ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -225
83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్
సాహిత్య చరిత్ర కారులు ప్రతి యుగానికి ఒక లక్షణాన్ని ఆపాదిస్తారు. కాని ,ప్రస్తుత యుగ లక్షణాన్ని ‘’ఏజ్ ఆఫ్ యా౦ గ్జైటీ’’ అన్నవాడు ఎఫ్ .స్కాట్ ఫిట్జెరాల్డ్.4-9-1890 న అమెరికా మిన్నెసోటా రాష్ట్రం సెయింట్ పాల్ లో ఫిట్జెరాల్డ్ పుట్టాడు .తల్లి తరపు దూరపు చుట్టం పై గౌరవం తో ఫ్రాన్సిస్ స్కాట్ కీ ఫిట్జెరాల్డ్ గా చర్చిలో పేరు నమోదయింది .మంచి కుటుంబమేకాని దరిద్రం తో అల్లల్లాడి౦ది .తండ్రి చేతకాని దద్దమ్మ .కొడుకు కు పదేళ్ళు రాకుండానే ఉద్యోగం పోగొట్టుకొన్నాడు .30 ఏళ్ళ తర్వాత ఫిట్జెరాల్డ్ తన ఓటమిని గ్రహించి ఈ విషయాన్ని తండ్రి ముందే గ్రహించాడని తెలుసుకొన్నాడు .ఈ విషయాలన్నీ రాసుకొన్నాడు .ఓటమి ,దురదృష్టం అనే రెండు అంశాలమీద ఫిట్జెరాల్డ్ సాహిత్యమంతా నడుస్తుంది .జాన్ ఓ హరా అనే రచయితకు ‘’సగం బ్లాక్ ఐరిష్ ,సగం పాత అమెరికన్ రక్తం తో గతకాలపు గొప్పల్ని నెమరేసుకొంటూ , ఏదో సాధించామని ప్రగల్భాలు పలకటం అలవాటైంది ‘’అని చెబుతూ ‘’being born in an atmosphere of crack ,wise crack and counter crack ,I developed a two cylinder inferiority complex .I I spent my youth in alternately crawling in front of kitchen maids and insulting the great ‘’అని చెప్పుకొన్నాడు .
కుటుంబం బీదరికం లో మగ్గుతున్నా తల్లికి ఫిట్జెరాల్డ్ అంటే ప్రాణం .ఒక ఆంట్ ఆతను న్యు జెర్సీ లోని న్యూమాన్ లో ఉన్న కేధలిక్ బోర్డింగ్ స్కూల్లో చేర్పించటానికి సాయం చేసింది .అక్కడ రాణించ లేక పోయాడు .చాలా అందంగా ఆకర్హణీయంగా,మంచి రంగుతో ,నీలి కళ్ళతో అందమైన ముద్దు గుమ్మలాగా కనిపించేవాడు . ఫుట్ బాల్ ఆడేవాడుకాడు .పుట్టుకతో వచ్చిన వక్తృత్వం తో ప్రతి వాడితోనూ వాదించేవాడు .’’ బీద వాడు- ధనవంతుల స్కూల్ ‘’అనేది మనసుపొరల్లో ఎప్పుడూ మసిలేది .17 వ ఏట ప్రిన్స్ టన్ లో చేరి ,అండర్ గ్రాడ్యుయేట్ సాహిత్య కారులతో ముఖ్యంగా జాన్ పీల్ బిషప్ తో బాగా దోస్తీ గా ఉన్నాడు .ఈ స్నేహం జీవితాంతం ఉంది .ఎడ్మండ్ విల్సన్ జూనియర్ ఇతనికి సాహిత్య చేతనగా నిర్వహణ కారుడుగా ఉండేవాడు .న్యూమాన్ చేసే తప్పులు చేయక ,ఫుట్బాల్ ఆటలో చేరి అయిదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తు,135 పౌండ్ల బరువుతో కొత్త స్క్వాడ్ ఏర్పరచాడు .తర్వాత తనలోని సృజనకు పదును పెడుతూ నాటకాలపై ద్రుష్టి పెట్టాడు .ట్రెయినింగ్ క్లబ్ కోసం ఒక ‘’ఒపరెట్టా’’రాశాడు .ప్రదర్శనలో లేకపోయినా గ్రేడులు మాత్రం దారుణంగా రావటం తో కట్టిపెట్టాడు . కాస్ట్యూమ్ తో ఉన్న అతని ఫోటో ను పబ్లిసిటి డిపార్ట్మెంట్ అందరికి చూపించి ‘ ప్రిన్స్ టన్ కొత్త మ్యూజిక్ నాటకం లో ’బహు సొగసైన షో గర్ల్ ‘’అని ప్రచారం చేసింది .
సెలవులలో ఇంటికి తిరిగి వచ్చి 19 వ ఏట మొదటి సారి జినేర్వా కింగ్ అనే ఒకమ్మాయిని ప్రేమించాడు .ఆమె అందమైన ధనికుల పిల్ల .ఆమెకు అయస్కాంత ఆకర్షణ ఉందని ,అన్నిరకాలాఫిట్జెరాల్డ్ కు జోడీ అని ,అతని పేదరికం ,అనిశ్చితత్వం ,ఊహ లకు తగినదని ఆయన చరిత్రకారుడు ఆర్ధర్ మిజేనర్ రాశాడు .ఆమె అన్నిటా విజయాలను సాధించినా అనాఘ్రాత పుష్పం అన్నాడు .ఫిట్జెరాల్డ్ చివరి రోజులలో ఆమెను వదిలిన 20 ఏళ్ళకు కూడా జినేర్వా గురించిన ఆలోచన వస్తే కళ్ళ వెంట కన్నీరు కారేది .తర్వాతెప్పుడో ఆమెను హాలీ వుడ్ లో చూసి మళ్ళీ అదే ప్రేమ మైకం లో పడ్డాడు .వారిద్దరిమధ్య రోమాన్స్ చోటు చేసుకోలేదు .ఆమె దక్కక పోయినా గ్రేడ్లు కూడా దక్కక ఒక ఏదాది చదువు ఆగటమేకాక గ్రాడ్యుయేట్ కాలేక పోయాడు యూని వర్సిటీ అభిమానమూ పొందలేక పోయాడు .ట్రయాంగిల్ క్లబ్ కు ప్రెసిడెంట్ గా ఎన్నికకాలేక పోయాడు .జేనేర్వా ఇక జన్మ లో తనను పెళ్లి చేసుకోదు అనే నిర్ణయానికి వచ్చాడు ఫిట్జెరాల్డ్ .ఇది చాలా బాధాకరమైంది .తన నోట్ పుస్తకాలలో ‘’that is the stamp that goes into my books so that people can read it blind like Braile’’అని రాసుకొన్నాడు .
మొదటి ప్రపంచ యుద్ధం ఫిట్జెరాల్డ్ లో దేశభక్తి కాని ఉత్సుకతను కానీ కల్పించలేదు .’’ఈ అనివార్య యుద్ధం నన్ను ఇరిటేట్ చేస్తోంది ‘’అన్నాడు .ప్రజల సెంటి మెంటాలిటి తనకు పక్కలో బల్లెంగా ఉందన్నాడు .సైన్యం లో చేరటాని అప్ప్లై చేశాడు .21 వయసు దాటిన నెలకు అది వచ్చింది .యుద్ధానికి వెళ్ళాడు .తల్లికి జాబు రాస్తూ ‘’cold bloodedly and purely for social reasons ‘’మిషతో యుద్ధానికి వెడుతున్నానని తెలియ జేశాడు .ఆతన్ని తీరాలు దాటి పంపలేదు .దానిబదులు చాలా కాంప్ లలో పని చేశాడు .ఫోర్ట్ లీవెన్ వర్త్ లో ‘’the world’s worst second lieutenant ‘’అని చెప్పుకొన్నాడు .’’ది రొమాంటిక్ ఈగోయిస్ట్ ‘’అనే నవల ఇప్పుడే రాశాడు .దీని రాత ప్రతి తిరస్కరింప బడిన తర్వాత తన ప్రేమికురాలు జినేర్వా పెళ్లి చేసుకో బోతోందని తెలిసింది .అదే సమయం లో ఒక కాంప్ డాన్స్ లో జేల్డా సేయ్రీ అనేఅందం ఆకర్షణ ,చొరవ వ్యక్తిత్వం ఉన్న బాల్ డాన్స్ బెల్లీ అయిన 18 ఏళ్ళ అమ్మాయితో పరిచయమై ఇద్దరూ ప్రేమ రొంపిలో దిగి భవిష్యత్తు పై కలలు కన్నారు . 1919 ఫిబ్రవరిలో ఫిట్జెరాల్డ్ ను ఘనంగా ఆర్మీ నుంచి విడుదల చేశారు .
మళ్ళీ సాధారణ పౌరుడై జర్నలిస్ట్ ఉద్యోగం వెతుక్కొని జేల్డా ను పెళ్లి చేసుకొందామనుకొన్నాడు ..న్యు యార్క్ చేరి ఏడు పత్రికల చేత తిరస్కరింప బడి ‘’నేను ఆఫీస్ బాయ్స్ ను ఇంప్రెస్ చేయటం లో విఫలమయ్యాను ‘’అనుకోని ఒక అడ్వేర్ టైజింగ్ కంపెనీలో కాపీలు రాసే పనికి నెలకు 90 డాలర్లకు చేరాడు .రాత్రిళ్ళు తన కధలకు కేటా యించుకొన్నాడు ..అవన్నీ తిరుగుటపాలో క్షేమంగా తిరిగోచ్చేవి ..’’బేబ్స్ ఇన్ ది వుడ్స్ ‘’ను హెచ్ ఎల్ మెంకేన్ ,జార్జి జీన్ నాధన్ లు చిన్న సెట్ గా 30 డాలర్లకు ప్రింట్ చేసే సరికి ,122 ప్రింటెడ్ రిజేక్షన్ స్లిప్పులు అందుకొన్నాడు .జేల్దాకు జాబులు రాస్తూనే ఉన్నాడు ఈ పరిస్తితుల్లో ఆమె దక్కదేమో అనుమానం పీడించింది .ఆ భయం తో అలబామాలోని మాంట్ గోమరి లో ఉన్న జేల్డా ను చూడటానికి ఉన్న కొద్ది డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళాడు .ఆమె త్వరగా పెళ్లి చేసుకోవటానికి కాని ,అసలు పెళ్లి చేసుకోవటానికి కాని ఇష్ట పడలేదు ‘’షేక్స్ పియర్ మొహం’’ వేసుకొని మళ్ళీ న్యు యార్క్ చేరాడు .చెదిరిన మనసుతో దేవదాస్లాగా పూటుగా తాగి రోజులు గడిపాడు .మళ్ళీ స్వంత ఊరు సెయింట్ పాల్ చేరాడు .అప్పటికే రాయటం మొదలెట్టి ఆపేసిన నవలను పూర్తీ చేసే ప్రయత్నం చేశాడు .రొమాంటిక్ ఈగో యిస్ట్ లోని మంచి పేరాలనన్నిటిని తీసుకొని మళ్ళీ ఆ ఎపిసోడ్ లనుతిరగ రాశాడు .కాని సంతృప్తి కలగక విసిరి పారేస్తే ఒక స్నేహితుడు దాన్ని ‘’ది కలేక్తేడ్ వర్క్స్ ఆఫ్ ఫిత్జరాల్ద్ ‘’అనే పేరు సూచించాడు .23 వ ఏట ‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’పేరు పెట్టి పంపాడు .ఎడిటర్ మాక్స్ వెల్ పెర్కింగ్ వెంటనే దాన్ని అంగీకరించి అందులో ఉన్న జీవ శక్తికి అభినందించాడు .దశ మారుతుంది అనుకొన్నాడు కాని జేల్డా ఇంకా పచ్చ జెండా ఊపలేదు .పబ్లిషర్ త్వరలోనే అచ్చు పూర్తీ చేసి అమ్మకాలకు పెడతానన్నాడు ఈలోపు పాతకధలు కొన్నిటిని రిపేర్ చేసి కొత్త రూపు తెచ్చాడు .1919 చివరి మూడు నెలలలో తొమ్మిది రాశాడు .అన్నీ బాగా అమ్ముడుపోయాయి .రేట్లు పెంచి అమ్మారు .’’ది సాటర్ డే ఈవెనింగ్ ‘’పత్రికరెండు కధలకు వెయ్యి డాలర్లు ఇచ్చింది .వీటినే రెండేళ్ళ క్రితం డజన్ పత్రికలు నిర్దాక్షిణ్యంగా తిరస్కరి౦ చాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-25-7-16 –ఉయ్యూరు