ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -226
83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-2
‘’దిస్ సైడ్ ఆఫ్ పారడైజ్ ‘’అనే పాక్షిక జీవిత చరిత్ర-అంటే కాలేజి జీవితం ,ఖుషీపార్టీలుఅడ్వర్ర్టైజ్ ఏజెన్సీ ,,విఫలప్రేమ ,మూడు వారాల తాగుబోతు దేవదాసు జీవితం అన్నీ కలగలిపి రాసిన రచన ,అంచనాలకు మించి విజయవంతం అయింది .విమర్శ మిశ్రమంగా వచ్చింది .అరువు తెచ్చుకొని ,క్షమించరాని తప్పులతో ఉందని కొందరు అన్నా ,అందులోని ఉత్తేజాన్ని ఎవరూ కాదన లేక పోయారు .’’ ఈనవల లో రచయిత చేయాల్సిన పాపాలన్నీ చేశాడు కాని క్షమించరాని తప్పు ఒకటి ఉంది –అదే బతకటానికి విఫలం కాకూడదని .కాలేజి జీవితానికి చెందిన అత్యంత రొమాంటిక్ ,నిరాశాలను కాచి వడపోసిన అమెరికన్ నవల అని పించుకోన్నది .కొన్ని నెలలలోపే ఈ పుస్తకం అండర్ గ్రాడ్యుయేట్ల ‘’బైబిల్ ‘’అయింది ఆరాధ్యమై కూర్చుంది .నవలా కారుడు ఫిట్జెరాల్డ్ జాజ్ యుగపు ఉడుకు లెత్తే యువ రక్త నాయకుడు అయ్యాడు .స్టాక్ మార్కెట్ స్పెక్యు లేషన్ కు ,రాజకీయ అవినీతికి అది బంగారు కాలం .నిష్ఫలమైన మద్యపాన నిషేధాలు, బలిసి దొంగ లిక్కర్ తయారు చేసే బడా వ్యాపారులకు అది అంది వచ్చిన కాలం .ఈ యుగానికి ఫిట్జెరాల్డ్ ప్రతినిధి అయ్యాడు –‘అద్భుత భవిష్యత్త్ ఉన్న ’గోల్డెన్ బాయ్ ‘’అని పించుకొన్నాడు .
చాలా ఏళ్ళ తర్వాత భయంకరమైన బీదరికపు హద్దులు ,మరీ భయపెట్టే ధన ప్రభావాల గురించి స్వగతాలు రాశాడు .డబ్బు యావ మాత్రం అతన్ని వదలలేదు .అది జేల్డా చుట్టూ తిరుగుతూనే ఉంది .జేబులో గలగలమంటూ డబ్బు ఉంటె ఆమెను ఒక ఏడాది తర్వాత పెళ్లి చేసుకొని అపనమ్మకం ,వైరాను దూరం చేసుకొని ,ఒక విప్లవ కారుడిగా కాకుండా రగిలిపోయే రైతుగా ఉండాలనుకొన్నాడు .తనతో బాటే ఉంటున్న తన స్నేహితులకు అంత డబ్బు ఎలా ఎక్కడి నుంచి వస్తోందో అర్ధం కాలేదు .అంత డబ్బున్న తన స్నేహితులలో ఎవరికో ఒకరికి ఆ అమ్మాయిని ఇచ్చి కట్ట బెడితే ?ఇలాంటి ఆలోచనలన్నీ బుర్ర నిండాసుళ్లు తిరుగుతున్నాయి .
మొత్తం మీద కల నెరవేరి యువ దంపతులై ఒక కూతురు ఫ్రాన్సెస్ ను కన్నారు. ఆ నిరాశా జనక కాలం లో కూతురు తండ్రి బొమ్మలను ఆరాధిస్తూ గడిపింది .అవి హీరో హీరో యిన్ ల గురించి అతిశయోక్తులకే అతిశయోక్తులు గా ఉన్నాయి .రగిలే యువతకు ప్రతి రూపాలు .బొమ్మల కొలువులో వాళ్ళు రాజు ,రాణి గా ఉండి ఫిక్షనల్ పాత్రలై అలరించాయి .టాక్సీ లపై వీటిని పెట్టుకొని తిప్పుతుంటే న్యు యార్క్ నగర వాసులకు చీమ కుట్టినట్లుగా కూడా లేక పోయింది .ఎవరినీ ఆకర్షి౦ప లేక పోయాయి .అవి కనబడిన ఫౌంటెన్ లలోకి దూకటం ,బట్టలు దాదాపు విప్పుకు తిరగటం డిన్నర్ టేబుల్స్ దగ్గర డాన్సులు చేయటం ,ఫైర్ అలారాలను మోగించటం ,దాని రక్షకులు ఎక్కడ మంటఎక్కడ మంట అంటూ పరిగెత్తుకు రావటం జేల్డా తన రొమ్ముల్ని చూపించి ఇక్కడేఅనటం-ఇదంతా ఒక కౌమారఆటగా అసంబద్ధ ఉల్లాస భరిత కలగా ఫిట్జెరాల్డ్ ప్రతిధ్వనింప జేశాడు ప్రపంచాన్ని జయించిన తర్వాత అలేక్సాండర్, అనుభవించిన దుఖం ,ఒక రోజు ఫిఫ్త్ ఎవేన్యు పై స్వారి చేస్తుంటే విజయం,నష్టాల అసంబద్ధత (పారడాక్స్ )అనుభవించటం ‘’నేను గట్టిగా అరిచాను –కారణం నాకునేను కోరింది అంతా దొరికింది ఇంతఆనందం నేను మళ్ళీ పొందలేను అని ‘’రాశాడు .
పార్టీలకు డబ్బు కట్టాలి చిన్న కధలు బాగానే ఆదాయాన్నిస్తున్నాయి కాని అప్పుల్లో కూరుకు పోయి రాయబోయే ,రాబోయే10 పుస్తకాలను తాకట్టు పెట్టి పదహారు వందల డాలర్లు ప్రింటర్స్ దగ్గర అప్పు తీసుకొన్నాడు.జేల్డా విపరీత దుబారా ఖర్చు రాబడిని తెలుసుకోకుండా చేస్తున్న అనవసర ఖర్చు భరించలేక మళ్ళీ తాగుడుకు బానిసై ఇంటికి దూరమై బతుకు తున్నాడు .ఫిట్జెరాల్డ్ దంపతులు స్థిరం గా ఒక చోట ఉండలేక ఊళ్లు ఇల్లు మారుతున్నారు .ఈ కాలపు మొదటివివరాలన్నీ ‘’ఫ్లాపెర్స్ అండ్ ఫిలాసఫర్స్ ‘’అనే చిన్న కదల సంపుటిలో చూపాడు .25 ఏళ్ళ రచయిత కు రావాల్సిన కీర్తి రాలేదు .కాని రెండవ నవల ‘’ది బ్యూటిఫుల్ అండ్ డామ్మేడ్ ‘’డబ్బు పెద్దగా రాల్చక పోయినా గొప్ప అన్వేషణ ఉంది .జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకొని సమాధానం వెతికాడు .విషాదాంతమే అయినా నూటికి నూరు శాతం అర్ధరహితం అన్నాడు విల్సన్..హీరో హీరోయిన్ ఇద్దరూ పరమ డిబాచరర్ లుగా ఉండి,మొదటి నుంచి చివరదాకా యేసీరియస్ పనీ చేయక , ఆ పిచ్చిమాలోకాలు హేతువాడులుగా అనిపిస్తారు .వాళ్ళు సామాన్య జీవితాన్ని స్పర్శించినప్పుడల్లా మానవ వ్యవస్థలు ఏవగి౦పుకలిగే ఫార్స్ గా ,పనికిమాలిన అసంబద్ధమైనవిగా చూపిస్తారు .చివరగా సైన్యం డబ్బు పిచ్చి లోకం ,వ్యాపార ద్రుష్టి లను బహిర్గతం చేస్తారు గౌరవమర్యాదలూ విషయమూ ఏమీ లేకుండానే అని రాశాడు విల్సన్ .
డిగ్నిటి మీదవ్యామొహం తో ఫిట్జెరాల్డ్ లాంగ్ ఐలాండ్ లో డబ్బు మంచినీళ్ళ ప్రవాహం లా ఖర్చుచేశాడు .ఒక్క ఏడాది లోనే 36 వేల డాలర్లు తగలేశాడు.ఇంకో అయిదు వేల డాలర్ల అప్పులో మునిగాడు. అప్పు చేసి పప్పు కూడు అంటే ఏమిటో రుజూ చేశాడు.’’స్కాట్ గురువు’’ స్కాచ్ తాగి .వెజిటబుల్స్ ‘’అనే నాటకం రాశాడు .అందులో కొంచెం రాజకీయవ్యంగ్య వాసన ఉండటం తో ఫెయిలయింది .చిన్న కదల రెండవ సంపుటి’’టేల్స్ ఆఫ్ ది జాజ్ ఏజ్ ‘’ విడుదల చేశాడు .ఇందులో ‘’లీస్ ఆఫ్ హాపినేస్స్ ,మే డే ‘’,ది డయమండ్ యాజ్ బిగ్ యాజ్ రిట్జ్ ‘’అనే మూడు కట్టుకధలు -ఫేబుల్స్ ఉన్నాయి .అప్పటికి వయసు 27మాత్రమే .కొన్ని నెలల తర్వాత ఫిట్జెరాల్డ్ లు అన్ని విలాసాలకు దూబరా ఖర్చులకు దూరమవ్వాలని యూరప్ కు మకాం మార్చారు .ఫ్రాన్స్ లో జేల్డా ఒక యువ ఫ్లయర్ తో ప్రేమాయణం సాగించింది .ఫిట్జెరాల్డ్ అహం దెబ్బతిన్నా ,అతని ప్యూరిటన్ భావాలకు విఘాతం కలిగినా నోరు మెదపలేక పోయాడు దీనివలన తాను పరిణతి చెందానని అనుకొని పబ్లిషర్ కు జాబు రాస్తూ ‘’నేను చాలా అసంతృప్తి తో ఉన్నాను .కాని నా పనికి ఆటంకం లేదు .నేను ఎదిగాను ‘’అని రాశాడు .రోమ్ కు చేరారు .అసహనం పెరిగిఅందరితో పోట్లాడుతూ ఫిట్జెరాల్డ్ఒక టాక్సీ డ్రైవర్ తో తగాదా పడి వాడిని కొట్టి దెబ్బలు తిని అరెస్టయి జైలు కు వెళ్ళాడు .కాప్రి స్వర్గం అనుకొన్నాడు .పెద్ద ప్రేగు వాచీ ఇన్ఫ్లుఎంజా బారిన పడి ఇద్దరూ మళ్ళీ ఫ్రాన్స్ చేరారు ‘’వెయ్యి పార్టీలు – పని నిల్ ‘’అని రాసుకొన్నాడు .
తాగుడుకు ఏదీ అడ్డం కాలేదు .నాన్ స్టాప్ గా పెగ్గు మీద పెగ్గు లాగిస్తూనే ఉన్నాడు .తాగి ఎక్కడికి వెడుతున్నాడో తెలీక వెళ్లి ఎవరి దయా దాక్షిణ్యాలతోనో తిరిగి వచ్చేవాడు ఇదీ అయ్యగారి ‘’పాన కత’’.అయిదేళ్ళలో లక్షా పదిహీను వేల డాలర్లు సంపాదించి అంటే ఏడాదికి ఇరవై మూడు వేల డాలర్లు పోగేసుకొంటూ కూడా సాధారణ రచయితలు కలలు కనే సుఖమయ జీవితాన్ని అనుభవించ లేక పోయాడు .పబ్లిషర్ కు రాస్తూ ‘’మా జీవిత స్థాయిని తగ్గించుకోలేం.ఈ ఆర్ధిక అరక్షణ ను ఎదుర్కొలేను ‘’ అని తెలియ జేశాడు .ఇంకా తాను హాండ్ సమ్ గా అండర్ గ్రాడ్యుయేట్ గా అడాలసెంట్ గా ఉన్నాననే భ్రమ పడుతూ ,అవతల వారిని ఆకర్షించలేక ,చిలిపి పరిహాసం ,జోకులతో ,ఒక్కో సారి అవి వెనక్కి పేలగా ఇబ్బంది పడుతూ చివరికి పరిస్థితిని యెంత దాకా తెచ్చుకొన్నాడు అంటే స్నేహితులందరూ ‘’సారీ ‘’తోనూ హోటళ్లుఅన్నీ ‘’నో ఎంట్రీ ‘’బోర్డుల తోనూ వెనక్కి పంపించేదాకా .ఇందులోంచి బయట పడేయ్యటానికి జేల్డా కొత్త ఉత్సాహ ప్రేరకంగా అనేక చిట్కాలు ప్రయోగించి చివరికి ఆత్మహత్య దాకా వెళ్ళింది .స్కాట్ మరింత బరి తెగించి డిప్రేస్ అయ్యాడు .’’నాకు ఇంకా 22 ఏళ్ళే .నారచనే నన్ను సంతోష పెడుతుంది .నేను మెంటల్ గా ఫిజికల్ గా హాంగోవర్ లో ఉన్నాను ‘’అని రాశాడు .
పరిస్థితులు ఇలా ఉన్నాకూడా ఫిట్జెరాల్డ్ మరో రెండు పుస్తకాలు ‘’ది గ్రేట్ గాట్స్ బి ‘’,ఆల్ ది సాద్ యాంగ్ మెన్ ‘’ విడుదల చేశాడు .రెండవది 1926 లో వచ్చింది .ఇందులో అతని పాత కధలు రెండు –రిచ్ బాయ్, వింటర్ డ్రీమ్స్ ‘’ఉన్నాయి .గాట్స్ బి మాత్రం ఫిట్జెరాల్డ్ రచనలలో మాస్టర్ పీస్ .ఇంకా తప్పించుకొనే వారి గురించి సహజ ముద్దులు గురించే రాస్తున్నాడు .బైరానిక్ లవ్ ఆఫ్ రోమాన్స్ ను రొమాంటిక్ లపై రియలిస్ట్ ల వెక్కిరింతల్ని ,పేదవాడు ధనికులను ఆరాది౦చటాన్ని ఆర్టిస్ట్ లు డబ్బు ను ఏవ గి౦చుకోవటాన్నిరాస్తూ ఒక వైపును సమర్ది౦చటమూచేశాడు .విశ్లేషకులు ఫిట్జెరాల్డ్ ప్రోగ్రెస్ ను వివిధ కారణాల తో సమర్ధించారు .హెచ్ ఐ మెంకాన్ ‘’The Great Gatsby is an exposure of the florid show of American life –the high carnival of those who have too much money to spend and too much time for the spending of it ‘’అంటే టి ఎస్ ఇలియట్ ‘’the first step that American fiction has taken since Henri James ‘’అని మెచ్చుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -26-7-16 –ఉయ్యూరు