ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227 83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత –స్కాట్ ఫిట్జరాల్డ్-3(చివరి భాగం)

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -227

83-జాజ్ యుగపు మూస అమెరికన్ నవలా కదా రచయిత  –స్కాట్ ఫిట్జరాల్డ్3(చివరి భాగం)

  అమెరికాకు తిరిగొచ్చాక తాను  ఏదో ప్రశాంతమైన స్థలం లో ఉండి తనమనసులో ఉన్న విషయాలపై రచన సాగిస్తానని ప్రకటించాడు ఫిట్జెరాల్డ్ .మళ్ళీ నిలకడ లేనితనం ,బాధ్యతారాహిత్యం తో ఉండి పోయి పదేళ్లకు కాని ఏదీ రాయలేక పోయాడు .హాలీఉడ్ కు ఆఫర్ వచ్చి’’ బంగారు లప్ప ‘’ఏదో దొరుకు తుందని తిరస్కరించకుండా వెళ్ళాడు .అక్కడా పార్టీల హోరు  ప్రాక్టికల్ జోకుల తో యే పనీ చేయలేదు .ముడ్డి మీదకు ముప్ఫై ఏళ్ళు వచ్చినా పాత పధ్ధతి మారక ‘’ఆడాల సెంట్ స్థాయి’’ నుంచి ఎదగ లేదు .’’తాగు బోతు  నాయాల’’గానే ప్రవర్తించాడు .కాన్స్తాంట్ టల్మాడ్గే అని జాజ్ యుగపు విఫల వ్యక్తిపై కద రాస్తే  తిరస్కరిస్తే భార్యతోకలిసి తూర్పుకు వెళ్లి డేలావార్ విల్లింగ్టన్ దగ్గర  ఒక పాత ఇంటిని కొని ఇంటినీ వ్యవహారాన్ని బాగు చేసుకొని బాగున్నారు  .విదేశాలలో ప్రారంభించిన కొత్తనవల దాదాపు ఇక్కడ పూర్తీ చేశాడు .కొంప చాలా పెద్దదవటం నిర్వహణ కస్టమవటం తో రోజూ జల్దా తో పోట్లాడే వాడు  .ఇరుగుపొరుగు తో నిత్యం తగూ పడేవాడు .పనిలో కూరుకు పోయేవాడు .ఏడాది లోపేదీన్ని వదిలేసి మళ్ళీ పారిస్ చేరారు .వయసు పెరిగి ఇక డాన్స్ చేయలేక జేల్డా తన వ్యాపకం ఏదో చూసుకోవాలని అనుభవం లేక పోయినా 28 ఏళ్ళకు ప్రొఫెషనల్ బాలెట్ డాన్సర్ అయింది .అంతకు ముందు ఏడాది ఫిట్జెరాల్డ్ రాబడి సుమారు ముప్ఫై వేల డాలర్లు .అయినా గురుడు అప్పుల అప్పారావే అయ్యాడు .తరువాత రెండేళ్ళు యూరప్ ,అమెరికాల మధ్య ఆసులో గొట్టం లాగా తిరిగాడు .జేల్డా ఉత్సాహం తెచ్చుకొని వ్రుత్తి లో నిలబడితే అయ్యగారు మొరోజ్ గా తన పాత కదల రిపేర్ లో పడ్డాడు .భార్యపైనా తనపైనా ఇర్రిటేషన్ఆపుకోలేక తరచుగా డిప్రెషన్ లో పడి కయ్యానికి కాలు దువ్వుతూ మానసిక క్షోభ పడుతూ ఆమెకూ కలిగించి ,ఇక తగ్గడు అన్నట్లుగా ప్రవర్తించాడు. జేల్డా డాన్సర్ గా ఫెయిల్ అయి,బాగా దెబ్బ తింది.1930 లో ఆమె బాగా కుంగి పోయింది .స్విట్జెర్లాండ్ లో మానసిక చికిత్స కోసం ఆమెను తీసుకు వెళ్ళాడు .ఆమె ‘’స్కిజియో ఫ్రేనేక్ ‘’తో బాధ పడుతున్నట్లు నిర్ధారణ అయింది .ఇక జీవితాంతం  మానసిక దెబ్బతిన్న ఆమెను కని పెట్టుకొని ఉండాల్సిన స్థితి కలిగింది .శానిటోరియంలలో కొంత నయమని పించినా మళ్ళీ తిరగ బెట్టేది .పూర్తిగా ఎప్పుడూ కోలుకొనే లేదు .అయనా ఆమె ఇంటలిజేంస్ లెవెల్ ఏమాత్రం తగ్గలేదు .1932 లో బాల్టిమోర్ హాస్పిటల్ లో చేర్చాడు .ఈ హాస్పిటల్ లో ఉండగానే అక్కడ జరిగిన అగ్నిప్రమాదం లో జేల్డా మరణించింది .

          1932  లో ఆల్కహాల్ బానిసత్వంనుండి బయట పదాలనుకొన్నాడు .కాని మందు ఎందుకు తాగాడో కారణాలు బాగా చెప్పటం ప్రారంభించాడు .ఒక స్నేహితుడి తో పోట్లాడి ,డిప్రెషన్ లో తనంతకు తానే   స్నేహితులు లేనిలోకం లో  జీవించసాగాడు .హెమింగ్ వే గురించి చెబుతూ ‘’ఆతను ఎప్పుడూ విజయాల గురించే గట్టిగా చెబుతాడు  .నేను సాధికారికంగా ఓటముల గురించి చెబుతాను ‘’అన్నాడు .ఏదో విధంగా తంటాలు పడి తొమ్మిది చిన్న కధలు గిలికాడు .ఎక్కువ ధర కావాలని డిమాండ్ చేయలేదు .ఇప్పటిదాకా రాసిన పుస్తకాలపై  రాయల్టీ లు ఇప్పటికి సున్నకు సున్నా  హళ్లికి హళ్ళి.’’టెండర్ ఇన్ ది నైట్ ‘’1934 లో కొన్ని వేలకాపీలు మాత్రమె అమ్ముడయ్యాయి .విమర్శకులు సానుభూతి చూపకుండా దారుణంగా విరుచుకు పడ్డారు .చదువరులు మాత్రం దెబ్బతిన్న సమాజాన్ని బాగా చూపించాడని భవిష్యత్తుపై ఆశ కల్పించాడని అనుకొన్నారు .’’All gods dead ,all faith in man shaken ‘’అని రాస్తూ సి హార్ట్లి గ్రాటేన్ ‘’the feverish beauty of a class  in decay ,the polished charm of a decadence that is not yet self conscious ‘’అన్నాడు . ‘’the story of a psychiatric husband and a psychoneurotic wife who ruin each other ‘’అనిపిస్తుంది ఇలియట్ తన వేస్ట్ లాండ్ తో పోల్చాడు .టెండర్ ఈజ్ ది నైట్ లో గుండెపగిలే  బుర్ర తిరిగే సంఘటనలు ఉన్నా ,ఆదుర్దా అలసట లు ఉన్నాయి వీటినే ఫిట్జెరాల్డ్ ‘’ఎమోషనల్  దివాలాతనం ‘’అన్నాడు .ఇదే ప్రతి చోటా కనిపిస్తుంది .

  38 వ ఏట పాత ట్రాక్ నుంచి దారిమార్చుకొని ఇదివరకెప్పుడూ ప్రయత్నించని విధానం లో 19 వ శతాబ్దపు హిస్టారికల్ రోమాన్స్ ‘’ది కౌంట్ ఆఫ్ డార్క్ నెస్ ‘’రాశాడు .9 లో ఇదివరకు అచ్చుకాని కధలను పోగేసి ‘’టాప్స్ ఎట్ రివెల్లి ‘’పేరుతొ ప్రచురించాడు .పసలేని పుస్తకం అయింది .విమర్శకులు విపరీతంగా విరుచుకుపడి ‘’దారుణం అలా ఉండ కూడదు ‘’అన్నారు .నలభై వ పడి లో ఫిట్జెరాల్డ్ తన పని అయిపోయి౦దనుకొన్నాడు .ఇప్పుడు రాసిన కధలు ఇది వరకేప్పుడూ లేనట్లు గా తిరిగొచ్చాయి .నిరాశా నిస్పృహలతో జీవిత చరిత్ర శకలాలు రాస్తున్నాడు .తాత్కాలిక ఉపశమనానికి రక్షణకు మళ్ళీ హాలీ వుడ్ వెళ్ళాడు .41 ఏడు సమీపిస్తుండగా నలభై వేల డాలర్లు బాకీ పడ్డాడు .అసలే ‘’లాస్ ‘’అయి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి ‘’లాస్ ఏంజెల్స్ ‘’వెళ్ళాడు .కొత్త ఆశ కొత్త జీవితం కొత్త మాధ్యమం కోసం ఎదురు చూశాడు .కాని ‘’వెనకటి గుణ మేల మాను వినరా సుమతీ ‘’అన్నట్లు పాత కద మళ్ళీ మొదలెట్టి తాగి తందనాలాడాడు .సృజన పోయి అవతలి వాడి రచనలకు మార్పులూ చేర్పులూ చేస్తూ గడిపాడు .కాని అయ్యగారి ట్రీట్ మెంట్ స్పందన కలిగించ లేక పోయింది .తను ఎంతో గొప్ప రచన అనిగర్వంగా  చెప్పుకొనే ఒక నవలను హాలీ వుడ్ జనం పూర్తిగా మార్చేసి ఫిట్జెరాల్డ్ సంభాషణలలో కిక్  ,వినోదాలు లేవని ’’ డై’’లాగులు’’ ‘’కుట్టారు .అతని గౌరవం ఒక్క సారిగా కూలి పోయింది .పబ్లిక్ అతన్ని అసలు పట్టించుకోవటం మానేశారు .అతనితోపాటు స్క్రిప్ట్ రైటర్ గా ఉన్న బడ్ శుల్ బెర్గ్ ‘’స్కాట్ ఫిట్జేరాల్డా 1 అతడు చనిపోయాడను కొన్నాను ‘’అన్నాడు అదీ హాలీవుడ్ లో ప్రముఖ రచయిత ఫిట్జెరాల్డ్ పరిస్తితి .అతని ఏజెంట్ లు  ఫిట్జెరాల్డ్  ఏదీ రాయ లేదని ,స్వయం గాఇక  ఏదీ రాయలేడని కధలకు అడ్వాన్స్ లు ఇవ్వటం మానేశారు.హాలీ వుడ్  లో ఉద్యోగం ఏది రాదు .హాలీవుడ్ లో ఏదీ రాకపోయినా ‘’ఆల్కహాల్ ‘’లో అన్నీ ఉన్నాయని తెగ తాగి అందరి చేత ఛీ కొట్టి౦చు కొంటూ ,మనిషి కనిపిస్తే పురుగును చూసినట్లు దూరం పారి పోతూ వెగటు పుట్టించే స్థితి కొని’’ సారీ ’’ ‘’తాగి’’ తెచ్చుకొన్నాడు .’’నేను ముసలివాడినై జబ్బు తో ఉన్నాను ‘’అని ఫిర్యాదు చేశాడు .నలభై మూడు కే ముసలి తనం ! విడ్డూరం .ఈ హాలీవుడ్ భాగోతాన్ని బయట పెడుతూ ఒక నవల రాయాలని ప్రయత్నం లో ఉండివందలాది విషయాలను నోట్ చేశాడు .

  1940 లో మొదటి సారి హార్ట్ ఎటాక్ వచ్చింది .భయ పెట్టింది కాని ధైర్యం తెచ్చుకొని ఆ హాలీవుడ్ నవల పై మళ్ళీ ద్రుష్టి పెట్టాడు .దీనికి ‘’ది లాస్ట్ టైకూన్ ‘’పేరుపెట్టాడు కాని పూర్తీ చేయలేక పోయాడు .దీన్ని అత్యంత విస్తృతంగా మనసు పొరల్లోకి దూసుకు పోయేట్లు రాయాలనుకొన్నాడు .’’I want to write scenes that are frightening and inimitable ‘’అని చెప్పుకొన్నాడు .మరో నెలకు మరో సారి విపరీతమైన గుండె జబ్బు వచ్చి21-12-1940  న 44 దాటిన మూడు నెలలకే స్కాట్ ఫిట్జెరాల్డ్ చనిపోయాడు .

ఫిట్జెరాల్డ్ లాగా యే రచయితరచనా ,జీవితం ఒకటై భాసి౦చలేదు .ఎక్కడ తనకద ముగిస్తాడో ఎక్కడ లేజేండరి పాత్ర ప్రారంభిస్తాడో తెలీకుండా రాసే నేర్పు అతనిది .వేది౦పబడిన రచనా సృష్టికర్తను ,సంతోషం లేని పాత్రలనుండి వేరు చేయలేము .ఆతను అతని ఫిక్షన్ ఫిగర్లు పరిణతి చెందని కలల బేహారులు  విజయం పొందినప్పుడు పొందిన ఆదుర్దా ,అపజయం లో వేదన లను ఒకే తీరున పంచుకొంటారు .హాలీ వుడ్ కు వెళ్ళక ముందు ‘’ఎందుకు నేను వ్యధను కోరుకు న్నానో  వేదన పొందానో ఆలోచించటానికే  ,విచార భావం విచార ప్రవర్తన ,ట్రాజెడీ పై ట్రాజిక్ ప్రవర్తన ,ఎందుకు నేను నా భయానక పరిస్థితి ,జాలి,దయల తో ఏకీభవించి పోయానో ఆలోచించటానికే నేను  పూర్తీ ప్రశాంతతను కోరాను’’అని చెప్పాడు  .ఫిట్జెరాల్డ్ చనిపోయే నాటికే అతని రచనలన్నీ ప్రచురితమైనాయి ‘

అయిదేళ్ళ తర్వాత ఫిట్జెరాల్డ్ ను మళ్ళీ కనుగొని ఆవిష్కరించారు .ఫిట్జెరాల్డ్ తిరిగి రాక ఎడ్మండ్ విల్సన్ ఎడిట్ చేసిన ‘’ది క్రాక్ అప్ ‘’ప్రచురణ తో జరిగింది .ఇందులో అత్యంత స్వీయ ఒప్పుకోళ్ళు,వ్యాసాలూ ,నోట్స్ ,ప్రక్షిప్తాలు ,కూతుళ్ళకు ప్రేమ ఆప్యాయతా ఉట్టిపడేలా రాసిన ఉత్తరాలు ఉన్నాయి .దీని తర్వాత డోరోతి పార్కర్ ఎడిట్ చేసిన ‘’ఎఫ్ .స్కాట్ .ఫిట్జెరాల్డ్ –ది మాన్ అండ్ హిస్ వర్క్ ‘’1950 లో వచ్చింది .అతని గ్రేట్ గాట్స్ బి నవల వ్యక్తీ సంక్షోభానికి అదే విశ్వవ్యాప్త సూత్రతకు డాక్యుమెంట్ గా నిలుస్తుంది

 ఫిట్జెరాల్డ్ ప్రభావం ఆయన మొదటి రచన ప్రచురణ అయిన నాటి నుంచే ఉంది .గాట్స్ బి నవల చదివి ఇలియట్ ఆయనకు ఉత్తరం రాస్తూ హెన్రి జేమ్స్ తర్వాత అమెరికన్ ఫిక్షన్ ను పండించిన వాడు అతనే అన్నాడు   Don Birnam, the protagonist of Charles Jackson‘s The Lost Weekend, says to himself, referring to The Great Gatsby, “There’s no such thing … as a flawless novel. But if there is, this is it.”[53] In letters written in the 1940s, J. D. Salinger expressed admiration of Fitzgerald’s work, and his biographer Ian Hamilton wrote that Salinger even saw himself for some time as “Fitzgerald’s successor”.[54] Richard Yates, a writer often compared to Fitzgerald, called The Great Gatsby “the most nourishing novel [he] read … a miracle of talent … a triumph of technique”.[55] It was written in a New York Times editorial after his death that Fitzgerald “was better than he knew, for in fact and in the literary sense he invented a generation … He might have interpreted them and even guided them, as in their middle years they saw a different and nobler freedom threatened with destruction.”

21 వ శతాబ్దం లో గాట్స్ బి మొదలైన ఫిట్జెరాల్డ్  రచనలు  మిలియన్ ల కొద్దీ కాపీలు అమ్ముడయ్యాయి .గాట్స్ బి ఎప్పుడూ బెస్ట్ సెల్లర్ గానే ఉంది’ స్కూళ్ళు కాలేజీలలో దాన్ని బోధిస్తున్నారు ఆయన 5 నవలలు , 3 నావేల్లాలు ,10 చిన్నకదా సంపుటాలు రాశాడు .ఆయన నవలలు సినిమాలుగా వచ్చాయి .ఎన్నో సంస్థలు ఆయన పేరు పెట్టి గౌరవించాయి .ఆయన రాత ప్రతులు బహు భద్రంగా భద్ర పరచ బడ్డాయి .

Inline image 1

Inline image 2Inline image 3

సశేషం

   మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-26-7-16- ఉయ్యూరు

    

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.