 న మరణించాడు .

‘’టైం మాగజైన్ ‘’నీల్ గురించి రాస్తూ ‘’ఓ నీల్ కు ముందు అమెరికాలో దియేటర్ మాత్రమే ఉంది .ఓ నీల్ వచ్చాక అందులో నాటకం వచ్చింది ‘’అన్నది .గ్రీక్ ట్రాజెడీ అంతా విధికి తలొగ్గిన ట్రాజేడి.అదృష్టం అంతా నక్షత్ర ప్రభావం .షేక్స్పియర్ ట్రాజేడి పాత్రల ట్రాజేడి .మానవుని అదృష్టం అతని మనసుని బట్టి ఉంటుంది .బాధా చావుల వలన గ్రీకుల షేక్స్ పియరన్ ట్రాజేడిలలో ట్రాజేడి హీరోలు దేవతలను సంతృప్తి పరచి ముక్తి పొందారు .కాని ఓ నీల్ ప్రేక్షకులు మాత్రం దేవుడు ,మనసు ,విదిలపై అనుమానం ఉన్నవారు .నీల్ రాసినదంతా పర్సనల్ సైకాలజీ .మనిషి అదృష్టం జీన్స్ లో హార్మోన్స్ లో ఉంటాయని చెప్పాడు .ఆయన నాటకం ‘ది గ్రేట్ గాడ్ బ్రౌన్ ‘’లో ట్రాజిక్ హీరో ‘’మనిషి ముక్కలు ముక్కలై  జన్మిస్తాడు .దాన్నిఅతికించి  బాగుచేస్తూ జీవిస్తాడు .దేవుని దయ ఒక జిగురు మాత్రమే ‘’అంటాడు .’’మార్నింగ్ బికం ఎలెక్ట్రా ‘’నాటకం లో గ్రీక్ లెజెండ్ క్లైమాక్స్ ను సంప్రదాయ కేదార్సిస్ ను  చుట్టేసి ముఖ్య పాత్ర చేత ‘’నన్ను శిక్షించటానికి ఎవరూ మిగల్లేదు  నన్ను నేనే శిక్షించు కొంటాను ‘’‘’అని అరిపిస్తాడు  .

ఓ నీల్ నాటకాలు అపజయం పొంద టానికి అధిక ప్రయోజనమే తప్ప ,ఆయన మేధో దారిద్ర్యం మాత్రం కాదు .ఉన్నత శిఖరం నుంచి అప్పుడప్పుడు ఆయన జారిపోవటానికి కారణం అవి జనానికి అందుబాటులో లేవు అనే అభియోగాన్ని ఆయన త్రోసి పుచ్చాడు .కాని కారణం ఆయన ఆ ఉన్నత శిఖరం మీదనే ఉండిచనిపోవాలను కొన్నాడేకాని అందరూ ఎప్పుడూ ఎంతకాల౦  నడిచిన రోడ్డుమీదకు వచ్చిమాత్రం కాదు .’’పాతా దేవుడి మరణం ‘’సైన్స్ ,భౌతికత  ల అపజయం ఆయన్ను కలత పెట్టాయి .నీల్ పాత్రలపై జాన్ మేసన్ ‘’Neil’s characters were not merely in conflict with one another .They were with war with the agents were not indifferent to them .This link between mortals and forces shaping their lives was the mighty concern which gave a kind of majesty to the feeblest of his plays ‘’అని రాశాడు .’’నాటక సాహిత్యం లో ఆయన స్థానం ఏమిటో ఇంకా తేలలేదు కాని ఆయన రెచ్చగొట్టే ఆవిష్కర్త, (ప్రోవోకేటివ్ ఇన్వెంటర్).పాత సంప్రదాయాలను విచ్చిన్నం చేసినవాడు ,నవీన సంప్రదాయ నిర్మాత .కాని నేటికాలం లోఆయన చిన్న నాటకాలను మాత్రమె ఎవరో కొందరు ఎక్కడో అక్కడ ఆడుతూనే ఉన్నారు .షేక్స్ పియర్ ,షాల నాటకాలులాగా నీల్ పెద్ద నాటక ప్రదర్శనలు ఎక్కడా లేవు .ఆయన నాటక నైపుణ్యం ,స్థాయి ,ప్లాట్ ల స్పూర్తి ,పాత్రల ప్రామాణ్యత, విశ్వసనీయత లపై ఇంకా చాలా చర్చ జరగాలి .కాని ఆయన ప్రభావ ప్రాధాన్యత మాత్రం ప్రశ్నింప రానిది  ‘’అంటాడు రచయితా లూయీ అంటర్ మేయర్ .

20 వ శతాబ్ది అమెరికన్ నాటకాలలో నీల్ రాసిన ‘’లాంగ్ డే స్ జర్నీ  ఇంటూ నైట్ ‘’అత్యంత విలువైన నాటకమని పేరు పొందింది .అమెరికా ప్రాంతీయ భాషను నాటకాలలో వాడిన మొదటి నాటక కర్తనీల్ .ఆయన పాత్రలు ఎదురు తిరుగుతాయి పోట్లాడుతాయి కాని చివరికి నిరాశ నిస్పృహలతో ప్రక్కు తప్పుకొంటాయి .ఆఫ్రికన్ అమెరికన్ నటులపై నీల్ ప్రభావం అత్యధికం .పాల్ రిలే రోబ్ సన్ బాగా ప్రేరణ పొందాడు .వారెన్ బీట్టీ తీసిన ‘’రెడ్ ‘’సినిమాలో నీల్ పాత్రను జాక్నికల్సన్ పోషించాడు .కనెక్టికట్ లో నీల్ దియేటర్ ఏర్పాటు చేశారు .ఆయన న్యు ఇంగ్లాండ్ లో నివసించిన ఇల్లు జాతీయ చారిత్రిక ప్రదేశంగా గుర్తింప బడింది .ఆయన పేరుమీద చాలాకాలేజీలు సంస్థలు ఏర్పడ్డాయి .నీల్ 32 పెద్దనాటకాలను ,21 ఎకా౦కికలను తో  పాటు కొన్ని ఇతర రచనలూ చేశాడు .

O’Neill’s tragic view of life was perpetuated in his relationships with the three women he married—two of whom he divorced—and with his three children. His elder son, Eugene O’Neill, Jr. (by his first wife, Kathleen Jenkins), committed suicide at 40, while his younger son, Shane (by his second wife, Agnes Boulton), drifted into a life of emotional instability. His daughter, Oona (also by Agnes Boulton), was cut out of his life when, at 18, she infuriated him by marrying Charlie Chaplin, who was O’Neill’s age.

 

నీల్ ను అమెరికన్లు బాగానే ఆరాధించారు అంతకంటే ఎక్కువగా స్వీడన్లు ఆరాధించారు .కారణం ఆయన్ను ప్రేరేపించినవాడు స్వీడన్ నాటక కర్త ఆగస్ట్ స్త్రిండ్ బెర్గ్ అవటం కూడా ఒక కారణం .ఆయన విషాద కధలు నీల్ నాకాలలో ప్రతిధ్వనిస్తాయి .అమెరికా రంగ స్థలాన్ని ఒక సాహిత్య క్షేత్రంగా గుర్తించి నాటక రచన చేసిన మొదటి అమెరికన్ నాటక కర్త ఓ నీల్ .సాహిత్యం లో నాటకానికి అమెరికా లో నోబెల్ పొందిన మొదటి వాడు కూడా నీల్ ఒక్కడే .1920 లో అమెరికన్ దియేటర్ సాంస్కృతికంగా ప్రాచుర్యం పొందటానికి నీల్ ఒక ముఖ్య కారకుడు

 

Inline image 1  Inline image 2

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -21-7-16 –ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.