ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -222
82-బలమున్నవాడిదే రాజ్యం అన్న జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ -2
ఈ జాతీయ భావం ,నాయకత్వ లక్షణం హిట్లర్ కు 24 ఏళ్ళు రాక ముందే మనసులో బలపడ్డాయి .వియన్నీస్ వర్కర్లు పెద్ద ప్రజా ప్రదర్శన చేసినప్పుడే ఈ మూక జనం బలమైన శక్తి సంపన్నమైన దేనికీ లొంగని పాలకుడికి విధేయంగా ఉంటారని అనుకొన్నాడు .పడగొట్టే వాడికంటే పరిపాలకుడికే జై కొడతారని ఊహించాడు .ఈ జనం భయపెట్టినకొద్దీ లొంగి ఉంటారని ,వాళ్ళస్వాతంత్రేచ్చ కాల రాచినా వాళ్ళు ఏమీ అనుకోరని తలచాడు .ప్రజల దృష్టిని ఏదో ఒక దానిపై ఏకీ కృతం చేస్తే వాళ్ళ ద్రుష్టి మరో దాని పైకి పోదని అనుకొన్నాడు .అప్పుడు వాళ్ళను విడదీయ టం కష్టమే అని అర్ధం చేసుకొన్నాడు ..మేధావి నాయకుడు వివిధ వ్యతిరేకుల్ని ఒకే కేటగిరీ లోకి తెచ్చి పిడికిలి లో బిగిస్తాడని అభిప్రాయ పడ్డాడు .అబద్ధాలు బాగా చెప్పాలి .యెంత తప్పు చేస్సినా ఒప్పుకోకుండా దబాయించాలి .రిజర్వేషన్ లను ఆపెయ్యటానికి సందేహించ రాదు .మూకల్ని బాగా అవినీతి పరులను చేయటం తేలిక .,వాళ్ళు సహజం గా చిన్న చిన్న అబద్ధాలు చెబుతారు అలాంటి వాళ్ళతో పెద్దవి బొంకి౦ చటానికి మరింత పెద్ద తప్పుల్ని చేయించటానికి శ్రమ పడక్కర లేదు ..బల ప్రయోగం తో మూకను ఒప్పించ వచ్చు .ఎంత గట్టిగా నొక్కి చెబితే అ౦త బాగా నమ్ముతారు .నెత్తిన మొట్టిన కొద్దీ వంగి వంగి సలాం చేస్తారు .’’అని ‘’హిట్లరోపనిషత్’’ విప్పి చెప్పాడు .’’the driving force which has brought about revolutions has never been a body of scientific teaching ,but always a devotion to which has inspired them and a kind of hysteria which urged them into action –who ever wishes to win over the masses must know this key ,It is not objectivity but a determined will backed up by power where necessary ‘’అన్నాడు .దీనిపై విశ్లేషకులు స్పందిస్తూ ‘’the greatest damage in history Hitler fused the cool cynicism of Machiaivelli with the agitating oratory of a mob spell binder ,plus a compulsive ruthlessness that was all his own ‘’అని చెప్పారు .
24 వ ఏట అధికార దాహం తో ఉన్న హిట్లర్ వియన్నాను వదిలాడు .24 ఏళ్ళతర్వాత మళ్ళీ అక్కడ విజేతగా కాలు పెట్టాడు. 1913 లో మ్యూనిచ్ కి స్ప్రింగ్ లో వెళ్ళాడు .ఇంతకాలం ఎలా పొట్ట పోషించు కున్నాడో ఎవరికీ తెలియదు .కొన్ని పెయింటింగ్ లు వేసి అమ్మి జీవించి ఉండవచ్చు .పిచ్చి పట్టిన వాడుగా రోడ్లమ్మట పగలూ రాత్రి తన సమ్మోహన స్వరం తో జనాలను చైతన్యం చేస్తూ తిరిగి ఉండవచ్చు .పాత చరిత్ర తవ్వి తీసి నార్డిక్ సుప్రీమసి ని జాగృతం చేస్తూ ట్యుటానిక్ మైదాలజిని గొప్ప చేస్సి చెప్పుతూ జర్మనీ ని కొత్త సైన్యం తో సమాయత్త పరిచి ఉండ వచ్చు .1914 ఆగస్ట్ 14 న అతని కల మొదటి ప్రపంచ యుద్ధ ప్రారంభం తో నెర వేరే అవకాశాలు లభింఛి బవేరియన్ సైన్యం లో పేరు నమోదు చేసు కొన్నాడు .
సైనికుడిగా హిట్లర్ పాత్ర ఏమిటో తెలియదుకాని తన స్థానాన్ని పదిలం చేసుకొన్నాడు . యుద్ధం పూర్తీ అయేసరికి హిట్లర్ ఒక కార్పోరల్ గానే ఉన్నాడు .అతని ముఖ్యమైన పని ఉత్తరాల బట్వాడా మాత్రమే . దీనికే’’ ఐరన్ క్రాస్ ‘’బహుమతి పొందాడు .జర్మని ఓడిపోవటం అతనికి పాలకుల నిర్వాకం పై మరింత ద్వేషం పుట్టించింది .సంధి పత్రం పై సంతకం చేసిన వాళ్ళను విద్రోహులు అన్నాడు .జర్మన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటే ఆతనికి ఎలర్జీ .మూక జనం పై ద్వేషం తోనే యుద్ధానికి దిగాడు .దీనిపై ‘’డేర్ ఫ్యూహ్రేర్ ‘’పుస్తకం లో కాన్రాడ్ హీడేన్ ‘’నాయకుల పై ఏహ్యం తోనే వదిలాడు .తాను నీచ జనం అన్నవాళ్ళకు భయపడి ఒణికి లొంగిపోయారు ‘’అని ఎద్దేవా చేశాడు అని రాశాడు .ఉన్నత వర్గాలపై ద్వేషం పెంచుకొన్నాడు .పది పన్నెండు వేల సోషలిస్ట్ ఉద్యమకారుల్ని గాస్ తోనో విషం తోనో అధినాయకులు చంప లేక ఊచ కోత కోయలేక పోయిన వాజమ్మలు దద్దమ్మలు అని ఆక్రోశించాడు .అదే వాళ్ళు చేసి అతిపెద్ద ద్రోహం తప్పు బ్లండర్ అన్నాడు .
అప్పటికే ప్రజాస్వామ్య వ్యతిరేక వాదుల ఉద్యమాలలో ప్రదర్శనలలో బాగా పాల్గొన్న హిట్లర్ ఇక తన స్వప్రయోజనం కోసం ప్రాపగాండా ప్రారంభించాడు .జర్మన్ నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ అంటే ‘’నాజీ పార్టీ ‘’లో చేరాడు. దాని గుర్తు స్వస్తికం .రౌడీల, ధగ్గుల ముఠాలను ఇందులో చేర్చుకొని ఊరేగింపులు , ఉద్యమాలను చెదర గొట్టటం, బెదిరించటం చేయించాడు .వ్యతిరేకుల్ని భయ భ్రాంతుల్ని చేయించాడు .ఒక మీటింగ్ లో తాను అన్ని రకాల సమావేశాలను ,ఉపన్యాసాలను అడ్డుకొంటానని శ్రోతలను దీనిద్వారా భయ భ్రాంతులకు గురి చేస్తానని ప్రేక్షకులకు తెలియ జేశాడు .నాజీ మూక తో ప్రతిపక్షానికి దడ పుట్టించాడు .’’మా దండు రాజకీయ పోరాటానికి కే తప్ప డిబేటింగ్ సొసైటీలకు కాదు ‘అని తేల్చి చెప్పాడు .రోమన్ ఇంపీరియ లిజానికి గుర్తుగా ముసోలిని ప్రవేశ పెట్టిన ఫాసిస్ట్ సాల్యూట్ ను హిట్లర్ కూడా ప్రవేశ పెట్టి ,ముసోలిని ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తూ ప్రజల్లో వెర్రి ఆవేశాన్ని రగిలించాడు .’’మేము పోరాటాన్ని బోధిస్తాం .పార్లమెంటరీ పద్ధతికి తీవ్ర వ్యతిరేకం గా పోరాటం సాగిస్తాం .దీనితో జర్మనీ పూర్తిగా కూలి పోవచ్చు లేక ఒక కొత్త హీరో ఆవిర్భవించి దాని భవితను నిర్ణయించ వచ్చు .ఆనాయకుని బూట్లు మురికిగా ఉండచ్చు కాని అతనికి ఉక్కు పిడికిలి ,సంకల్పం ఉంటాయి .అతను ఊక దంపుడు ఉపన్యాసాలకు స్వస్తి చెప్పి స్వస్తిక మార్కు గుర్తు తో జాతిని కార్యోన్ముఖం చేస్తాడు ‘’అని ఉద్రేక పూర్వకంగా ప్రసంగించాడు .రెచ్చగొట్టాడు .తన దారికి తెచ్చుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -23-7-16 –ఉయ్యూరు